సాక్షి, అమరావతి : ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన హిమదాస్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తే.. వారు అద్భుతంగా రాణించి.. దేశానికి కీర్తిప్రతిష్టలు సాధించి పెడతారని ఆయన శనివారం టిటర్‌లో పేర్కొన్నారు. ఫిన్లాండ్‌లోని టాంపెరెలో జరుగుతున్న ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో హిమ దాస్ స్వర్ణం నెగ్గిన విషయం తెలిసిందే. ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత తొలి భారత అథ్లెట్ హిమ కావడం విశేషం.
Congratulations @HimaDas8 on becoming the first ever Indian girl to win gold in world U20 athletics. AP has such potential in abundance. Provided world-class sports facilities, these athletes can perform their best and bring many more accolades to India.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2018
Comments
Please login to add a commentAdd a comment