![Oppn MPs came with request for suspension after some lawmakers suspended - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/23/joshi.jpg.webp?itok=02E0wWH_)
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్రప్రభుత్వం అనుకోలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సభకు అంతరాయం కలిగించిన కొందరు ఎంపీలను సస్పెండ్ చేయడంతో తమను కూడా సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు తమను కోరారని ఆయన చెప్పారు. శుక్రవారం మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. ‘ఎంపీలను సస్పెండ్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు.
ప్లకార్డులతో రావొద్దని కోరాం. చర్యలుంటాయని ముందుగానే వారికి చెప్పాం. నిబంధనలు ఉల్లంఘించి కొందరు ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. క్రమశిక్షణారాహిత్యం కింద తమను కూడా సస్పెండ్ చేయాలంటూ మిగతా వారు కూడా కోరారు. కాంగ్రెస్ స్థాయి అంతగా దిగజారింది. లోక్‌సభ నుంచి 100 మంది, రాజ్యసభ సభ్యులు 46 మంది మొత్తం 146 మంది ఎంపీలు బహిష్కరణకు గురయ్యారు’అని మంత్రి చెప్పారు. తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందిన మూడు క్రిమినల్ బిల్లుల్లో ఏమైనా లోపాలున్నాయని భావిస్తే కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు ఉందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment