న్యూఢిల్లీ : పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. జూన్ 17వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలపై చర్చించేందుకు జోషి శుక్రవారం సోనియా నివాసానికి వెళ్లారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరి మధ్య భేటీ కొనసాగింది. అలాగే రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్‌తో, లోక్‌సభలో డీఎంకే నాయకుడు టీఆర్ బాలుతో కూడా జోషి పార్లమెంట్ సమావేశాలపై చర్చించనున్నారు.
కాగా, 17వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు జూలై 26 వరకు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 19వ తేదీన స్పీకర్ ఎన్నిక జరపాలని నిర్ణయించారు. 20వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూలై 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment