Prahlad Joshi
-
రైతు సంఘాలతో కేంద్రం చర్చలు
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సారథ్యంలోని బృందం శుక్రవారం చండీగఢ్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించింది. రెండున్నర గంటలకుపైగా జరిగిన ఈ చర్చల్లో సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాలకు చెందిన 28 మంది స భ్యుల ప్రతినిధి బృందం పాల్గొంది. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల్లో ఈ రెండు రైతు సంఘాలు ఏడాదికిపైగా నిరసనలు సాగిస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుద్దియన్, ఆహారం, పౌరసరఫరా శాఖ మంత్రి లాల్ చంద్ తదితరులు పాలొ న్నారు. మహాత్మాగాంధీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప బ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఎంజీఎస్ఐపీఏ)లో జరిగిన చ ర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయన్నా రు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం తీసు కున్న చర్యలను ఈ సందర్భంగా రైతు నేతలకు వివరించామని ప్రహ్లాద్ జోషి చెప్పారు. తదుపరి రౌండ్ చర్చలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో 22న జరుగుతాయని మంత్రి చెప్పారు. నిరశనదీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఖనౌరీ నుంచి ఆయన్ను అంబులెన్సులో తీసుకువచ్చారు. ఆయన ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టిందని రైతు నేత కాకా సింగ్ కొట్ర చెప్పారు. -
సోలార్ విద్యుత్ @100 గిగావాట్లు
న్యూఢిల్లీ: సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది.‘‘గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ దార్శనిక నాయకత్వంలో భారత్ చరిత్రాత్మక 100 గిగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని సాధించింది. పరిశుద్ధమైన, పర్యావరణ అనుకూల భవిష్యత్ కోసం విశ్రమించని మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ పెట్టారు. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని కేంద్ర సర్కారు లక్ష్యాన్ని విధించుకోగా, ఇందులో 100 మెగావాట్లు సోలార్ ద్వారా సమకూర్చుకోవాలన్నది ప్రణాళిక. కానీ, కరోనా విపత్తు, ఆ సమయంలో లాక్డౌన్లతో లక్ష్యం చేరిక రెండేళ్లు ఆలస్యమవడం గమనార్హం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మోదీ సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ‘‘సోలార్ ప్యానెళ్లు, సోలార్ పార్క్‌లు, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులు విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి. ఫలితమే నేడు భారత్ 100 గిగావాట్ల సోలార్ ఇంధన లక్ష్యాన్ని సాధించింది. పర్యావరణ అనుకూల ఇంధనంలో భారత్ స్వీయ సామర్థ్యాలపై ఆధారపడడమే కాకుండా, ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపిస్తోంది’’అని ప్రహ్లాద్‌జోషి పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ప్రతి ఇంటికి శుద్ధ ఇంధనాన్ని అందిస్తుందన్నారు. పదేళ్లలో చేరిక 2014 నాటికి దేశంలో సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 2.82 గిగావాట్లుగానే ఉండగా, పదేళ్లలో 100 గిగావాట్లను చేరుకోవడం విశేషం. 2025 జనవరి 31 నాటికి స్థాపిత సోలార్ సామర్థ్యం 100.33 గిగావాట్లు అయితే, మరో 84.10 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉంది. మరో 47.49 గిగావాట్లు టెండర్ దశలో ఉండడం గమనార్హం. కేవలం 2024లోనే 24.5 గిగావాట్ల సామర్థ్యం కొత్తగా అందుబాటులోకి వచి్చంది. మరోవైపు 2014 నాటికి దేశంలో కేవలం 2 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం ఉంటే, 2024 నాటికి 60 గిగావాట్లకు చేరుకుంది. -
వెండి ఆభరణాలకూ హాల్ మార్కింగ్
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలకు తప్పనిసరి హాల్ మార్కింగ్ విజయవంతం కావడంతో వెండి ఆభరణాలు, కళాకృతులకు సైతం ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయడాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలంటూ భారతీయ ప్రమాణాల సంస్థను (బీఐఎస్) కోరినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ‘బంగారం మాదిరే వెండికీ హాల్ మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలంటూ వినియోగదారుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోండి’ అని బీఐఎస్ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంత్రి జోషి కోరారు. ఈ దిశగా కార్యాచరణను ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టిందని చెప్పారు. ‘అమలు సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని, వినియోగదారులు, ఆభరణాల డీలర్ల స్పందనలను తెలుసుకోవాలని కోరాను. భాగస్వాములు అందరితో మాట్లాడిన తర్వాతే ప్రక్రియ మొదలు పెడతాం’అని తెలిపారు. కాగా, మూడు నుంచి ఆరు నెలల్లో వెండికి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ చెప్పారు. -
సీటీ రవిని ఎన్కౌంటర్ చేస్తారేమో ?
హుబ్లీ: ఎమ్మెల్సీ సీటీ రవిని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారేమోనని అనుమానం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బాగల్కోటెలో మీడియాతో మాట్లాడారు. సీటీ రవిని అరెస్ట్ చేయడం, నిబంధనలు పాటించకుండా దారుణంగా వ్యవహరించడంపై కోర్టులో ప్రశి్నస్తామన్నారు. ప్రభుత్వ కీలుబొమ్మలుగా మారిన పోలీసు అధికారులకు తగిన గుణపాఠం చెప్పడానికి కోర్టుకు వెళ్తామన్నారు. రవి ఎటువంటి వ్యాఖ్యలు చేశారన్నదే స్పీకర్ నిర్ణయిస్తారన్నారు. స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. ముఖ్యంగా ఇలాంటి కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడానికి వీలు లేదన్నారు. ఆయన్ను గుర్తు తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. -
పెరిగిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం.. ఎంతంటే..
పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–నవంబర్ కాలంలో 15 మెగావాట్ల మేర అదనంగా సమకూరినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. క్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త ఏర్పాటు చేసిన 7.54 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్ సామర్థ్యం కంటే రెట్టింపుగా ఉందని పేర్కొన్నారు. గత నెలలోనే 2.3 గిగావాట్ల మేర సామర్థ్యం సమకూరినట్టు మంత్రి తెలిపారు.సీఐఐ నిర్వహించిన ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో అసాధారణమైన బాటలు వేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఇంధన శుద్ధి విభాగంలో భారత్ ప్రపంచంలోనే ప్రముఖ దేశంగా అవతరించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ తయారీ సాధించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ 6.1 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించినట్టు మంత్రి వెల్లడించారు.ఇదీ చదవండి: నాయకత్వ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యంస్థానికంగానే సోలార్ ప్యానెళ్లు, మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ ద్వారా రూ.24,000 కోట్లు అందించినట్లు మంత్రి గుర్తు చేశారు. 2025–26 నాటికి 38 గిగావాట్ల సామర్థ్యంతో 50 సోలార్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఎలక్ట్రోలైజర్ల తయారీకి రూ.4,400 కోట్లు, ఇతర ప్రధాన విడిభాగాలకు రూ.13,050 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించినట్టు చెప్పారు. -
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి స్ట్రాంగ్ కౌంటర్
-
సింగరేణికి తాడిచెర్ల–2 బొగ్గు గని
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థకి తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేయగా, ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడానికి అన్ని అనుకూలతలున్నాయని భట్టి వివరించారు. త్వరలో సింగరేణికి బొగ్గు గని కేటాయింపులకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామని ప్రహ్లద్ జోషీ హామీ ఇచ్చారని భట్టి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బ్లాక్‌లోనూ ఉత్పత్తిని ప్రారంభించే నిమిత్తం అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని భట్టి తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా రాష్ట్రంలోని సబ్స్టేషన్ల పరిసరాల్లో సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సహకరించాలని విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌ను కోరామన్నారు. ఈ అంశాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. భట్టి వెంట ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, సింగరేణి ఇన్చార్జీ సీఎండీ బలరామ్ ఉన్నారు. కాగా, తాడిచెర్ల బ్లాక్–2 గనిని సింగరేణికి కేటాయిస్తే సంస్థ వార్షిక బొగ్గు ఉత్పత్తి ఏటా 5మిలియన్ టన్నులకు పెరగనుంది. తాడిచర్ల బ్లాక్ 2 గని ద్వారా 30 ఏళ్లలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదు మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేరు చేస్తే సరిపోతుందని చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంజనీర్లు కాదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఎవరికి వారే ఇంజనీర్లమని ఊహించుకుని చెప్పడంవల్లనే అవి కూలిపోయాయని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్తు ఆలోచనా జ్ఞానం కోల్పోయారని భట్టి మండిపడ్డారు. డ్యామ్ సేఫ్టీ, ఇంజనీరింగ్ అధికారులు చెప్పినట్లు చేయడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం చర్చలు జరుపుతోందని, సమయం, సందర్భాన్ని బట్టి జాబితా ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరో ముందుగా ప్రకటించారని తాము తొందరపడబోమని వ్యాఖ్యానించారు. -
మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం
సాక్షి, అమరావతి/మంగళగిరి/తెనాలిఅర్బన్/మహారాణిపేట(విశాఖ దక్షిణ)/సాక్షి ప్రతినిధి, కాకినాడ: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను, కాకినాడలో నిర్మించిన 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం మెడికల్ కాలేజీలతోపాటు తెనాలి, హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 9 క్రిటికల్ కేర్ యూనిట్ల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను, నాలుగు సంచార ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ సహా పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్‌లో 960 పడకలున్నాయని.. 41 విభాగాల్లో ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. 125 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. 2019 నుంచి రోగులకు ఓపీ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎయిమ్స్ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పింంచాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘కరోనా, లాక్డౌన్ వంటి క్లిష్ట సమయాన్ని కూడా భారత్ సమర్థంగా ఎదుర్కొని ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం’ అని చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ప్రవీణ్ భారతీపవార్ మాట్లాడుతూ ‘2014కు ముందు ఎయిమ్స్‌లో చికిత్స పొందాలంటే ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చేది. మోదీ సర్కార్ వచ్చి న తర్వాత గత పదేళ్లలో ఎయిమ్స్‌ల సంఖ్య 22కు పెరిగింది. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ నవ భారతాన్ని ప్రధాని మోదీ నిర్మిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు అన్ని విధాల సహకారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ‘వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ఎయిమ్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 183 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. విద్యుత్ సరఫరా కోసం రూ.35 కోట్లతో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుతో పాటు జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్‌కు రూ.10 కోట్లతో అప్రోచ్ రోడ్ల అభివృద్ధి చేపట్టాం. రూ.7.74 కోట్లతో నీటి సరఫరా పనులు, రూ.2.2 కోట్లతో డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్‌ను అందించడమే సీఎం జగన్ లక్ష్యం. నాడు–నేడు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయి’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఉన్నతాధికారులు కృష్ణబాబు, నివాస్, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధబానందక తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ వేళ.. 146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత
ఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్ సమావేశాలను(బడ్జెట్) కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు కృషి చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం అఖిల పక్ష భేటీ తర్వాత ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దుండగుల దాడితో అలజడి రేగిన విషయం తెలిసిందే. ఈ భద్రతా వైఫ్యలంపై కేంద్ర హోం శాఖ వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించారనే కారణంతో లోక్‌సభ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. అదే సమయంలో రాజ్యసభలోనూ ఇలా అవాంతరాలు కలిగిన సభ్యుల్ని సస్పెండ్ చేశారు చైర్మన్. అయితే బడ్జెట్ సమావేశాలు.. అదీ ఎన్నికలకు ముందు ఓటాన్ బడ్జెట్ కావడంతో సభ్యులంతా ఉండాలని కేంద్రం ఆశిస్తోంది. ‘‘అన్ని సస్పెన్షన్లను ఎత్తేస్తున్నాం. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లతో మాట్లాడాం. ప్రభుత్వం తరఫున సస్పెన్షన్ ఎత్తివేయాలని వాళ్లను కోరాను. అందుకు వాళ్లు అంగీకరించారు అని తెలిపారాయన. లోక్‌సభ నుంచి 135 మంది, రాజ్యసభ నుంచి 11 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక రేపటి నుంచి(జనవరి 31) ఫిబ్రవరి 9వ తేదీదాకా బడ్జెట్ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. -
రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లోని పారీ్టల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ అవుతారు. సమావేశాలు ఫిబ్రవరి 9 దాకా కొనసాగుతాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. -
ఇది ఇంగ్లాండ్ కాదు.. కన్నడ భాషా వివాదంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
బెంగళూరు: బెంగళూరులో భాషా ఉద్యమంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కర్ణాటకలో దుకాణాల బోర్డులు ప్రధానంగా స్థానిక భాషలో ఉండాలనే డిమాండ్‌తో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులో కన్నడ అనుకూల గ్రూపులు బుధవారం విధ్వంసం చేసిన తర్వాత ఆయన ఈ మేరకు మాట్లాడారు. "ప్రతి ఒక్కరూ సంకేతాలను చదవగలగాలి. అందరూ ఇంగ్లీష్ చదవలేరు. కన్నడలో అలాగే ఇంగ్లీష్ లేదా హిందీ వంటి ఇతర భాషలలో రాయడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? ఇది ఇంగ్లాండ్ కాదు. దుకాణదారులు కూడా అవసరాన్ని అర్థం చేసుకోవాలి " అని ప్రహ్లాద్ జోషి అన్నారు. కన్నడనాట మరోసారి భాష ప్రతిపాదిత ఆందోళనలు బుధవారం జరిగాయి. నేమ్ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్‌పై దాడులకు దిగాయి. దీంతో బెంగళూరు అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్ట్ బయట కన్నడ కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో నేమ్ ప్లేట్లు ఉంచడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కన్నడ రక్షా వేదిక. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆందోళకు దిగింది. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ బయట ఇతర భాషల నేమ్ బోర్డుల్ని ధ్వంసం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని నిలువరించి.. పరిస్థితి అదుపుచేసే యత్నం చేస్తున్నారు. ఇదీ చదవండి: తమిళనాడు డీజీపీ ఆఫీస్‌కు ‘బాంబు’ బెదిరింపు -
సస్పెన్షన్ కోసం వాళ్లే అభ్యర్థించారు: జోషి
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్రప్రభుత్వం అనుకోలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సభకు అంతరాయం కలిగించిన కొందరు ఎంపీలను సస్పెండ్ చేయడంతో తమను కూడా సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు తమను కోరారని ఆయన చెప్పారు. శుక్రవారం మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. ‘ఎంపీలను సస్పెండ్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ప్లకార్డులతో రావొద్దని కోరాం. చర్యలుంటాయని ముందుగానే వారికి చెప్పాం. నిబంధనలు ఉల్లంఘించి కొందరు ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. క్రమశిక్షణారాహిత్యం కింద తమను కూడా సస్పెండ్ చేయాలంటూ మిగతా వారు కూడా కోరారు. కాంగ్రెస్ స్థాయి అంతగా దిగజారింది. లోక్‌సభ నుంచి 100 మంది, రాజ్యసభ సభ్యులు 46 మంది మొత్తం 146 మంది ఎంపీలు బహిష్కరణకు గురయ్యారు’అని మంత్రి చెప్పారు. తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందిన మూడు క్రిమినల్ బిల్లుల్లో ఏమైనా లోపాలున్నాయని భావిస్తే కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు ఉందని ఆయన చెప్పారు. -
NDA: ఉపరాష్ట్రపతికి సంఘీభావంగా..
సాక్షి, ఢిల్లీ: దేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను హేళన చేస్తూ టీఎంసీ ఎంపీ ఒకరు చేసిన చేష్టలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. చైర్మన్ ధన్కడ్ ఈ చర్యను ఖండించగా.. ప్రధాని మోదీ ఈ ఉదయం ఉపరాష్ట్రపతికి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు కూడా. ఈ క్రమంలో.. బుధవారం పెద్దల సభలో ఎన్డీయే ఎంపీలు, ధన్కడ్కు సంఘీభావం ప్రకటించారు. ‘‘ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లు రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో ఉన్నవాళ్లను పదే పదే అవమానిస్తున్నారు. అన్నివిధాలుగా పరిధి దాటి ప్రవర్తించారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ ప్రధానిని అవమానిస్తూ వస్తున్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని అవమానించారు. జాట్ కమ్యూనిటీ నుంచి ఉపరాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి మీరు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి మిమ్మల్ని ఇప్పుడు అవమానించారు. మీరు ఉన్న ఉన్నతస్థానం పట్ల వాళ్లకు గౌరవం లేదు. రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానించడం మేం సహించలేం అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాజ్యసభలో తెలిపారు. వాళ్లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. మీకు గౌరవసూచికంగా ప్రశ్నోత్తరాల సమయం మొత్తం మేం నిలబడాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారాయన. ఏం జరిగిందంటే.. ఎంపీల సస్పెన్షన్ పరిణామం అనంతరం.. పార్లమెంటు వెలుపల మంగళవారం ఓ ఘటన చోటుచేసుకుంది. ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ను ఉద్దేశించేలా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరణ చేశారు. ఆయన గొంతును అనుకరిస్తూ.. విచిత్రంగా ప్రవర్తించారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు నవ్వులు కురిపిస్తుండగా.. రాహుల్ గాంధీ ఆ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించారు. దీనిపై ధన్కడ్ మండిపడుతూ.. ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటన్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. If the country was wondering why Opposition MPs were suspended, here is the reason… TMC MP Kalyan Banerjee mocked the Honourable Vice President, while Rahul Gandhi lustily cheered him on. One can imagine how reckless and violative they have been of the House! pic.twitter.com/5o6VTTyF9C — BJP (@BJP4India) December 19, 2023 మరోవైపు రాజకీయంగా ఈ ఘటన దుమారం రేపుతోంది. అధికార-విపక్ష ఎంపీలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం స్పందించారు. రాహుల్ జీ(రాహుల్ గాంధీ) వీడియో తీసి ఉండకపోతే.. ఈ వ్యవహారంపై ఇంత రాద్దాంతం జరిగి ఉండి కాదేమో అనేలా ఆమె ప్రకటన ఇచ్చారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ధన్కడ్కు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జాట్ కమ్యూనిటీ సైతం ఈ డిమాండ్‌తో నిరసనలకు దిగింది. #WATCH | On TMC MP mimicry row, West Bengal CM Mamata Banerjee says, "...You wouldn't have come to know if Rahul ji had not recorded a video..." pic.twitter.com/t1gNmnI69p — ANI (@ANI) December 20, 2023 -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి..
సాక్షి, ఢిల్లీ: గందరగోళానికి తెర దించుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2023 నిర్వహణపై స్పష్టమైన ప్రకటన వెలవడింది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో సందేశం ఉంచారు. సెలవులు మినహా డిసెంబర్ 22 దాకా.. మొత్తం 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను తేనుంది కేంద్రం. వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే.. వీటికి సంబంధించిన నివేదికలు ఇటీవల హోం మంత్రిత్వ శాఖకు అందాయి. దీంతో.. శీతాకాల సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. Winter Session, 2023 of Parliament will commence from 4th December and continue till 22nd December having 15 sittings spread over 19 days. Amid Amrit Kaal looking forward to discussions on Legislative Business and other items during the session.#WinterSession2023 pic.twitter.com/KiboOyFxk0 — Pralhad Joshi (@JoshiPralhad) November 9, 2023 -
సోనియా లేఖకు బదులిచ్చిన కేంద్రం.. ఏం చెప్పిందంటే!
న్యూఢిల్లీ: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండా ఏమిటో తెలపాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖకు స్పందిస్తూ వ్యంగ్యంగా బదులిచ్చారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. అజెండా లేకుండా సమావేశాలా? సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సెషన్లు నిర్వహిస్తున్నట్లు కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే విషయమై ప్రతిపక్షాలతో చర్చించకుండానే పిలుపునిచ్చారని కనీసం అజెండా ఏమిటో తెలపమని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు సోనియా గాంధీ. అయినప్పటికీ ఈ సమావేశాలకు హాజరు కావడానికి తాము సుముఖంగానే ఉన్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రజాసమస్యలు చాలానే ఉన్నాయని చెబుతూ తొమ్మిది అంశాలను లేఖలో ప్రస్తావించారు. వాటిలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, మణిపూర్‌లో పరిస్థితి, మతతత్వం, చైనా సరిహద్దు అంశంతోపాటు మరికొన్ని అంశాలున్నాయి. Here is the letter from CPP Chairperson Smt. Sonia Gandhi ji to PM Modi, addressing the issues that the party wishes to discuss in the upcoming special parliamentary session. pic.twitter.com/gFZnO9eISb — Congress (@INCIndia) September 6, 2023 ఆ సంప్రదాయం లేదు.. సోనియా గాంధీ లేఖకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ మీకు ఇక్కడి సంప్రదాయాలు ఇంకా అలవాటైనట్టు లేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఎన్నడూ పార్టీల అభిప్రాయాలను అడిగిడం కానీ వారితో చర్చలు జరిపింది కానీ లేదని అన్నారు. రాష్ట్రపతి సందేశంతో పార్లమెంట్ సెషన్లు ప్రారంభమవుతాయి. అన్ని పార్టల నాయకులు సమేవేశమయ్యాక అప్పుడు ప్రజా సమస్యలపైనా ఇతర అంశాలపైనా చర్చలు కొనసాగిస్తుంటామని రాస్తూ బదులిచ్చారు. यह बेहद दुर्भाग्यपूर्ण है कि एक वरिष्ठ सांसद होने के बाद भी कांग्रेस की पूर्व अध्यक्षा श्रीमती गांधी संसद के आगामी सत्र को लेकर अनावश्यक विवाद पैदा करने की कोशिश कर रही हैं। संसद का सत्र बुलाना भारत सरकार का संवैधानिक अधिकार है। मैं आशा करता हूं कि सभी पार्टियां संसद की गरिमा… pic.twitter.com/STTOYtxIsO — Pralhad Joshi (@JoshiPralhad) September 6, 2023 ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి -
పార్లమెంట్ 'ప్రత్యేక' భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజల్లో ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 దాకా ఈ సమావేశాలు (17వ లోక్‌సభకు 13వ సెషన్, రాజ్యసభకు 261వ సెషన్) జరుగుతాయని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుత అమృతకాలంలో పార్లమెంట్లో అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ ప్రత్యేక భేటీల ఎజెండా ఏమిటన్నది ప్రభుత్వం బయట పెట్టలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. కూటమి దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జీ20 సదస్సు తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం తలపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఆ మరుసటి రోజే ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడం విశేషం. కొత్త భవనంలోనే సమావేశాలు ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలోనే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మే 28న ఈ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రతిఏటా మూడుసార్లు (బడ్జెట్, వర్షాకాల, శీతాకాల) పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈసారి ప్రత్యేక సమావేశాల వెనుక కారణంగా ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం.. ఏడాదిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్‌ను సమావేశపరచాల్సి ఉంటుంది. రెండు భేటీల మధ్య వ్యవధి 6 నెలలకు మించరాదు. దానికి అనుగుణంగానే ప్రతిఏటా ఫిబ్రవరి–మే నెలల మధ్యలో బడ్జెట్, జూలై–ఆగస్టు మధ్య వర్షాకాల, నవంబర్–డిసెంబర్ల మధ్య శీతాకాల సమావేశాలను నిర్వహిస్తారు. ఈసారి ఏకంగా ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడం పట్ల దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిపోయింది. పెండింగ్‌లో ఉన్న బిల్లుకు మోక్షం! మరోవైపు సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, రాజకీయ అవసరాల కోసమే బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తెరపైకి తీసుకొస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కూడా ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు గత రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చంద్రయాన్–3 మిషన్ చరిత్ర సృష్టించడం, ‘అమృతకాలం’లో భారతదేశ లక్ష్యాలతోపాటు ఇతర ముఖ్యమైన అంశాలపైనా ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజల దృష్టిని మళ్లించడానికే: జైరామ్ రమేశ్ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశాలు, అదానీ గ్రూప్‌లో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల పేరిట మోదీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ విమర్శించారు. ‘ఇండియా’ కూటమి సమావేశాల వార్తలకు మీడియాలో ప్రాధాన్యం లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు వారాల క్రితమే ముగిశాయని, ఇంతలోనే మళ్లీ భేటీ కావడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలంటూ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని జైరామ్ రమేశ్ చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగే సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ఆ బిల్లుల ఆమోదానికేనా? వన్ నేషన్–వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్, ఉమ్మ డి పౌరస్మృతి(యూసీసీ) బిల్లులను మోదీ ప్రభు త్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుందని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ఇందులో వన్ నేషన్–వన్ ఎలక్షన్ బిల్లు అత్యంత ముఖ్యమైనది. దీన్ని ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం వచ్చే ఏడాది జరిగే సార్వ త్రిక ఎన్నికలను ముందుకు జరపడమేనని రాజకీ య పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లో తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలన్న ప్రతిపాదనపై బలమైన చర్చ జరుగుతోంది. కేంద్రం ముందస్తుకు వెళ్లే యత్నాల్లో ఉందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ విధానమే మార్గమని బీజే పీ నాయకులు అంటున్నారు. దేశమంతటా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ అమలుకు కనీసం 5 కీలక రాజ్యాంగ సవరణలు చేయాలి. అందుకు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశం జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యా య శాఖ మంత్రి మేఘ్వాల్ గతంలోనే చెప్పారు. ప్రత్యేక సమావేశాలు కొత్తేమీ కాదు పార్లమెంట్ బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు కాకుండా, ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం అసాధారణమేమీ కాదు. 2017 జూన్ 30న అర్ధరాత్రి పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. కానీ, ఇది లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశం. 50వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 1997 ఆగస్టులో ఆరు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. క్విట్ ఇండియా ఉద్యమానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1992 ఆగస్టు 9న, స్వాతంత్య్ర దినోత్సవ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 1972 ఆగస్టు 14–15న అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్.. AICC కీలక నిర్ణయం -
మోదీ సర్కార్ అనూహ్య ప్రకటన.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ గురువారం అనూహ్య ప్రకటన చేసింది. సెప్టెంబర్‌లో పార్లమెంట్ అమృత్కాల్ స్పెషల్ సెషన్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. వివరాల ప్రకారం.. మోదీ సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌లో ఐదు రోజులు పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. అయితే, ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా? అనే కోణం కూడా వినిపిస్తోంది. ఈ మేరకు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక దేశం.. ఒకే ఎన్నిక బిల్లు పెట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. "A special Session of Parliament (13th Session of 17th Lok Sabha and 261st Session of Rajya Sabha) is being called from 18th to 22nd September having 5 sittings," tweets Parliamentary Affairs Minister Pralhad Joshi pic.twitter.com/7nyRfZUAHF — ANI (@ANI) August 31, 2023 ఇదిలా ఉండగా.. ఇటీవలే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ క్రమంలో మణిపూర్ ఘటనపై మోదీ స్పందించాలని ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. దీంతో, మణిపూర్‌పై స్పందించిన ప్రధాని మోదీ.. అక్కడ శాంతి నెలకొల్పే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అంటూ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతలకు గట్టి సమాధానం ఇచ్చారు. Special Session of Parliament (13th Session of 17th Lok Sabha and 261st Session of Rajya Sabha) is being called from 18th to 22nd September having 5 sittings. Amid Amrit Kaal looking forward to have fruitful discussions and debate in Parliament. ಸಂಸತ್ತಿನ ವಿಶೇಷ ಅಧಿವೇಶನವನ್ನು… pic.twitter.com/k5J2PA1wv2 — Pralhad Joshi (@JoshiPralhad) August 31, 2023 ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో ‘ఇండియా’ బీజేపీని ఓడిస్తుంది: అఖిలేశ్ -
రాహుల్ గాంధీకి మతి తప్పినట్లుంది.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రసంగం సమయంలో తను ప్రస్తావించిన ‘భరత మాత’మాటను తొలగించారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన మతి తప్పినట్లుగా అనిపిస్తోందని జోషి వ్యాఖ్యానించారు. అన్ పార్లమెంటరీ మాటలను తొలగించామేతప్ప, భరతమాత అనే మాటను కాదని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌పై మేము(కేంద్రం) చర్చకు అంగీకరిస్తామని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కలలో కూడా అనుకోని ఉండరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినట్లుగా, ఈ అంశంపై మనం సున్నితంగా వ్యవహరించాలి. ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన తన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని అనిపిస్తోంది. రాహుల్ గాంధీ సభకు రాలేదు. మా సమాధానం వినలేదు.గ్రాండ్ ఓల్డ్ అని పిలవబడే పార్టీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం’ అనిపేర్కొన్నారు. మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..ఏదో హడావుడి చేయాలన్న రాహుల్ గాంధీ ప్రయత్నం మరోసారి ఫెయిల్, ఫ్లాప్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ‘రాహుల్ తప్పుడు భాషను వాడుతున్నారు. భరత మాత బిడ్డ ఎవరూ కూడా ఆమె హత్య గురించి మాట్లాడరు, ఆలోచించరు. దేశానికి అప్రతిష్ట తెచ్చేందుకే ఇలా మాట్లాడుతున్నారన్న విషయం రాహుల్ వాడిన భాషను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది’అని ఆరోపించారు. చదవండి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కవిత కరచాలనం #WATCH | Parliamentary Affairs Minister Pralhad Joshi says, "Congress & other opposition parties never thought that we would agree for a discussion on Manipur...Like PM Narendra Modi & Union Home Minister Amit Shah said we should be sensitive about the issue. Today, as well what… pic.twitter.com/SqhHrJkHge— ANI (@ANI) August 11, 2023 -
20 నుంచి పార్లమెంట్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో సభా వ్యవహారాలు, వివిధ అంశాలపై ఫలప్రదమైన చర్చలకు సహకరించాలని అన్ని పారీ్టలను కోరుతున్నా’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మొత్తం 17 రోజులపాటు పార్లమెంట్ సమావేశం కానుంది. సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, సమావేశాల మధ్యలో కొత్త భవనానికి మారుతాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయతి్నస్తున్న వేళ ఈ సమావేశాలు వాడీవేడిగా సాగుతాయని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి( యూసీసీ)బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రధాని మోదీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెడుతూ ఢిల్లీలో పరిపాలనాధికారాలపై పట్టుబిగించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అదేవిధంగా, ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ నూతన భవనాన్ని మే 28న ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. -
తమిళనాడు తరహాలో మినహాయించాలి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు డెల్టా ప్రాంతంలోని మూడు లిగ్నైట్ బ్లాకులను వేలం నుంచి మినహాయించిన రీతిలోనే సింగరేణి బొగ్గు బ్లాక్‌లను కూడా వేలం నుంచి మినహాయించాలని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీ రామారావు శనివారం ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రాంతీయ పార్టీల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని లిగ్నైట్ గనులను వేలం నుంచి మినహాయించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన ప్రకటనను కేటీఆర్ ప్రస్తావించారు. బొగ్గు గనులను ప్రైవేటీకరించకుండా సింగరేణికే కేటాయించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. తమిళనాడు గనులను వేలం జాబితా నుంచి కేంద్రం తప్పిస్తున్నట్లు వచ్చిన ఓ వార్తను తన పోస్టుకు జత చేశారు. ఒకే దేశంలో ఉన్న రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీలు ఏవైనా సరే వేలంలో టెండర్లు దాఖలు చేసి బొగ్గు గనులు సొంతం చేసుకోవాల్సిందేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, స్వచ్ఛందంగా సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. -
ప్రధాని దృష్టికి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు
సైదాబాద్ (హైదరాబాద్): రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్ పెంపు.. తదితర అపరిష్కృత సమస్యలను ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి హామీ ఇచ్చారు. గురువారం ఆయన సైదాబాద్‌లోని ఎస్బీహెచ్ ఏ కాలనీ కమ్యూనిటీహాల్లో నిర్వహించిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.రోహిణిరావు, అసోసియేషన్ సభ్యులతో కలసి కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. గత మూడు దశాబ్దాలుగా బ్యాంక్ ఉద్యోగుల ప్రాథమిక పెన్షన్‌ను సవరించలేదని ఆయన పేర్కొన్నారు. 2002కు ముందు పదవీ విరమణ పొందిన సీనియర్ మేనేజర్లు, టాప్ మేనేజర్లలో చాలామంది రూ. 35 వేల కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారని వివరించారు. పెరిగిన ఖర్చులతో పెద్ద హోదాలోనివారి పరిస్థితే ఇలా ఉంటే తక్కువ క్యాడర్ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని తెలిపారు. కాగా, పెన్షన్ రివిజన్, 100 శాతం డీఏ న్యూట్రలైజేషన్ సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని వారు కోరారు. అసోసియేషన్ వినతులకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రెండు విడతల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 6న ముగియనున్నాయని తెలిపారు. తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరగనున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుందన్నారు. రెండో విడతలో మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. 66 రోజుల వ్యవధిలో మొత్తం 27 రోజల పని దినాల్లో ఈ సమావేశాలు కొనసాగున్నట్లు తెలిపారు. ఈ అమృత కాలంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని పేర్కొంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా ఈ సమావేశాల్లో తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు. చదవండి: ఢిల్లీ సర్కార్ వర్సెస్ కేంద్రం.. నియంత్రణ కేంద్రానిదే అయితే రాష్ట్ర సర్కార్ దేనికి? Budget Session, 2023 of Parliament will commence from 31 January and continue till 6 April with 27 sittings spread over 66 days with usual recess. Amid Amrit Kaal looking forward to discussions on Motion of Thanks on the President’s Address, Union Budget & other items. pic.twitter.com/IEFjW2EUv0 — Pralhad Joshi (@JoshiPralhad) January 13, 2023 -
ఆ ఆరోపణలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..
సాక్షి, ఢిల్లీ: సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంట్లో బుధవారం రగడ జరిగింది. ప్రైవేటీకరణ ఆపాలని టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆందోళనకు దిగారు. దీనిపై కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. తెలంగాణ ఎంపీల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్థరహితమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణపై జీరో అవర్‌లో లేవనెత్తగా.. సభలోనే కేంద్రమంత్రి ప్రకటన జారీ చేశారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉన్నప్పుడు 49 శాతం వాటా కల్గిన కేంద్రం.. ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదు. బొగ్గు గనుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న వేలం ప్రక్రియపై ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుపుతున్న రాష్ట్రాలకు సైతం ప్రయోజనం కలుగుతుంది. దీంతో అనేక రాష్ట్రాలు గనుల వేలానికి పూర్తిగా సహకరిస్తున్నాయని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కానప్పటికీ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా వేలం పద్ధతిని అందిపుచ్చుకున్నాయి. వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళ్తుంది. బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. చదవండి: గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు -
జీ–20పై నేడు అఖిలపక్షం
న్యూఢిల్లీ: భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులు హాజరుకానున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జీ–20 శిఖరాగ్ర సదస్సుకి ముందు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200కిపైగా సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు జీ–20 మొట్టమొదటి ప్రతినిధుల సదస్సు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఆదివారం జరిగింది. సమ్మిళిత అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యరంగంలో సదుపాయాలు, నాణ్యమైన జీవనం వంటివాటిపై భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ మాట్లాడారు. -
CM Jagan: జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రపంచ జీడీపీలో 90 శాతం, వ్యాపారంలో 80 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల వాటా ఈ దేశాలదే. ఈ దేశాలు కలిసి పని చేయడం ద్వారా ప్రపంచ ఆరి్థక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించడమే ఈ సమావేశాల లక్ష్యం. చదవండి: (Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే) -
జీ20 అఖిలపక్ష సమావేశానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రపంచ జీడీపీలో 90 శాతం, వ్యాపారంలో 80 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల వాటా ఈ దేశాలదే. ఈ దేశాలు కలిసి పని చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించడమే ఈ సమావేశాల లక్ష్యం. -
‘తెలంగాణలో ఇక బీజేపీదే అధికారం’
సాక్షి, యాదాద్రి, యాద గిరిగుట్ట/వనపర్తి: రాబో యే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికార పగ్గాలు చేపడుతుందనే నమ్మకం ఉందని కేంద్ర బొగ్గు, గనులు, పార్ల మెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. గురువారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించు కున్న మంత్రి.. మీడియాతో మాట్లాడారు. అవినీతి, అధికార దుర్వినియో గానికి పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు విశ్వాసం కోల్పో యారని అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడటానికి శక్తిని ప్రసాదించా లని యాదాద్రీశుడిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. బీజేపీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీ, జిల్లా స్థాయి మత్స్యకారుల సమ్మే ళనంలో ఆయన మాట్లాడుతూ.. పోటీ చేయాలనే కోరిక ఉంటేనే సరిపోదని, అందుకు పోరాటపటిమ చూపాలన్నారు. ప్రపంచంలో మత్స్య సంపదను ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్‌కు అడ్డుపడుతున్న కేసీఆర్: మహేంద్రనాథ్ పాండే పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఏటా రూ.5 లక్షల వైద్య సహాయం అందించే ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలుకానివ్వ కుండా కేసీఆర్ స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడుతున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరోపించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారి వనపర్తి, గద్వాల జిల్లాలో పర్యటించారు. వనపర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అతి త్వరలో ఆ స్పీడ్ బ్రేకర్‌ను తొలగించి తెలంగాణలోనూ ప్రతి పేదవాడికి మోదీ కేర్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యాశాఖలో నియామకాలు చేపట్టకుండా, తనకు ఎన్ని కల సమయంలో ఉపయోగపడే ఒక్క పోలీస్ శాఖలోనే కేసీఆర్ తరుచూ నియామకాలు చేపట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ– రాయలసీమను కలుపుతూ కృష్ణానదిపై సోమశిల వద్ద తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. కొత్త ఓటర్లతో మంత్రి రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్రావు, కాసం వెంకటేశ్వర్లు, జిట్టా బాలకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా? -
విధాన స్థిరత్వం, పారదర్శకత బాటన భారత్
న్యూఢిల్లీ: దేశంలో పెట్టుబడులను పురోభివృద్దికి పాలసీ స్థిరత్వం, పారదర్శకత, చక్కటి సంప్రదింపుల ప్రక్రియ బాటను అందిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పేర్కొన్నారు. దేశంలో ఇంధన వనరుల రంగంలో అవకాశాలు అపారమన్న ఆమె, ఈ అవకాశాలను అందిపుచ్చుకోడానికి పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు అమ్మకానికి సంబంధించి ఆరవ విడత గనుల వేలం పక్రియ ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘ఈ అమృత్ కాలం (భారత్ స్వాతంత్రం సముపార్జించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా) సమయంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సమయంలో భారతదేశానికి అన్ని ప్రాథమిక ఖనిజాలు అవసరం. ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలు అపారం’ అని ఆర్థికమంత్రి ఈ సందర్బంగా పేర్కొన్నారు. పెట్టుబడులకు తగిన దేశం భారత్ అని మోర్గాన్ స్టాన్లీ చేసిన వ్యాఖ్యను ఆర్థికమంత్రి ప్రస్తావించారు. బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ వాణిజ్య గనుల ఆరవ విడత వేలంలో 141 బొగ్గు, లిగ్నైట్ గనులను విక్రయించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 67 బొగ్గు గనులను కమర్షియల్ మైనింగ్ కింద అమ్మకానికి ఉంచినట్లు కూడా తెలిపారు. ప్రపంచంలో పలు దేశాలు మందగమనం ముందు నుంచొన్న సమయంలో భారత్ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని తెలిపారు. ఆరవ విడత బొగ్గు గనుల వేలం పక్రియను ప్రారంభిస్తున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ -
మెడిసిన్ విదేశాల్లోనే ఎందుకు?
-
‘అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమే’
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అఖిలపక్షం ఆదివారం భేటీ అయింది. ఈ సమావేశానికి దేశంలోని 32 పార్టీల నేతలు హాజరయ్యారు. లోక్ సభ స్పీకర్ అనుమతితో అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. చదవండి: చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు ఈ సందర్భంగా కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, సాగుచట్టాల వ్యతిరేకిస్తూ జరిపిన ఆందోళనలో మృతి చెందిన రైతులు, కరోనా మృతులకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. చదవండి: పార్లమెంట్లో కాంగ్రెస్‌తో సమన్వయంపై ఆసక్తి లేదు రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మూడు సాగు చట్టాలపై రైతులను ఒప్పించలేకపోయామన్న ప్రధాని మోదీ.. మరో రూపంలో వాటిని తీసుకువచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. అయితే ఈసారి జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకాకపోవడం గమనార్హం. -
వైఎస్సార్ జిల్లాలో వజ్రాల లభ్యత: జీఐఎస్
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఏపీలోని వైఎస్సార్ జిల్లా పరిధిలో పెన్నా నదీ బేసిన్ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఐఎస్) గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఖనిజాన్వేషణ సర్వే నిర్వహించిన ఈ సంస్థ జీ–4 స్థాయి పరిశోధన అనంతరం 100 మినరల్ బ్లాక్‌ల (గనులు) నివేదికలను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల మైనింగ్ శాఖలతో ఢిల్లీలో బుధవారం కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆ నివేదికలను ఆయన ఆయా రాష్ట్రాలకు అందజేశారు. మైనింగ్ బ్లాక్‌ల నివేదికలను స్వీకరించిన రాష్ట్రాలు ఇక ఆలస్యం లేకుండా వేలాన్ని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం మైనింగ్ రంగాన్ని ఉత్తేజ పరచడానికి వీలుగా దేశంలో ఖనిజ అన్వేషణను వేగవంతం చేస్తోందని వివరించారు. మొత్తం 14 రాష్ట్రాలు మైనింగ్ బ్లాక్ నివేదికలను అందుకున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్ 21, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 9 చొప్పున నివేదికలు అందుకున్నాయి. ఏపీ తరఫున రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి నివేదికలు అందుకున్నారు. రాష్ట్రాలు ఆయా బ్లాక్‌లకు కాంపోజిట్ లైసెన్స్‌లు ఇచ్చేందుకు వేలం నిర్వహించాల్సి ఉంటుంది. 37 చ.కి.మీ మేర వజ్రాల బ్లాక్ వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఐఎస్) అన్వేషణలో తేలింది. నెల్లూరు జిల్లా మాసాయపేట పరిధిలో 20 చ.కి.మీ మేర బేస్ మెటల్ ఉన్నట్లు స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లా ములగపాడులో 4.02 చ.కి.మీ, విశాఖపట్నం జిల్లా నందాలో 2.04 చ.కి.మీ, విజయనగరం జిల్లా గరికపేటలో 4.60 చ.కి.మీ, శివన్నదొర వలసలో 4.20 చ.కి.మీ, బుద్ధరాయవలసలో 6.38 చ.కి.మీ విస్తీర్ణంలో మాంగనీస్ బ్లాక్‌లు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాలోని లక్ష్మక్కపల్లెలో 30.23 చ.కి.మీ విస్తీర్ణంలో ఒకటి, అద్దంకివారిపాలెంలో 9.14 చ.కి.మీ విస్తీర్ణంలో మరొకటి మొత్తంగా 2 ఐరన్ ఓర్ బ్లాక్‌లు ఉన్నాయని వెల్లడించింది. ఆదాయం పెంచుకునేందుకే.. గతంలో ఈ స్థాయి సర్వే ప్రకారం గనులకు వేలం నిర్వహించవద్దని కేంద్రం చెప్పింది. అయితే ఆదాయం పెంచుకోవాల్సిన నేపథ్యంలో తాజాగా ఎంఎండీఆర్ (మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టాన్ని సవరించి జీ–4 సర్వే ప్రకారం గనుల్ని లీజుకిచ్చే అవకాశం కల్పించింది. వేలంలో లీజులు తీసుకున్న వారు వెంటనే మైనింగ్ చేసుకునే అవకాశం ఉండదు. ఆ బ్లాకుల్లో ఖనిజం ఎక్కడ, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సొంతంగా జీ–3, 2, 1 స్థాయి సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రెండు నుంచి ఐదేళ్లు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వారికిచ్చిన కాంపోజిట్ లీజును సాధారణ లీజుగా మార్పు చేస్తారు. -
గనుల రంగంలో విప్లవాత్మక సంస్కరణలు!
న్యూఢిల్లీ: గనుల రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. మరో వారంలో సంబంధిత వర్గాల సలహాలను ఆహా్వనిస్తుందని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా నవంబర్‌లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో మైనింగ్ చట్టాలకు కేంద్రం సవరణలు తీసుకువస్తుందని కూడా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 100 జీ4 ఖనిజ క్షేత్రాల బదలాయింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రహ్లాద్ మాట్లాడారు. గనులు, ఖనిజాల అంశాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఖనిజ క్షేత్రాలను వేలానికి తీసుకురావాలని రాష్ట్రాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు 100 ఖనిజ క్షేత్రాల కేటాయింపు వల్ల దేశంలో సంబంధిత సరఫరాలు నిరంతరం పెరుగుతాయని, ఖనిజ క్షేత్రాల వేలం ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వస్తుందని తెలిపారు. -
కూతురు పెళ్లిలో స్టెప్పులేసిన కేంద్ర మంత్రి.. వీడియో వైరల్
బెంగళూరు: పెళ్లిలో మ్యూజిక్, డ్యాన్స్‌లు, ఎంజాయ్మెంట్ కామన్‌గా మారిపోయింది. వివాహ తంతు కంటే వీటి కోసమే ఎక్కువ ఆర్భాటాలు చేస్తున్నారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు, కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా అందరూ ఏకమై ఆటపాటలతో చిందేస్తున్నారు. సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు సైతం ఇలాంటి వేడుకలకు సై అంటున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కుమార్తె వివాహం బుధవారం కర్ణాటకలో జరిగింది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి ఓ పాటకు డ్యాన్స్ చేశారు. చదవండి: అరుదైన సంఘటన.. ఏనుగుకు కవల పిల్లలు! హుబ్లీలో జరిగిన ఈ ఫంక్షన్లో ఆయన సతీమణి జోత్యితో కలిసి ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. కన్నడ లెజెండ్ దివంగత రాజ్ కుమార్ పాడిన ‘ఏరాడు కనుసు’ సినిమాలోని సూపర్ హిట్ పాట ‘ఎండెందు నిన్నాను మారేటు నానిరాలారే’ కు జోషి దంపతులు డ్యాన్స్ చేశారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకొని తమదైన స్టెప్పులతో అందరినీ అలరించారు. మంత్రి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. -
‘గెజిట్ నోటిఫికేషన్‌తో కేఆర్ఎంబీ సమర్థవంతంగా పనిచేసే అవకాశం’
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో జల విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పలు దఫాలుగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని జల శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కేఆర్ఎంబీకి ఇండెంట్ పెట్టకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో తెలంగాణ ఏకపక్షంగా జల విద్యుత్ ఉత్పాదన చేస్తున్నట్లుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ గత జూలై 5న జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ గత జూన్ 17న లేఖ ద్వారా తెలంగాణ జన్‌కోను ఆదేశించింది. జల విద్యుత్ ఉత్ప్తత్తి కోసం నీటి వినియోగంపై కేఆర్ఎంబీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు విద్యుత్ ఉత్పాదన చేయవద్దని ఆ లేఖలో సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌తోపాటు నాగార్జున సాగర్ డామ్, పులిచింతల ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తూనే ఉన్నందున దీనిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ జూలై 15న కేఆర్ఎంబీ తెలంగాణ జెన్కో అధికారులను ఆదేశించిందని చెప్పారు. జల విద్యుత్ ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు, తాగు నీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కూడా కేఆర్ఎంబీ స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. కేఆర్ఎంబీ రాసిన లేఖలపై తెలంగాణ జెన్కో (హైడల్) డైరెక్టర్ జూలై 16న ప్రత్యుత్తరమిస్తూ జల విద్యుత్ ఉత్పాదన చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే తాము విద్యుత్ ఉత్పాదన చేస్తున్నట్లు కేఆర్ఎంబీకి తెలిపారని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పాదన కోసం నీటిని వినియోగించేందుకు కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసే వరకు శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్, నాగార్జున సాగర్ డామ్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో విద్యుత్ ఉత్పాదన కోసం నీటి విడుదలను నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా కేఆర్ఎంబీ జూలై 16న రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. అయినప్పటికీ కేఆర్ఎంబీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేఆర్ఎంబీకి కల్పించిన అధికారాలను సద్వినియోగం చేసే దిశగా కేఆర్ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. దీని వలన బోర్డు మరింత సమర్ధవంతంగా పని చేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
BS Yediyurappa: యడియూరప్ప వారసుడెవరు?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బి.ఎస్.యడియూరప్ప(78) మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. యడియూరప్ప వారసుడు ఎవరన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తదుపరి సీఎం రేసులో తాము ముందంజలో ఉన్నామంటూ పలువురు నాయకులు లీకులిస్తున్నారు. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జాబితాలో కొత్త పేర్లు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని కర్ణాటక బీజేపీలోని ఒకవర్గం వాదిస్తుండగా, మార్పు తథ్యమని మరో వర్గం బల్లగుద్ది మరీ చెబుతోంది. యడియూరప్ప స్థానంలో బలమైన నేతను నియమించడం పార్టీకి సవాలేనని బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. అనుకున్నంత సులభం కాదు కర్ణాటకలో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన బీజేపీ నాయకత్వంలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ సజావుగా సాగాలంటే యడియూరప్ప వారసుడిగా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని మాస్ లీడర్ కావాలని చెబుతున్నారు. అలాంటి నేతను వెతికి పట్టుకోవడం అనుకున్నంత సులభం కాదని బీజేపీ కార్యకర్తలే పేర్కొంటున్నారు. కులాల మధ్య సమతూకం పాటిస్తూ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిదేనని అంటున్నారు. లింగాయత్ వర్గం జనాభా కర్ణాటకలో 16 శాతానికి పైగానే ఉంది. దీంతో ఈ వర్గాన్ని విస్మరించలేని పరిస్థితి. లింగాయత్‌లు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పిస్తారన్న వార్తల పట్ల ఈ వర్గం గుర్రుగా ఉంది. లింగాయత్‌ల ఆగ్రహానికి గురైతే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. ఒక్కళిగ వర్గంలో పట్టుకోసం ఆరాటం కర్ణాటక తదుపరి సీఎంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.ఎల్.సంతోష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జోషీ, సంతోష్ బ్రాహ్మణ సామాజికవర్గం నేతలు. సి.టి.రవి ఒక్కళిగ వర్గం నాయకుడు. అయితే, బీజేపీ అధిష్టానం అనూహ్యంగా కొత్త నేతను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఒక్కళిగ కూడా బలమైన సామాజిక వర్గమే. ఈ వర్గంలో పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం రేసులో మరో బ్రాహ్మణ నాయకుడు, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ఖగేరీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. రామకృష్ణ హెగ్డే తర్వాత 1988 నుంచి ఇప్పటిదాకా కర్ణాటక సీఎంగా బ్రాహ్మణులకు అవకాశం దక్కలేదు. బీజేపీలో యడియూరప్ప ప్రత్యర్థి, సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తనకు సీఎం పదవి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన వీర హిందుత్వవాదిగా పేరుగాంచారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ నెగ్గాలంటే హిందుత్వవాదికే పట్టం కట్టాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారని, అందులో భాగంగానే తనవైపు మొగ్గు చూపుతున్నారని బసనగౌడ సంకేతాలిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా మంత్రులు మురుగేష్ నిరానీ, బసవరాజ్ ఎస్.బొమ్మై, ఆర్.అశోక్, సి.ఎన్.అశ్వత్థ నారాయణ్, జగదీష్ షెట్టర్(మాజీ సీఎం), ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు విందు వాయిదా కర్ణాటక సీఎం యడియూరప్ప ఈ నెల 25న తలపెట్టిన విందు వాయిదా పడింది. సీఎంగా రెండేళ్ల పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో బెంగళూరులోని ఓ హోటల్లో బీజేపీ ఎమ్మెల్యేలకు భారీ విందు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. అయితే, ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల నేపథ్యంలో ఈ విందు వాయిదా పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. విందు కోసం తదుపరి తేదీని ఇంకా ఖరారు చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి. యడియూరప్ప గత వారమే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. సీఎం మార్పుపై చర్చించడానికే యడియూరప్పను పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిపించారన్న వార్తలు వెలువడ్డాయి. -
సభా సమరం షురూ..!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అన్ని పార్టీ లు సహకరించాలని, ఈ సమావేశాలు సజావుగా సాగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా కొందరు సభ్యులు మృతిచెందడం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. సోమవారం నుంచి వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు అవసరమని, ఇవి చర్చలను మరింత ఫలప్రదంగా మారుస్తాయని చెప్పారు. సభ్యుల్లో అధికులు టీకాలు తీసుకున్నందున సభలు మరింత సజావుగా సాగుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగడానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. సోమవారం నుంచి ఆగస్టు 13 వరకూ నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19 సార్లు సభ సమావేశం అవుతుందన్నారు. 30 పైచిలుకు బిల్లులు వర్షాకాల సమావేశాల సందర్భంగా రెండు ఆర్థిక బిల్లులు సహా మొత్తం 30కి పైచిలుకు బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీటిలో ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు, ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ బిల్లు, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ తదితర బిల్లులున్నాయి. వీటితో పాటు పలు కీలక బిల్లులు సైతం సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ఈ అఖిలపక్ష సమావేశంలో టీఎంసీ, డీఎంకే, వైఎస్సార్సీపీ, శివసేన, జేడీయూ, బీజేడీ, ఎస్పీ, టీఆర్ఎస్, ఏఐడీఎంకే, బీఎస్పీ, ఎన్సీపీ, టీడీపీ, అకాలీదళ్ సీపీఐ, ఆప్ సహా 33 పార్టీల నేతలు పాల్గొన్నారు. వీరిలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ సింగ్, టీఎంసీకి చెందిన డెరిక్ ఓబ్రెయిన్, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, ఎస్పీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్, బీఎస్పీకి చెందిన సతీష్ మిశ్రా, అప్నాదళ్ నేత అనుప్రియ, ఎల్జేపీ నేత పశుపతి పరాస్ ఉన్నారు. ప్రధానితో పాటు హోం, రక్షణ మంత్రులు, రాజ్యసభ లీడర్ ఆఫ్ హౌస్ పీయూష్ గోయల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ తాజా విస్తరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో వీటిపై ఆసక్తి నెలకొంది. అందుకు ఒప్పుకోం దేశంలో కరోనా పరిస్థితిని పార్లమెంట్ ఉభయసభల ఎంపీలకు పార్లమెంట్ బయట ఏర్పాటు చేసే సమావేశంలో ప్రధాని వివరిస్తారనే కేంద్ర ప్రతిపాదనకు ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఇది పార్లమెంటరీ నియమాలను ఉల్లంఘించేందుకు మరోమార్గమని దుయ్యబట్టాయి. జూలై 20న ప్రధాని రెండు సభల ఎంపీలనుద్దేశించి పార్లమెంట్ అనుబంధ భవనంలో ప్రసంగిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషీ ప్రకటించగానే, తొలుత టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంటు జరుగుతోందని, సభకు వచ్చి మాట్లాడాలని ఆపార్టీ ఎంపీ డెరిక్ అభిప్రాయపడ్డారు. దీనికి పలు ఇతర పక్షాల నేతలు కూడా మద్దతు ప్రకటించారని తెలిసింది. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కొందరు నేతలు సూచించారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలన్నా సభలోనే చెప్పాలన్నది తమ అభిప్రాయమని సీపీఎం వ్యాఖ్యానించింది. వేరుగా ఎంపీలనుద్దేశించి ప్రసంగించడం తగదని పేర్కొంది. సోమవారం సభలు ఆరంభం కాగానే ఉప ఎన్నికల్లో ఎన్నికైన నూతన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఎన్డీఏ నేతలతో ప్రధాని భేటీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభమవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఎన్డీఏలోని పార్టీల పార్లమెంటరీ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్నా«థ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. ఎన్డీఏ పక్షాల నేతల్లో అప్నాదళ్‌కు చెందిన అనుప్రియ, జేడీయూ నేత రామ్‌నాథ్ ఠాకూర్, ఏఐఏడీఎంకే నేత నవనీతకృష్ణన్, ఆర్పీఐ నేత రామ్‌దాస్ అథవాలే, ఎల్జేపీ నేత పశుపతి పరాస్ తదితరులున్నారు. ఈ సమావే శాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో ప్రధాని చర్చించారు. సభ పవిత్రతను గౌరవించాలి: ఓం బిర్లా సభ పవిత్రత, గౌరవాన్ని సభ్యులందరూ గౌరవించాలని సభాపతి ఓంబిర్లా తెలిపారు. ఆదివారం సభాపతి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ సజావుగా సాగడానికి గత సమావేశాల మాదిరిగానే సహకరించాలని పార్టీల నేతలను ఓం బిర్లా కోరారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అందరికీ తగిన సమయం కేటాయిస్తానన్నారు. త్వరలోనే ఒక యాప్ తీసుకొస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి వన్‌స్టాప్ సొల్యూషన్‌గా అది ఉపకరిస్తుందని ఓం బిర్లా తెలిపారు. కరోనా నేపథ్యంలో సభ్యులు, సిబ్బంది, మీడియా అందరికీ తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఓం బిర్లా మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆకాంక్షలకు సభ ప్రాతినిధ్యం వహిస్తుందని, ప్రజల సమస్యలను తెలియజేయడం సభ్యుల బాధ్యత అన్నారు. ప్రజా ప్రయోజనాలపై చర్చించడానికి అవకాశం ఉండాలని .. చిన్నపార్టీలు, ఏక సభ్యుడున్న పార్టీలకు కూడా తగిన సమయం కేటాయిస్తానని సభాపతి ఓంబిర్లా తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేతలు మిథున్‌రెడ్డి, రామ్మోహన్నాయుడు, నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఎంపీలాడ్ ఫండ్స్ పునరుద్ధరించాలి! రాజకీయ పార్టీల డిమాండ్ ఎంపీ లాడ్ నిధులను పునరుద్ధరించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీలు ఈ డిమాండ్‌ను వినిపించాయి. పార్టీల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషీ ముందు ఎంపీ లాడ్ నిధులు మరలా ఇవ్వాలనే డిమాండ్‌ను వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్, టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ లేవనెత్తారు. ప్రజాప్రయోజన అంశాలపై మాట్లాడేందుకు సభ్యులకు తగిన సమయం ఇస్తానని ఈ సందర్భంగా స్పీకర్ హామీ ఇచ్చారు. ఎంపీలంతా సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరారు. ఐదు సెషన్లుగా పార్లమెంట్ సాఫీగా జరిగేందుకు సహకరించినందుకు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటంకాలు లేకుండా సభ నడిచేందుకు సహకరిస్తామని పార్టీల నేతలు స్పీకర్‌కు చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ నేపథ్యంలో సభా సమావేశాల ఏర్పాట్లను కట్టదిట్టం చేశామని స్పీకర్ చెప్పారు. -
మంత్రి ఇంటి ఎదుట మహిళ డెత్‌నోట్..
సాక్షి, హుబ్లీ: కూలిపోయిన ఇంటికి పరిహారం కోసం తిరిగి తిరిగి వేసారిన ఓ మహిళ స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంటి ఎదుట డెత్‌నోట్ రాసి పెట్టి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడలో బుధవారం చోటుచేసుకుంది. ధార్వాడ తాలూకా గరగ గ్రామానికి చెందిన శ్రీదేవి అనే మహిళకు చెందిన ఇల్లు గత ఏడాది వర్షాకాలంలో అతివృష్టితో కూలిపోయింది. పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కొన్ని నెలలుగా ధార్వాడ గ్రామీణ ఎమ్మెల్యే అమృత్ దేశాయిని కలిసి విజ్ఞప్తులు చేసింది. ఆయన ఎంపీకి విజ్ఞప్తి చేయాలని సూచించారు. ఆమె ధార్వాడ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంటికి వెళ్లి పరిహారం కోసం మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. విసిగి వేసారిన శ్రీదేవి ఆయన ఇంటి ఎదుట లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు పాలైన ఆమెను విమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: వేట కొడవళ్లతో దాడి: తండ్రీ కొడుకుల దారుణ హత్య పెళ్లయిన 43వ రోజు భార్య గొంతు కోసి దారుణ హత్య -
Coal Block Auction: వేలానికి 67 బొగ్గు గనులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 67 బొగ్గు బ్లాకులను (గనులు/నిక్షేపాలు) విక్రయానికి పెట్టింది. రెండో దశ వాణిజ్య బొగ్గు మైనింగ్ వేలాన్ని గురువారం ప్రారంభించి.. ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేసిన అడుగుగా అభివర్ణించింది. 2014లో వాణిజ్య ప్రాతిపదికన బొగ్గు గనులను ప్రారంభించిన తర్వాత ఒక విడతలో అత్యధిక బ్లాక్‌లను వేలానికి ఉంచడం ఇదే ప్రథమం. వేలాన్ని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, బొగ్గు శాఖ సెక్రటరీ అనిల్ కుమార్ జైన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విక్రయించనున్న 67 గనుల్లో 23 కోల్‌మైన్స్ చట్టం కింద, 44 మైన్స్ అండ్ మినరల్స్ చట్టం పరిధి కింద ఉన్నాయి. కోకింగ్, నాన్‌కోకింగ్ కలసి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర పరిధిలో ఈ గనులు విస్తరించి ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. అపారమైన బొగ్గు నిల్వలను వినియోగించుకునేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడమేకాక దేశాభివృద్ధికి పాటుపడాలని ప్రహ్లాద్ జోషి కోరారు. వాణిజ్య బొగ్గు మైనింగ్ ద్వారా కొత్త పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్పారు. బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రాల్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధి మేరుగుపడుతుందని అని అన్నారు. బొగ్గు రంగంలో గత విజయాలను పరిశీలించాక, భవిష్యత్తులో వేలం నిర్వహించడానికి ప్రభుత్వం ‘రోలింగ్ యాక్షన్’ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు మంత్రి ప్రకటించారు. చదవండి: ఈ బ్యాంకు పాస్‌బుక్, చెక్‌బుక్‌లు ఏప్రిల్ 1 నుంచి చెల్లవు -
ముగిసిన బడ్జెట్ పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల నాయకులు ఎన్నికల ప్రచారం కోసం సమయం అవసరమని విజ్ఞప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 13 రోజుల ముందే సమావేశాలను ముగించారు. జనవరి 29న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8 వరకు జరగాల్సి ఉండగా, ముందే, గురువారం, మార్చి 25వ తేదీన నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగడంపై స్పీకర్ ఓం బిర్లా ఒక ట్వీట్లో హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో ముఖ్యమైన పలు బిల్లులు సభ ఆమోదం పొందాయన్నారు. ఈ సమావేశాల్లో మొత్తం 20 బిల్లులను ప్రవేశపెట్టగా.. 18 బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. బడ్జెట్ సమావేశాల తొలి విడతలో ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం, రెండో విడత సమావేశాలు మార్చి 8న ప్రారంభమయ్యాయి. ఈ విడతలో ఢిల్లీలో ఎల్జీకి మరిన్ని అధికారాలు కల్పించే బిల్లు, బీమా సవరణ బిల్లు తదితర కీలక బిల్లులు సభ ఆమోదం పొందాయి. మొత్తంగా ఈ సమావేశాల్లో లోక్‌సభ ఉత్పాదకత 114%గా ఉంది. 14 గంటల 42 నిమిషాల పాటు జరిగిన బడ్జెట్‌పై చర్చలో 146 మంది సభ్యులు పాల్గొన్నారు. కరోనా ముప్పు కారణంగా, మొదట రాజ్యసభ సమావేశాలను ఉదయం, లోక్‌సభ సమావేశాలను సాయంత్రం నిర్వహించారు. కానీ, మార్చి 9వ తేదీ నుంచి ఉభయ సభలు కూడా ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, బడ్జెట్‌పై రాజ్యసభలో లోతైన, నాణ్యమైన చర్చ జరిగిందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో కోవిడ్ నిబంధనలను సభ్యులంతా పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో మొత్తంగా 90% ఉత్పాదకతతో రాజ్యసభ 104 గంటల 23 నిమిషాల పాటు జరిగిందన్నారు. -
అమృత్ మహోత్సవ్‌లో భాగస్వాములు కండి
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు విరివిగా పాల్గొ నాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రారంభం కానున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. దాదాపు ఏడాది తర్వాత బుధవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 75 ప్రాంతాల్లో 75 వారాలపాటు జరిగే ఈ పండగలో పార్లమెంట్ సభ్యులంతా పాల్గొని, ప్రభుత్వం చేపట్టిన కోవిడ్–19 వ్యాక్సినేషన్లో పాల్గొనేలా ప్రజలకు చేయూత అందించాలని కూడా సూచించారని ప్రహ్లాద్ జోషి తెలిపారు. వ్యాక్సినేషన్‌కు వెళ్లే పౌరులకు వాహనాలు సమ కూర్చడం వంటి ఏర్పాట్లు చేయాలని కోరార న్నారు. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో ప్రధాని మోదీ సమర్థంగా వ్యవహరించారని ప్రశంసిస్తూ పార్లమెంటరీ పార్టీ ఒక తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రసంగించారని చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌పై మోదీ బుధవారం లోక్‌సభలో ప్రకటన చేయాలనుకున్నారని, అయితే, సభలో అంతరాయాల వల్ల ఆయన మాట్లాడ లేకపోయారని మంత్రి జోషి తెలిపారు. అంతకు ముందు, సభలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విషయంలో ఏకాభి ప్రాయం సాధించేందుకు స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం విఫలమైంది. మిగతా పార్టీలన్నీ అంగీకరించినా ఆందోళనలను విరమించేందుకు కాంగ్రెస ససేమిరా అంది. -
బడ్జెట్ సెషన్‌కు సిద్ధం.. 30న అఖిలపక్ష భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఈనెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో వర్చువల్ విధానంలోనే ఈ సమావేశం నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయా పార్టీల పార్లమెంటరీ నేతలకు ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి జోషి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఉన్న శాసన వ్యవహారాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రతిపక్షాల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి విడత, మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడతగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈసారి పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కొత్తగా ఉండనుంది. ఉదయం రాజ్యసభ కొనసాగితే లోక్‌సభ సాయంత్రం జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ మేరకు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు. -
‘బొగ్గు’లో సంస్కరణల బాజా
న్యూఢిల్లీ: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు మరింతగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957, బొగ్గు గనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం 2015లో సవరణలను సవరిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం.. బొగ్గుయేతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే, అంతిమంగా బొగ్గు వినియోగంపైనా ఆంక్షలు ఉండవు. కేంద్ర క్యాబినెట్ భేటీ అనంతరం బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాలు వెల్లడించారు. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా కనీస అర్హత గల ఏ కంపెనీ అయినా బొగ్గు గనుల వేలంలో పాల్గొనవచ్చు. ఈ కొత్త నిబంధనల కింద జనవరిలోనే తొలి విడత వేలం నిర్వహించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ చెప్పారు. మొదటి విడతలో 40 బొగ్గు బ్లాకుల దాకా వేలం వేయనున్నట్లు వివరించారు. మరోవైపు, మార్చి 31తో మైనింగ్ లీజు ముగిసిపోయే ముడి ఇనుము, ఇతర ఖనిజాల గనుల వేలాన్ని గడువులోగా నిర్వహించే ప్రతిపాదనకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోల్ ఇండియాకూ మద్దతు ఉంటుంది.. అవకతవకల ఆరోపణల కారణంగా.. 2014లో సుప్రీం కోర్టు 204 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. అయితే, అంతిమంగా వినియోగించే అంశానికి సంబంధించి పరిమితుల కారణంగా వాటిలో కేవలం 29 బ్లాకులను మాత్రమే వేలం వేయడం జరిగింది. తాజాగా ఆంక్షలను ఎత్తివేయడంతో మిగతా బ్లాకుల వేలానికీ మార్గం సుగమం అవుతుందని జోషి చెప్పారు. ఈ రంగంలో పోటీని పెంచేందుకు, బొగ్గు దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ రంగ కోల్ ఇండియా గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కూడా ఈ చర్యలు ఉపయోగపడనున్నట్లు జైన్ చెప్పారు. అలాగని కోల్ ఇండియా ప్రాధాన్యాన్ని తగ్గించే యోచనేదీ లేదని, దాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. 2023 నాటికి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు దానికి తగినన్ని బ్లాక్‌లు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు, 334 నాన్–క్యాప్టివ్ ఖనిజ గనుల లీజు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిపోనుంది. ఇవి మూతబడితే దాదాపు 60 మిలియన్ టన్నుల ముడి ఇనుము కొరత ఏర్పడవచ్చని జోషి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉత్పత్తికి కోత పడకుండా గడువులోగా ఖనిజాల గనుల వేలాన్ని కూడా నిర్వహించాలని.. బిడ్డింగ్‌లో గెలుపొందిన సంస్థకు ఇతరత్రా అటవీ, పర్యావరణ అనుమతులు కూడా బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల రెండేళ్ల సమయం ఆదా అవుతుందని, ఎలాంటి అవరోధాలు లేకుండా ఉత్పత్తి యథాప్రకారంగా కొనసాగుతుందని చెప్పారు. అత్యంత భారీ సంస్కరణలు: ప్రధాన్ వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్ కంపెనీలకూ అనుమతినిచ్చినప్పటికీ.. బొగ్గుపరిశ్రమయేతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు. తాజా మార్పుచేర్పులు బొగ్గు పరిశ్రమలో అత్యంత భారీ సంస్కరణలని చమురు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. కేంద్ర నిర్ణయాన్ని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ స్వాగతించారు. ‘ఏటా 15 బిలియన్ డాలర్లకు పైగా ఉంటున్న బొగ్గు దిగుమతులను తగ్గించుకోవడానికి గణనీయంగా ఉపయోగపడుతుంది. చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల తరుణంలో.. ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధికి తోడ్పడుతుంది‘ అని జిందాల్ చెప్పారు. అంతిమ వినియోగంపై ఆంక్షల ఎత్తివేత నిర్ణయం.. దేశీయంగా బొగ్గు నిల్వల వెలికితీతకు, మరిన్ని విదేశీ సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పడగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. బొగ్గు మైనింగ్ ఆర్డినెన్స్‌ను ఉక్కు పరిశ్రమ స్వాగతించింది. బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది తోడ్పడగలదని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ పేర్కొంది. ఈ సంస్కరణల ఊతంతో దేశీ ఉక్కు పరిశ్రమ .. అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పోటీపడగలదని తెలిపింది. నీలాచల్ ఇస్పాత్ విక్రయానికీ గ్రీన్‌సిగ్నల్.. ఉక్కు సంస్థ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్ఐఎన్ఎల్)లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయానికి కూడా కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని తెలిపారు. ఎన్ఐఎన్ఎల్లో ఎంఎంటీసీ, ఎన్ఎండీసీ, బీహెచ్ఈఎల్, ఎంఈసీవోఎన్, ఐపీఐసీవోఎల్, ఒడిషా మైనింగ్ కార్పొరేషన్లకు వాటాలు ఉన్నాయి. మరోవైపు, నీలాచల్ ఇస్పాత్‌లో వాటాల విక్రయ ప్రతిపాదనను ఉక్కు రంగ కార్మికుల సమాఖ్య ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ ఖండించింది. భూషణ్ స్టీల్, ఆధునిక్ స్టీల్ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు మూతబడుతుంటే ప్రభుత్వ రంగంలోని సంస్థలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.కె. దాస్ చెప్పారు. వాటాల విక్రయ ప్రతిపాదనలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే కార్మికులు సమ్మెకు దిగేందుకు సిద్ధమని తెలిపారు. -
లోక్‌సభ 116% ఫలప్రదం
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయసభల పనితీరును వెల్లడించారు. లోక్‌సభ సమావేశాలు 116 శాతం(కేటాయించిన సమయం కంటే ఎక్కువ చర్చ), రాజ్యసభ సమావేశాలు 99 శాతం ఫలప్రదమయ్యాయని శుక్రవారం చెప్పారు. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో 18 బిల్లులను ప్రవేశపెట్టామన్నారు. అందులో లోక్‌సభ 14 బిల్లులను, రాజ్యసభ 15 బిల్లులను ఆమోదించిందన్నారు. సభా కార్యకలాపాలు తెలుగులో... సభా కార్యకలాపాలను ఒక రోజు పాటు తన మాతృభాష తెలుగులో నిర్వహించాలనుకుంటున్నానని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘సభ్యులు తమ మాతృభాషల్లో మాట్లాడితే ప్రజలను ఈ దిశగా ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. నా మాతృభాష తెలుగులో ఒకరోజు సభా కార్యకలాపాలు నిర్వహించాలని ఆసక్తిగా ఉన్నా’ అని పేర్కొన్నారు. గత సమావేశాలతో పాటు తాజాగా 250వ సెషన్ కూడా వంద శాతం ఫలప్రదమైందని పేర్కొన్నారు. ‘రోజుకు సగటున 9.5 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు వచ్చాయి. 49 ఏళ్లలో ఇదే అత్యుత్తమం’ అని పేర్కొన్నారు. ‘199 జీరో అవర్ అభ్యర్థనలు, 115 ప్రత్యేక ప్రస్తావనలు వచ్చాయి. ఇదీ రికార్డే’ అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022కి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అప్పటికి కొత్త పార్లమెంటు నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. -
గొప్ప అవకాశం లభించింది : అశ్వినీదత్
వైజయంతీ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ను మంగళవారం ఆయన కార్యాలయంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి కలిశారు. మోదీ ప్రభుత్వం సాధించిన ఆర్టికల్ 370 విజయ కరదీపికను, మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రహ్లాద్ జోషితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇరవై నిమిషాల పాటు సినిమాలు, మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై పరస్పరం చర్చించుకున్నారు. అశ్వినీ దత్ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ఇటీవల జాతీయ అవార్డు సాధించిన ‘మహానటి’ సినిమా గురించి మాట్లాడుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వప్నాదత్, ప్రియాంకా దత్ ‘మహానటి’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘ఈ రోజు గొప్ప అవకాశం లభించింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వచ్చి నాగ్ అశ్విన్, ప్రియాంకాలను అభినందించారు. దేశం మొత్తం మోదీ పనితీరును ప్రశంసిస్తోంది. ప్రధాని మోదీ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం మనకు గర్వకారణం. కశ్మీర్ మనదని చాటారు. దేశం కోసం మోదీ ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. ఆనాడు మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత వాజ్పాయ్ పాలనలో గొప్ప పరిపాలన చూశాం. మళ్లీ మోదీ హయాంలో చూస్తున్నాం. జీఎస్టీ విషయంలో మేం సూచించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి సహకరించారు. మోదీకి (మంగళవారం మోదీ పుట్టినరోజు) ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలి. మా నుంచి ప్రభుత్వానికి అన్నిరకాల సహకారాలు ఉంటాయని ప్రహ్లాద్ జోషీకి చెప్పాం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై దృష్టి సారించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరాను’’ అని అన్నారు. -
కుక్కకున్న విలువ లేదా?: ప్రహ్లాద్ జోషి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్య మంత్రి ఇంటి కుక్కకు ఉన్న విలువ తెలంగాణ కోసం బలిదానం చేసిన వారికి లేదా? అని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. అంత విలువ ఇచ్చేవారైతే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కారులో మజ్లిస్ సవారీ చేస్తోందన్నారు. కారు రిమోట్ మజ్లిస్ చేతుల్లో ఉందని స్టీరింగ్ మాత్రం కేసీఆర్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని 20 ఏళ్లుగా బీజేపీ పోరాడుతోందని చెప్పారు. రాష్ట్రంలో మరో నిజాం పాలన నడుస్తోందని, రాచరిక వ్యవస్థను తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
‘త్వరలో మమత ఇంటికే... ఆ తర్వాత కేసీఆరే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కారులో మజ్లిస్ పార్టీ సవారీ చేస్తోందని.. కేసీఆర్ ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. మంగళవారం పటాన్‌చెరులోని ఎస్వీఆర్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ విమోచన దినోత్సవ సభ’ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947 ఆగస్టు15 అనంతరం 13మాసాల తర్వాత హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. తెలంగాణలో మంత్రులకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వని దుస్థితి ఉందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తోందన్నారు. త్వరలో మమత ఇంటికి వెళ్ళిపోతుంది. కేసీఆర్ కూడా ఇంటికి వెళతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో కుక్కలకు మర్యాద ఉంది. కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరులకు విలువ లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏం పాలన నడుస్తుందో తెలియడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన వంటి పథకాలను కేసీఆర్ తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదని.. ఆ పార్టీకి కనీసం అధ్యక్షుడు లేకపోవడం హాస్యస్పదం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నిధులు విడుదల చేసిందన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగిందని విమర్శించారు. హర్యానా, బిహార్ రాష్ట్రాలకు ఉన్న పూర్వ ముఖ్యమంత్రులకు పట్టిన గతి తెలంగాణ సీఎంకి కూడా పడుతుందన్నారు. ఈ క్రమంలో తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేశామని మంత్రి ప్రహ్లాద్ జోషి గుర్తు చేశారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు భారీగా బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. -
పీఓకేపై కేంద్రం వైఖరేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని సమాజ్‌వాది పార్టీ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. పీఓకే ఎవరి ప్రాంతమో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కోరారు. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా ఏం జరుగుతుందో దేశ ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆందోళనతో ఉన్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్లో ఏం జరుగుతుందో తెలియదని అక్కడి గవర్నరే అన్నారని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని దేశమంతా స్వాగతిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్లా మాట్లాడుతోందని బీజేపీ ఎంపీ పహ్లాద్ జోషి విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని చీకటి దినంగా పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొందని, కాంగ్రెస్ నాయకులు కూడా చీకటి దినం అంటూ ప్రకటనలు చేశారన్నారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా విప్ చేయడానికి ఇష్టం లేక రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ కలిత రాజీనామా చేశారని గుర్తు చేశారు. కాగా, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ గిరిశ్ చంద్ర, టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు ప్రకటించారు. బిల్లును వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. -
తల్లిలాంటి పార్టీ బీజేపీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ తల్లివంటిదని, ఎంపీలు, మంత్రులుగా ఎదిగిన వారు పార్టీని మరిచిపోరాదని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ ఎంపీల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పార్టీని, పార్టీ కార్యకర్తలను తల్లితో పోల్చిన మోదీ.. ‘కుమారుడిని పెంచి పెద్దచేసిన తల్లి.. పెళ్లయిన తర్వాత ఆ కొడుకు తన కంటే భార్యపైనే ఎక్కువ మమకారం చూబితే చిన్నబుచ్చుకుంటుంది. అలాంటి కొడుకు మాదిరిగా కాకుండా ఎంపీలు, మంత్రులు అయిన మీరు పార్టీని, కార్యకర్తలను మరవకండి. మీకోసం ఎంతో శ్రమకోర్చిన కార్యకర్తలతో సంబంధాలు కొనసాగించండి’ అని వారికి ఉద్బోధించారు. పార్టీ ఈ స్థాయికి చేరుకోవడం కార్యకర్తల కృషి ఫలితమేనన్నారు. చట్ట సభల సభ్యులైనా, మంత్రులయినా పార్టీ కార్యకర్తగా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు. ‘వయస్సుతో పనిలేకుండా, విద్యార్థిగా భావించినప్పుడే ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారు’ అని ప్రధాని తెలిపారు. ‘బీజేపీ కృత్రిమంగా ఏర్పడిన పార్టీ కాదు. క్షేత్రస్థాయి నుంచి బలంగా ఏర్పడిన పార్టీ. సైద్ధాంతిక బలం, ఆలోచనా విధానం కారణంగానే ఈ స్థాయికి చేరుకుంది. అంతేగానీ, ఏదో ఒక్క కుటుంబ వారసత్వంపై నడుస్తున్న పార్టీ కాదు’ అని ఈ సందర్భంగా ప్రధాని అన్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అనంతరం మీడియాకు తెలిపారు. రెండు రోజుల ఈ శిక్షణ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ప్రసంగించారు. జేపీ నడ్డా ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ తదితరులు వేదికపై నుంచి కిందికి దిగి మిగతా ఎంపీల మధ్యన కూర్చున్నారు. -
ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం
న్యూఢిల్లీ: లోక్‌సభ డెప్యూటీ స్పీకర్, బీజేపీ ఎంపీ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట హాజరై, అనంతరం సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్‌కు స్పీకర్ కార్యాలయం తెలిపినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకపోతే ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు అధికారమిస్తూ సభలో ఓ తీర్మానం చేసేందుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయి. అన్ని పార్టీల నాయకులతో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించి ఆజం ఖాన్ అంశంపై చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఆజం ఖాన్ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కు లోక్‌సభ ఇస్తుందని తెలిపారు. డీఎంకే ఎంపీ కనిమొళి, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తి, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితర మహిళా ఎంపీలతోపాటు బీజేపీ నాయకురాలు జయప్రద కూడా ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆజం ఖాన్‌ను ఈ లోక్‌సభ నుంచి పూర్తిగా బహిష్కరించేలా ఆయనను ఐదేళ్లపాటు సస్పెండ్ చేయాలని రమాదేవి డిమాండ్ చేశారు. -
సోనియాను కలిసిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. జూన్ 17వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలపై చర్చించేందుకు జోషి శుక్రవారం సోనియా నివాసానికి వెళ్లారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరి మధ్య భేటీ కొనసాగింది. అలాగే రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్‌తో, లోక్‌సభలో డీఎంకే నాయకుడు టీఆర్ బాలుతో కూడా జోషి పార్లమెంట్ సమావేశాలపై చర్చించనున్నారు. కాగా, 17వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు జూలై 26 వరకు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 19వ తేదీన స్పీకర్ ఎన్నిక జరపాలని నిర్ణయించారు. 20వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూలై 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. -
లోక్‌సభ స్పీకర్ రేస్‌లో ప్రహ్లాద్ జోషీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో క్యాబినెట్లో ఎవరెవరికి చోటుదక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు క్యాబినెట్ కూర్పుతో పాటు కీలక పదవుల్లో ఎవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు కొలిక్కివచ్చినట్టు తెలిసింది. ధార్వాడ్ నుంచి నాలుగుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, గతంలో కర్నాటక బీజేపీ చీఫ్‌గా పనిచేసిన ప్రహ్లాద్ జోషీని లోక్‌సభ స్పీకర్‌గా ఎంపిక చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్ధానాలు దక్కిన నేపథ్యంలో దక్షిణాదిలో పాగావేయాలన్న బీజేపీ వ్యూహంలో భాగంగా జోషీ పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. పలువురు బీజేపీ, మిత్రపక్షాల ఎంపీలకు పార్టీ చీఫ్ అమిత్ షా నుంచి పిలుపు రావడంతో వారికి క్యాబినెట్ బెర్త్‌లు ఖరారయ్యాయని భావిస్తున్నారు. -
కర్ణాటక ఎన్నికలు; బీజేపీకి మరో షాక్
హుబ్లీ: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘ప్రధాని మోదీ దేశాన్ని సర్వనాశనం చేశారు..’ అని అమిత్ షా ప్రసంగాన్ని తప్పుగా అనువదించిన ఎంపీ ప్రహ్లాద్ జోషి గుర్తున్నారు కదా, నోరుజారి అభాసుపాలైన ఆ కీలక నేత.. ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి కొత్త తలనొప్పులు కొనితెచ్చుకున్నారు. విద్వేషం: హుబ్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్వాడ ఎంపీ అయిన ప్రహ్లాద్ జోషి శుక్రవారం సదార్సోఫా గ్రామంలో పర్యటించారు. ‘‘ఇది ఊరు కాదు, మినీ పాకిస్తాన్లా ఉంది. ఇక్కడి మసీదుల్లో అక్రమంగా ఆయుధాలను దాచి ఉంచారు’’ అని ఎంపీ అనడంతో అక్కడున్నవారు షాకయ్యారు. ఇటీవలే మరణించిన ఓ బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సదార్సోఫా ముస్లిం మత పెద్దలు కసభాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఎంపీ ప్రహ్లాద్ జోషిపై ఐపీసీ153, 298 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. వరుస షాక్‌లు: ‘యడ్యూరప్ప అవినీతిలో నంబర్ వన్’ అని అమిత్ షా నోరుజారడం మొదలు.. ‘మోదీ దేశాన్ని నాశనం చేశాడ’నే తప్పుడు అనువాదం, షా ప్రసంగిస్తున్నవేళ యడ్డీ కునుకు తీయడం, ఇప్పుడు ఏకంగా బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషిపై కేసు నమోదు కావడం.. ఇలా బీజేపీ కర్ణాటక ఎన్నికల ప్రచార పర్వంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
అమిత్ షా.. మళ్లీ పప్పులో కాలు!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాక్షాత్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్న కార్యక్రమాల్లోనే అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులు, పేదలకు ఆయన చేసిందేమి లేదు..’’ అంటూ అమిత్ షా ప్రసంగాన్ని పొరపాటుగా అనువదించడం సంచలనం రేపింది. ఇప్పటికే ‘యడ్యూరప్ప సర్కార్ అవినీతిలో నంబర్‌వన్’ అని నాలుక కరుచుకున్న షా.. పరోక్షంగా మళ్లీ పప్పులో కాలేసినట్లైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో వైరల్ అయింది. అసలేం జరిగిందంటే..: ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవనగరి జిల్లాలో బీజేపీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. హిందీలో సాగిన షా ప్రసంగాన్ని.. ధర్వాడ ఎంపీ ప్రహ్లాద్ జోషి కన్నడలోకి అనువాదం చేశారు. సిద్ధరామయ్య రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని, యడ్యూరప్పను సీఎం చేస్తే ఇద్దరూ(మోదీ-యడ్డీ) కలిసి రాష్ట్రాన్ని నంబంర్ వన్‌గా నిలబెడతారని అమిత్ షా పేర్కొన్నారు. అయితే ఆయన మాటలను కన్నడలోకి అనువదించిన ప్రహ్లాద్ మాత్రం.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులు, పేదలకు ఆయన చేసిందేమి లేదు. యడ్యూరప్పను సీఎంగా గెలిపిస్తే పీఎం మోదీ సహకారంతో కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా తయారుచేస్తారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ తప్పుడు అనువాదాన్ని విన్న ప్రజలు, బీజేపీ నేతలు ఒక్కసారిగా విస్తుపోయారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తప్పు అనువాదకుడిదే అయినా అమిత్ షా టాప్ లీడర్ కావడంతో ‘మళ్లీ పప్పులో కాలేశారు’ అంటూ కామెంట్లు మొదలయ్యాయి. మొన్న అమిత్ షా తడబాటు, తర్వాత అనువాదకుడి పొరపాటు ప్రత్యర్థులకు అనుకోని అస్త్రాలుగా మారాయి. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరుగనున్నాయి. మే 15న ఫలితాలు వెవడనున్నాయి. తాము అధికారంలో ఉన్న ఒకేఒక పెద్ద రాష్ట్రం కర్ణాటక కావడంతో తిరిగి పట్టునిలుపుకునేందుకు కాంగ్రెస్ విశ్వపయత్నం చేస్తోంది. అందుకు ఏమాత్రం తక్కువకాకుండా బీజేపీ పావులు కదుపుతోంది. -
అమిత్ షా.. మళ్లీ పప్పులో కాలు!
-
కేంద్రంతో ఘర్షణ మంచిది కాదు
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రహ్లాద్ జోషి సూచన సాక్షి, బెంగళూరు : కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగడం సరికాదని, కేంద్రంతో సౌహార్దయుతమైన వాతావరణాన్ని నిర్మించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి సూచించారు. కొంతమంది రాష్ట్రమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రతిరోజు విమర్శించడాన్నే పనిగా పెట్టుకున్నారని, ఇది సరైన పరిణామం కాదని అన్నారు. శుక్రవారమిక్కడి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీపై అత్యంత ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇందుకు గాను ఎన్నికల కమిషన్ చీవాట్లు పెట్టినా... ఇప్పటికీ అదే మనస్థితిలో సిద్ధరామయ్య ఉండడం బాధాకరమని అన్నారు. గతంలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రులుగా ఉన్న జె.హెచ్.పటేల్, ఎస్.ఎం.కృష్ణలు కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించారని, ఈ విషయాన్ని సిద్ధరామయ్య గ్రహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అత్యవసర అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు గాను తక్షణమే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి, నాయకుల అభిప్రాయాలను తీసుకొని తేదీని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న కరువు పరిహార చర్యలకు సంబంధించి ఈ సమావేశాల్లో ముఖ్యంగా చర్చించాలని సిద్ధరామయ్యను కోరారు. -
కాంగ్రెస్‌కు గడ్డుకాలం
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి దొడ్డబళ్లాపురం : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం దాపురించిందని, సిద్ధరామయ్యనే ఆ పార్టీకి చిట్టచివరి ముఖ్యమంత్రిగా మిగిలిపోనున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. స్థానిక బసవభవన్‌లో బుధవారం నిర్వహించిన బీజేపీ మహా సంపర్క అభియాన్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపే చర్యలను ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు చేపట్టడం లేదని విమర్శించారు. ఆరు నెలలుగా పాలకు ప్రోత్సాహ ధనం ఇవ్వడం లేదన్నారు. రుణగ్రహీతలైన రైతులపై బ్యాంకులు గాని, వడ్డీ వ్యాపారులు గాని ఒత్తిడి చేయరాదని కోరారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తాను అనుభవం ఉన్న పాలకుడనుకున్నానని అనుకున్నానని, అయితే అహంభావం ఉన్న మనిషని ఇటీవలే తెలిసిందన్నారు అసహనం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ప్రవర్తనతో, మొండితనంతో కాంగ్రెస్ పార్టీలోని నేతలు కార్యకర్తలే విసిగిపోయారని, వారే సిద్ధరామయ్యను ఇంటికి పంపించే పనిచేస్తారన్నారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పార్టీ ప్రముఖులతో కూడిన ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీబీఎంపీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందని, సిద్ధరామయ్య పదవికి గండం ఏర్పడుతుందని చెప్పారు. అనంతరం బీజేపీ మద్దతుతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జె.నరసింహస్వామి, కె.ఎం.హనుమంతరాయప్ప, హనుమంతేగౌడ, పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. -
బీజేపీ-కాంగ్రెస్ మాటల యుద్ధం
న్యూఢిల్లీ: కర్ణాటక ఐఏఎస్ ఆఫీసర్ డీకె రవి అనుమానస్పద మృతిపై లోక్‌సభలో వివాదం రేగింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మాటల యుద్ధం నడిచింది. ఇది ముమ్మాటికే హత్యే అంటూ బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషీ కర్ణాటక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ జోక్యం చేసుకుని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరితే సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రితో నిరంతరం మాట్లాడుతున్నానని.. రెండు రోజుల్లో దీనిపై పూర్తి నివేదిక పంపుతామన్నారని వివరణ ఇచ్చారు. అయినా సభ్యుల మధ్య వాగ్యుద్ధం సద్దుమణగక పోవడంతో స్పీకర్ సభను కొద్ది సేపు వాయిదావేశారు. ఇది ఇలా వుంటే... సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించపోవడంతో ఏబీవీపీ ఆధ్యర్యంలో బెంగళూరులో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పరిస్థితి హింసాత్మకంగా పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. డీకె రవి సొంతజిల్లా తుంకూర్ లో పోలీసులుకు , ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదని, సీబీఐ విచారణ చేపట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటామని డీకె రవి తల్లిదండ్రులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
‘ఢిల్లీ’ ప్రభావం ఇతర ప్రాంతాల్లో ఉండదు
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు {పహ్లాద్‌జోషి బెంగళూరు : ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర ప్రాంతాల్లోని ఎన్నికల్లో ఉండబోదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి పేర్కొన్నారు. బుధవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఢిల్లీలోని సమస్యలు, అక్కడి పరిస్థితులు ఇతర ప్రాంతాలకంటే చాలా భిన్నంగా ఉంటాయని, అందుకే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విజయాన్ని సాధించగలిగిందని అన్నారు. ఢిల్లీ ప్రజలు స్థానిక నాయకత్వాన్ని, స్థానిక పార్టీని కోరుకున్నారని అందుకే ఆప్‌ను విజయం వరించిందని విశ్లేషించారు. అయితే ఇదే తరహా ఫలితాలు బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల్లో సైతం పునరావృతమవుతాయనడం సరికాదని అన్నారు. -
సర్కారు పతనానికి నాంది
రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు {పహ్లాద్ జోషి ప్రభుత్వ దివాళకోరుతనానికి ఇది నిదర్శనం బెంగళూరు : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సతీష్ జారకీహోళి రాజీనామా పరిణామం ‘సిద్ధు’ సర్కారు పతనానికి నాంది అని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి వాఖ్యానించారు. బుధవారమిక్కడి బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావుతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సతీష్ జారకీహోళీ రాజీనామా చేయడం రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరు తనాన్ని బయటపెడుతోందని విమర్శించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలోని మరికొందరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక అర్కావతి లే అవుట్‌లోని భూమి డీ-నోటిఫికేషన్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై న్యాయపరమైన పోరాటం విషయంలో తమ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేయడాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ వ్యతిరేకించలేదని తెలిపారు. ఇక జగదీష్ శెట్టర్, మురళీధర్‌రావులతో జరిపిన సమావేశంలో ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పై ఏ విధంగా పోరాడాలి అనే అంశంపై చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ప్రభుత్వం పై పోరాటానికి ఎలాంటి విధానాలను అనుసరించాలి, అర్కావతి డీనోటిఫికేషన్ అంశానికి సంబంధించి సిద్ధరామయ్య పై న్యాయపోరాటానికి గవర్నర్ అనుమతి కోరడం, ఒకవేళ అనుమతి లభించక పోతే ఎలాంటి వ్యూహం అనుసరించాలి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ప్రహ్లాద్‌జోషి తెలిపారు. అంతేకాక బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మార్చితో ముగుస్తున్నందున ఈలోపు లక్ష్యాన్ని చేరేందుకు ఏ విధమైన ప్రణాళికలు రచించాలనే అంశంపై జగదీష్‌శెట్టర్, మురళీధర్‌రావుతో చర్చించినట్లు పేర్కొన్నారు. -
సాక్ష్యాలున్నాయ్
డీకే అవినీతికి సంబంధించిన ఆధారాలను త్వరలో బయటపెడతాం ‘బెళగావి’ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం 9న సువర్ణసౌధను ముట్టడిస్తాం సీఎం సిద్ధుతో కుమారస్వామి కుమ్మక్కు 25న సుపరిపాలనా రోజుగా వాజ్‌పేయి జన్మదినోత్సవం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి బెంగళూరు : రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ తన శాఖలో అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి తెలిపారు. బుధవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఇంధన శాఖలో అవినీతి జరిగిన విషయం ఇటీవలే బయటికి వచ్చిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం తాము సేకరించామని చెప్పారు. వీటిని త్వరలోనే బయటపెడతామని తెలిపారు. ఇక రాష్ట్ర మంత్రులు చేసిన అవినీతి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని, బెళగావిలో నిర్వహించనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఈ విషయంపై నిలదీస్తామని చెప్పారు. అంతేకాక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈనెల 9న సువర్ణసౌధను సైతం ముట్టడిస్తామని పేర్కొన్నారు. తమ పోరాటాలను అణచివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, అయితే వీటికి తామెంతమాత్రం భయపడబోమని అన్నారు. ఇక రాష్ట్రంలో తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాల్లో సైతం ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు ఒప్పుకున్నారని విమర్శించారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని, మంత్రి అంబరీష్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బహిరంగంగానే విమర్శలకు దిగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇక ఈనెల 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని సుపరిపాలనా దినంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. -
సర్కార్ విఫలం
రాష్ర్టంలో శాంతిభద్రతలు కరువు హోం శాఖ మంత్రి రాజీనామా చేయాలి ప్రహ్లాద్ జోషి ధ్వజం బెంగళూరు : రాష్ట్రంలో శాంతి, భద్రతలను కాపాడడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి విమర్శించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న నేరాలు అందరినీ భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. ఇక చెరుకు రైతుల సమస్యను పరిష్కరించడంపై సైతం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ స్థితిగతులపై చర్చించడంతో పాటు సభ్యత్వ నమోదును పెంచడంపై చర్చించేందుకు గాను బుధవారం 13 రాష్ట్రాల బీజేపీ శాఖల అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు ఇతర పదాధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. -
సమర సన్నాహాలు
అర్కావతిపై న్యాయ పోరాటం చేయాలని బీజేపీ నిర్ణయం సీఎం ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి కోరాలని తీర్మానం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ వ్యవహారంపై న్యాయ పోరాటం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీనోటిఫికేషన్‌పై ఇప్పటి వరకు సాగుతున్న ఆందోళనకు కొనసాగింపుగా న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను కోరాలని నిర్ణయించినట్లు కూడా చెప్పారు. ఇప్పటికే దీనిపై రాజకీయ పోరాటం సాగుతున్నదని గుర్తు చేశారు. డీనోటిఫికేషన్ వ్యవహారంపై పరిశీలన జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సురేశ్ కుమార్ నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. న్యాయ పోరాటానికి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించాల్సిందిగా కూడా కమిటీకి సూచించామని చెప్పారు. మేయర్ అభ్యర్థిపై చర్చ బీబీఎంపీకి కొత్త మేయర్, ఉప మేయర్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై సమావేశంలో చర్చించామని జోషి తెలిపారు. అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రులు అనంత కుమార్, డీవీ. సదానంద గౌడ, మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ యడ్యూరప్ప, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, ఆర్. అశోక్‌లు పాల్గొన్నారు. -
ఎలా ఓడామప్పా...
బీజేపీ ఆత్మావలోకనం శికారిపుర ఫలితంపై యడ్యూరప్ప అసంతృప్తి రాఘవేంద్ర గెలుపు మొత్తం భారాన్ని తనపైనే మోపారని విమర్శ బళ్లారి, చిక్కొడి స్థానాల్లో స్థానిక నేతలు సహకరించారన్న ఆరోపణలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉప ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలను సాధించకపోవడానికి కారణాలను బీజేపీ ఆరా తీసింది. పార్టీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి అధ్యక్షతన జరిగిన ఆత్మావలోకనం సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. శివమొగ్గ జిల్లా శికారిపురలో పార్టీ విజయం సాధించినప్పటికీ, అంత తక్కువగా మెజారిటీ రావడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వమే కారణమని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప నిష్టూరమాడినట్లు తెలిసింది. తన కుమారుడు ఆ నియోజక వర్గంలో పోటీ చేసినందున, మొత్తం భారాన్ని తనపైనే మోపారని విమర్శించినట్లు సమాచారం. బళ్లారి గ్రామీణ, చిక్కోడి నియోజక వర్గాల్లో ఎదురైన ఘోర పరాభవంపై సుదీర్ఘ చర్చ జరిగింది. స్థానిక నాయకులు కొందరు కాంగ్రెస్‌కు సహకరించారని సమావేశంలో పాల్గొన్న నాయకులు ఆరోపించినట్లు తెలిసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఎంపీ తన నియోజక వర్గంలోని అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం ఎదురైన అపజయాన్ని గుణపాఠంగా తీసుకుని పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచే కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పాలనా వైఫల్యం గురించి ప్రజలకు తెలియజెప్పడానికి ఆందోళన కార్యక్రమాలను రూపొందించడంపై కూడా సమావేశంలో చర్చించారు. పోరాట స్వరూపాన్ని తదుపరి సమావేశంలో నిర్ణయించాలని తీర్మానించారు. ప్రతిపక్షంగా మరింత సమర్థంగా పని చేయడానికి శాసన సభ లోపల, వెలుపల అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. తొలుత పార్టీ ఎంపీలతో సమావేశం జరిగింది. అనంతరం ప్రముఖ నాయకులను కూడా ఆహ్వానించి చర్చించారు. ఇదే సందర్భంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా నియమితులైన యడ్యూరప్పను జోషి సత్కరించారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, ఉప నాయకుడు ఆర్. అశోక్ ప్రభృతులు సమావేశంలో పాల్గొన్నారు. -
సీఎంకు జైలు ఖాయం....
బెంగళూరు : బెంగళూరు అర్కావతి లే అవుట్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు జైలు శిక్ష తప్పదని బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి జోస్యం చెప్పారు. అర్కావతి లే అవుట్ అక్రమాలపై తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ విపక్షనేత జగదీష్ శెట్టర్ పేర్కొంటున్నప్పటికీ సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించటం లేదని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలు వెలుగు చూస్తే తనకు జైలుశిక్ష తప్పదని తెలుసుకునే సీబీఐ దర్యాప్తుకు ముఖ్యమంత్రి వెనుకంజ వేస్తున్నారని ప్రహ్లాద జోషి ఎద్దేవా చేశారు. తన కుమారుడితో ఇసుక మాఫియాను నడుపుతున్న ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోడిని, అమిత్ షాను విమర్శించే అర్హత లేదన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా బళ్లారిలో అధికార దుర్వినియోగానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. -
ఎంపిక పూర్తి
పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్రే తరువాయి నెలాఖరుకు బీజేపీ జాబితా శివమొగ్గ నుంచి పోటీ చేయాలని యడ్డిపై ఒత్తిడి శివకుమార్, రాఘవేంద్ర, బసవరాజులపై సస్పెన్షన్ ఎత్తివేత బసవరాజుకు మళ్లీ తుమకూరు టికెట్ ఇవ్వాలని అప్ప డిమాండ్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, ఈ నెలాఖరుకు జాబితాను విడుదల చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై సోమవారం పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం 28 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశామని, దీనిపై పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర పడాల్సి ఉందని తెలిపారు. యడ్యూరప్పపై ఒత్తిడి ఎన్నికల్లో శివమొగ్గ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై సమావేశంలో నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారు. యడ్యూరప్పను పోటీ చేయించాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయనను అనునయించడానికి నాయకులు ప్రయత్నించారు. ఇటీవల యడ్యూరప్ప పోటీకి విముఖత వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ భాను ప్రకాశ్ నాయకత్వంలో శివమొగ్గ నుంచి వచ్చిన పార్టీ జిల్లా ప్రతినిధుల కమిటీ యడ్యూరప్పను ఆయన నివాసంలో కలుసుకుంది. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చింది. కోర్ కమిటీ సమావేశానికి ముందు యడ్యూరప్ప విలేకరులతో మాట్లాడుతూ శివమొగ్గ అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదన్నారు. పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థిని ఎంపిక చేస్తారని, పోటీ చేయాలంటూ తనపై ఒత్తిడి వస్తున్న మాట నిజమేనని ఆయన వివరించారు. మరో వైపు దక్షిణ కర్ణాటకలోని అభ్యర్థుల ఎంపికపై తీవ్ర చర్చ జరిగింది. గెలిచే సామర్థ్యం ఉన్న వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సస్పెన్షన్ ఉపసంహరణ యడ్యూరప్ప కేజేపీని స్థాపించినప్పుడు ఆయనకు మద్దతునిచ్చారనే కారణంతో బీజేపీ నుంచి శివ కుమార్ ఉదాసి, బీవై. రాఘవేంద్ర, జీఎస్. బసవరాజులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. యడ్యూరప్ప కుమారుడైన రాఘవేంద్ర శివమొగ్గ, మాజీ మంత్రి సీఎం. ఉదాసి కుమారుడైన శివ కుమార్ ఉదాసి హావేరి, బసవరాజ్ తుమకూరుల నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బసవరాజుకు మళ్లీ తుమకూరు టికెట్ ఇవ్వాలని సమావేశంలో యడ్యూరప్ప డిమాండ్ చేసినట్లు తెలిసింది. ప్రహ్లాద జోషి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రులు సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్, ఎంపీ అనంత కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు. -
మళ్లీ ఛాన్స
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు బీజేపీ శ్రీకారం చుట్టింది. సిట్టింగ్‌లందరికీ తిరిగి టికెట్లు ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించింది. ఇక్కడి మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశం 28కి గాను 13 నియోజక వర్గాలను అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పాల్గొన్నారు. ధార్వాడ, బెల్గాం, చిక్కోడి, బిజాపుర, బాగలకోటె, గుల్బర్గ, రాయచూరు, కొప్పళ, దక్షిణ కన్నడ, ఉడిపి, దావణగెరె, చిత్రదుర్గ, బెంగళూరు దక్షిణ నియోజక వర్గాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. దీనికి పార్టీ పార్లమెంటరీ బోర్డు లాంఛనంగా ఆమోదం తెలపాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత తొలి జాబితా వెలువడనుంది. ధార్వాడకు ప్రహ్లాద జోషి, బెల్గాం-సురేశ్ అంగడి, చిక్కోడి-ఉమేశ్ కత్తి, బిజాపుర-రమేశ్ జిగజిణగి, బాగలకోటె-గద్ది గౌడర్, కొప్పళ-శివరామే గౌడ, దక్షిణ కన్నడ-నళిన్ కుమార్ కటీల్, దావణగెరె-బీఎం. సిద్ధేశ్, చిత్రదుర్గ-జనార్దన స్వామి, బెంగళూరు దక్షిణకు అనంత కుమార్ పేర్లు ఖరారయ్యాయి. ఉడిపి-చిక్కమగళూరు స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి డీవీ. సదానంద గౌడను బరిలో దింపాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. శాసన సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన మాజీ మంత్రి శోభా కరంద్లాజెను మైసూరు-కొడగు స్థానం నుంచి పోటీ చేయించే విషయమై చర్చించారు. సమావేశంలో మాజీ ముఖ్యమంత్రులు సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప, ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
పునరాగమనం
= నేడు యడ్డికి బీజేపీ తీర్థం = మరో నలుగురు ఎమ్మెల్యేల సహా = పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా అప్పను నియమించే అవకాశం = ఎంపీలు రాఘవేంద్ర, శివకుమార్లపై సస్పెన్షన్ ఎత్తివేత సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప గురువారం లాంఛనంగా బీజేపీలో చేరనున్నారు. ఆ పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటారు. ఎమ్మెల్యేలు గురుపాదప్ప నాగమారపల్లి, విశ్వనాథ పాటిల్, యూబీ. బణకార్‌లతో పాటు మాజీ మంత్రులు సీఎం. ఉదాసీ, శోభా కరంద్లాజె, కేంద్ర మాజీ మంత్రి ధనంజయ కుమార్ సహా పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి సహా పలువురు సీనియర్ నాయకులు గత వారంలో యడ్యూరప్పను లాంఛనంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా కేజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారని పేర్కొంటూ శివమొగ్గ ఎంపీ, యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర, సీఎం. ఉదాసీ తనయుడు, హావేరి ఎంపీ శివ కుమార్‌లను బీజేపీ పార్లమెంటరీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేజేపీ విలీనం నేపథ్యంలో ఆ సస్పెన్షన్ రద్దు చేయాలని రాష్ట్ర శాఖ పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేసింది. బీజేపీలో చేరిన తర్వాత యడ్యూరప్పను పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడితో పాటు జాతీయ కార్యవర్గం ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించనున్నారు. ఈ నెల 18 నుంచి ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఆ సందర్భంగా యడ్యూరప్ప పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సహా అగ్ర నేతలను కలుసుకోనున్నారు. -
యడ్డికి నేడు బీజేపీ ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను బీజేపీలో చేర్చుకోవడానికి అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. పార్టీలో చేరాల్సిందిగా శనివారం ఆయనకు అధికారికంగా ఆహ్వానం అందనుంది. నగరంలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో యడ్యూరప్ప పునరాగమనానికి అంగీకారం తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమాచారాన్ని ఆయనకు తెలియజేయడం ద్వారా పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, ఎంపీ అనంత కుమార్, మాజీ ముఖ్యమంత్రులు సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్ ప్రభృతులు యడ్యూరప్పను ఆయన నివాసంలో కలుసుకుని పార్టీ నిర్ణయాన్ని తెలియజేయనున్నారు. చప్పట్లతో సమ్మతి కార్యవర్గ సమావేశంలో అనంత కుమార్ మాట్లాడుతూ పార్టీని వదలి వెళ్లిన నాయకులను తిరిగి ఆహ్వానించడానికి చప్పట్లు కొట్టడం ద్వారా అంగీకారం తెలపాలని సూచించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న వారంతా జోరుగా చప్పట్లు చరిచారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను బీజేపీ సమైక్యంగా ఎదుర్కొంటుందన్నారు. బయటకు వెళ్లిపోయిన వారంతా తిరిగి రావడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం లభించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని కారణాల వల్ల కొందరు నాయకులు పార్టీని వీడారని, వారిని తిరిగి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ రహిత భారత్‌ను నెలకొల్పాలన్న పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పిలుపు మేరకు అందరూ పార్టీ విజయం కోసం శ్రమించాలని ఆయన కోరారు. యడ్యూరప్ప సమాలోచనలు బీజేపీలోకి రావాలంటూ అధికారిక ఆహ్వానం అందనున్న నేపథ్యంలో యడ్యూరప్ప ఇక్కడి తన నివాసంలో పార్టీ ముఖ్యులతో సమాలోచనలు జరిపారు. పార్టీలో చేరిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బీజేపీలో ఎప్పుడు చేరేదీ నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు. బీజేపీలో విలీనంపై పార్టీలో తన నిర్ణయమే అంతిమమని ఆయన వెల్లడించారు. -
వేట ప్రారంభం
= త్వరలో కోర్ కమిటీ సమావేశం : జోషి = రాష్ర్టంలో నాలుగైదు చోట్ల మోడీ బహిరంగ సభలు = జనవరి లేదా ఫిబ్రవరిలో సభలు నిర్వహించే అవకాశం = యడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై విభేదాల్లేవు = ఆయన షరతులపై అధిష్టానం స్పందిస్తుంది సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై త్వరలోనే పార్టీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముందు సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వెల్లడించారు. గతంలో లోక్‌సభ ఎన్నికల్లో తొలుత 15, తర్వాత 19 స్థానాలను గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ సారి మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలను నిర్వహించాలని యోచిస్తునామని వెల్లడించారు. ఆయన కేటాయించే సమయాన్ని బట్టి జనవరి లేదా ఫిబ్రవరిలో సభలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా యడ్యూరప్పను బీజేపీలోకి తిరిగి తీసుకు రావడంపై పార్టీ నాయకుల్లో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. యడ్యూరప్ప ప్రజా నాయకుడని, కాంగ్రెసేతర ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశంతో ఆయనను చేర్చుకునే విషయమై అధిష్టానంతో చర్చించామని తెలిపారు. సీనియర్ నాయకులందరూ సానుకూలంగానే స్పందించారని చెప్పారు. యడ్యూరప్ప ప్రస్తావించిన షరతుల గురించి అడినప్పుడు, దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యం కావాలి అంతకు ముందు దక్షిణాది బీజేపీ యువ మోర్చా శాఖల పదాధికారుల సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామనే తృప్తితో ఉండవద్దని, లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యం కావాలని ఉద్బోధించారు. యువకులు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో రాష్ట్ర శాఖలోనూ ఉత్సాహం ఉరకలేస్తోందని అన్నారు. అయితే ఇదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న ఆరేళ్ల కాలంలో ధరల పెరుగుదలపై పార్లమెంట్ ఒక రోజు కూడా చర్చ జరగలేదని, యూపీఏ హయాంలో ప్రతి సమావేశంలోనూ చర్చ జరుగుతోందని ఆయన దుయ్యబట్టారు. ఈ సమావేశంలో బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు అనురాగ్ సింగ్ ఠాకూర్, ఐదు దక్షిణ రాష్ట్రాల యువ మోర్చా శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి నివాసం ముట్టడి భగ్నం
= లాడ్‌ను బర్తరఫ్ చేయాల్సిందే.. : బీజేపీ = అంతవరకూ ఆందోళన = త్వరలో జిల్లా, తాలూకా కేంద్రాల్లోనూ ఆందోళనలు = ముఖ్యమంత్రికి మతి మరుపు = వారి పార్టీ నేతల అవినీతిని మరిచిపోయారా? = లాడ్‌ను తొలగించకుంటే.. సీఎం కూడా ఇంటికే = సంతోష్‌ను రక్షించేందుకు డబ్బు తీసుకున్నారేమో? సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్‌ను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించడానికి బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. తొలుత ఫ్రీడం పార్కు నుంచి బయలుదేరిన నాయకులను జేడీఎస్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు సాగడానికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ సహా పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంతకు ముందు ఫ్రీడం పార్కులో కార్యకర్తలనుద్దేశించి ప్రహ్లాద జోషి ప్రసంగిస్తూ, సంతోష్ లాడ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించేంత వరకు తమ పార్టీ ఆందోళనలు చేస్తూనే ఉంటుందని తెలిపారు. మున్ముందు తాలూకా, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మతి మరుపు వ్యాధితో బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, బదిలీల్లో జరిగిన అవకతవకలను ఆయన మరిచి పోయినట్లున్నారని అన్నారు. కనుక ఆయన ‘మతి మరుపు భాగ్య యోజన’ను అమలు చేయాలని దెప్పి పొడిచారు. లాడ్‌ను తొలగించక పోతే, ముఖ్యమంత్రే ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప మాట్లాడుతూ సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరలు లాడ్ వద్ద డబ్బులు తీసుకుని ఆయనను రక్షిస్తున్నారనే అనుమానాలు రాష్ర్ట ప్రజల్లో ఉన్నాయని అన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.