ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఈ నెల 18-22 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. తప్పనిసరిగా అందరూ హాజరై ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలపాలని తెలిపింది. ఈ పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌లో ప్రభుత్వం ప్రధానంగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులను ఆమోదం తెలిపేందుకు అందరు ఎంపీలు రావాలని విప్ జారీ చేసింది.
BJP issues a line whip to all party MPs of Lok Sabha to be present in the house from 18th to 22nd September to discuss very important legislative business and support the government's stand. pic.twitter.com/lgtB98KrWb
— ANI (@ANI) September 14, 2023
పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌లో భాగంగా ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇందులో మొదటి రోజు గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ ప్రయాణంపై చర్చించనున్నారు. అనంతరం రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల
Comments
Please login to add a commentAdd a comment