జైపూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు జనాభాగణన పూర్తిచేయకుండా 'ఒకే దేశం ఒకే ఎన్నికలకు పిలుపునివ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమే అన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఇక రాజస్థాన్‌లో అయితే ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారని బీజేపీ ఎవరితో పెట్టుకుంటున్నారన్న విషయం వారికి తెలియాలని అన్నారు.
అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగం చిన్నాభిన్నమైందని నేను ఎప్పటి నుంచో చెబుతునే ఉన్నాను. ఈరోజు దేశంలో జరిగేవన్నీ చూస్తుంటే దేశం ఎటువైపు వెళ్తుందో కూడా చెప్పడం కష్టమేనని.. ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్రం ప్రతిపక్షాల అభిప్రాయం కూడా అడిగి ఉంటే బాగుండేదని కానీ వారు ఎవరి అభిప్రాయాన్ని అడగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
ఇక మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తావన తీసుకొస్తూ అసలు ఇలాంటి కమిటీలో మాజీ రాష్ట్రపతి భాగస్వామి కావడం నేనింత వరకు ఎప్పుడు వినలేదు, చూడలేదని అన్నారు. ఇందులోకి అనవసరంగా ఆయనను లాగుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చే హక్కు ఉంది కానీ ప్రజలకు కారణం చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇక రాజస్థాన్ ప్రజలైతే మళ్లీ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చేశారని అసలు వారు ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలని ఘాటుగా స్పందించారు.
ఇది కూడా చదవండి: ఆర్టికల్ 370 రద్దుపై విచారణ.. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం
Comments
Please login to add a commentAdd a comment