Parliamentary Affairs Minister
-
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ దాకా జరుగుతాయని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో తొలిరోజే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని తెలిపాయి. బడ్జెట్‌కు ముందు వివిధ శాఖలతో జరిపే సంప్రదింపులను ఆర్థిక శాఖ ఈనెల 17 నుంచి ప్రారంభించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక విజయాలను, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదిగిన క్రమాన్ని ఆమె ఆనాడు వివరించారు. కాగా 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 దాకా జరగనున్నాయి. 24, 25 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు దీన్ని ధృవీకరించారు. -
రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లోని పారీ్టల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ అవుతారు. సమావేశాలు ఫిబ్రవరి 9 దాకా కొనసాగుతాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. -
సస్పెన్షన్ కోసం వాళ్లే అభ్యర్థించారు: జోషి
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్రప్రభుత్వం అనుకోలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సభకు అంతరాయం కలిగించిన కొందరు ఎంపీలను సస్పెండ్ చేయడంతో తమను కూడా సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు తమను కోరారని ఆయన చెప్పారు. శుక్రవారం మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. ‘ఎంపీలను సస్పెండ్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ప్లకార్డులతో రావొద్దని కోరాం. చర్యలుంటాయని ముందుగానే వారికి చెప్పాం. నిబంధనలు ఉల్లంఘించి కొందరు ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. క్రమశిక్షణారాహిత్యం కింద తమను కూడా సస్పెండ్ చేయాలంటూ మిగతా వారు కూడా కోరారు. కాంగ్రెస్ స్థాయి అంతగా దిగజారింది. లోక్‌సభ నుంచి 100 మంది, రాజ్యసభ సభ్యులు 46 మంది మొత్తం 146 మంది ఎంపీలు బహిష్కరణకు గురయ్యారు’అని మంత్రి చెప్పారు. తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందిన మూడు క్రిమినల్ బిల్లుల్లో ఏమైనా లోపాలున్నాయని భావిస్తే కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు ఉందని ఆయన చెప్పారు. -
Parliament Winter sessions 2023: రేపు అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: డిసెంబర్ నాలుగో తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. డిసెంబర్ రెండో తేదీన(శనివారం) అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని సంబంధిత రాజకీయ పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేంద్రం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్‌తోపాటు రాజకీయ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు పాల్గొంటారు. ప్రస్తుతం పార్లమెంట్ వద్ద 37 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సారి సెషన్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని, 12 బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ల తొలి అదనపు బిల్లులను ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తోంది. లోక్‌సభలో ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలంటూ నైతికవిలువల కమిటీ ఇచ్చిన సిఫార్సును ఈసారి సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులను సభ ముందు ఉంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లునూ ప్రవేశపెట్టే అవకాశముంది. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి..
సాక్షి, ఢిల్లీ: గందరగోళానికి తెర దించుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2023 నిర్వహణపై స్పష్టమైన ప్రకటన వెలవడింది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో సందేశం ఉంచారు. సెలవులు మినహా డిసెంబర్ 22 దాకా.. మొత్తం 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను తేనుంది కేంద్రం. వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే.. వీటికి సంబంధించిన నివేదికలు ఇటీవల హోం మంత్రిత్వ శాఖకు అందాయి. దీంతో.. శీతాకాల సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. Winter Session, 2023 of Parliament will commence from 4th December and continue till 22nd December having 15 sittings spread over 19 days. Amid Amrit Kaal looking forward to discussions on Legislative Business and other items during the session.#WinterSession2023 pic.twitter.com/KiboOyFxk0 — Pralhad Joshi (@JoshiPralhad) November 9, 2023 -
సోనియా లేఖకు బదులిచ్చిన కేంద్రం.. ఏం చెప్పిందంటే!
న్యూఢిల్లీ: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండా ఏమిటో తెలపాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖకు స్పందిస్తూ వ్యంగ్యంగా బదులిచ్చారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. అజెండా లేకుండా సమావేశాలా? సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సెషన్లు నిర్వహిస్తున్నట్లు కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే విషయమై ప్రతిపక్షాలతో చర్చించకుండానే పిలుపునిచ్చారని కనీసం అజెండా ఏమిటో తెలపమని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు సోనియా గాంధీ. అయినప్పటికీ ఈ సమావేశాలకు హాజరు కావడానికి తాము సుముఖంగానే ఉన్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రజాసమస్యలు చాలానే ఉన్నాయని చెబుతూ తొమ్మిది అంశాలను లేఖలో ప్రస్తావించారు. వాటిలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, మణిపూర్‌లో పరిస్థితి, మతతత్వం, చైనా సరిహద్దు అంశంతోపాటు మరికొన్ని అంశాలున్నాయి. Here is the letter from CPP Chairperson Smt. Sonia Gandhi ji to PM Modi, addressing the issues that the party wishes to discuss in the upcoming special parliamentary session. pic.twitter.com/gFZnO9eISb — Congress (@INCIndia) September 6, 2023 ఆ సంప్రదాయం లేదు.. సోనియా గాంధీ లేఖకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ మీకు ఇక్కడి సంప్రదాయాలు ఇంకా అలవాటైనట్టు లేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఎన్నడూ పార్టీల అభిప్రాయాలను అడిగిడం కానీ వారితో చర్చలు జరిపింది కానీ లేదని అన్నారు. రాష్ట్రపతి సందేశంతో పార్లమెంట్ సెషన్లు ప్రారంభమవుతాయి. అన్ని పార్టల నాయకులు సమేవేశమయ్యాక అప్పుడు ప్రజా సమస్యలపైనా ఇతర అంశాలపైనా చర్చలు కొనసాగిస్తుంటామని రాస్తూ బదులిచ్చారు. यह बेहद दुर्भाग्यपूर्ण है कि एक वरिष्ठ सांसद होने के बाद भी कांग्रेस की पूर्व अध्यक्षा श्रीमती गांधी संसद के आगामी सत्र को लेकर अनावश्यक विवाद पैदा करने की कोशिश कर रही हैं। संसद का सत्र बुलाना भारत सरकार का संवैधानिक अधिकार है। मैं आशा करता हूं कि सभी पार्टियां संसद की गरिमा… pic.twitter.com/STTOYtxIsO — Pralhad Joshi (@JoshiPralhad) September 6, 2023 ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి -
ప్రశ్నోత్తరాలు లేకుండానే పార్లమెంటు ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ: ఈ నెల ద్వితీయార్థంలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మరెన్నో రకాలుగా కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయి. సెపె్టంబర్ 18–22 మధ్య ఐదు రోజుల పాటు వాటిని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషీ గురువారం ప్రకటించడం తెలిసిందే. ఉభయ సభల్లో సాధారణంగా ఉదయాన్నే చేపట్టే ప్రశ్నోత్తరాలు ఈ సమావేశాల్లో ఉండబోవు. అలాగే ప్రైవేట్ సభ్యుల బిల్లులు ప్రవేశ పెట్టేందుకు కూడా అవకాశం ఇవ్వబోరు. రాజ్యసభ, లోక్‌సభ సచివాలయాలు శనివారం ఈ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ‘17వ లోక్‌సభ 13వ సమావేశాలు సెపె్టంబర్ 18 సోమవారం మొదలవుతాయి. ఉభయ సభలు సభ్యులకు ఈ మేరకు సమాచారం ఇవ్వడం జరిగింది‘ అని లోక్‌సభ సచివాలయం; ‘రాజ్యసభ 261వ సమావేశాలు మొదలవుతాయి‘ అని రాజ్యసభ సచివాలయం వేర్వేరు బులెటిన్లలో పేర్కొన్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల అజెండాను కేంద్రం ఇప్పటిదాకా గోప్యంగా ఉంచడం తెలిసిందే. ప్రత్యేక భేటీ కొత్త భవనంలో...? పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రస్తుత లోక్‌సభకు చివరివి అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. భేటీ అనంతరం ఉభయ సభలు సభ్యులకు ప్రత్యేక గ్రూప్ ఫోటో సెషన్‌కు ఏర్పాట్లు జరుగుతుండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే ఈ సమావేశాలు కొత్త భవనంలో జరిగే అవకాశముందని కూడా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవి కొత్త భవనంలో జరిగే తొలి సమావేశాలు గనుక ఫోటో సెషన్ ఏర్పాటు చేస్తుండవచ్చని కూడా కొందరు అంటున్నారు. అత్యాధునిక రీతిలో సర్వ హంగులతో రికార్డు సమయంలో నిర్మితమైన పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత మే 28న ప్రారంభించడం తెలిసిందే. ప్రత్యేక సమావేశాలు ఇలా... ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మొత్తం ఐదు సెషన్లు ఉంటాయి. సమావేశాలకు సంబంధించిన ప్రోవిజనల్ కేలండర్‌ను ఎంపీలకు విడిగా తెలియజేస్తారు. -
20 నుంచి పార్లమెంట్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో సభా వ్యవహారాలు, వివిధ అంశాలపై ఫలప్రదమైన చర్చలకు సహకరించాలని అన్ని పారీ్టలను కోరుతున్నా’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మొత్తం 17 రోజులపాటు పార్లమెంట్ సమావేశం కానుంది. సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, సమావేశాల మధ్యలో కొత్త భవనానికి మారుతాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయతి్నస్తున్న వేళ ఈ సమావేశాలు వాడీవేడిగా సాగుతాయని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి( యూసీసీ)బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రధాని మోదీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెడుతూ ఢిల్లీలో పరిపాలనాధికారాలపై పట్టుబిగించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అదేవిధంగా, ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ నూతన భవనాన్ని మే 28న ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. -
జీ–20పై నేడు అఖిలపక్షం
న్యూఢిల్లీ: భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులు హాజరుకానున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జీ–20 శిఖరాగ్ర సదస్సుకి ముందు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200కిపైగా సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు జీ–20 మొట్టమొదటి ప్రతినిధుల సదస్సు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఆదివారం జరిగింది. సమ్మిళిత అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యరంగంలో సదుపాయాలు, నాణ్యమైన జీవనం వంటివాటిపై భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ మాట్లాడారు. -
‘తెలంగాణలో ఇక బీజేపీదే అధికారం’
సాక్షి, యాదాద్రి, యాద గిరిగుట్ట/వనపర్తి: రాబో యే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికార పగ్గాలు చేపడుతుందనే నమ్మకం ఉందని కేంద్ర బొగ్గు, గనులు, పార్ల మెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. గురువారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించు కున్న మంత్రి.. మీడియాతో మాట్లాడారు. అవినీతి, అధికార దుర్వినియో గానికి పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు విశ్వాసం కోల్పో యారని అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడటానికి శక్తిని ప్రసాదించా లని యాదాద్రీశుడిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. బీజేపీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీ, జిల్లా స్థాయి మత్స్యకారుల సమ్మే ళనంలో ఆయన మాట్లాడుతూ.. పోటీ చేయాలనే కోరిక ఉంటేనే సరిపోదని, అందుకు పోరాటపటిమ చూపాలన్నారు. ప్రపంచంలో మత్స్య సంపదను ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్‌కు అడ్డుపడుతున్న కేసీఆర్: మహేంద్రనాథ్ పాండే పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఏటా రూ.5 లక్షల వైద్య సహాయం అందించే ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలుకానివ్వ కుండా కేసీఆర్ స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడుతున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరోపించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారి వనపర్తి, గద్వాల జిల్లాలో పర్యటించారు. వనపర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అతి త్వరలో ఆ స్పీడ్ బ్రేకర్‌ను తొలగించి తెలంగాణలోనూ ప్రతి పేదవాడికి మోదీ కేర్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే విద్యాశాఖలో నియామకాలు చేపట్టకుండా, తనకు ఎన్ని కల సమయంలో ఉపయోగపడే ఒక్క పోలీస్ శాఖలోనే కేసీఆర్ తరుచూ నియామకాలు చేపట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ– రాయలసీమను కలుపుతూ కృష్ణానదిపై సోమశిల వద్ద తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. కొత్త ఓటర్లతో మంత్రి రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్రావు, కాసం వెంకటేశ్వర్లు, జిట్టా బాలకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా? -
పార్లమెంట్ సమావేశాలు వాయిదాపై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎంపీల వినతి మేరకే షెడ్యూల్‌కు రెండు రోజులు ముందుగానే నిరవధికంగా వాయిదా వేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 12 కంటే ముందుగానే ముగించడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, సభను నడిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సభలో చర్చ జరగాలంటూ బయటకు చెప్పుకుంటూ అంతరాయం కలిగించడం, వాకౌట్ చేయడం ప్రతిపక్షాల ఎజెండాగా మారిందని విమర్శించారు. ‘ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా వర్షాకాల సమావేశాలను షెడ్యూల్ కంటే 4 రోజులు కాదు, 2 రోజులు ముందుగా వాయిదా వేశాం. ప్రతిపక్ష సభ్యులు సహా పలువురు ఎంపీలు చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని పేర్కొన్నారు. చదవండి: నితీశ్‌కు వెన్నుపోటు అలవాటే: బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ సభలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలపై ఆయన స్పందిస్తూ..‘అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక కుటుంబం వ్యక్తిగత సమస్యలపై పార్లమెంట్ సమయాన్ని వృథా చేశారు. ప్రజాప్రయోజనాల కంటే ఒక కుటుంబాన్ని రక్షించడానికే ఎక్కువ ఆసక్తి చూపారు’అని ఎత్తిపొడిచారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్‌ని ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. చదవండి: నలుగురికి కోవిడ్ పాజిటివ్.. భారత పర్యాటకులపై నేపాల్ నిషేధం TMC leader @derekobrienmp should stop preaching about democratic values and the sanctity of institutions. The people of Bengal have elected BJP as the main opposition but TMC, in its arrogance, has denied BJP the post of PAC Chairman. https://t.co/YeKpYJdXWE — Pralhad Joshi (@JoshiPralhad) August 8, 2022 -
'అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం'
-
'అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం'
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై బుధవారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ కేసులో ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ వేదికగా ప్రభుత్వంపై దాడికి దిగింది. అయితే ప్రభుత్వం కూడా కాంగ్రెస్‌పై ఎదురు దాడి చేసింది. ఇవాళ ఉదయం లోక్‌సభ ప్రారంభమవడమే ఆలస్యం... కాంగ్రెస్ ఎంపీలు నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు సభ కార్యకలాపాలను అడ్డుకునే యత్నం చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ఆందోళన మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఆందోళన విరమించాలని, సభ సజావుగా సాగాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ సందర్భంగా విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ...ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానాలో కాంగ్రెస్ నేతలపై అక్రమంగా సీబీఐ కేసులు నమోదు చేస్తుందన్నారు. దేశంలో రెండు చట్టాలు అమలవుతున్నాయని... అధికార పక్షానికి ఓ చట్టం... విపక్షానికి మరో చట్టం అమలవుతుందని ఎద్దేవా చేశారు. అయితే సీబీఐ, ఈడీ కేసులకు మాత్రం భయపడేది లేదని ఖర్గే స్పష్టం చేశారు. ఇంతలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ఖర్గే వాఖ్యలకు ఖండించారు. కోర్టు కేసులను రాజకీయం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కోర్టు కేసులకు... ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో అమిత్ షాను జైలుకు పంపిన సంగతిని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. కక్ష సాధించడం కాంగ్రెస్ పార్టీకే అలవాటు అని ఆయన అన్నారు. సభ సజావుగా జరగడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఒకరిని వేధించాల్సిన అవసరం తమకు లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. -
4 నుంచి లోక్‌సభ
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడి న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన 16వ లోక్‌సభ తొలి సమావేశాలు వచ్చే నెల 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు గురువారం తెలిపారు. పార్లమెంటు సమావేశాలపై కేబినెట్ సమావేశమై చర్చించిన అనంతరం ఆయన విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. 4, 5 తేదీల్లో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని, మరుసటి రోజు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉంటుందని వివరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 9న ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని, అదే తేదీ నుంచి రాజ్య సభ సమావేశాలు మొదలవుతాయని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదా లు తెలిపే తీర్మానం లోక్‌సభలో 10న, రాజ్యసభలో 11న చేపడతామని వివరించారు. కాగా కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేం దుకు సీనియర్ కాంగ్రెస్ ఎంపీ కమల్‌నాథ్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారని, ఆయనకు అర్జున్ చరణ్ సేథీ (బీజేడీ), పూర్ణో ఎ సంగ్మా(నేషనల్ పీపుల్స్ పార్టీ), బీరేన్ సింగ్(కాంగ్రెస్)తో కూడిన ప్యానెల్ సహాయకారిగా ఉంటుందని వివరించారు. స్పీకర్ పోస్టుకు సంబంధిం చి ఎవరినైనా ఖరారు చేశారా అని ప్రశ్నించగా.. ఇంకా అలాంటిదేమీ లేదన్నారు. అవసరాన్ని బట్టి సమావేశాలను ఒక రోజు పొడిగించే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తారా? తగినంతమంది సభ్యులు లేకున్నా కూడా కాంగ్రెస్‌కు సభలో ప్రతిపక్ష హోదా ఇస్తారా అని ప్రశ్నించగా.. ‘‘ఈ అంశంపై చర్చించే సమయంలో మేం చాలా అంశాలను పరిశీలించాం. దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయముంది’’ అని వెంకయ్య అన్నారు. 543 మంది సభ్యుల లోక్‌సభలో కనీసం 10 శాతం సీట్లు వచ్చిన పార్టీకి చెందిన సభ్యుడికే కేబినెట్ ర్యాంకుగల ప్రతిపక్ష నాయకుడి హోదా లభిస్తుంది. అయితే ఇటీవలి ఎన్నికల్లో ఏ పార్టీకీ ఆ మేర సీట్లు రాలేదు. ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్య కంటే 10 సీట్లు తక్కువగా 44 సీట్లు వచ్చాయి.