Leader of Opposition
-
జగన్‌కు ప్రతిపక్ష నేత హోదాపై కౌంటర్లు వేయండి
సాక్షి, అమరావతి : శాసన సభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ శాసన సభాపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటర్లు దాఖలు చేసేందుకు శాసన సభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు మరింత గడువునిచ్చింది. గతంలో కౌంటర్ల దాఖలుకు మూడు వారాల గడువునిచ్చిన హైకోర్టు, ఇప్పుడు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట ప్రకారం శాసన సభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా శాసన సభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శానస సభాపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. శాసన సభ, స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి, కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు మరింత సమయం ఇవ్వాలని శాసన సభ కార్యదర్శి తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు కోరారు. స్పీకర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉందని, ఆ వివరాలను కూడా కౌంటర్లో పొందుపరుస్తామని చెప్పారు. దీనికి జగన్ తరపు న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. హైకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసిందని చెప్పారు.చిరునామా సరిగా లేదంటూ స్పీకర్ కార్యదర్శి నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారని తెలిపారు. పోస్టుమేన్ స్పీకర్ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లగలిగినప్పుడు చిరునామా సరిగా లేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. న్యాయ శాఖ కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ.. ఈ వ్యాజ్యంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారని, అది అనవసరమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కౌంటర్ల దాఖలుకు అసెంబ్లీ, స్పీకర్ కార్యదర్శులకు మరో నాలుగు వారాల గడువునిస్తూ విచారణను ఆ మేరకు వాయిదా వేశారు. -
Parliament Special Session: విపక్షనేతగా రాహుల్: స్పీకర్
న్యూఢిల్లీ: రాహుల్‌ను లోక్‌సభలో విపక్షనేతగా గుర్తిస్తున్నట్లు నూతన స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్షాలకు ‘విపక్షనేత’ హోదా దక్కడం విశేషం. ఈ మేరకు జూన్ 9వ తేదీ నుంచే రాహుల్‌ను విపక్షనేతగా పరిగణిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. పార్లమెంట్చట్టం1977లోని రెండో సెక్షన్ ప్రకారం రాహుల్‌ను విపక్షనేతగా ప్రకటించింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. పార్టీ చీఫ్ ఖర్గే, పార్టీ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడిగా ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్లో వినిపిద్దామని పిలుపునిచ్చారు. 16వ, 17వ లోక్‌సభలో విపక్షపార్టీలకు కనీసం 10 శాతం సభ్యులబలం లేనికారణంగా ఏ పారీ్టకీ విపక్షహోదా దక్కలేదు. విపక్షనేతగా ఎన్నికవడం ద్వారా రాహుల్ తన పాతికేళ్ల రాజకీయజీవితంలో తొలిసారిగా రాజ్యాంగబద్ద పదవిని స్వీకరించారు. కేబినెట్ మంత్రి హోదాతో సమానమైన విపక్షనేత హోదాలో రాహుల్‌కు ఒక ప్రైవేట్ కార్యదర్శి, ఇద్దరు అదనపు ప్రైవేట్ కార్యదర్శులు, ఇద్దరు వ్యక్తిగత సహాయకులు, ఇక హిందీ స్టెనో, ఒక క్లర్క్, ఒక శానిటేషన్ వర్కర్, నలుగురు ప్యూన్లను కేంద్రం సమకూరుస్తుంది. 1954చట్టం 8వ సెక్షన్, 1977 చట్టాల ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తుంది. లోక్‌పాల్, సీఈసీ, ఈసీ, సీబీఐ డైరెక్టర్, సీవీసీ, సీఐసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీల నియామక ప్యానెళ్లలో ఇకపై రాహుల్ సభ్యునిగా ఉండనున్నారు.రాహుల్ తొలిసారిగా 2004లో అమేథీలో విజయంతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. -
విపక్ష నేతగా రాహుల్
న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ బాధ్యతలు స్వీకరించాలని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కోరింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అయితే తనకు కాస్త సమయం కావాలని ఈ బాధ్యత స్వీకరించే విషయమై అతి త్వరలో నిర్ణయం తీసుకుంటానని రాహుల్ చెప్పారు. ఖర్గే, రాహుల్‌తో పాటు సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు. 32 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 26 మంది శాశ్వత ఆహా్వనితులు, 12 మంది ప్రత్యేక ఆహా్వనితులు, 29 మంది పీసీసీ అధ్యక్షులు, 18 మంది సీఎల్పీ నేతలతో పాటు మరో 35 మంది వీరిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై భేటీ ప్రధానంగా చర్చించింది. ‘‘రాజ్యాంగ పరిరక్షణకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను కాపాడేందుకు ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పోరాడింది. సమర్థమైన ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక, సామాజిక విజన్‌ను ప్రజల ముందుంచింది. వారు కూడా తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు పట్టం కట్టారు. అందుకు దేశ ప్రజలకు అభినందనలు. కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవన పథంలో నిలిపినందుకు కృతజ్ఞతలు’’ అంటూ మరో తీర్మానం ఆమోదించింది. ‘‘పదేళ్ల మోదీ పాలనను ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. తన పేరుతోనే ఓట్లడిగిన మోదీకి ఇది రాజకీయ నష్టం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా, నైతికంగా ఓటమి కూడా! ఆయన అవాస్తవ, విద్వేష, విభజన ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టారు’’ అని తీర్మానం పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక పార్టీని అద్భుతంగా ముందుకు నడిపారంటూ అభినందించింది. ‘‘ముఖ్యంగా పార్టీ అద్భుత ప్రదర్శనలో రాహుల్‌ది కీలక పాత్ర. భారత్ జోడో, భారత్ జోడో న్యాయ్ యాత్రలను స్వయంగా రూపొందించి విజయవంతం చేశారు’’ అంటూ ప్రశంసించింది. ఈ ఎన్నికల్లో రాహుల్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ అభివరి్ణంచారు. విద్వేష రాజకీయాలకు చెంప పెట్టు: ఖర్గే ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద కాంగ్రెస్ ప్రదర్శన బాగున్నా పలు రాష్ట్రాల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. ఆయా రాష్ట్రాల్లో తక్షణ దిద్దుబాటు చర్యల కోసం ప్రత్యేక కమిటీలు వేయాలని భేటీ నిర్ణయించింది. ప్రారం¿ోపన్యాసం చేసిన ఖర్గే ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్‌కు పునరుజ్జీవంగా, విద్వేష, విభజన రాజకీయాలకు చెంపపెట్టుగా అభివరి్ణంచారు. పార్లమెంటు బయటా లోపలా ఇండియా కూటమి కలసికట్టుగా పని చేయాలని నొక్కి చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతంగా రాణించిన రాష్ట్రాల్లో ఈసారి అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయామని కర్నాటక, తెలంగాణలను ఉద్దేశించి అభిప్రాయపడ్డారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తేల్చేందుకు అతి త్వరలో రాష్ట్రాలవారీగా ప్రత్యేకంగా మథనం జరుపుతామని వెల్లడించారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రతి చోటా కాంగ్రెస్‌కు సీట్లు, ఓట్ల శాతం పెరిగాయని ఖర్గే అన్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా పలు రాష్ట్రాల్లో అద్భుతంగా పని చేశాయంటూ అభినందించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ప్రాబల్య స్థానాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాం. పట్టణ ప్రాంతాల్లో పట్టును మరింతగా పెంచుకోవాల్సి ఉంది’’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ పోరాడుతుందని ప్రకటించారు. రాష్ట్రాలవారీ కమిటీలు పరిస్థితులను క్షుణ్నంగా సమీక్షించి అధ్యక్షునికి నివేదిక సమరి్పస్తాయని జైరాం రమేశ్ మీడియాకు తెలిపారు.పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పారీ్టకి పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా, విపక్ష నేత పదవి దక్కాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో కనీసం 10 శాతం వస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. కాంగ్రెస్‌కు 2014లో 44, 2019లో 52 మాత్రమే రావడం తెలిసిందే. -
