సాక్షి, యాదాద్రి, యాద గిరిగుట్ట/వనపర్తి: రాబో యే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికార పగ్గాలు చేపడుతుందనే నమ్మకం ఉందని కేంద్ర బొగ్గు, గనులు, పార్ల మెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. గురువారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించు కున్న మంత్రి.. మీడియాతో మాట్లాడారు. అవినీతి, అధికార దుర్వినియో గానికి పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు విశ్వాసం కోల్పో యారని అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడటానికి శక్తిని ప్రసాదించా లని యాదాద్రీశుడిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. బీజేపీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీ, జిల్లా స్థాయి మత్స్యకారుల సమ్మే ళనంలో ఆయన మాట్లాడుతూ.. పోటీ చేయాలనే కోరిక ఉంటేనే సరిపోదని, అందుకు పోరాటపటిమ చూపాలన్నారు. ప్రపంచంలో మత్స్య సంపదను ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందన్నారు.
ఆయుష్మాన్ భారత్‌కు అడ్డుపడుతున్న కేసీఆర్: మహేంద్రనాథ్ పాండే
పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఏటా రూ.5 లక్షల వైద్య సహాయం అందించే ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలుకానివ్వ కుండా కేసీఆర్ స్పీడ్ బ్రేకర్‌లా అడ్డుపడుతున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరోపించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారి వనపర్తి, గద్వాల జిల్లాలో పర్యటించారు. వనపర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అతి త్వరలో ఆ స్పీడ్ బ్రేకర్‌ను తొలగించి తెలంగాణలోనూ ప్రతి పేదవాడికి మోదీ కేర్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.
భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యాశాఖలో నియామకాలు చేపట్టకుండా, తనకు ఎన్ని కల సమయంలో ఉపయోగపడే ఒక్క పోలీస్ శాఖలోనే కేసీఆర్ తరుచూ నియామకాలు చేపట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ– రాయలసీమను కలుపుతూ కృష్ణానదిపై సోమశిల వద్ద తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. కొత్త ఓటర్లతో మంత్రి రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు, జిట్టా బాలకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?
Comments
Please login to add a commentAdd a comment