న్యూఢిల్లీ: రాహుల్‌ను లోక్‌సభలో విపక్షనేతగా గుర్తిస్తున్నట్లు నూతన స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్షాలకు ‘విపక్షనేత’ హోదా దక్కడం విశేషం. ఈ మేరకు జూన్ 9వ తేదీ నుంచే రాహుల్‌ను విపక్షనేతగా పరిగణిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. పార్లమెంట్‌చట్టం1977లోని రెండో సెక్షన్ ప్రకారం రాహుల్‌ను విపక్షనేతగా ప్రకటించింది.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. పార్టీ చీఫ్ ఖర్గే, పార్టీ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడిగా ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్‌లో వినిపిద్దామని పిలుపునిచ్చారు. 16వ, 17వ లోక్‌సభలో విపక్షపార్టీలకు కనీసం 10 శాతం సభ్యులబలం లేనికారణంగా ఏ పారీ్టకీ విపక్షహోదా దక్కలేదు. విపక్షనేతగా ఎన్నికవడం ద్వారా రాహుల్ తన పాతికేళ్ల రాజకీయజీవితంలో తొలిసారిగా రాజ్యాంగబద్ద పదవిని స్వీకరించారు.
కేబినెట్ మంత్రి హోదాతో సమానమైన విపక్షనేత హోదాలో రాహుల్‌కు ఒక ప్రైవేట్ కార్యదర్శి, ఇద్దరు అదనపు ప్రైవేట్ కార్యదర్శులు, ఇద్దరు వ్యక్తిగత సహాయకులు, ఇక హిందీ స్టెనో, ఒక క్లర్క్, ఒక శానిటేషన్ వర్కర్, నలుగురు ప్యూన్లను కేంద్రం సమకూరుస్తుంది. 1954చట్టం 8వ సెక్షన్, 1977 చట్టాల ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తుంది. లోక్‌పాల్, సీఈసీ, ఈసీ, సీబీఐ డైరెక్టర్, సీవీసీ, సీఐసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీల నియామక ప్యానెళ్లలో ఇకపై రాహుల్ సభ్యునిగా ఉండనున్నారు.రాహుల్ తొలిసారిగా 2004లో అమేథీలో విజయంతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment