న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడి నియామక వివాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని శుక్రవారం కోరింది. ప్రతిపక్ష నాయకుడి నియామకంలో ప్రభుత్వ దృక్పథం ఏంటో తెలుసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా అటర్నీ జనరల్‌ను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌పై స్పందించిన సుప్రీం ధర్మాసనం.... ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను విస్మరించవద్దని సూచించింది. సభలో ప్రతిపక్ష నాయకుడి ఉండబోడని ఎప్పుడూ ఊహించలేదని అభిప్రాయపడింది.
కాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాపై కాంగ్రెస్ డిమాండ్‌ను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. సభ నియమాలను నిశితంగా అధ్యయనం చేసిన తరువాతే కాంగ్రెస్ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు ఆమె తెలిపారు.
ప్రతిపక్ష నాయకుడి పాత్ర విస్మరించొద్దు
Published Fri, Aug 22 2014 1:29 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement