special parliament session
-
PM Narendra Modi: ప్రశాంతంగా మణిపూర్
న్యూఢిల్లీ: విపక్షాల విమర్శల నేపథ్యంలో మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు బుధవారం ప్రధాని బదులిచ్చారు. రెండు గంటలపాటు సాగిన ప్రసంగంలో మణిపూర్ అంశంపై వివరంగా మాట్లాడారు. అక్కడ హింస క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ‘‘మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యా సంస్థలతో పాటు వ్యాపార సంస్థలు కూడా దాదాపుగా తెరుచుకుంటున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను సంపూర్ణంగా పునరుద్ధరించేందుకు కేంద్రం అన్ని చర్యలూ చేపడుతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో అన్నివిధాలా కలిసి పని చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌లో పలు రోజుల పాటు ఉండి మరీ పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేశారు. హింసాకాండకు సంబంధించి ఇప్పటిదాకా 500 మందికి పైగా అరెస్టయ్యారు. 11 వేల పై చిలుకు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి’’ అని వివరించారు. మణిపూర్ హింసపై గత సమావేశాల సందర్భంగా రాజ్యసభలో తాను సుదీర్ఘంగా మాట్లాడానని ప్రధాని గుర్తు చేశారు. ‘‘మణిపూర్ ఇప్పుడు వరదలతో సతమతమవుతోంది. కనుక ఈ అంశంపై విపక్షాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. పరిస్థితిని చక్కదిద్దేందుకు మాతో కలిసి రావాలి’’ అని కోరారు. కానీ మోదీ వ్యాఖ్యలతో విపక్షాలు సంతృప్తి చెందలేదు. మణిపూర్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందన్నాయి. అక్కడ గత మేలో హింస చెలరేగితే ఏడాదైనా ఆ రాష్ట్రాన్ని సందర్శించేందుకు మోదీకి తీరిక చిక్కలేదా అంటూ మండిపడ్డాయి. ఈ అంశంపై మాట్లాడేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు అవకాశమివ్వాలని డిమాండ్ చేశాయి. అందుకు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ నిరాకరించడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రధాని మాట్లాడుతుండగానే సభ నుంచి వాకౌట్ చేశాయి. దీనిపై చైర్మన్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. విపక్షాలు సభనే గాక రాజ్యాంగాన్ని కూడా అవమానించాయంటూ ఆగ్రహించారు. ‘‘మీరు వీడింది సభను కాదు, మర్యాదను’’ అంటూ దుయ్యబట్టారు. అనంతరం మోదీ మాట్లాడుతూ మణిపూర్ జాతుల సంఘర్షణలకు మూలం దాని చరిత్రలోనే ఉందన్నారు. స్వాతంత్య్రానంతరం అక్కడ 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచి్చందని గుర్తు చేశారు. 1993 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రంలో భారీ స్థాయిలో సామాజిక సంఘర్షణ చోటుచేసుకుందన్నారు. ‘‘కనుక మణిపూర్ సమస్యను పరిష్కరించే క్రమంలో ఓపికగా, ఆచితూచి వ్యవహరించాలి’’ అన్నారు. నీట్ లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. రాజ్యాంగాన్ని కాలరాసిందే కాంగ్రెస్! అంతకు ముందు సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను మరోసారి తూర్పరాబట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్నే అపహాస్యం చేసిన వారినుంచి ఇలాంటి మాటలు విడ్డూరం! ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 ఎన్నికల సందర్భంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపింది. ఆ ఎన్నికల్లో మాత్రమే ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓటేశారు. కాంగ్రెస్ సర్కారును సాగనంపారు’’ అంటూ దుయ్యబట్టారు. దాంతో మోదీ అబద్ధాలకోరంటూ విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీనిపై ఖర్గేకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. వారి నినాదాల మధ్యే మోదీ ప్రసంగం కొనసాగించారు. దర్యాప్తు సంస్థలకు మరింత స్వేచ్ఛ అవినీతి, నల్లధనంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపుతామని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు చెప్పారు. ‘‘అవినీతిపరులెవరినీ వదలబోం. ఇది మోదీ గ్యారంటీ’’ అన్నారు. రాజ్యసభ నిరవధిక వాయిదా రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించగానే చైర్మన్ ఈ మేరకు ప్రకటించారు. లోక్‌సభ మంగళవారమే నిరవధికంగా వాయిదా పడటం తెలిసిందే. దీంతో పార్లమెంటు సమావేశాలకు తెర పడింది. -
Parliament Session 2024: సభలో ‘హిందూ’ కాక
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సోమవారం ఊహించినట్టుగానే నీట్ దుమారానికి వేదికగా మారాయి. అది కేవలం సంపన్నుల పరీక్షగా మారిపోయిందని, ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తుకు సమాధి కడుతోందని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ఆయన గంటా 40 నిమిషాల పాటు మాట్లాడారు. అయితే విపక్ష నేత హోదాలో రాహుల్ చేసిన తొలి ప్రసంగమే సభలో తీవ్ర దుమారం రేపింది. లక్షలాది మంది విద్యార్థుల భవిత ప్రమాదంలో పడ్డా మోదీ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆ క్రమంలో చేసిన ‘హిందూ’వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారి తీశాయి. ‘‘తాము హిందువులమని చెప్పకునే వాళ్లు నిరంతరం హింసా ద్వేషాలను, అవాస్తవాలను వ్యాప్తి చేయడంలో మునిగి తేలుతున్నారు’’అంటూ రాహుల్ తీవ్ర విమర్శలు చేయడంతో సభలో గగ్గోలు రేగింది. అధికార బీజేపీ సభ్యులంతా వాటిని తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కలగజేసుకుని రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘విపక్ష నేత మొత్తం హిందూ సమాజాన్నే హింసాత్మకమైనదిగా అభివరి్ణంచారు. ఇది చాలా తీవ్రమైన అంశం’’అంటూ దుయ్యబట్టారు. వాటిని రాహుల్ తోసిపుచ్చారు. తన వ్యాఖ్యలు కేవలం బీజేపీని ఉద్దేశించినవి మాత్రమేనని స్పష్టం చేశారు. ‘‘హిందూ సమాజమంటే కేవలం బీజేపీ, ఆరెస్సెస్, మోదీ మాత్రమే కాదు’’అంటూ చురకలు వేశారు. నిర్భీతి, అహింస గురించి మాట్లాడుతూ శివుడు, గురు నానక్, జీసస్ ఫొటోలు సభలో ప్రదర్శించారు. సభలో మత చిహ్నాల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించబోవని స్పీకర్ ఓం బిర్లా వారిస్తున్నా పట్టించుకోలేదు. ‘‘అన్ని మతాలూ, అందరు మహానుభావులూ చెప్పింది అహింస, నిర్భీతి గురించే. కానీ తాము హిందువులమని చెప్పుకునే వాళ్లు మాత్రం కేవలం హింస, ద్వేషం, అసత్యాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఏ లెక్కన చూసుకున్నా మీరసలు హిందువులే కాదు’’అంటూ బీజేపీ నేతలను దుయ్యబట్టారు. ‘‘మైనారిటీలు దేశానికి గర్వకారణం. అన్ని రంగాల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశభక్తులు. వారిపైనా బీజేపీ దారుణంగా దాడులకు దిగుతోంది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులపై హింసాద్వేషాలను వ్యాప్తి చేస్తోంది’’అని ఆక్షేపించారు. రాహుల్ ప్రసంగాన్ని ఆయన తల్లి సోనియాగాం«దీ, సోదరి ప్రియాంకా గాంధీ వద్రా లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి వీక్షించారు. హిందువులంతా హింసావాదులా: అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలపై నిరసనలతో బీజేపీ సభ్యులు హోరెత్తించారు. రాహుల్ తక్షణం సభకు క్షమాపణ చెప్పి తీరాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ‘‘దేశంలో కోట్లాది హిందువులున్నారు. వారంతా హింసకు పాల్పడేవాళ్లేనన్నది రాహుల్ ఉద్దేశమా? 1975లో ఎమర్జెన్సీ విధింపు, 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల వంటి అకృత్యాలన్నీ కాంగ్రెస్ పుణ్యమే. దేశమంతటా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసిందే కాంగ్రెస్. అలాంటి పారీ్టకి చెందిన రాహుల్‌కు అహింస గురించి మాట్లాడే అర్హతే లేదు’’అంటూ మండిపడ్డారు. అయినా రాహుల్ వెనక్కు తగ్గలేదు. ‘‘క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం, జైనం, సిక్కు వంటి మతాలన్నీ ధైర్యం, నిర్భీతి వంటివాటి గురించే చెప్పాయి. కానీ బీజేపీ ప్రజాస్వామిక విలువలపై ఏనాడూ నమ్మకం లేదు. మోదీ ఆదేశాల మేరకు నాపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. 20కి పైగా కేసులు పెట్టారు. నా ఇంటిని లాగేసుకున్నారు. నాపై ఈడీని ప్రయోగించి 55 గంటల పాటు విచారణ జరిపారు. అయినా వెరవకుండా రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో ముందుండి నిలిచా. రాజ్యాంగంపై, భారత దేశ మూల భావనలపై బీజేపీ పాల్పడుతున్న వ్యవస్థీకృత దాడులకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు అడ్డుకట్ట వేశారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ వాళ్లు కూడా నాతో పాటు రాజ్యాంగానికి జై కొట్టాల్సి వస్తోంది’’అంటూ ఎద్దేవా చేశారు. ‘నీట్’పై విపక్షాల వాకౌట్ సోమవారం లోక్‌సభ సమావేశం కాగానే నీట్–యూజీ పేపర్ లీకేజీ అంశాన్ని రాహుల్ ప్రస్తావించి తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ‘‘నీట్ వంటి ప్రొఫెషనల్ పరీక్షను కేవలం సంపన్న విద్యార్థులకు అనువైనపక్కా కమర్షియల్ పరీక్షగా మార్చేశారు. గత ఏడేళ్లలో 70కి పైగా పేపర్లు లీకయ్యాయి. ఇంత ముఖ్యమైన అంశంపై ప్రభుత్వం చర్చకు కూడా అంగీకరించడం లేదు. ఇది చాలా తీవ్రమైన అంశం. కనుక సభలో ఒక రోజంతా ప్రత్యేకంగా చర్చ చేపడదాం’’అని ప్రతిపాదించారు. అందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభ్యంతరం తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఇతర అంశాలపై చర్చ కోరడం లోక్‌సభ సభ్యునిగా నా దశాబ్దాల అనుభవంలో ఎప్పుడూ చూడలేదు’’అన్నారు. అనంతరం నీట్‌పై చర్చకు స్పీకర్ తిరస్కరించారు. అందుకోసం ప్రత్యేక నోటీసివ్వాలని విపక్షాలకు సూచించారు. స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. అంతకుముందు మణిపూర్ కల్లోలం, రైతు ఆత్మహత్యలు, జమ్మూ కశీ్మర్లో హింసాకాండ, జీఎస్టీ, నోట్ల రద్దు తదిరాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును రాహుల్ దుయ్యబట్టారు. మణిపూర్‌ను మోదీ సర్కారు అంతర్యుద్ధం దిశగా నెట్టేస్తోందని ఆరోపించారు. ‘‘విపక్షాన్ని శత్రువులుగా చూడకండి. ప్రతి అంశంపైనా దేశ హితం కోసం ప్రజోపయోగకరమైన చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’’అన్నారు. విపక్షాల నిరసన విపక్ష నేతలను వేధించేందుకు వారిపైకి మోదీ సర్కారు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ఇండియా కూటమి సభ్యులు ఆరోపించారు. ఇందుకు నిరసనగా రాహుల్‌తో పాటు వారంతా పార్లమెంటు మకర ద్వారం వద్ద నిరసనకు దిగారు. ‘విపక్షాల గొంతు నొక్కేందుకు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం మానుకోండి’, ‘బీజేపీలో చేరండి, అవినీతికి లైసెన్సు పొందండి’అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులపై ఈడీని ఉసిగొల్పడం మానుకోవాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్‌ది బాధ్యతారాహిత్యం: బీజేపీ లోక్‌సభలో రాహుల్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారంటూ బీజేపీ విమర్శించింది. విపక్ష నేత వంటి బాధ్యతాయుత స్థానంలో ఉంటూ నీట్, హిందూ సమాజం, అగి్నవీర్ పథకం... ఇలా అన్ని అంశాలపైనా హుందాతనం లేని వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్ర అశ్వినీ వైష్ణవ్ ఆరోపించారు. రాహుల్ ఇప్పటిదాకా బాధ్యతల్లేని అధికారాన్ని మాత్రమే ఆస్వాదించారంటూ బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు. సభకు నిత్యం డుమ్మా కొట్టడాన్ని అలవాటుగా మార్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు. మోదీ నవ్వరెందుకో...! ప్రధాని మోదీ గురించి రాహుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీజీ! మీరెందుకు ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు? విపక్షాలతో ఎప్పుడూ సరదాగా మాట్లాడరు. సభలో మేం ఎదురైనప్పుడు మీలో చిరునవ్వు కూడా కని్పంచదు’’అన్నారు. మోదీ స్పందిస్తూ, ‘‘విపక్ష నేతను సీరియస్‌గా తీసుకోవాలని మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాకు నేర్పాయి’’అనడంతో ఎన్డీఏ సభ్యులంతా నవ్వుల్లో మునిగిపోయారు. మోదీకి తలవంచి అభివాదమా? రాహుల్ అభ్యంతరం, స్పీకర్ వివరణ నిండు సభలో ప్రధాని మోదీకి స్పీకర్ ఓం బిర్లా తలవంచి అభివాదం చేయడం సరికాదన్న రాహుల్ వ్యాఖ్యలు వారి మధ్య సంవాదానికి దారి తీశాయి. ‘‘మీరు స్పీకర్‌గా ఎన్నికయ్యాక నేను అభినందించినప్పుడు నిటారుగా నిలబడి నాతో కరచాలనం చేశారు. కానీ మోదీ కరచాలనం చేసినప్పుడు ఆయనకు వంగి నమస్కరించారు’’అంటూ రాహుల్ ఆక్షేపించారు. దీన్ని అధికార పక్ష సభ్యులంతా తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ సభాపతి స్థానంపైనే తీవ్ర అభియోగాలు మోపుతున్నారంటూ అమిత్ షా ఆక్షేపించారు. స్పీకర్ స్పందిస్తూ, ‘‘ప్రధాని సభా నాయకుడు. పైగా నా కంటే పెద్దవారు. పెద్దలను గౌరవిస్తా. అవసరమైతే పాదాభివందనం చేస్తా. సమ వయస్కులతో సమాన స్థాయిలో ప్రవర్తిస్తా. అది నా సంస్కృతి’’అని బదులిచ్చారు. అయినా రాహుల్ ఊరుకోలేదు. ‘‘మీ తీరును గౌరవిస్తా. కానీ లోక్‌సభలో స్పీకరే అందరికంటే పెద్దవారు. సభలో అంతా మీకే అభివాదం చేయాలి’’అన్నారు. ‘మైక్ కట్’విమర్శలు... ధన్‌ఖడ్, బిర్లా సీరియస్ విపక్షాలకు మైక్ కట్ చేస్తున్నామన్న విమర్శలపై రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా స్పందించారు. గత వారం సభలో రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశానన్న విపక్షాల ఆరోపణలను బిర్లా తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది స్పీకర్ స్థానం గౌరవానికి సంబంధించిన అంశం. మైకుల నియంత్రణ స్పీకర్ చేతిలో ఉండదు. ఈ విషయం విపక్షాలకూ తెలుసు. అయినా ఉద్దేశపూర్వకంగా సభ బయట తప్పుడు ఆరోపణలు చేశారు’’అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. అనంతరం రాజ్యసభలోనూ ఇదే అంశం చర్చకొచి్చంది. విపక్ష నేత ఖర్గే మాట్లాడుతుండగా అంతరాయం కలగడంతో మైక్ కట్ చేశారని విపక్ష సభ్యుడు ప్రమోద్ తివారీ అన్నారు. దానిపై ధన్‌ఖడ్ సీరియసయ్యారు. ‘‘మీ వ్యాఖ్యలతో సభను కించపరుస్తున్నారు. మిస్టర్ ఖర్గే! మైక్‌లను మెకానికల్‌గా నియంత్రిస్తారు తప్ప అది సభాపతి చేతిలో ఉండదు. అది మీకూ తెలుసు’’అంటూ మండిపడ్డారు. మోదీపై రాహుల్ మాటల తూటాలు – మనమంతా మామూలుగా పుట్టి మట్టిలో కలిసే జీవమాత్రులం. మోదీ అలా కాదు. ఆయన ఆత్మతో పరమాత్మ నేరుగా సంప్రదిస్తాడు. తనను దేవుడే పంపాడని మోదీయే స్వయంగా చెప్పుకున్నారు! దేవునితో తనకు నేరుగా కనెక్షన్ ఉందని ప్రకటించుకున్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ ఓ నాటి రాత్రి వేళ బహుశా మోదీకి దైవసందేశం అందినట్టుంది. వెంటనే ఆ మేరకు ప్రకటన చేసేశారు! – అంతా మర్చిపోయిన మహాత్మా గాం«దీని ఓ సినిమా తిరిగి గుర్తు చేసిందని మోదీ సెలవిచ్చారు. దాదాపుగా మృతప్రాయుడైన గాం«దీకి ఒక సినిమా పునర్జీవం పోసిందట! ఇంతటి అవగాహనరాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి! – సైనికులను అవసరానికి వాడి, ఆ తర్వాత పారేసే కార్మికులుగా మార్చేసిన అగి్నపథ్ కూడా మోదీ మెదడులో పురుడుపోసుకున్న పథకమే. మేం అధికారంలోకొస్తే దాన్ని తక్షణం రద్దు చేస్తాం. -
Parliament Special Session: పార్లమెంట్లో నీట్ రగడ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ) వ్యవహా రం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. నీట్ పరీక్షలో అవినీతి అక్రమాలపై, పేపర్ లీకేజీపై వెంటనే చర్చ చేపట్టాలని శుక్రవారం ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. నినాదాలతో హోరెత్తించాయి. ఇతర వ్యవహారాలు పక్కనపెట్టి నీట్ అభ్యర్థుల భవితవ్యాన్ని కాపాడడంపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. తర్వాత చర్చిద్దామని సభాపతులు కోరినన్పటికీ ప్రతిపక్ష నేతలు శాంతించలేదు. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. దిగువ సభలో విపక్షాల ఆందోళన లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే సుశీల్‌కుమార్ మోదీ సహా పలువురు మాజీ సభ్యుల మృతి పట్ల స్పీకర్ ఓం బిర్లా సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విపక్ష సభ్యులు నీట్ అంశాన్ని లేవనెత్తారు. తక్షణమే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందిస్తూ... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తెలిపే తీర్మానంపై చర్చ వాయిదా వేయడం కుదరని, ఈ నేపథ్యంలో జీరో అవర్ చేపట్టలేమని అన్నారు. కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని నీట్–యూజీపై చర్చించాలని అన్నారు. డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు వారి సీట్ల వద్దే నిల్చొని నినాదాలు ప్రారంభించారు. రాహుల్ గాంధీ విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్య క్రమాలు ప్రారంభించారు. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభాపతి ఎంతగా వారించినా వినకుండా నినాదాలు కొనసాగించారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిద్దామని, ఆ తర్వాత నీట్‌పై చర్చకు సమయం కేటాయిస్తానని సభాపతి పేర్కొన్నప్పటికీ విపక్షాలు పట్టువీడలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పశి్చమ బెంగాల్‌కు చెందిన నురుల్ హసన్‌తో ఎంపీగా స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం లోక్‌సభలో కమిటీల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. మరోవైపు నీట్–యూజీపై విపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో లోక్‌సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.రాజ్యసభలో వెల్‌లోకి దూసుకొచి్చన ఖర్గే నీట్ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షాలు నిలదీశాయి. విపక్షాల నిరసనలు, నినాదాల వల్ల శుక్రవారం ఎగువ సభను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మూడుసార్లు వాయిదా వేశా రు. రాష్ట్రప తి ప్ర సంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. నీట్‌పై చర్చించాలని పట్టుబట్టాయి. నీట్లో అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని జేడీ(ఎస్) సభ్యుడు హెచ్.డి.దేవెగౌడ గుర్తు చేశారు. సభ సక్రమంగా జరిగేలా విపక్ష సభ్యులంతా సహకరించాలని కోరారు. నీట్‌పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని, అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలని చెప్పారు. నీట్‌పై చర్చించాలని కోరుతూ ప్రతిపక్షాల నుంచి 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నానని ధన్‌ఖడ్ చెప్పారు. దీనిపై విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావడంపై రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకు డు వెల్‌లోకి రావడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి అని, పార్లమెంట్‌కు ఇదొక మచ్చ అని ఆక్షేపించారు. పార్లమెంటరీ సంప్రదాయం ఈ స్థాయికి దిగజారిపోవడం తనను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఈ ఘటన దేశంలో ప్రతి ఒక్కరినీ మానసికంగా గాయపర్చిందని చెప్పారు. నీట్‌పై చర్చకు సభాపతి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, సభలో మాట్లాడేందుకు చైర్మన్ ధనఖఢ్ అవకాశం ఇవ్వకపోవడం వల్లే తాను వెల్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. అయితే, ధన్‌ఖడ్ చెబుతున్నట్లుగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత వెల్‌లోకి వెళ్లడం ఇదే మొదటిసారి కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో అప్పటి విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వెల్‌లోకి వెళ్లారని గుర్తుచేశారు. స్పృహతప్పి పడిపోయిన కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలోదేవి నేతమ్ శుక్రవారం స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటు కారణంగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. పార్లమెంట్ సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. నేతమ్ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, కోలుకుంటున్నారని, ఈ మేరకు ఆసుపత్రి నుంచి తనకు సమాచారం అందిందని చైర్మన్ ధన్‌ఖఢ్ సభలో ప్రకటించారు. -
Parliament Special Session: విపక్షనేతగా రాహుల్: స్పీకర్
న్యూఢిల్లీ: రాహుల్‌ను లోక్‌సభలో విపక్షనేతగా గుర్తిస్తున్నట్లు నూతన స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్షాలకు ‘విపక్షనేత’ హోదా దక్కడం విశేషం. ఈ మేరకు జూన్ 9వ తేదీ నుంచే రాహుల్‌ను విపక్షనేతగా పరిగణిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. పార్లమెంట్చట్టం1977లోని రెండో సెక్షన్ ప్రకారం రాహుల్‌ను విపక్షనేతగా ప్రకటించింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. పార్టీ చీఫ్ ఖర్గే, పార్టీ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడిగా ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్లో వినిపిద్దామని పిలుపునిచ్చారు. 16వ, 17వ లోక్‌సభలో విపక్షపార్టీలకు కనీసం 10 శాతం సభ్యులబలం లేనికారణంగా ఏ పారీ్టకీ విపక్షహోదా దక్కలేదు. విపక్షనేతగా ఎన్నికవడం ద్వారా రాహుల్ తన పాతికేళ్ల రాజకీయజీవితంలో తొలిసారిగా రాజ్యాంగబద్ద పదవిని స్వీకరించారు. కేబినెట్ మంత్రి హోదాతో సమానమైన విపక్షనేత హోదాలో రాహుల్‌కు ఒక ప్రైవేట్ కార్యదర్శి, ఇద్దరు అదనపు ప్రైవేట్ కార్యదర్శులు, ఇద్దరు వ్యక్తిగత సహాయకులు, ఇక హిందీ స్టెనో, ఒక క్లర్క్, ఒక శానిటేషన్ వర్కర్, నలుగురు ప్యూన్లను కేంద్రం సమకూరుస్తుంది. 1954చట్టం 8వ సెక్షన్, 1977 చట్టాల ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తుంది. లోక్‌పాల్, సీఈసీ, ఈసీ, సీబీఐ డైరెక్టర్, సీవీసీ, సీఐసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీల నియామక ప్యానెళ్లలో ఇకపై రాహుల్ సభ్యునిగా ఉండనున్నారు.రాహుల్ తొలిసారిగా 2004లో అమేథీలో విజయంతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. -
Parliament Special Session: స్పీకర్‌గా బిర్లా.. మోదీ, రాహుల్ అభినందన
న్యూఢిల్లీ: అనూహ్యమేమీ జరగలేదు. అధికార ఎన్డీఏ పక్ష అభ్యర్థి ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీ కూడా ఓటింగ్ కోసం పట్టుబట్టలేదు. దాంతో మూజువాణి ఓటు ద్వారా విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై బిర్లా విజయం సాధించినట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. స్పీకర్ ఎన్నికపై అధికార, విపక్ష కూటముల మధ్య నెలకొన్న రగడకు ఆ విధంగా తెర పడింది. అనంతరం మోదీ, విపక్ష నేత రాహుల్‌గాం«దీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు 61 ఏళ్ల బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లారు. పారీ్టలకు అతీతంగా సభ్యులంతా చప్పట్లతో హర్షధ్వానాలు వెలిబుచ్చారు. అఖిలేశ్ యాదవ్ తదితర విపక్ష సభ్యులంతా ఈ సందర్భంగా బిర్లాను అభినందించారు. విధి నిర్వహణలో ఆయన నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని, ప్రజల గొంతుక వినిపించేందుకు విపక్షాలకు తగిన అవకాశాలిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. బలరాం జాఖడ్ అనంతరం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని తిరిగి స్పీకర్‌గా ఎన్నికైన రికార్డును బిర్లా సొంతం చేసుకున్నారు. లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293, ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలముంది. వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామాతో సభలో ఒక ఖాళీ ఉంది. మోదీ తొలి ప్రసంగం బిర్లా ఎన్నిక అనంతరం 18వ లోక్‌సభలో మోదీ తొలి ప్రసంగం చేశారు. గత ఐదేళ్లలో సభ హుందాతనాన్ని పరిరక్షించడంలో స్పీకర్‌గా బిర్లా గొప్ప పరిణతి చూపారంటూ ప్రశంసించారు. పలు చరిత్రాత్మక నిర్ణయాలతో లోక్‌సభ చరిత్రలో స్వర్ణయుగానికి సారథ్యం వహించారంటూ కొనియాడారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చన సందర్భాల్లోనూ ఆయన చక్కని సంతులనం పాటించారన్నారు. సభ నిర్వహణలో బిర్లా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతారని విశ్వాసం వెలిబుచ్చారు. పార్లమెంటేరియన్‌గా ఆయన పనితీరును కొత్త సభ్యులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విపక్షాల అభినందనలురాహుల్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా 18వ లోక్‌సభ చక్కగా పని చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈసారి సభలో విపక్షాల బలం పెరిగిందని గుర్తు చేశారు. వాటికి అందుకు తగ్గట్టుగా ప్రజా సమస్యలు లేవనెత్తేందుకు వీలైనన్ని అవకాశాలు లభించాలన్నారు. ఈ సభలో సభ్యుల సస్పెన్షన్ల వంటి సభ హుందాతనాన్ని తగ్గించే చర్యలుండబోవని అఖిలేశ్ ఆశాభావం వెలిబుచ్చారు. సుదీప్ బంధోపాధ్యాయ (టీఎంసీ), టీఆర్ బాలు (డీఎంకే) తదితరులు మాట్లాడారు. నేడు పార్లమెంటు సంయుక్త సమావేశం గురువారం పార్లమెంటు సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. మోదీ 3.0 నూతన సర్కారు ప్రాథమ్యాలను ఈ సందర్భంగా ఆమె పార్లమెంటు ముందుంచే అవకాశముంది. రాజ్యాంగంలోని 87వ ఆరి్టకల్ ప్రకారం లోక్‌సభ ఎన్నిక అనంతరం సమావేశాలు ప్రారంభమయ్యాక ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముర్ము గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి గుర్రపు బగ్గీలో సంప్రదాయ పద్ధతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకుంటారు. గజద్వారం వద్ద ప్రధానితో పాటు లోక్‌సభ, రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారులు స్వాగతం పలుకుతారు. సంప్రదాయ సెంగోల్ చేబూని ముందు నడుస్తూ రాష్ట్రపతిని లోక్‌సభ చాంబర్లోకి తీసుకెళ్తారు. మోదీ రాహుల్ కరచాలనంస్పీకర్గా ఎన్నికయ్యాక బిర్లాను పోడియం వద్దకు తీసుకెళ్లే సందర్భంలో లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు నవ్వుతూ మాట్లాడుకోవడం సభ్యులందరినీ ఆకర్షించింది. రాహుల్ నయా లుక్ స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ఆయన తెలుపు రంగు లాల్చీ, పైజామా ధరించి లోక్‌సభకు వచ్చారు. ఆయన కొన్నేళ్లుగా టీ షర్టు, బ్యాగీ ప్యాంటే ధరిస్తున్నారు. భారత్ జోడో యాత్రల్లోనూ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ అదే వస్త్రధారణ కొనసాగించారు. సోమ, మంగళవారాల్లో లోక్‌సభకు వచి్చనప్పుడు, సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా టీ షర్టు, బ్యాగీ ప్యాంటులోనే కని్పంచారు. రాహుల్ ప్రస్తుతం లోక్‌సభలో విపక్ష నేత కావడంతో అందుకు తగ్గట్టుగా లాల్చీ, పైజామాకు మారినట్టు భావిస్తున్నారు. ‘‘స్పీకర్‌గా ఎన్నికైన మీకు విపక్షం తరఫున, ‘ఇండియా’ కూటమి తరఫున మీకు అభినందనలు. ఉభయ సభలు సజావుగా సవ్యంగా సాగాలని ఆశిస్తున్నాం. విశ్వాసంతోనే సహకారం సాధ్యమవుతుంది. ప్రజావాణి పార్లమెంట్లో ప్రతిధ్వనించాలి. ప్రభుత్వం వెంట అధికార బలం ఉండొచ్చేమోగానీ విపక్షాలు గతంతో పోలిస్తే మరింత గట్టిగా ప్రజావాణిని పార్లమెంట్లో వినిపించనున్నాయి. మమ్మల్ని మాట్లాడేందుకు మీరు అనుమతిస్తారని విశ్వసిస్తున్నాం. విపక్షసభ్యులు మాట్లాడితే ప్రజల గొంతు పార్లమెంట్లో మోగినట్లే. ఈ మేరకు మీరు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి’’ ‘‘గత లోక్‌సభ సెషన్లు అత్యంత ఫలవంతమయ్యాయని ప్రభుత్వం ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. విపక్షసభ్యులందరినీ సస్పెండ్ చేసి సభలో మౌనం రాజ్యమేలేలా చేయడం అప్రజాస్వామిక విధానం. సభ అత్యంత ప్రభావవంతంగా నడవడం కంటే ప్రజావాణి ఎంతగా సభలో వినిపించింది అనేదే ముఖ్యం’’ – రాహుల్ గాంధీ‘‘ప్రజాస్వామ్య న్యాయానికి ఓం బిర్లాయే చీఫ్ జస్టిస్. మరెవరి ఆదేశాల ప్రకారమోకాకుండా ఆయన మార్గదర్శకత్వంలోనే సభ సజావుగా సాగాలని ఆశిస్తున్నా. వివక్షలేకుండా ప్రతి రాజకీయ పక్షానికి సమానమైన అవకాశాలు కలి్పంచాలి. నిష్పక్షపాత వైఖరి ప్రదర్శించడం గొప్ప బాధ్యత. సస్పెన్షన్ వంటి సభ గౌరవానికి హాని కల్గించే చర్యలు పునరావృతంకాబోవని భావిస్తున్నా’’ – అఖిలేశ్ యాదవ్ ‘‘ సభలో విపక్షాలు బలం పుంజుకున్నాయి. దీంతో సభ కొత్తరూపు సంతరించుకుందిగానీ బీజేపీ వైఖరి మారలేదు. మెజారిటీ సభ్యులున్న పారీ్టలకు ప్రాధాన్యత దక్కుతోంది. సభకు సారథి అయిన స్పీకర్ చిన్న పార్టీలనూ పట్టించుకోవాలి’’ – అసదుద్దీన్ అడ్డంకులు లేకుండా సాగాలి... ‘‘నన్ను స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు. అధికార, విపక్ష సభ్యులు ఒక్కతాటిపై నడిస్తేనే సభ సాగుతుంది. ప్రతి ఒక్కరి గొంతుకనూ వినడమే భారత ప్రజాస్వామ్యపు మూలబలం. ఏకైక సభ్యుడున్న పారీ్టకి కూడా సభలో కావాల్సినంత సమయం లభించాలి. మనల్ని ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారు. కనుక వారి సమస్యల పరిష్కారం కోసం సభ అడ్డంకుల్లేకుండా నడుస్తుందని ఆశిస్తున్నా. విమర్శలుండొచ్చు. కానీ సభను అడ్డుకోవడం సరి కాదు. సభ్యులపై చర్యలు తీసుకోవాలని నాకెప్పుడూ ఉండదు. కానీ ఉన్నత పార్లమెంటరీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చు’’ – స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం లోక్‌సభనుద్దేశించి ఓం బిర్లా -
స్పీకర్ పదవిపై వీడని సస్పెన్స్
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎవరుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీఏలోని మిత్రపక్షాలతో బీజేపీ సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ నెల 26న జరిగే స్పీకర్ ఎన్నికకు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 293 మంది ఎంపీలతో ఎన్డీఏ సంకీర్ణానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎన్డీఏ తమ స్పీకర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. అయితే విపక్ష ఇండియా కూటమికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి స్పీకర్ పదవికి పోటీపడే అంశాన్ని చురుకుగా పరిశీలిస్తోందని విశ్వసనీవర్గాలు తెలిపాయి. స్పీకర్‌పై ఎలాంటి తుది నిర్ణయాన్ని తమకు తెలుపలేదని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా కూటమి నేతలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. బీజేపీ నాయకత్వం తనతో సంప్రదింపులు జరిపిందని ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకుడొకరు తెలిపారు. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. బీజేపీ తమ అగ్రనేతలందరికీ మునుపటి శాఖలే కేటాయించి.. కొనసాగింపును భూమికగా ఎంచుకున్నందున 17వ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కొనసాగించొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎన్డీఏ వైఖరిని బట్టి స్పీకర్ పోస్టుకు తమ అభ్యరి్థని పోటీకి నిలుపడంపై నిర్ణయం తీసుకుంటామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించడం సంప్రదాయంగా వస్తోందని, బీజేపీకి అందుకు ముందుకు రాకపోతే పోటీచేయక తప్పదని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. కొత్త స్పీకర్‌పై ఏకాభిప్రాయాన్ని నిర్మించడానికి విపక్షాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని, అలా జరపని పక్షంలో తాము స్పీకర్ పదవికి పోటీ పెడతామని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ సోమవారం విలేకరులతో అన్నారు. ఎన్డీఏ అభ్యర్థి ఎవరనేది మాకు తెలిపిన తర్వాత పోటీపై నిర్ణయం తీసుకుంటామని ఇండియా కూటమికి చెందిన నాయకుడొకరు అన్నారు. బలహీనవర్గాలకు చెందిన అభ్యరి్థని పోటీపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమికి 234 మంది ఎంపీల బలముంది. -
Parliament Special Session: సభ్యుల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: లోక్‌సభ తొలిరోజు సమావేశాల్లో ప్రమాణస్వీకార పర్వం కొనసాగింది. సోమవారం ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్యానెల్ స్పీకర్లు రాధా మోహన్ సింగ్, ఫగన్ సింగ్ కులస్తేలు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు రాష్ట్రపతిభవన్‌లో భర్తృహరి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణంచేయించారు. ఆ తర్వాత లోక్‌సభ ప్రారంభం అయిన వెంటనే వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు ప్రొటెం స్పీకర్ మెహతాబ్ ప్రకటించారు. అనంతరం 11:07 గంటలకు ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ఎంపీగా హిందీలో ప్రమాణం చేయడంతో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది. ప్రధాని తర్వాత ప్యానెల్ స్పీకర్లు రాధామోహన్, కులస్తేలు ప్రమాణం చేశారు. తర్వాత మంత్రిమండలి సభ్యులు ఒకరి తర్వాత ఒకరు ప్రమాణం చేశారు. ముందుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితర మంత్రులు ప్రమాణం చేశారు. తర్వాత స్వతంత్ర హోదా ఉన్న సహాయకమంత్రులు తర్వాత సహాయక మంత్రులు ప్రమాణంచేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో ‘నీట్ ఫెయిల్డ్ మినిస్టర్’, నీట్–నెట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. తర్వాత మెహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించినందుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యుడు కె.సురేశ్, డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు, టీఎంసీ సభ్యుడు సుదీప్ బంధోపాధ్యాయ్లు స్పీకర్ప్యానెల్ సభ్యులుగా ప్రమాణంచేయలేదు. ఎనిమిదిసార్లు ఎంపీగా గెలిచిన దళిత నేత సురేశ్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపికచేయనందుకు నిరసన తెలపాలని విపక్షపార్టీలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ ముగ్గురు ప్యానెల్ స్పీకర్ల పదవులకు దూరంగా ఉండిపోయారు. ప్రమాణస్వీకారం మొదలుకాగానే సురేశ్, టీఆర్ బాలు, సుదీప్‌లు సభ నుంచి వాకౌట్‌చేశారు. ప్యానెల్ సభ్యుల ప్రమాణంవేళ ‘ రాజ్యాంగ ఉల్లంఘన’ అని విపక్షసభ్యులు నినాదాలు చేశారు. తర్వాత అక్షరమాల ప్రకారం రాష్ట్రాలవారీగా సభ్యులు ప్రమాణంచేశారు. మిగతా సభ్యులు మంగళవారం ప్రమాణం చేయనున్నారు.పలు భాషల్లో ప్రమాణాలుప్రమాణస్వీకారం వేళ సభలో భాషా వైవిధ్యం కనిపించింది. పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణంచేశారు. ఇంగ్లిష్‌తోపాటు సంస్కృతం, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, మరాఠీ, తదితర భాషల్లో ప్రమాణంచేశారు. అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, ఖట్టర్ హిందీలో ప్రమాణంచేశారు. ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి కన్నడలో, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడియాలో, పోర్ట్‌లు, నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ అస్సామీలో, విద్యుత్, పునరుత్పాదక ఇంధన సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్ సంస్కృతంలో, పర్యాటకం, పెట్రోలియం మంత్రి సురేష్ గోపి మలయాళంలో సభ్యులుగా ప్రమాణంచేశారు. లోక్‌సభ ప్రారంభానికి శుభసూచకంగా సభ్యులంతా తొలుత లేచి నిలబడి కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.తొలి వరుసలో రాహుల్, అఖిలేశ్సభలో విపక్షాలకు కేటాయించిన కుర్చీల్లో మొదటి వరుసలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ, ఎస్పీ నేతలు అఖిలేశ్ యాదవ్, అవధేశ్ ప్రసాద్‌లు కూర్చున్నారు. మాజీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మూడో వరుసలో కూర్చున్నారు. తొలిసారి సభకు ఎన్నికైన దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె భాన్సురీ స్వరాజ్ సభలో అందరినీ పలకరిస్తూ కనిపించారు. సెల్ఫీలు దిగారు. ఎస్పీ సభ్యులు ఎర్రని టోపీలు, ఎర్ర కండువాలు ధరించి హిందీలో ముద్రించిన రాజ్యాంగ ప్రతులను పట్టుకొచ్చారు.సభలో హైలైట్స్→ రైతు నేత, సీపీఐ (ఎం) ఎంపీ ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్‌కు వచ్చారు.→ కొందరు సభ్యులు తమ రాష్ట్ర సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు.→ ‘రేసుగుర్రం’ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ధోతీలో అలరించారు.→ తొలిసారి ఎంపీగా గెలిచిన మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు అనిత నగర్‌సింగ్ చౌహాన్ వేళ్లకు పెద్ద ఉంగరాలు, మెడలో భారీ సంప్రదాయ నగలతో సభకు వచ్చారు. → శ్వేతవర్ణ చీరకట్టులో మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.→ తిహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు. → టీవీ రాముడు అరుణ్ గోవిల్ అందరితో మాట్లాడుతూ కనిపించారు. → మోదీ ప్రమాణం చేసేటపుడు ఎన్డీఏ నేతలంతా జైశ్రీరాం అని నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష సభ్యులంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు. కొందరు సభ్యులు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి వచ్చారు -
రాజ్యాంగం వర్ధిల్లాలి.. ‘ఇండియా’ ఎంపీల నినాదాలు
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ ప్రారంభమైన తొలి రోజే ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం దద్దరిల్లింది. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో గాం«దీజీ విగ్రహం ఉన్నచోట విపక్ష ఎంపీలు గుమికూడారు. రాజ్యాంగం ప్రతులను చేతబూని నినాదాలు చేశారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, మనమంతా కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అంటూ బిగ్గరగా నినదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం జోలికి రావొద్దు: రాహుల్ పవిత్రమైన మన రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నిస్సిగ్గుగా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగం జోలికి రావొద్దని హెచ్చరించారు. ప్రతిపక్ష కూటమి సందేశం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రాజ్యాంగంపై ఎవరు దాడికి దిగినా సహించబోమని తేలి్చచెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఏ శక్తి కూడా రాజ్యాంగాన్ని టచ్ చేయలేదని తేలి్చచెప్పారు. రాజ్యాంగాన్ని కచి్చతంగా కాపాడుకుంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజా సమస్యలను పక్కనపెట్టి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై దాడి చేయడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. ప్రజల గొంతుకను సభలో వినిపిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం నుంచి మోదీ తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో తొలి 15 రోజుల్లో ఎన్నో ఘోరాలు, ప్రమాదాలు జరిగాయని, పరీక్షల్లో పేపర్ లీకేజీలు చోటుచేసుకున్నాయని, ధరలు పెరిగిపోయాయని రాహుల్ గాంధీ విమర్శించారు. -
2029 ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించబోదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ తీర్మానం ప్రవేశపెట్టి ఆయన మాట్లాడారు. ఓటింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు ఈ బిల్లు వర్తించదు. 2024 ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, డీ లిమిటేషన్ చేపడతాం. ఆ తర్వాతే మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తిస్తుంది అని వ్యాఖ్యానించారాయన. ఇక బిల్లుపై చర్చ సందర్భంగా 60 మంది ఎంపీలు మాట్లాడారని.. ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారని మంత్రి అర్జున్ రామ్ తెలిపారు.మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా ఈ అభివృద్ధి యాత్ర అసంపూర్ణమని సుష్మా స్వరాజ్ చెప్పిన మాటల్ని ఈ సందర్భంలో మంత్రి లోక్‌సభలో ప్రస్తావించారు. బిల్లుపై లొల్లి ఇదిలా ఉంటే.. అంతకు ముందు బిల్లుపై హోం మంత్రి అమిత్ షా సైతం ఇదే సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని.. ఎన్నికల తర్వాత జనాభా లెక్కుల, డీ లిమిటేషన్ ప్రక్రియ చేపడతామని తెలిపారు. 2029 ఎన్నికల సమయంలోనే రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేశారాయన. ఆ సమయంలో.. బిల్లు అసంపూర్తిగా ఉందంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అమిత్ షా మాట్లాడుతుండగానే.. రాహుల్ గాంధీ లేచి వెళ్లిపోగా.. ఓటింగ్ కంటే ముందు కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. #WATCH | "Some people on social media are saying that this bill should not be supported as there is no reservation of OBC, Muslims. If you don’t support this bill, will reservation happen sooner? If you support this bill, then will at least be guarantee..." Union Home Minister… pic.twitter.com/q5CSeWaZI1 — ANI (@ANI) September 20, 2023 ఓబీసీ, ముస్లింల రిజర్వేషన్లు లేనందున ఈ బిల్లుకు మద్దతివ్వకూడదని కొందరు సోషల్ మీడియాలో చెబుతున్నారు. మీరు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే, రిజర్వేషన్లు త్వరగా జరుగుతాయా? మీరు ఈ బిల్లుకు మద్దతు ఇస్తే, కనీసం హామీ అయినా ఉంటుంది అని అమిత్ షా విపక్షాలను ఉద్దేశించి పేర్కొన్నారు.అయినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు తొలిరోజు ముగిశాక కేంద్ర కేబినెట్ సమావేశమై పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేబినెట్ చారిత్రాత్మక ప్రకటన చేసింది. చట్టసభల్లో రిజర్వేషన్.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడో వంతు సీట్లు మహిళా అభ్యర్థులకు కేటాయించబడతాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ రిజర్వ్డ్ సీట్లలో మార్పులు చేయాలని కేబినెట్ ప్రతిపాదించింది. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు సబ్-రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం, లోక్‌సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉండగా, అందులో 78 మంది మహిళా సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 224 మంది సభ్యులు ఉండగా, అందులో 24 మంది మహిళా సభ్యులు. ఈసారి అంతా సానుకూలమే.. మహిళా రిజర్వేషన్ బిల్లు మూడు దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకో లేదు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో పలుమార్లు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయి మెజార్టీ మద్దతు లభించకపోవడంతో బిల్లు వీగిపోయేది. అన్ని పార్టీలు ఈ బిల్లుపై సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అంతా సజావుగా సాగితే ఈ సమావేశాల్లోనే బిల్లుకు మోక్షం కలిగే అవకాశం ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటనుంచి ఇప్పటివరకూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడ్డ మహిళలు ఎన్నికల్లో గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టిన మహిళలు ఇప్పటిది కాదు.. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొట్టమొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో కూడా బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభలో ఆమోదం పొందలేదు. 2010లో ఎట్టకేలకు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ లోక్‌సభలో మాత్రం ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో మోదీ సారథ్యంలోని కేబినెట్ బిల్లుపై నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఇంకే నిర్ణయాలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది. ప్రధానికి మాత్రమే సాధ్యం.. కేబినెట్ సమావేశం ముగిశాక మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్పందిస్తూ మహిళా రిజర్వేషన్ డిమాండ్‌ను నెరవేర్చే ధైర్యం ఒక్క మోదీ ప్రభుత్వానికే ఉందన్నారు. కేబినెట్ ఆమోదంతో ఇది మరోసారి రుజువైందన్నారు. ఈ సందర్భంగా ఈ బిల్లును ఆమోదించిన మోదీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. The Women's Reservation Bill is the brainchild of the Indian National Congress and UPA. We gave 50% reservation to women in local bodies. If they (Centre) have any sincerity in their mind, they should pass the Women's Reservation Bill in this session. : Shri @kcvenugopalmp,… pic.twitter.com/J3jTvEjEjo — Congress (@INCIndia) September 18, 2023 #WATCH | On Women’s Reservation Bill, BRS MLC K Kavitha says, "Happy we get to hear we are hearing from the sources that Cabinet has cleared the introduction of Women's Reservation Bill in the Parliament. And I hope the bill will be introduced very soon. The only, objection or… pic.twitter.com/fN2dGZbj3S — ANI (@ANI) September 19, 2023 ఇది కూడా చదవండి: ఆదిత్య ఎల్1.. అసలు కథ షురూ -
కొత్త భవనంలో సమావేశాలు: లోక్‌సభ స్పీకర్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ పాత భవనం శకం ముగిసింది. నేటి నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి రోజు సమావేశాలు జరగ్గా.. ముగించే ముందర ఆయన ఈ విషయం సభ్యులకు తెలియజేశారు. సభని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా.. మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నడుస్తాయని తెలిపారు. ముందుగా నేటి ఉదయం 9.30గం. ప్రాంతంలో ఫొటో సెషన్ నిర్వహిస్తారు. ఆపై సెంట్రల్ హాల్లో ఎంపీలు సమావేశం అవుతారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రధాని మోదీ.. ఎంపీలతో పాటు ఎంట్రీ ఇస్తారు. ఈ సందర్భంగా ఎంపీలందరికీ గిఫ్ట్ బ్యాగ్ ఇవ్వనున్నారు. ఆ గిఫ్ట్ బ్యాగ్‌లో రాజ్యాంగం బుక్, పార్లమెంట్ పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంప్ ఉండనున్నట్లు సమాచారం. ఆపై మధ్యాహ్నాం 1.15 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభం కానుంది. మరోవైపు రాజ్యభస 2.15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. Special Session of Parliament | Lok Sabha adjourned to meet at 1:15 pm in the new Parliament building tomorrow. — ANI (@ANI) September 18, 2023 క్లిక్ చేయండి: ప్రజాస్వామ్య సౌధం.. 96 ఏళ్ల సేవలు.. ఇక సెలవు -
Parliament Special Sessions:సమావేశాలకు ముందు ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ప్రారంభానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భాంగా ప్రధాని చంద్రయాన్-3, జీ20 సదస్సు విజయాలను ప్రస్తుతిస్తూ భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి నిరూపించమని అన్నారు. ఎంతో సాధించాం.. ఐదు రోజుల పాటు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజు సెషన్ ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా భారత దేశం సాధించిన అనేక విజయాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశం ఇప్పుడు అన్ని అంశాల్లో దూసుకెళ్తోంది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. జీ20 సమావేశాలను అత్యంత విజయవంతంగా నిర్వహించుకున్నాం. భారత దేశం సత్తా ఏంటో ప్రపంచానికి నిరూపించాం. సకల వసతులతో యశోభూమిని నిర్మించుకున్నామని ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయని అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi says "...India will always be proud that we became the voice of the Global South during the G20 Summit and that the African Union became a permanent member of the G20. All this is a signal of India's bright future. 'YashoBhoomi' an… pic.twitter.com/UXhtqEZ0GJ — ANI (@ANI) September 18, 2023 ప్రత్యేకమైన సెషన్లు.. ఈ పార్లమెంటు సమావేశాలకు సమయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ సమయానుకూలంగా చూస్తే అది చాలా పెద్దదనే చెప్పాలి. ఇక ఈ సెషన్ గురించి చెప్పాలంటే ఇది చారిత్రక నిర్ణయాలకు వేదిక కానున్న సెషన్. ఈ సెషన్ ప్రత్యేకత ఏమిటంటే. 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానం కొత్త గమ్యం నుంచి మొదలవుతోంది. ఇప్పుడు సరికొత్త ప్రదేశం నుంచి మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. భారత దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుబోయే నిర్ణయాలన్నీ కొత్త పార్లమెంటు భవనంలోనే నిర్ణయించబడతాయని అన్నారు. #WATCH | PM Narendra Modi says, "...This session of the Parliament is short but going by the time, it is huge. This is a session of historic decisions. A speciality of this session is that the journey of 75 years is starting from a new destination...Now, while taking forward the… pic.twitter.com/suOuM2pnyH — ANI (@ANI) September 18, 2023 మాపై ఏడవచ్చు.. ఇది సెషన్‌కు తక్కువ సమయం ఉన్నందున సెషన్ ఉత్సాహంగానూ ఫలప్రదంగానూ కొనసాగడానికి అనుకూల వాతావరణాన్ని కలిగించాలని వారి ఎంపీలు గరిష్ట సమయాన్ని దేనికి కేటాయించాలని కోరుతున్నానన్నారు. (రోనే ధోనే కే లియే బహుత్ సమయ హోతా హై, కర్తే రహియే) మాపై ఏడవటానికి, మమ్మల్ని ప్రశ్నించడానికి చాల సమయం ఉంటుంది మీరు ఆ పనే చేయండని అన్నారు. జీవితంలో కొన్ని క్షణాలు మనలో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని నింపుతాయి. నేను ఈ చిన్న సెషన్‌నలో అలాంటి సందర్భాలను ఆశిస్తున్నాను అన్నారు. #WATCH | Special Session of Parliament | PM Narendra Modi says, "This is a short session. Their (MPs) maximum time should be devoted (to the Session) in an environment of enthusiasm and excitement. Rone dhone ke liye bahut samay hota hai, karte rahiye. There are a few moments in… pic.twitter.com/eLEy9GOmV4 — ANI (@ANI) September 18, 2023 రేపే కొత్త భవనంలోకి.. రేపు వినాయక చవితి సందర్బంగా మనం కొత్త పార్లమెంటుకు వెళ్ళబోతున్నాము. గణేశుడిని 'విఘ్నహర్త' అని కూడా అంటారు అంటే విఘ్నాలను హరించే వాడని అర్ధం.. ఇప్పుడు దేశాభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని.. ఎటువంటి విఘ్నాలు లేకుండా భారతదేశం స్వప్నాలన్నిటినీ సాకారం చేసుకుంటుందని (నిర్విఘ్న రూప్ సే సారే సప్నే సారే సంకల్ప్ భారత్ పరిపూర్ణ్ కరేగా) ఈ పార్లమెంట్ సమావేశాలకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ చారిత్రాత్మకంగా నిలవనున్నాయని అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi says "Tomorrow, on Ganesh Chaturthi, we will move to the new Parliament. Lord Ganesha is also known as ‘Vighnaharta’, now there will be no obstacles in the development of the country... 'Nirvighna roop se saare sapne saare sankalp Bharat… pic.twitter.com/P2DZmG3SRF — ANI (@ANI) September 18, 2023 అంతటా ఆసక్తి.. తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలోనే జరగనుండగా రెండో రోజునుంచి మాత్రం ప్రత్యేక సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగబోయే ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ఏవైనా అనూహ్య నిర్ణయాలను తీసుకోనుందా అన్న అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా.. -
Special Parliament Session: ఎంపీలకు బీజేపీ విప్ జారీ
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఈ నెల 18-22 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. తప్పనిసరిగా అందరూ హాజరై ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలపాలని తెలిపింది. ఈ పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో ప్రభుత్వం ప్రధానంగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులను ఆమోదం తెలిపేందుకు అందరు ఎంపీలు రావాలని విప్ జారీ చేసింది. BJP issues a line whip to all party MPs of Lok Sabha to be present in the house from 18th to 22nd September to discuss very important legislative business and support the government's stand. pic.twitter.com/lgtB98KrWb — ANI (@ANI) September 14, 2023 పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో భాగంగా ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇందులో మొదటి రోజు గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ ప్రయాణంపై చర్చించనున్నారు. అనంతరం రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల -
సోనియా లేఖకు బదులిచ్చిన కేంద్రం.. ఏం చెప్పిందంటే!
న్యూఢిల్లీ: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండా ఏమిటో తెలపాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖకు స్పందిస్తూ వ్యంగ్యంగా బదులిచ్చారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. అజెండా లేకుండా సమావేశాలా? సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సెషన్లు నిర్వహిస్తున్నట్లు కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే విషయమై ప్రతిపక్షాలతో చర్చించకుండానే పిలుపునిచ్చారని కనీసం అజెండా ఏమిటో తెలపమని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు సోనియా గాంధీ. అయినప్పటికీ ఈ సమావేశాలకు హాజరు కావడానికి తాము సుముఖంగానే ఉన్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రజాసమస్యలు చాలానే ఉన్నాయని చెబుతూ తొమ్మిది అంశాలను లేఖలో ప్రస్తావించారు. వాటిలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, మణిపూర్‌లో పరిస్థితి, మతతత్వం, చైనా సరిహద్దు అంశంతోపాటు మరికొన్ని అంశాలున్నాయి. Here is the letter from CPP Chairperson Smt. Sonia Gandhi ji to PM Modi, addressing the issues that the party wishes to discuss in the upcoming special parliamentary session. pic.twitter.com/gFZnO9eISb — Congress (@INCIndia) September 6, 2023 ఆ సంప్రదాయం లేదు.. సోనియా గాంధీ లేఖకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ మీకు ఇక్కడి సంప్రదాయాలు ఇంకా అలవాటైనట్టు లేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఎన్నడూ పార్టీల అభిప్రాయాలను అడిగిడం కానీ వారితో చర్చలు జరిపింది కానీ లేదని అన్నారు. రాష్ట్రపతి సందేశంతో పార్లమెంట్ సెషన్లు ప్రారంభమవుతాయి. అన్ని పార్టల నాయకులు సమేవేశమయ్యాక అప్పుడు ప్రజా సమస్యలపైనా ఇతర అంశాలపైనా చర్చలు కొనసాగిస్తుంటామని రాస్తూ బదులిచ్చారు. यह बेहद दुर्भाग्यपूर्ण है कि एक वरिष्ठ सांसद होने के बाद भी कांग्रेस की पूर्व अध्यक्षा श्रीमती गांधी संसद के आगामी सत्र को लेकर अनावश्यक विवाद पैदा करने की कोशिश कर रही हैं। संसद का सत्र बुलाना भारत सरकार का संवैधानिक अधिकार है। मैं आशा करता हूं कि सभी पार्टियां संसद की गरिमा… pic.twitter.com/STTOYtxIsO — Pralhad Joshi (@JoshiPralhad) September 6, 2023 ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి -
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం సమావేశమయ్యారు. 10, జన్‌పథ్‌లోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, అధిర్ రంజాన్ చౌదరి ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నటు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని ప్రతిపక్షాలు అమ్ములపొదిలో అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశాల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటన్నది ప్రకటించలేదు కానీ అసెంబ్లీ, పార్లమెంటుకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశమే ప్రధానాంశంగా సమావేశాలు జరుగుతాయని మాత్రం తెలుస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసేందుకు కేంద్రం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా వేసింది కేంద్రం. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎన్‌కె సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారిలు ఉండగా ప్రతిపక్ష నేత అధిర్ రంజాన్ చౌదరి ఈ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రం జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేసి హుటాహుటిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సిద్ధపాటుగా ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల గురించి చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇండియా కూటమి ఎంపీలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: 'భారత్' అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరం: ప్రధాని మోదీ -
ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలి
జైపూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు జనాభాగణన పూర్తిచేయకుండా 'ఒకే దేశం ఒకే ఎన్నికలకు పిలుపునివ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమే అన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఇక రాజస్థాన్‌లో అయితే ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారని బీజేపీ ఎవరితో పెట్టుకుంటున్నారన్న విషయం వారికి తెలియాలని అన్నారు. అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగం చిన్నాభిన్నమైందని నేను ఎప్పటి నుంచో చెబుతునే ఉన్నాను. ఈరోజు దేశంలో జరిగేవన్నీ చూస్తుంటే దేశం ఎటువైపు వెళ్తుందో కూడా చెప్పడం కష్టమేనని.. ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్రం ప్రతిపక్షాల అభిప్రాయం కూడా అడిగి ఉంటే బాగుండేదని కానీ వారు ఎవరి అభిప్రాయాన్ని అడగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇక మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తావన తీసుకొస్తూ అసలు ఇలాంటి కమిటీలో మాజీ రాష్ట్రపతి భాగస్వామి కావడం నేనింత వరకు ఎప్పుడు వినలేదు, చూడలేదని అన్నారు. ఇందులోకి అనవసరంగా ఆయనను లాగుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చే హక్కు ఉంది కానీ ప్రజలకు కారణం చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇక రాజస్థాన్ ప్రజలైతే మళ్లీ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చేశారని అసలు వారు ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలని ఘాటుగా స్పందించారు. ఇది కూడా చదవండి: ఆర్టికల్ 370 రద్దుపై విచారణ.. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం -
ప్రజలకు మంచి చేయడానికి ముందుకు రారు: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కోసం కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎగిరి గంతేయాల్సింది పోయి ప్రతిపక్షాలన్నీ అనవసర విమర్శలు చేస్తున్నాయని.. ఒకేసారి అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే బోలెడంత డబ్బును, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు కదా అని సమాచార, ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఎప్పటినుంచో ఒకే దేశం ఒకే ఎన్నికలు గురించి చెబుతూనే ఉంది. మా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దీన్ని ఆమోదించారు. ఇదే క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒకకమిటీని కూడా వేశాము. ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణన తీసుకోవాలన్న ఉదేశ్యంతో కమిటీలో వారికి కూడా స్థానం కల్పించాం. కానీ అధిర్ రంజాన్ చౌదరి ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై చర్చ ఉంటుంది. దీనికి కమిటీ సభ్యులు కూడా హాజరవుతారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విషయంలో మాట్లాడటానికి వారు ఎప్పుడూ ముందుకు రారు. విలువైన పార్లమెంట్ సమీవేశాల సమయాన్ని వృధా చేయడమే వారికున్న ఏకైక లక్ష్యం. మీరే చూశారు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వారు సమయాన్ని ఎలా వృధా చేశారో. అంతెందుకు గతంలో ఒకే దేశం.. ఒకే పన్ను విధానాన్ని తెరపైకి తీసుకొస్తూ జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా వారు ఇదే విధంగా గొడవ చేశారు. కానీ ఈరోజు ఒకే పన్ను విధానం వలన రూ.90,000 వచ్చే చోట రూ.1,60,000 ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని అన్నారు. అదే విధంగా ఒకే దేశంలో ఒకే ఎన్నికల నిర్వహిస్తే మరింత డబ్బు ఆదా చేయవచ్చని.. బోలెడంత సమయం కలిసొస్తుందని అన్నారు. ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి వినియోగించవచ్చని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయకుండా సమాలోచన చేయాలని కోరుతున్నానన్నారు. ఇది కూడా చదవండి: చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా -
'ఇండియా' కూటమి తర్వాతి ప్రణాళిక అదుర్స్!!
పాట్నా: ముంబైలో ముచ్చటగా మూడో సారి సమావేశమైన ఇండియా విపక్ష కూటమి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై జమిలి ఎన్నికల కమిటీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇదే క్రమంలో ఇండియా తదుపరి కార్యాచరణ గురించి కీలకమైన సమాచారమిచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దానికోసం యావత్ భారత్ దేశం పండుగలా జరుపుకునే గాంధీ జయంతిని వేదికగా చేసుకున్నట్లు తెలిపారు. ఇండియా కూటమి తర్వాతి కార్యాచరణ గురించి కీలక సమాచారమిచ్చారు బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. ముంబైలో ఇండియా కూటమి సమావేశం ముగించుకుని పాట్నా చేరుకున్న ఆయన మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ జన్మదినోత్సవాల్లో పాల్గొని వచ్చేనెల ఇండియా కూటమి గాంధీ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఇదే నెలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల కోసం పిలుపునిచ్చిన ప్రభుత్వం వాటి ఎజెండా ఏమిటో చెప్పకపోవడంపై కూడా అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక జమిలి ఎన్నికల పేరుతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని మేమంతా ఏకకంఠంతో వ్యతిరేకించడంతో షాక్‌కు గురయ్యారన్నారు. కేంద్రం ఎప్పుడో నిర్వహిస్తామని చెప్పిన కులగణన గురించి ఇప్పటికీ నోరువిప్పకపోవడం చాల ఆశ్చర్యకరంగా ఉందని వారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలోపే మేము మా రాష్ట్రంలో కులగణన తోపాటు జనాభా గణన కూడా పూర్తి చేశామని అన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చేందుకే బహుశా వారు ఈ సమావేశాలకు పిలుపునిచ్చారనిపిస్తోందని మేము కూడా ఇదే సమావేశాల్లో జనాభాగణన గురించి కేంద్రాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ టికెట్టు కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ -
సెప్టెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
నెల్లూరు : ప్రత్యేక హోదా అంశం ఇంకా కేంద్ర పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరులో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.... ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పరిశ్రమలకు రాయతీ తదితర అంశాలపై నీతి ఆయోగ్ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను వెల్లడిస్తామన్నారు. -
టీ పెడతారా?
-
టీ పెడతారా?
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణపై సందేహాలు గడువు తక్కువ ఉండటంపై సర్వత్రా ఉత్కంఠ మరోవైపు ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికలు జనవరి ఆఖరు నుంచి పక్షం రోజులే అతి కీలకం అసెంబ్లీలో చర్చ జనవరి 23 దాకా జరిగే అవకాశం ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి మూడో వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విభజన అంశం చివర్లో ఏ మలుపులు తిరిగేనో? సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు భవిష్యత్తు ఏమిటన్నది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న చర్చ ఊపందుకుంది. ఫిబ్రవరిలో జరిగే పార్ల మెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదముద్ర పడుతుందా? లేక చివరి అంకంలో మరేదైనా జరుగు తుందా? రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? ఇలాంటి అనేక కీలకాంశాలపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లోగా విభజన బిల్లు ఆమోదం పొందదని కొందరు, ఆలోగానే అంతా పూర్తవుతుందని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. గడువు తక్కువ ఉన్నందున చివరి దశలో ఏదైనా జరగొచ్చన్న అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది. డిసెంబర్ 20తో నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంట్ సమావేశాలు తిరిగి ఎప్పుడు జరుగుతాయన్నది తేలితే విభజన బిల్లు భవిష్యత్తుపై కొంత స్పష్టత వచ్చే అవకాశముంది. జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం దాకా పక్షం రోజులు విభజన బిల్లుకు అత్యంత కీలకంగా మారాయి. ఏదేమైనా విభజన బిల్లు కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమని హస్తిన రాజకీయ వర్గాల్లో విన్పిస్తోంది. బిల్లు కోసం అవసరమైతే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తామని గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి సాధ్యం కాదంటున్నారు. విభజన బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని తాజాగా కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. విభజన బిల్లుపై 40 రోజుల్లోగా ఉభయ సభల అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా దాన్ని రాష్ట్రానికి పంపిన సందర్భంగా రాష్ట్రపతి సూచించడం తెలిసిందే. ఆ గడువును పూర్తిగా వినియోగించుకునేలా అసెంబ్లీ మలి విడత షెడ్యూల్‌ను జనవరి 3 నుంచి 23వ తేదీ దాకా ప్రకటించారు. బిల్లుపై ఉభయ సభల్లో చర్చ పూర్తయ్యాక సభ్యుల అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి మూడు రోజుల్లోగా తిప్పి పంపాలని రాష్ట్రపతి నిర్దేశించారు. అభిప్రాయాలన్నింటినీ ఆంగ్లంలోకి తర్జుమా చేసి 50 ప్రతులను రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. 279 మంది ఎమ్మెల్యేలు (15 ఖాళీలున్నాయి), ఎమ్మెల్సీల్లో 75 మంది (15 ఖాళీలున్నాయి) మాట్లాడే పక్షంలో మొత్తం 354 మంది సభ్యుల అభిప్రాయాలనూ మూడు రోజుల్లోగా ఆంగ్లంలోకి తర్జుమా చేయించాల్సి నివేదికను రాష్ట్రపతికి పంపాలి. దాని అధ్యయనానికి రాష్ట్రపతి ఎంత గడువు తీసుకుంటారన్నది కూడా కీలకంగా మారింది. ఉభయ సభలు జనవరి 23 వరకూ కొనసాగితే ఆ తర్వాత మూడు రోజుల్లోగా, అంటే 26 నాటికి గానీ, ఆ రోజు గణతంత్ర దినంతో పాటు ఆదివారం కూడా గనుక దాన్ని పరిగణనలోకి తీసుకుంటే 27న గానీ రాష్ట్రపతికి నివేదిక పంపాలి. కానీ బీఏసీ నిర్దేశించిన ఎజెండా మేరకు సభ జరగడం చాలా అరుదు. కేంద్రం నుంచి ఆదేశాలేమైనా వస్తే జనవరి 23 దాకా ఆగకుండా ముందుగానే సభ్యుల అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్రపతికి పంపించే అవకాశాలూ లేకపోలేదు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యమన్నది చూడాల్సిందే. చివరి అంకంలో చిక్కుముడులు ఉభయ సభల అభిప్రాయాలతో గడువులోగా రాష్ట్రపతికి బిల్లును తిప్పి పంపినా అక్కడి నుంచి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే దాకా ఉన్న దశ కూడా అత్యంత కీలకమే. బిల్లుపై రాష్ట్రపతి ముందుగా కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి పంపాలి. అందుకాయన ఎంత గడువు తీసుకుంటారో తెలియదు. ఒకవేళ ఒక్క రోజులోనే పంపుతారని భావించినా.. అసెంబ్లీ, మండలిల్లో సభ్యులు చేసిన సూచనలు, లేవనెత్తిన రాజ్యాంగపరమైన సందేహాలు, సీమాంధ్రకు సంబంధించి సమస్యల వంటి అంశాలన్నింటినీ కేంద్ర మంత్రివర్గం పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సూచనలు, సిఫార్సులతో ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం ముందుకు హోం శాఖ తీసుకెళ్తుందని అధికాారవర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, వాటికి పరిష్కార మార్గాలను కూడా చూపి, ఆమోదించినప్పుడే ముసాయిదా బిల్లుగా రూపాంతరం చెందుతుంది. ఆ లెక్కన జనవరి చివరి వారంలో ముసాయిదా కేంద్ర మంత్రివర్గం ముందుకు చర్చకొస్తుంది. వ్యక్తమయ్యే అభ్యంతరాలు, సలహాలు, సూచనలు, సమస్యల వంటివాటికి స్పష్టమైన హామీలతో కూడిన పరిష్కారాలు చూపుతూ బిల్లులో సవరణలు చేయాలని పార్లమెంట్లో పార్టీలు పట్టుబట్టే అవకాశముంటుంది గనుక ఆ కసరత్తును కేంద్రం ముందే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా ప్రస్తుత ముసాయిదాలో అవసరమైన సవరణలతో బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించాక దాన్ని మళ్లీ రాష్ట్రపతికి నివేదించాలి. దాన్నాయన పరిశీలించి, ఆమోదముద్ర వేశాక ఆయన సూచనల మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఇంత ప్రక్రియ పూర్తవడానికి ఉన్న కొద్ది సమయం సరిపోతుందా? బిల్లు అంతే వేగంగా కదులుతుందా? పరిస్థితులెలా ఉంటాయి? ఇలాంటి సందే హాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికలు మరోవైపు లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. 2009 సార్వత్రిక ఎన్నికలకు ఆ ఏడాది మార్చి 2వ తేదీనే షెడ్యూలు విడుదలైంది. 2014 మార్చి మూడో వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ కూడా డిసెంబర్ 14న అమెరికా పర్యటన సందర్భంగా ప్రకటించారు. ఆ ఎన్నికల సన్నద్ధతపై ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో సమావేశాలు కూడా పూర్తి చేశారు. ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం మే 31తో ముగుస్తున్నందున, ఆలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉన్నందున అన్ని చర్యలు తీసుకున్నట్టు కూడా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విభజన బిల్లు చివరి అంకంలో ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది అంచనాలకు అందడం లేదు. ఫిబ్రవరిలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ దఫా కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి వీలులేదు. ఓట్ ఆన్ అకౌంట్‌ను మాత్రమే పార్లమెంట్లో ఆమోదించాలి. అది ఫిబ్రవరిలో జరిగే అవకాశముంది. 2009లోనూ అదే సమయంలో ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టడం తెలిసిందే. ఫిబ్రవరి 12 నుంచి 26 వరకు సెలవులు పోను పది రోజులు మాత్రమే అప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 13న రైల్వే, 16న సాధారణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లను పార్లమెంటు ఆమోదించింది. ఈసారి కూడా ఓట్ ఆన్ అకౌంట్‌ను ఆమోదించుకోవడానికి ఫిబ్రవరిలోనే పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి. అవి ఫిబ్రవరి 3 నుంచి జరగవచ్చని చెబుతున్నారు. అందుకు ఫిబ్రవరి 3, 5, లేదా 10వ తేదీలను పరిశీలిస్తున్నట్టు కేంద్రంలోని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అసెంబ్లీ అభిప్రాయ సేకరణ పూర్తయ్యాక నివేదిక రాష్ట్రపతికి చేరడానికి జనవరి 26 వరకు గడువుండటం తెలిసిందే. అక్కడి నుంచి ఫిబ్రవరి మరో ఐదు రోజులే ఉంటుంది. ఇక ఫిబ్రవరిలో విధిగా పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో విభజన బిల్లు కోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలంటూ ఏవీ నిర్వహించే అవకాశాల్లేవు. ఈ సమావేశాల్లోనైతే మద్దతు మరోవైపు జాతీయ స్థాయిలో శరవేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, మారుతున్న రాజకీయాల నేపథ్యంలో పార్లమెంటులో విభజన బిల్లు సాధారణ మెజారిటీతో గట్టెక్కడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కీలకంగా మారింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విభజన బిల్లు పెడితే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని బీజేపీ జాతీయ నాయకత్వం ఒకటికి రెండుసార్లు స్పష్టం చేసింది. అయితే, ‘ప్రస్తుత శీతాకాల సమావేశాలు’ అని వారు నొక్కి చెప్పడంలోని ఆంతర్యం ఏమిటన్న దానిపై కూడా చర్చ సాగుతోంది. తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడ్డామని స్పష్టంగా ప్రకటించి కూడా ఇలా శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేయడం రకరకాల విశ్లేషణలకు తావిస్తోంది. బీజేపీ ఎంతగా నొక్కి చెప్పినా శీతాకాల సమావేశాల్లో బిల్లు పార్లమెంట్ ముందుకు దేవుడెరుగు, ఇంకా అసెంబ్లీ నుంచి రాష్ట్రపతి భవన్‌కే చేరలేదు. తాజాగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఊపుమీదున్న బీజేపీ, శరవేగంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిల్లుపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నది కూడా చర్చనీయంగానే ఉంది. వారు చెప్పినట్టు శీతాకాల సమావేశాల్లో బిల్లు పార్లమెంటుకు రాలేదు. ఫిబ్రవరిలో సమావేశాల్లో బిల్లు పెడితే ఏం చేస్తామన్న అంశంపై మాత్రం బీజేపీ నేతలెవరు ఇంతవరకూ మాట్లాడకపోవడం గమనార్హం. మరోవైపు బిల్లుకు ఆమోదముద్ర పడటానికి పార్లమెంట్లో సాధారణ మెజారిటీ సరిపోతుందన్నది నిజమే అయినా ఈ విషయంలో లోక్‌సభలో ఉన్నంత సానుకూల పరిస్థితులు కాంగ్రెస్‌కు రాజ్యసభలో లేవన్నది కూడా అందరికీ తెలిసిందే. ఇలా ఎటు చూసినా సంక్లిష్టతలే కన్పిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన బిల్లు చివరి అంకంలో ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది అందరిలోనూ ఉత్కంఠ కలిగిస్తోంది.