సోనియా లేఖకు బదులిచ్చిన కేంద్రం.. ఏం చెప్పిందంటే!  | Minister Responds To Sonia Gandhi's Letter To PM Modi - Sakshi
Sakshi News home page

సోనియా లేఖకు బదులిచ్చిన కేంద్రం.. ఏం చెప్పిందంటే! 

Sep 6 2023 9:23 PM | Updated on Sep 7 2023 12:08 PM

Minister Responds To Sonia Gandhi Letter Says Parties Never Consulted - Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండా ఏమిటో తెలపాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖకు స్పందిస్తూ వ్యంగ్యంగా బదులిచ్చారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.  

అజెండా లేకుండా సమావేశాలా?
సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సెషన్లు నిర్వహిస్తున్నట్లు కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే విషయమై ప్రతిపక్షాలతో చర్చించకుండానే పిలుపునిచ్చారని కనీసం అజెండా ఏమిటో తెలపమని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు సోనియా గాంధీ.

అయినప్పటికీ ఈ సమావేశాలకు హాజరు కావడానికి తాము సుముఖంగానే ఉన్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రజాసమస్యలు చాలానే ఉన్నాయని చెబుతూ తొమ్మిది అంశాలను లేఖలో ప్రస్తావించారు. వాటిలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, మణిపూర్‌లో పరిస్థితి, మతతత్వం, చైనా సరిహద్దు అంశంతోపాటు మరికొన్ని అంశాలున్నాయి.   

ఆ సంప్రదాయం లేదు..  
సోనియా గాంధీ లేఖకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ మీకు ఇక్కడి సంప్రదాయాలు ఇంకా అలవాటైనట్టు లేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఎన్నడూ పార్టీల అభిప్రాయాలను అడిగిడం కానీ వారితో చర్చలు జరిపింది  కానీ లేదని అన్నారు. రాష్ట్రపతి సందేశంతో పార్లమెంట్ సెషన్లు ప్రారంభమవుతాయి. అన్ని పార్టల నాయకులు సమేవేశమయ్యాక అప్పుడు ప్రజా సమస్యలపైనా ఇతర అంశాలపైనా చర్చలు కొనసాగిస్తుంటామని రాస్తూ బదులిచ్చారు.         

ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement