గుజరాత్ బడ్జెట్ ఘోరవిఫలం: శంకర్ సింఘ్ వాఘేలా
గాంధీనగర్: గుజరాత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేత శంకర్ సింఘ్ వాఘేలా విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటిరోజైన సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ....గత నెల్లో ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ లో పేదలు, మధ్యతరగతి వారి సంక్షేమం కోసం ఎలాంటి పథకాలు పేర్కొనలేదని విమర్శించారు. లక్షా 39 వేల కోట్ల బడ్జెట్ లో ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు ప్రతిపాదనలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. అయితే తాగునీరు, వాద్య, విద్యుత్, ద్రవ్యోల్బనం అదుపు లాంటి విషయాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ...అది కేవలం బీజేపీ ఎన్నికల హామీ మాత్రమేనని విమర్శించారు. అదే విధంగా ప్రభుత్వం అమృతం యోజన, దూధ్ సంజీవనిలాంటి మరికొన్ని నినాదాలు ఇచ్చిందన్నారు. గత మోడేళ్లుగా ఈ ప్రాజెక్టుకు 9000 కోట్లు కేటాయించారని అయినా పూర్తికాలేదని అన్నారు. ఇలాగే కొనసాగితే మరో 20 ఏళ్లైనా ప్రాజెక్టులు పూర్తికావని ఎద్దేవా చేశారు.