కేసీఆర్‌కు ఈ చాంబర్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఇన్నర్ లాబీలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏళ్ల తరబడి కేటాయిస్తూ వస్తున్న చాంబర్‌ను తొలగించి తాజాగా కె.చంద్రశేఖరరావుకు ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాల తొలిరోజున గురువారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ చాంబర్‌కు వెళ్లి తమ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు, సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తదితరులు కేసీఆర్ చాంబర్‌ను మార్చడాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ఇన్నర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేక చాంబర్‌ను కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన చాంబర్‌ను ఔటర్ లాబీకి తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపైనా ఫిర్యాదు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన పలు సంఘటలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నా ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి భార్య వచ్చేంత వరకు సుమారు రెండు గంటల పాటు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారన్నారు. నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్ తదితర నియోజకవర్గాల్లోనూ ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులను పోలీసులు ఎస్కార్ట్ వాహనంతో అనుసరిస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అధికారులను ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు. పని చేయని టీవీ.. డోర్ హ్యాండిల్ లేని బాత్ రూం గతంలో ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్‌కు కూడా చాంబర్‌ను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్నర్ చాంబర్‌లోని ప్రతిపక్ష నేత చాంబర్‌ను తాను వాడుకుంటానని స్పీకర్ కోరడంతో ఔటర్ లాబీకి తన కార్యాలయాన్ని తరలించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. అయితే ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గది కేటాయించారని, అందులోని మూత్రశాలకు కనీసం డోర్ హ్యాండిల్ లేదనీ, టీవీ పనిచేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారు. ఇది ప్రతిపక్ష నేతను అవమానించడం లాంటిదేనని, విశాలమైన చాంబర్‌ను కేటాయించాలని కోరారు. వచ్చే సెషన్‌లోగా ప్రతిపక్ష నేత చాంబర్‌ను విశాలంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. -
శుక్రవారం నామినేషన్.. శనివారం రాజీనామా
సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఆయన శుక్రవారమే నామినేషన్ సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు కట్టుబడి ఒక్కరికి ఒకే పదవి అనే నిబంధనను పాటిస్తూ ఆయన శనివారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపినట్లు సమాచారం. ఖర్గే రాజీనామాతో రాజ్యసభ ప్రతిపక్షనేతగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్‌లలో ఒకరు ఎంపికయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ శుక్రవారంతో(సెప్టెంబర్ 30) ముగిసింది. ఖర్గేతో పాటు శశిథరూర్, ఆర్ఎన్ త్రిపాఠి పోటీలో ఉన్నారు. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. థరూర్, ఖర్గేలో ఎవరు గెలిచినా 25ఏళ్ల తర్వాత కాంగ్రెస్ చీఫ్‌గా ఓ దక్షిణాది నాయకుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడి నుంచి చివరిసారి 1994లో పీవీ నరసింహారావు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. గాంధీ కుటుంబం విధేయుడు కావడం, సుదీర్ఘ అనుభవం, దళిత నేత వంటి కారణాలు ఆయనకే అనుకూలంగా ఉన్నాయి. పోటీ నుంచి తప్పుకున్న అశోక్ గహ్లోత్, దిగ్విజయ్ సింగ్ సహా కాంగ్రెస్ జీ-23నేతలు కూడా ఖర్గేకే మద్దతు తెలిపారు. దీంతో ఆయన విజయం నల్లేరుపై నడకే అని పార్టీ వర్గాలు అంటున్నాయి. చదవండి: చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన మోదీ -
హిమ దాస్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన హిమదాస్‌కు వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తే.. వారు అద్భుతంగా రాణించి.. దేశానికి కీర్తిప్రతిష్టలు సాధించి పెడతారని ఆయన శనివారం టిటర్‌లో పేర్కొన్నారు. ఫిన్లాండ్లోని టాంపెరెలో జరుగుతున్న ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో హిమ దాస్ స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత తొలి భారత అథ్లెట్ హిమ కావడం విశేషం. Congratulations @HimaDas8 on becoming the first ever Indian girl to win gold in world U20 athletics. AP has such potential in abundance. Provided world-class sports facilities, these athletes can perform their best and bring many more accolades to India. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2018 -
ఈసారి తప్పించుకోలేవని బెదిరించాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తాను హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గుప్తా పీఏ ఆశీష్ కట్యల్ ఫోన్‌కు ఆగంతకుడు కాల్ కేసి ఈ మేరకు హెచ్చరించాడు. ఆశీష్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం గుర్తుతెలియనివ్యక్తి తనకు ఫోన్ చేసి గుప్తాను చంపుతానని బెదిరించాడని, గతంలో రెండుసార్లు తమదాడి నుంచి తప్పించుకున్నాడని, ఈ సారి సెక్యూరిటీ ఉన్నా తమ నుంచి తప్పించుకోలేడని హెచ్చరించాడని ఆశీష్ చెప్పారు. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా తనకు గత నెల 9వ తేదీన ఇదేవిధంగా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు గుప్తా చెప్పారు. ఏడాదిన్నర క్రితం కూడా బెదిరింపులు వచ్చాయని, వీటి వెనుక ఆప్ లీడర్ల హస్తముందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని, వీటి వెనుక వందశాతం ఆప్ నేతల హస్తముందని భావిస్తున్నట్టు గుప్తా చెప్పారు. అయితే గుప్తా ఆరోపణలు ఆప్ నేతలు ఖండించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించి వాస్తవాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
ప్రతిపక్షనేతగా స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా డీఎంకే కోశాధికారి, కొళత్తూరు ఎమ్మెల్యే స్టాలిన్ ఎన్నికయ్యారు. పలువులు ఎమ్మెల్యేలు ఆయన పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ అధ్యక్షులు కరుణానిధి అధికారికంగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాలతో అన్నాడీఎంకే అధికారాన్ని చేపట్టగా, డీఎంకే 89 సీట్లను గెలుపొంది అధికార పార్టీ తరువాత అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కరుణానిధి అధ్యక్షతన మంగళవారం ఉదయం 10.30 గంటలకు కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్, కోశాధికారి స్టాలిన్, సహాయ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, జీ పెరియస్వామి, అన్ని జిల్లాల కార్యదర్శులు హాజరైనారు. అలాగే కొత్తగా ఎన్నికైన డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కరుణానిధి ప్రకటించారు. ప్రతిపక్ష సహాయ నేతగా దురైమురుగన్, చీఫ్ విప్‌గా చక్రపాణి, విప్‌గా పిచ్చాండి సైతం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కేంద్రం కుట్ర వల్లనే డీఎంకే ఓటమి: కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లనే తమ పార్టీ ఓటమి పాలైందని డీఎంకే కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రగా ఆరోపించింది. ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే జయలలితను ప్రధాని నరేంద్రమోదీ అభినందిస్తున్నట్లుగా టీవీల్లో వార్త ప్రసారం కావడాన్ని ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోవడం కుమ్మక్కుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి లెక్కింపు పూర్తయ్యేవరకు ఎన్నికల కమిషన్ చర్యలు అన్నాడీఎంకేకు అనుకూలంగా, పక్షపాతంగానే కొనసాగాయి. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. ఎన్నికల సమయంలో వాహనాల తనిఖీల్లో పట్టుబడిన రూ.570 కోట్లపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉండగా, వాటిని లెక్కచేయకుండా బ్యాంకు సొమ్ముగా తేల్చేయడం వెనుక కేంద్రం అండ ఉందని సమావేశంలో పేర్కొన్నారు. ఈ అనుమానాలు నివృత్తి కావాలంటే రూ.570కోట్లపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే డిమాండ్ చేసింది. పార్టీ కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన నేతలు చేసిన 20 తీర్మానాల వివరాలు ఇలా ఉన్నాయి. గ డచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 4 కోట్ల 32 లక్షలా 62వేల 906 ఓట్లను పొందడం ద్వారా 39.7 ఓట్లను సాధించింది. గత 2011 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఒక కోటి 35లక్షల 13వేల 816 ఓట్లను పొందింది. గత ఎన్నికల ఓట్లతో పోల్చుకుంటే ప్రజల్లో డీఎంకే పట్ల అపారమైన నమ్మకం పెరిగింది. 1957 నుండి 2016 వరకు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి వరుసగా 13 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. అంతేగాక ఈ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజార్టీని సాధించారు. నమక్కునామే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి లక్షలాది ప్రజల అభిమానాన్ని చూరగొన్న స్టాలిన్‌కు అభినందనలు. వైద్యకోర్సుకు ప్రవేశపరీక్షలు ఈ ఏడాది మాత్రమే కాదు ఇక ఎప్పటికీ ఉండబోవని వెంటనే ప్రకటించాలి. ఏపీలో 20 మంది తమిళులను ఎన్కౌంటర్ చేయడంపై సాగుతున్న కేసు విచారణ, అన్నాడీఎంకే నేత అన్బునాథన్ ఫాంహౌస్‌లో భారీ ఎత్తున నగదు దొరకడంపై సీబీఐ విచారణ జరిపించాలని తీర్మానాలు చేశారు. ఓటమికి కరుణే కారణం: సుబ్రమణ్యస్వామి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికి ఆ పార్టీ అధ్యక్షులు కరుణానిధే కారణమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. స్టాలిన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుగానే ప్రకటించి ఉంటే గెలుపు సాధ్యమయ్యేదని అన్నారు. కాంగ్రెస్ కూటమిగా ఏర్పడినా అధికారంలోకి రాలేకపోయిందని అన్నారు. కరుణానిధి ఇక నైనా రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. -
సీఎం కాబోయి.. విపక్ష నేతగా!
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంకే స్టాలిన్ (63) అడుగుపెట్టడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే తమ శాసనసభాపక్ష నేతగా స్టాలిన్‌ను డీఎంకే ఎన్నుకొంది. దాంతో ఆయన విపక్షనేత కావడం లాంఛనంగానే మిగిలింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో డీఎంకే 89 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. డీఎంకే విజయం సాధిస్తే తానే ముఖ్యమంత్రి పదవి చేపడతానని కరుణానిధి ప్రకటించారు. అయితే 93 ఏళ్ల కరుణానిధి తర్వాత సీఎం అయ్యేది స్టాలినేనన్నది పార్టీ నాయకులు, కార్యకర్తల భావన. ఇక ఊహించని రీతిలో అన్నాడీఎంకే మళ్లీ గెలవడంతో కరుణ ఆశలు అడియాసలయ్యాయి. దాంతో ప్రధాన ప్రతిపక్ష నేత పదవిని కూడా ఆయన వద్దనుకుని, కొడుక్కి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. మంగళవారమే పార్టీ ఎమ్మెల్యేలు స్టాలిన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 2006 వరకు కరుణానిధి విపక్ష నేతగా ఉండేవారు. కానీ, 2011లో డీఎండీకేకు ఎక్కువ స్థానాలు రావడంతో విజయ కాంత్ విపక్ష నేత అయ్యారు. 1996 నుంచే డీఎంకేలో అళగిరిని కాదని స్టాలిన్‌ను పైకి తెచ్చేందుకు కరుణానిధి మొగ్గుచూపారు. 1989లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన స్టాలిన్.. ఇప్పుడు వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
గుజరాత్ బడ్జెట్ ఘోరవిఫలం: శంకర్ సింఘ్ వాఘేలా
గాంధీనగర్: గుజరాత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేత శంకర్ సింఘ్ వాఘేలా విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటిరోజైన సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ....గత నెల్లో ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ లో పేదలు, మధ్యతరగతి వారి సంక్షేమం కోసం ఎలాంటి పథకాలు పేర్కొనలేదని విమర్శించారు. లక్షా 39 వేల కోట్ల బడ్జెట్ లో ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు ప్రతిపాదనలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. అయితే తాగునీరు, వాద్య, విద్యుత్, ద్రవ్యోల్బనం అదుపు లాంటి విషయాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ...అది కేవలం బీజేపీ ఎన్నికల హామీ మాత్రమేనని విమర్శించారు. అదే విధంగా ప్రభుత్వం అమృతం యోజన, దూధ్ సంజీవనిలాంటి మరికొన్ని నినాదాలు ఇచ్చిందన్నారు. గత మోడేళ్లుగా ఈ ప్రాజెక్టుకు 9000 కోట్లు కేటాయించారని అయినా పూర్తికాలేదని అన్నారు. ఇలాగే కొనసాగితే మరో 20 ఏళ్లైనా ప్రాజెక్టులు పూర్తికావని ఎద్దేవా చేశారు. -
ఏక్నాథ్ షిండేకు ఘనసన్మానం
సాక్షి, ముంబై: మహరాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకునిగా ఎన్నుకోబడిన ఠాణే జిల్లా శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండేను ఠాణే తెలుగు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గత నెలలో జరిగిన మహరాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో శివసేన అభ్యర్థిగా ఏక్నాథ్ షిండే ఠాణే నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ సన్మాన కార్యక్రమంలో తెలుగు సేవా సంస్థ చైర్మన్ నాయన జగదీశ్వర్‌రావు, అధ్యక్షుడు నాగేష్, సెక్రటరీ ఎ. రామారావు, ముఖ్య సలహాదారులు తులసీరావు, శివసేన కళ్యాణ్ లోక్‌సభ కార్యదర్శి తిరుపతి రెడ్డి, భివండీ నుండి వచ్చిన పలువురు తెలుగు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ నాయన జగదీశ్వర్‌రావు మాట్లాడుతూ.... ఏక్నాథ్ షిండేకు స్థానిక తెలుగు ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయన తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. షిండే మాట్లాడుతూ.. తన గెలుపులో భాగస్వాములైన తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్ పని ఖతం
ముంబై: రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం అన్నారు. కాంగ్రెస్ రహిత భారత్‌ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ రహిత భారత పథకం పేరుతో ముందుకు వెళ్తాం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనే ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంటుంది’ అని షా అన్నారు. మహారాష్ట్ర పర్యటన కోసం గురువారం ముంబై చేరుకున్న ఈ సీనియర్ నాయకుడికి కార్యకర్తలు స్వాగతం పలికిన సందర్భంగా మాట్లాడుతూ పైవిధంగా అన్నారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ సర్కారు అత్యంత అవినీతి, అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలు, ప్రజల సహకారంతో ఈసారి కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితుడైన అనంతరం తొలిసారిగా మహారాష్ట్ర పర్యటనకు వచ్చారు. అసెంబ్లీలో విపక్ష నేత వినోద్ తావ్డే, బీజేపీ ముంబైశాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్, దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పంకజ ముండే తదితరులు ముంబై ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం పలికారు. బీజేపీ సీనియర్ నాయకులు రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఓపీ మాథుర్ తదితరులు షా వెంట ముంబై చేరుకున్నారు. ‘మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్వరాజ్యను స్థాపించాడు. మా మహాయుతి (బీజేపీ, సేన, మిత్రపక్షాల కూటమి) కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది’ అని వివరించారు. విలేపార్లేలోని తావ్డే నివాసంలో సాయంత్రం ఏర్పాటు చేసిన పార్టీ కోర్ కమిటీ సమావేశానికి కూడా షా హాజరయ్యారు. ఉద్ధవ్‌తో భేటీ సీట్ల విషయమై ఇరు పార్టీల మధ్య విబేధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అమిత్ షా శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రేతో గురువారం రాత్రి భేటీ అయ్యారు. అయితే వీరిద్దరి మధ్య చర్చల వివరాలు తెలియరాలేదు. తన నివాసం మాతోశ్రీకి రావాల్సిందిగా ఉద్ధవ్ స్వయంగా షాను ఆహ్వానించారని తావ్డే విలేకరులకు తెలిపారు. ఉద్ధవ్ ఆహ్వానాన్ని మన్నించి రాత్రి 9.30 గంటలకు ఆయన నివాసానికి వెళ్లారు. సీట్ల కేటాయింపు విషయంలో సేనతో తమకు ఎటువంటి విబేధాలూ లేవని తావ్డే ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఉద్ధవ్ ఠాక్రే తండ్రి, సేన మాజీ అధ్యక్షుడు, దివంగత బాల్‌ఠాక్రే స్మారకాన్ని కూడా షా సందర్శించారు. శివాజీపార్కులో ఠాక్రే స్మారకాన్ని నిర్మించడం తెలిసిందే. -
ప్రతిపక్ష నాయకుడి పాత్ర విస్మరించొద్దు
న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడి నియామక వివాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని శుక్రవారం కోరింది. ప్రతిపక్ష నాయకుడి నియామకంలో ప్రభుత్వ దృక్పథం ఏంటో తెలుసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా అటర్నీ జనరల్‌ను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌పై స్పందించిన సుప్రీం ధర్మాసనం.... ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను విస్మరించవద్దని సూచించింది. సభలో ప్రతిపక్ష నాయకుడి ఉండబోడని ఎప్పుడూ ఊహించలేదని అభిప్రాయపడింది. కాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాపై కాంగ్రెస్ డిమాండ్‌ను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. సభ నియమాలను నిశితంగా అధ్యయనం చేసిన తరువాతే కాంగ్రెస్ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు ఆమె తెలిపారు. -
విపక్ష హోదా ఇవ్వాల్సిందే: కాంగ్రెస్
పార్టీ ఎంపీలతో సోనియా సమావేశం న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం లోక్‌సభలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విపక్షనేత విషయంలో సత్వరం నిర్ణయం కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయాలని యూపీఏ ఎంపీలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది అనధికారిక భేటీ అని పార్టీ ఎంపీలు తెలిపారు. లోక్‌సభలో విపక్షనేతగా తమ పార్టీ వారికే గుర్తింపునివ్వాలని సోనియా సోమవారం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. విపక్షనేత ఉంటే సంతోషమే: వెంకయ్యనాయుడు లోక్‌సభ, రాజ్యసభల్లో గుర్తింపు పొందిన విపక్షనేత ఉండడం ప్రభుత్వానికి సంతోషకరమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విపక్ష నేత విషయంలో కాంగ్రెస్ తీరును ఆయన తప్పుబట్టారు. ఆ పార్టీ స్పీకర్‌కు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం విపక్ష నేత ఉండకూడదని కోరుకుంటోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై కూడా మండిపడ్డారు. విపక్షనేతను గుర్తించే విషయంలో బీజేపీకి, ఎన్డీయేకు పాత్ర లేదని, ఇది పూర్తిగా స్పీకర్ అధికార పరిధిలోనిదని చెప్పారు. స్పీకర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనడం, కోర్టుకు వెళతాననడం వ్యవస్థలను కించపరచడమేనన్నారు. రాష్ట్రపతితో సోనియా భేటీ మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ప్రతిపక్ష నేత హోదాను పొందే అర్హత తమ పార్టీకి ఉందని ప్రకటించిన సోనియా గాంధీ అంతకు ముందు ఇదే అంశంపై కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులతో చర్చించారు. ఇదిలా ఉండగా, సోనియా గాంధీ మర్యాద పూర్వకంగానే రాష్ట్రపతిని కలుసుకున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా సాధించాలన్న తన డిమాండ్‌కు ప్రజాస్వామ్యబద్ధమైన పరిష్కారం కోసం తాము అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని ఆ పార్టీ పేర్కొంది. -
ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే: సోనియా
న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీ తమదేనని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఎన్నికల ముందే తాము పొత్తు కుదుర్చుకుని కూటమిగా ఏర్పడినందున తమకు లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. అధికార పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీకిగానీ, కూటమిని సాధారణంగానే ప్రధాన ప్రతిపక్షంగా పరిగణిస్తారని, ఆ ప్రకారం తమకే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ అంతకుముందు పేర్కొంది. కాగా, లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సాగనీయబోమన్న కాంగ్రెస్ నాయకుల హెచ్చరికలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. సంఖ్యా బలం లేనప్పుడు ప్రతిపక్ష హోదాకోసం స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలి తప్పితే మొత్తం సభను అడ్డుకుంటామన్న మాటలు సరికాదని హితవు పలికారు.