single largest party
-
మధ్యప్రదేశ్‌లో మేజిక్ మార్క్ చేరుకున్న కాంగ్రెస్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డ బీజేపీ, కాంగ్రెస్‌లు తుది రౌండ్ల వరకూ ఉత్కంఠ పెంచేలా పోటీపడుతున్నాయి. ప్రారంభం నుంచీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య స్వల్ప ఆధిక్యంతో విజయం దోబూచులాడుతున్నా తాజాగా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా, కాంగ్రెస్ 115 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 105 స్ధానాల్లో ఆధిక్యం సాధించింది. ఇక నాలుగు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న బీఎస్పీ, ఆరు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఇతరులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నాయి. ఫలితాల సరళిని పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ, ఇతరుల సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తోంది. -
‘సుప్రీంకోర్టు తీర్పు చారిత్రక విజయం’
న్యూఢిల్లీ : కర్ణాటకలో బీజేపీ శనివారం బలనిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్ధానం ఆదేశించిన నేపథ్యంలో ధర్మాసనం తీర్పును చారిత్రక విజయంగా వర్ణించారు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్. ఈ సందర్భంగా ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం కర్ణాటకలో ఏర్పడిన హంగ్ పరిస్థితుల దృష్ట్యా సర్కారియా కమిషన్ సూచనలను తెరపైకి తీసుకురావడం వల్ల మేలు జరుగుతుందని తెలిపారు. సర్కారియా కమిషన్ మూడో పేరాలో పేర్కొన్న ‘అతిపెద్ద రాజకీయ పార్టీ అంశం’ లోతుగా పరిశీలించడానికి అవకాశం దొరికిందన్నారు. సర్కారియా కమిషన్ సూచించిన ఈ ‘అతిపెద్ద రాజకీయ పార్టీ అంశానికి’ ఉన్న న్యాయబద్దతను పరిశీలించడానికి గాను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను 10 వారాల పాటు వాయిదా వేసిందని తెలిపారు. ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించి, మార్గదర్శకాలను రూపొందిస్తే ఇక భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడకుండా చూడవచ్చని పేర్కొన్నారు. కాగా కర్ణాటక అసెంబ్లీలో బీజేపీని శనివారం బలనిరూపణ చేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన బలపరీక్ష నిర్వహించాలని, చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ జరుగుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించాలని బీజేపీ అడగడాన్ని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం... యడ్యూరప్ప ఎటువంటి విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి వీలులేదని ఆదేశాలు ఇచ్చింది. -
ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే: సోనియా
న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీ తమదేనని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఎన్నికల ముందే తాము పొత్తు కుదుర్చుకుని కూటమిగా ఏర్పడినందున తమకు లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. అధికార పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీకిగానీ, కూటమిని సాధారణంగానే ప్రధాన ప్రతిపక్షంగా పరిగణిస్తారని, ఆ ప్రకారం తమకే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ అంతకుముందు పేర్కొంది. కాగా, లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సాగనీయబోమన్న కాంగ్రెస్ నాయకుల హెచ్చరికలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. సంఖ్యా బలం లేనప్పుడు ప్రతిపక్ష హోదాకోసం స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలి తప్పితే మొత్తం సభను అడ్డుకుంటామన్న మాటలు సరికాదని హితవు పలికారు.