ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే: సోనియా
న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీ తమదేనని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఎన్నికల ముందే తాము పొత్తు కుదుర్చుకుని కూటమిగా ఏర్పడినందున తమకు లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. అధికార పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీకిగానీ, కూటమిని సాధారణంగానే ప్రధాన ప్రతిపక్షంగా పరిగణిస్తారని, ఆ ప్రకారం తమకే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ అంతకుముందు పేర్కొంది.
కాగా, లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సాగనీయబోమన్న కాంగ్రెస్ నాయకుల హెచ్చరికలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. సంఖ్యా బలం లేనప్పుడు ప్రతిపక్ష హోదాకోసం స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలి తప్పితే మొత్తం సభను అడ్డుకుంటామన్న మాటలు సరికాదని హితవు పలికారు.