హుబ్లీ: ఎమ్మెల్సీ సీటీ రవిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని అనుమానం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బాగల్‌కోటెలో మీడియాతో మాట్లాడారు. సీటీ రవిని అరెస్ట్ చేయడం, నిబంధనలు పాటించకుండా దారుణంగా వ్యవహరించడంపై కోర్టులో ప్రశి్నస్తామన్నారు.
ప్రభుత్వ కీలుబొమ్మలుగా మారిన పోలీసు అధికారులకు తగిన గుణపాఠం చెప్పడానికి కోర్టుకు వెళ్తామన్నారు. రవి ఎటువంటి వ్యాఖ్యలు చేశారన్నదే స్పీకర్ నిర్ణయిస్తారన్నారు. స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. ముఖ్యంగా ఇలాంటి కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడానికి వీలు లేదన్నారు. ఆయన్ను గుర్తు తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లడం వెనుక దురుద్దేశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment