ముంబయి: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి సునామీలా విరుచుపడింది. మహాయుతి దెబ్బకు షాక్‌కు గురవడం ప్రత్యర్థి పార్టీల వంతైంది. హోరాహోరీగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలుంటాయని చెప్పిన ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి.
మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ టర్ములో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కే అకాశం లేకుండా పోయిందంటే మహాయుతి కూటమి ప్రభంజనం ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే పార్టీలకు కనీసం 29 సీట్లు రావాల్సి ఉంటుంది.
అయితే ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఓటమి చవిచూసిన మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)కూటమిలోని ఏ పార్టీకి 29 సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ రానున్న ఐదేళ్లపాటు అసెంబ్లీలో ఉండదు. ఎంవీఏలో శివసేన(ఉద్ధవ్) పార్టీకి 20, కాంగ్రెస్‌కు 16, ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీకి 10 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన మహాయుతి కూటమిలోని బీజేపీకి అత్యధికంగా 132, శివసేన(షిండే)పార్టీకి 57,అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి.
ఇదీ చదవండి: రాజ్‌భవన్‌లో సొంత విగ్రహం.. గవర్నర్‌పై విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment