Opposition MPs
-
వక్ఫ్ కమిటీ భేటీ నుంచి విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)బిల్లును సమీక్షిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాడీవేడీ చర్చలకు వేదికగా మారింది. అధికార బీజేపీ, విపక్ష పార్టీల ఎంపీలు వాగ్వాదానికి దిగారు. చివరకు విపక్ష ఎంపీలు సమావేశాన్ని బహిష్కరిస్తూ బయటకు వెళ్లిపోయారు. నియమనిబంధనలకు విరుద్ధంగా కమిటీ సమావేశం జరుగుతోందని ఆరోపించారు. పార్లమెంట్ సంయుక్త కమిటీలో చర్చ సజావుగా సాగట్లేదని, నియమాలను పాటించడం లేదని శివసేన ఎంపీ సావంత్ మీడియాతో చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ విపక్ష నేతలపై కొందరు తీవ్రమైన వ్యక్తిగత దూషణలకు దిగారని విపక్షసభ్యులు ఆరోపించారు. తమ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు విపక్షాల సభ్యులు విడిగా సమావేశమయ్యారు. పార్లమెంట్ సంయుక్త కమిటీ సమావేశంలో జరిగిన వాగ్వాదంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేయాలని కొందరు విపక్షసభ్యులు తమ అభిప్రాయం వ్యక్తంచేశారు. విపక్ష ఎంపీలు బయటకు వెళ్లిపోయాక బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ సారథ్యంలో కమిటీ సమావేశం యథావిధిగా కొనసాగింది. ఖర్గేపై విమర్శలువక్ఫ్ భూముల కుంభకోణంతో కర్ణాటకకు చెందిన ఖర్గే, రెహ్మాన్ ఖాన్లకు ప్రమేయం ఉందని కర్ణాటక బీజేపీ నేత అన్వర్ మణిప్పాడి ఆరోపణలు గుప్పించారు. దీంతో విపక్షసభ్యులు వాగ్వాదానికి దిగారు. సభలో లేని వ్యక్తిపై నిబంధనలకు విరుద్ధంగా పార్లమెంటరీ కమిటీలో ఆరోపణలు ఎలా చేస్తారని వాదించారు. ముస్లింలకు సంబంధించిన చట్టంపై హిందూ వర్గాల అభిప్రాయాలను ఎందుకు ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు?. ముస్లింల అభిప్రాయాలు పట్టవా? అని విపక్ష సభ్యులు నిలదీశారు. కమిటీ చీఫ్‌కి ఒవైసీ లేఖకమిటీ చీఫ్ జగదాంబికాపాల్కు ఒవైసీ ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘‘సనాతన్ సంస్థ, హిందూ జనజాగృతి సమితి వంటి సంస్థలు హిందూ అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారత్‌ను హిందూదేశంగా మార్చడమే వారి లక్ష్యం. భారత సర్కార్‌కు వ్యతిరేకంగా ఆయా సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి’’ అని లేఖలో ఒవైసీ పేర్కొన్నారు. -
Parliament Session: చినికి చినికి గాలివానగా... జయ వర్సెస్ ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి. వేడెక్కిన రాజ్యసభ జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్‌శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్‌ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్‌ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్‌ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు. నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్‌ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్‌కు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు. ‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్‌ఖడ్‌కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. మేం స్కూలు పిల్లలమా?: జయ ధన్‌ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్‌ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.87 మంది ఎంపీల సంతకాలుఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్‌పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్‌గా ధన్‌ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.ముందస్తు నోటీసు తప్పనిసరి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి. -
మద్దతు ధర టీడీపీ, జేడీ(యూ)కేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, రైతన్నలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) తదితర పార్టీల సభ్యులు పార్లమెంట్ మకర ద్వారం మెట్లపై గుమికూడారు. ఉల్లిపాయలు, కూరగాయల దండలను మెడపై ధరించి కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ‘పంటలకు కనీస మద్దతు ధర కల్పించండి’, ‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోండి’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... ‘‘తెలుగుదేశం పార్టీ, జేడీ(యూ)లకు బీజేపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర(స్పెషల్ ప్యాకేజీ) అందించింది. అదే తరహాలో రైతులకు కూడా కనీస మద్దతు ధర అందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ సమానమేనని గుర్తించుకోవాలి. రైతులు దేశంలో ప్రధాన వాటాదార్లు. అందుకే వారికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి విదేశాలకు ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా చూడడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. -
Parliament Budget Session 2024: ఆత్మపరిశీలన చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలిగించే విపక్ష ఎంపీలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రామ్ రామ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ప్రజాస్వామ్యంలో విమర్శ, ప్రతిపక్షం అనేవి చాలా అవసరం. అయితే నిర్మాణాత్మక ఆలోచనలతో సభను సుసంపన్నం చేసిన వారినే ప్రజలు గుర్తుంచుకుంటారు. అంతరాయం సృష్టించిన వారిని ఎవరూ గుర్తుంచుకోరు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగకుండా అనుక్షణం నిరసనలు, నినాదాలను సభా కార్యకలాపాలను స్తంభింపజేసిన ఆ విపక్ష పార్టీల సభ్యులు తమ ప్రవర్తనను ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు తమ పాత పంథాను విడనాడాలి. వాళ్లు తమ సొంత పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరిగినా పాత సెషన్లో వీరు చేసిన వీరంగాన్ని ఎవ్వరూ గుర్తుంచుకోరు‘ అని విపక్ష ఎంపీలను ప్రధాని తప్పుబట్టారు. ‘‘సాధారణంగా ఎన్నికల సమయంలో పూర్తి బడ్జెట్‌ను సమర్పించరు. మేము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఈసారి మళ్లీ మేమే వస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసి పూర్తి బడ్జెట్‌ను మీ ముందుకు తెస్తాం. ఈసారి ఆర్థిక మంత్రి కొన్ని మార్గదర్శక అంశాలతో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు’ అని మోదీ ప్రకటించారు. ‘అభివృద్ధిలో దేశం అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోంది. సమ్మిళిత, దేశ సర్వోతోముఖాభివృద్ధి ప్రయాణం ఆగదు’’ అని వ్యాఖ్యానించారు. -
బడ్జెట్ వేళ.. 146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత
ఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్ సమావేశాలను(బడ్జెట్) కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు కృషి చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం అఖిల పక్ష భేటీ తర్వాత ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దుండగుల దాడితో అలజడి రేగిన విషయం తెలిసిందే. ఈ భద్రతా వైఫ్యలంపై కేంద్ర హోం శాఖ వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించారనే కారణంతో లోక్‌సభ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. అదే సమయంలో రాజ్యసభలోనూ ఇలా అవాంతరాలు కలిగిన సభ్యుల్ని సస్పెండ్ చేశారు చైర్మన్. అయితే బడ్జెట్ సమావేశాలు.. అదీ ఎన్నికలకు ముందు ఓటాన్ బడ్జెట్ కావడంతో సభ్యులంతా ఉండాలని కేంద్రం ఆశిస్తోంది. ‘‘అన్ని సస్పెన్షన్లను ఎత్తేస్తున్నాం. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లతో మాట్లాడాం. ప్రభుత్వం తరఫున సస్పెన్షన్ ఎత్తివేయాలని వాళ్లను కోరాను. అందుకు వాళ్లు అంగీకరించారు అని తెలిపారాయన. లోక్‌సభ నుంచి 135 మంది, రాజ్యసభ నుంచి 11 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక రేపటి నుంచి(జనవరి 31) ఫిబ్రవరి 9వ తేదీదాకా బడ్జెట్ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. -
సస్పెన్షన్ కోసం వాళ్లే అభ్యర్థించారు: జోషి
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్రప్రభుత్వం అనుకోలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సభకు అంతరాయం కలిగించిన కొందరు ఎంపీలను సస్పెండ్ చేయడంతో తమను కూడా సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు తమను కోరారని ఆయన చెప్పారు. శుక్రవారం మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. ‘ఎంపీలను సస్పెండ్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ప్లకార్డులతో రావొద్దని కోరాం. చర్యలుంటాయని ముందుగానే వారికి చెప్పాం. నిబంధనలు ఉల్లంఘించి కొందరు ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. క్రమశిక్షణారాహిత్యం కింద తమను కూడా సస్పెండ్ చేయాలంటూ మిగతా వారు కూడా కోరారు. కాంగ్రెస్ స్థాయి అంతగా దిగజారింది. లోక్‌సభ నుంచి 100 మంది, రాజ్యసభ సభ్యులు 46 మంది మొత్తం 146 మంది ఎంపీలు బహిష్కరణకు గురయ్యారు’అని మంత్రి చెప్పారు. తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందిన మూడు క్రిమినల్ బిల్లుల్లో ఏమైనా లోపాలున్నాయని భావిస్తే కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు ఉందని ఆయన చెప్పారు. -
Save Democracy: ప్రజాస్వామ్యానికి పెనుముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల నుంచి 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట భారీ ధర్నా నిర్వహించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రశి్నస్తే బహిస్కరిస్తారా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని ఇండియా కూటమి నాయకులు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీతోపాటు వామపక్ష నాయకులు, డీఎంకే, ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, జేఎంఎం, రాష్ట్రీయ జనతాదళ్ తదితర పారీ్టల నాయకులు, పార్లమెంట్ ఉభయ సభల నుంచి సస్పెండైన ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం పెనుముప్పును ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రతిపక్షాలు చేతులు కలపాల్సి వచి్చందని చెప్పారు. అందరూ ఒక్కటై కలిసికట్టుగా పనిచేస్తే ప్రధాని నరేంద్ర మోదీ చేయగలిగేది ఏమీ ఉండదని అన్నారు. ప్రభుత్వం తమను ఎంతగా అణచివేయాలని చూస్తే అంతగా పైకి లేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే తామంతా ఉమ్మడిగా పోరాడుతున్నామని ఖర్గే ఉద్ఘాటించారు. తెలంగాణతోపాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ వీధివీధికీ తిరిగినా బీజేపీ ఓడిపోయిందని అన్నారు. ప్రజల గొంతుకలను అణచి వేశారు పార్లమెంట్లో ఈ నెల 13న చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రశ్నించినందుకు పార్లమెంట్ నుంచి 146 మంది విపక్ష సభ్యులను అన్యాయంగా సస్పెండ్ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అధికార బీజేపీ దేశంలో విద్వేషాన్ని మరింతగా వ్యాప్తి చేస్తోందని, ‘ఇండియా’ కూటమి పారీ్టలు మాత్రం మరింత ప్రేమ, సోదరభావాన్ని పంచుతున్నాయని వ్యాఖ్యానించారు. 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి బహిష్కరించడం ద్వారా దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజల గొంతుకలను ప్రభుత్వం అణచివేసిందని ఆరోపించారు. ‘‘ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్‌లోకి దూకి పొగ వదిలారు. దీనిని చూసి బీజేపీ ఎంపీలు పారిపోయారు. దేశ భక్తులుగా చెప్పుకునే బీజేపీ నేతల గాలి పోయింది’’ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ఇండియా కూటమి నాయకులు చెప్పారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శించారు. పార్లమెంట్ నుంచి బయటకు పంపిస్తే విపక్షాల నోరు మూసుకుంటాయని ప్రభుత్వం భావిస్తోందని ఆక్షేపించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ... దేశ ప్రజలకు రాజ్యాంగం కలి్పంచిన సార్వ¿ౌమత్వం ప్రజాప్రతినిధుల ద్వారా అమలు కావాలన్నారు. అమృత మథనం కథలో అమృతం రాక్షసుల చేతికి చిక్కిందని, దాన్ని వెనక్కి తెచ్చేందుకు అందరూ ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. పార్లమెంట్‌ను అనవసర వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తప్పుపట్టారు. పార్లమెంట్‌కు విలువ లేకపోతే ప్రజాస్వామ్యం మరణిస్తుందన్నారు. ‘బీజేపీ విముక్త భారత్’ మన లక్ష్యం కావాలని తృణమూల్ పార్టీ ఎంపీ మౌసమ్ నూర్ అన్నారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆర్జేడీ నేత మనోజ్ ఝా, సీపీఐ(ఎంఎల్) నాయకుడు దీపాంకర్ భట్టాచార్య, రా్రïÙ్టయ లోక్‌దళ్ నేత షహీద్ సిద్దిఖీ, సమాజ్‌వాదీ నేత ఎస్.సి.హసన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత హస్నైన్ మసూదీ తదితరులు ప్రసంగించారు. -
Winter Parliament Session 2023: లోక్‌సభ నిరవధికంగా వాయిదా
లోక్‌సభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది. శీతాకాల సమావేశాల్లో షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే దిగువ సభ వాయిదా పడడం గమనార్హం. ఈ నెల 4న ప్రారంభమైన ఈ సెషన్‌ను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న ముగించాల్సి ఉంది. పార్లమెంట్ నూతన భవనంలో పూర్తిస్థాయిలో జరిగిన తొలి సెషన్ ఇదే. ఈసారి సభలో 74 శాతం ప్రొడక్టివిటీ నమోదైనట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. మొత్తం 18 బిల్లులను ఆమోదించినట్లు చెప్పారు. శీతాకాల సమావేశాలు ఈసారి వాడీవేడిగా జరిగాయి. లోక్‌సభలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించడం, రంగుల గొట్టాలు ప్రయోగించడం వంటివి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. పార్లమెంట్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయడం, నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడంతో రికార్డు స్థాయిలో 146 మంది ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండయ్యారు. ప్రశ్నలకు లంచాలు కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై సస్పెన్షన్ వేటు పడింది. -
Winter Parliament Session 2023: మరో ఇద్దరు ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ: భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడంతో బుధవారం లోక్‌సభలో ఇద్దరు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కేరళ కాంగ్రెస్(మణి) సభ్యుడు థామస్ చెళికాదన్, సీపీఎం సభ్యుడు ఎ.ఎం.అరీఫ్‌ను సభ నుంచి ఈ సెషన్లో మిగిలిన కాలమంతా సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ నుంచి సస్పెండైన విపక్ష ఎంపీల సంఖ్య 143కు చేరుకుంది. లోక్‌సభ నుంచి 97 మంది, రాజ్యసభ నుంచి 46 మంది సస్పెండయ్యారు. -
Parliament Winter Session 2023: సస్పెన్షన్ల పర్వం...78 మందిపై వేటు
పార్లమెంట్లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై నినాదాలు, నిరసనలతో హోరెత్తించిన క్రమంలో ఏకంగా 78 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది! వీరిలో 33 మంది లోక్‌సభ సభ్యులు కాగా 45 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఒకే రోజు ఇంతమందిని బహిష్కరించడం పార్లమెంటు చరిత్రలోనే ఇదే తొలిసారి. గత వారమే 13 మంది లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యునిపై సస్పెన్షన్ వేటు పడటం తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన విపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ, రాజీనామాకు డిమాండ్ చేయడమే వీరి సస్పెన్షన్‌కు కారణం. సస్పెన్షన్లపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరగకుండా మోదీ సర్కారు కుట్ర పన్నిందని, అందుకే తమను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. న్యూఢిల్లీ: పార్లమెంట్లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉభయ సభల్లో ఏకంగా 78 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకేరోజు 78 మందిని బహిష్కరించడం భారత పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంట్లో ఈ నెల 13వ తేదీనాటి భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలో తీవ్ర అలజడి సృష్టించిందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. లోక్‌సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. గత వారమే లోక్‌సభలో 13 మంది, రాజ్యసభలో ఒక విపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన మొత్తం ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరుకుంది. వీరంతా ఒకే కారణంతో వేటుకు గురయ్యారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ, రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. ఎంపీల నినాదాలు, నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. సస్పెన్షన్ల పర్వంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. లోక్‌సభలో విపక్షాల రగడ భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేయడంతో లోక్‌సభ సోమవారం పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర మంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు కోరినా ఫలితం లేకుండాపోయింది. దాంతో 33 మంది విపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేర్వేరు తీర్మానాలు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. అనంతరం సదరు ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వీరిలో 10 మంది డీఎంకే, 9 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 8 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. స్పీకర్ పోడియంపైకి చేరుకొని నినాదాలు చేసిన ముగ్గురు కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనపై విచారణ జరపాలని సభా హక్కుల కమిటీని స్పీకర్ ఆదేశించారు. ఆ నివేదిక వచ్చేదాకా వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసేదాకా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో అదే దృశ్యం రాజ్యసభలో కూడా అదే దృశ్యం పునరావృతమైంది. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించడంతోపాటు సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతూ అనుచితంగా ప్రవర్తించడంతో మొత్తం 45 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరిలో 12 మంది కాంగ్రెస్, ఏడుగురు తృణమూల్, నలుగురు డీఎంకే సభ్యులున్నారు. 45 మందిలో 34 మందిని ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. మిగతా 11 మంది సభలో ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీని చైర్మన్ ఆదేశించారు. నివేదిక వచ్చేదాకా సభకు దూరంగా ఉండాలని వారిని చైర్మన్ ఆదేశించారు. దాంతో వారు 3 నెలల దాకా సభకు హాజరయ్యే అవకాశం లేనట్లే. ప్రస్తుత సెషన్ ముగిసేదాకా సస్పెండైన లోక్‌సభ సభ్యులు అదీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగొయ్, కె.సురేశ్, అమర్‌సింగ్, రాజమోహన్ ఉన్నిథాన్, తిరుణావుక్కరసర్, కె.మురళీధరన్, ఆంటోనీ (కాంగ్రెస్); కల్యాణ్ బెనర్జీ, అపురూప పొద్దార్, ప్రసూన్ బెనర్జీ, సౌగతా రాయ్, శతాబ్ది రాయ్, ప్రతిమా మండల్, కకోలీ ఘోష్ దస్తీదార్, అసిత్ కుమార్ మాల్, సునీల్ కుమార్ మండల్ (తృణమూల్ కాంగ్రెస్); టీఆర్ బాలు, ఎ.రాజా, దయానిధి మారన్, టి.సుమతి, కె.నవాస్కని, కళానిధి వీరస్వామి, సి.ఎన్.అన్నాదురై, ఎస్.ఎస్.పళనిమాణిక్కం, జి.సెల్వన్, ఎస్.రామలింగం (డీఎంకే); ఈటీ మొహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్); ఎన్.కె.ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ); కౌసలేంద్ర కుమార్ జేడీ(యూ) సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు: కె.జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ (కాంగ్రెస్) ప్రస్తుత సెషన్ ముగిసేదాకా సస్పెండైన రాజ్యసభ సభ్యులు ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, కె.సి.వేణుగోపాల్, రణదీప్‌సింగ్ సుర్జేవాలా, అమీ యాజ్ఞిక్, నరేన్భాయ్ జె.రాథ్వా, సయీద్ నాసిర్ హుస్సేన్, ఫూలోదేవి నేతమ్, శక్తిసింహ్ గోహిల్, రజని అశోక్‌రావు పాటిల్, రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్గార్హీ (కాంగ్రెస్); సుఖేందు శేఖర్ రాయ్, మొహమ్మద్ నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంతను సేన్, మౌసమ్ నూర్, ప్రకాశ్ చిక్ బరాయిక్, సమీరుల్ ఇస్లాం (తృణమూల్ కాంగ్రెస్); ఎం.షణ్ముగలింగం, ఎన్.ఆర్.ఇలాంగో, కనిమొళి ఎన్వీఎన్ సోము, ఆర్.గిరిరాజన్ (డీఎంకే); మనోజ్ కమార్ ఝా, ఫయాజ్ అహ్మద్ (ఆర్జేడీ), రామ్‌గోపాల్ యాదవ్, జావెద్ అలీఖాన్ (ఎస్పీ); రామ్‌నాథ్ ఠాకూర్, అనీల్ ప్రసాద్ హెగ్డే (జేడీ–యూ); వి.సదాశివన్ (సీపీఎం); వందనా చవాన్ (ఎన్సీపీ); మహువా మజీ (జేఎంఎం); జోస్ కె.మణి (కేసీ–ఎం); అజిత్‌కుమార్ భూయాన్ (స్వతంత్ర) సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు: జెబీ మాథర్ హిషామ్, ఎల్.హనుమంతయ్య, నీరజ్ డాంగీ, రాజమణి పటేల్, కుమార్ కేట్కర్, జి.సి.చంద్రశేఖర్ (కాంగ్రెస్); జాన్ బ్రిట్టాస్, ఎ.ఎ.రహీం (సీపీఎం); బినోయ్ విశ్వం, పి.సందోష్‌కుమార్ (సీపీఐ); మొహమ్మద్ అబ్దుల్లా (డీఎంకే) నియంతృత్వాన్ని పరాకష్టకు తీసుకెళ్లారు. అచ్చం బాహుబలుల మాదిరిగా ప్రవర్తించారు. సభ నడవాలంటే విపక్షాలు ఉండాలనే కనీస నియమాన్నీ మరిచారు. అందర్నీ దారుణంగా సస్పెండ్ చేశారు. – అధీర్ రంజన్ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్ నేత లోక్‌సభలో పొగ ఘటనకు కారకుడైన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను సస్పెండ్ చేయాలని మేం కోరుతుంటే మమ్మల్నే సస్పెండ్ చేశారు. ఈ దారుణ ధోరణి ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం. – సౌగతా రాయ్, తృణమూల్ కాంగ్రెస్ నేత పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటిది జరగలేదు. 33 మంది లోక్‌సభ ఎంపీలను సస్పెండ్ చేస్తారా?. సభను ప్రశాంతంగా నడపాలి. అధికార పార్టీ సభ్యుల వైఖరి మీదే అది ఆధారపడి ఉంటుంది. విపక్షాలు వివరణ కోరుతుంటే ప్రభుత్వం ఈ విధంగా స్పందించడం దారుణం. – టీఆర్ బాలు, డీఎంకే నేత -
Parliament security breach: పట్టువీడని విపక్షాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో ఉభయ సభలు వరుసగా రెండో రోజు శుక్రవారం సైతం పూర్తిగా స్తంభించిపోయాయి. తమ డిమాండ్ నుంచి విపక్ష ఎంపీలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బుధవారం నాటి అవాంఛనీయ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే సభకు వచ్చి వివరణ ఇవ్వాలని, భద్రతా లోపంపై ఉభయ సభల్లో చర్చ చేపట్టాలని వారు తేలి్చచెప్పారు. పార్లమెంట్ బయట మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న హోంమంత్రి సభకు ఎందుకు రావడం లేదని వారు నిలదీశారు. పార్లమెంట్లో భద్రతా లోపానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగంతకులకు విజిటర్ పాసులు ఇచి్చన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై చర్చలు తీసుకోవాలన్నారు. భద్రతా లోపంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 14 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతించాలంటూ లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పదేపదే కోరినా వినిపించుకోలేదు. ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడకపోవడంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలోనూ విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. గురువారం సస్పెన్షన్ వేటు పడిన ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభ అలా... లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. భద్రతా లోపాన్ని లేవనెత్తారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న కిరీట్ సోలంకీ ప్రకటించారు. రాజ్యసభ ఇలా... ఎగువ సభలోనూ విపక్షాలు అలజడి సృష్టించాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల నుంచి నినాదాల హోరు మొదలైంది. హోంమంత్రి అమిత్ షా సభకు వచి్చ, సమాధానం చెప్పాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. సభలో స్టాండింగ్ కమిటీ నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భద్రతా లోపంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేయగా, చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అంగీకరించలేదు. భద్రతా లోపంపై రాజ్యసభలో చర్చ కోసం పట్టుబడుతూ విపక్షాలు ఇచి్చన 23 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. జీరో అవర్ చర్చను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా ప్రయతి్నంచగా, చైర్మన్ ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించవద్దని సూచించారు. విపక్ష ఎంపీలు నినాదాలు జోరు పెంచడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా సభలో అలజడి తగ్గలేదు. సభా కార్యకలపాలు సజావుగా సాగడానికి సహకరించాలని పలుమార్లు కోరినా విపక్ష ఎంపీలు లెక్కచేయలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు. అది మా బాధ్యత: ఖర్గే దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై గళం వినిపించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత, పార్లమెంటరీ విధి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. విపక్ష ఎంపీలను చట్టవ్యతిరేకంగా నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. ఇదెక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన 14 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. గురువారం రాజ్యసభ నుంచి సస్పెండైన ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి తప్పు చేయని విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని, భద్రతా లోపానికి కారణమైన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై మాత్రం చర్యల్లేవని మండిపడ్డారు. తమపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్లాన్ బీ కూడా ఉంది..! పార్లమెంట్లో అలజడికి కుట్ర పన్నిన లలిత్ ఝా బృందం, ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకుంది. విచారణలో లలిత్ ఈ మేరకు వెల్లడించాడు. నీలమ్, అమోల్ పార్లమెంట్ వద్దకు చేరుకోలేకుంటే ముకేశ్, కైలాశ్ మరో మార్గంలో చేరుకుని మీడియా కెమెరాల ఎదుట నినాదాలిస్తూ పొగ గొట్టాలను పేల్చాలనుకున్నారు. కానీ మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విక్కీ ఇంటికి సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్, నీలమ్ మాత్రమే వచ్చారు. మహేశ్, కైలాశ్ రాలేకపోయారు. బూట్లలో పొగ గొట్టాలు లోక్‌సభలో ప్రయోగించిన పొగ గొట్టాలను నిందితులు బూట్లలో దాచి సభలోకి తెచి్చనట్లు పోలీసులు గుర్తించారు. ఎడమ బూటు కింది భాగంలో రబ్బరు పొరలతో చేసిన రహస్య అరలో వాటిని అమర్చుకొని సభలోకి ప్రవేశించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బూట్లను భద్రతా సిబ్బంది తనిఖీ చేయరని కనిపెట్టే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వారినుంచి స్వా«దీనం చేసుకున్న కరపత్రాల్లో కరపత్రాల్లో మణిపూర్ హింసాకాండపై నినాదాలున్నట్లు తెలిపారు. -
Winter Parliament Sessions 2023: సభలో గందరగోళం..!
న్యూఢిల్లీ: పార్లమెంట్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై గురువారం ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ప్రతిపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం జరిగిన అవాంఛనీయ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో తీవ్ర అలజడి సృష్టించారు. వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని పట్టుబట్టారు. అరుపులు, కేకలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. తీవ్ర గందరగోళం నెలకొంది. ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లోక్‌సభ నుంచి 13 మంది విపక్ష ఎంపీలపై, రాజ్యసభలో ఒక ప్రతిపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం వారు సభకు హాజరు కాకూడదని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో నినాదాల హోరు లోక్‌సభ గురువారం ఉద యం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రా రంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు శాంతించలేదు. దీంతో సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న ఐదుగురు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. టీఎన్ ప్రతాపన్, హిబీ ఎడెన్, జోతీమణి, రమ్య హరిదాస్, దీన్ కురియాకోస్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో ప్రహ్లాద్ జోషీ మరో తీర్మానం ప్రవేశపెట్టారు. 9 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. వీకే శ్రీకందన్, బెన్నీ బెహనన్, మొహమ్మద్ జావెద్, పీఆర్ నటరాజన్, కనిమొళి, కె.సుబ్బరాయన్, ఎస్ఆర్ పార్తీబన్, ఎస్.వెంకటేశన్, మాణిక్కం ఠాగూర్‌ను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతను పర్యవేక్షించే బాధ్యత లోక్‌సభ సెక్రెటేరియట్దేనని స్పీకర్ ఓంబిర్లా చెప్పారు. సభ వాయిదా పడిన తర్వాత పలువురు విపక్ష సభ్యులు సభలోనే ఉండి ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని సస్పెండ్ చేశారు: కాంగ్రెస్ పార్లమెంట్ ఉభయ సభల నుంచి గురువారం మొత్తం 14 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విపక్ష ఎంపీలను కాదు, దేశ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం నుంచి సమాధానం కోరినందుకు ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం, భయానక చర్య అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం హత్య చేసిందని, పార్లమెంట్‌ను రబ్బర్ స్టాంప్ స్థాయికి దిగజార్చిందని దుయ్యబట్టారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆగంతకులు పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు కారణమైన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఎగువ సభలో తీవ్ర అలజడి పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశాయి. ఈ రోజు మిగతా కార్యకలాపాలను పక్కనపెట్టి, కేవలం భద్రతా వైఫల్యంపైనే సభలో చర్చ చేపట్టాలని పలువురు ఎంపీలు గురువారం ఉదయం 28 నోటీసులు ఇచ్చారు. వీటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తేలి్చచెప్పారు. సభకు సహకరించాలని కోరారు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేస్తుండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చైర్మన్ వేదిక ముందుకు చేరుకొని, గాల్లోకి చేతులు విసురుతూ గట్టిగా అరిచారు. ఆయన తీరుపై చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను «ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. డెరెక్ ఓబ్రెయిన్‌ను సభ నుంచి సస్పెండ్ చేయడానికి రూల్ 256 కింద తీర్మానం ప్రవేశపెట్టడానికి బీజేపీ పక్షనేత పీయూష్ గోయల్‌కు అనుమతి ఇచ్చారు. పీయూష్ గోయల్ తీర్మానం ప్రవేశపెట్టడం, మూజువాణి ఓటుతో అమోదం పొందడం, డెరెక్ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు వేయడం వెంటనే జరిగిపోయాయి. ఆయనను ఈ సెషన్లో మిగిలిన కాలమంతా స్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. సస్పెండ్ అయినప్పటికీ బయటకు వెళ్లకుండా సభలోనే కూర్చున్న డెరెక్ ఓబ్రెయిన్‌పై ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. నియమ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. అయినా ఓబ్రెయిన్ వినిపించుకోలేదు. రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ చెప్పారు. ఇదిలా ఉండగా, సభ నుంచి సస్పెండ్చేసినా బయటకు వెళ్లకుండా నిబంధనలను ఉల్లంఘించిన డెరెక్ ఓబ్రెయిన్ తీరుపై విచారణ జరపాలని సభా హక్కుల కమిటీకి జగదీప్ ధన్‌ఖడ్ సిఫార్సు చేశారు. సభలో లేకున్నా సస్పెన్షన్ లోక్‌సభలో రెండో విడతలో సస్పెండైన విపక్ష ఎంపీల్లో తమిళనాడుకు చెందిన ఎస్ఆర్ పార్తీబన్ పేరు కూడా ఉంది. వాస్తవానికి ఆయన గురువారం సభకు రాలేదని, చెన్నైలో ఉన్నారని ప్రతిపక్ష సభ్యులు చెప్పారు. సభలో లేని ఎంపీని సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. పొరపాటు జరిగిందని అంగీకరించారు. ఆయన పేరును తొలగిస్తున్నట్లు చెప్పారు. పార్తీబన్‌పై సస్పెన్షన్ వేటును స్పీకర్ ఉపసంహరించినట్లు తెలిపారు. గురువారం లోక్‌సభ నుంచి మొత్తం 13 మందిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. బుధవారం నాటి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామన్నారు. -
యాపిల్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: విపక్ష ఎంపీల ఐఫోన్లకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్‌ల ఉదంతంలో కేంద్ర సైబర్‌సెక్యూరిటీ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. భారత కంప్యూటర్ అత్యవసర స్పందనా బృందం(సీఈఆర్టీ–ఇన్) సంస్థ తన దర్యాప్తు ఇప్పటికే ప్రారంభించిందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ గురువారం చెప్పారు. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు ఐఫోన్ల దాడికి యత్నించినట్లు ఏమైనా ఆధారాలుంటే సమరి్పంచాలని ఐఫోన్ తయారీసంస్థ యాపిల్‌ను కోరుతూ కేంద్రం నోటీసులు పంపింది. సీఈఆర్టీ–ఇన్ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తుకు యాపిల్ సంస్థ సహకరించనుందని కృష్ణన్ చెప్పారు. సీఈఆర్టీ అనేది జాతీయ నోడల్ ఏజెన్సీ. కంప్యూటర్ భద్రతను సవాల్ చేసే ఘటనలు సంభవించినపుడు వెంటనే సీఈఆర్టీ స్పందించి తగు సూచనలు, సలహాలు ఇస్తుంది. -
ఎంపీ మహువా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఎథిక్స్ కమిటీ
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా గురువారం లోక్‌సభ నైతిక విలువల కమిటీ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే కమిటీ సంబంధం లేని చెత్త ప్రశ్నలు అడిగారంటూఎంపీ మహువాతోపాటు బీఎస్పీ ఎంపీ డ్యానిష్ అలీ, గిర్ధారీ యాదవ్‌తోపాటు మరికొంతమంది ప్రతిపక్ష ఎంపీలు విచారణ నుంచి మధ్యలోనే బయటకొచ్చారు. ఎథిక్స్ కమిటీ సభ్యులు వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలు అడుగుతున్నారంటూ మీడియా ముందు మహువా మండిపడ్డారు. రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని, అసలు ఇది ఎథిక్స్ కమిటేనా అని ప్రశ్నించారు. ‘నా కంట్లో నీళ్లు వస్తున్నాయంటూ చెత్త వాగుడు వాగుతున్నారు. మీకు నా కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయా’ అని ధ్వజమెత్తారు. అయితే మహువా చేసిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోంకర్ ఘాటుగా స్పందించారు. టీఎంపీ ఎంపీ విచారణకు సహకరించలేదని అన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిందని మండిపడ్డారు. ‘మొయిత్రా విచారణ సమయంలో సమాధానాలు చెప్పకుండా.. కమిటీ సభ్యులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకర పదజాలంతో చైర్మన్, ప్యానెల్ మెంబర్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడానికే మహువా, డ్యానిష్ అలీ, గిర్దారీ యాదవ్, ఇతర ప్రతిపక్ష ఎంపీలు కమిటీని నిందిస్తూ ఆకస్మాత్తుగా బయటకొచ్చేశారు. దీనిపై ప్యానెల్ మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటుంది’ అని వినోద్ సోంకర్ వెల్లడించారు. చదవండి: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వండి: ఈసీకి సుప్రీం ఆదేశం మరోవైపు మోయిత్రాను ఎథిక్స్ కమిటీ చైర్ పర్సన్ అడిగిన ప్రశ్నలు అనైతికంగా ఉన్నట్లు తాము గుర్తించామని కాంగ్రెస్ ఎంపీ, ప్యానెల్ సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అతను ఎవరో ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నాడనే విషయం అర్థమవుతోందన్నారు. ఇది మంచిది కాదని అన్నారు. కమిటీ సభ్యులు మహువా ‘ఎక్కడికి వెళ్లున్నారు? ఎక్కడ ఎవరిని కలుస్తున్నారు? మీ ఫోన్ రికార్డులు మాకు ఇవ్వగలరా?’ అంటూ చెత్త ప్రశ్నలు అడుగుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు.అదే విధంగా జనతాదళ్ఎంపీ గిరిధారి యాదవ్ మాట్లాడుతూ, మహువా మోయిత్రాను వ్యక్తిగత ప్రశ్నలు అడిగే హక్కు ప్యానెల్‌కు లేదని అన్నారు. -
విపక్షాల లొల్లి నడుమే... ‘ఢిల్లీ’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’పై గురువారం లోక్‌సభలో ఆమోద ముద్రపడింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ఈ బిల్లుపై లోక్‌సభలో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు?: కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బిల్లును ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ప్రభుత్వ పాలనా సరీ్వసులపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు ఉన్నాయంటూ న్యాయస్థానం చెప్పిందని గుర్తుచేశారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే, రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన శాసనసభలపై కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అధికారులే నడిపిస్తే ఇక ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఎందుకని నిలదీశారు. ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ వ్యవస్థను విచి్ఛన్నం చేయొద్దని కోరారు. డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ మాట్లాడుతూ.. ‘ఇండియా’ కూటమి బలంగా ఉందని, మీ గురించి ఆలోచించుకోండి అని బీజేపీకి హితవు పలికారు. 2024లో తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజలను బానిసలుగా మారుస్తారా?: కేజ్రివాల్ ఢిల్లీ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ గురువారం ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలను బానిసలుగా మార్చడానికే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆక్షేపించారు. ప్రజల హక్కులను లాక్కొనే బిల్లు ఎందుకని నిలదీశారు. బిల్లుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన వాదన ఒక్కటి కూడా లేదన్నారు. బిల్లు విషయంలో తప్పు చేస్తున్నట్లు కేంద్రానికి కూడా తెలుసని పేర్కొన్నాను. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే..: అమిత్ షా ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 239ఏఏ కింద పార్లమెంట్‌కు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఢిల్లీ బిల్లుపై లోక్‌సభలో తొలుత ఆయన చర్చను ప్రారంభించారు. కేవలం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఢిల్లీలోని అధికార ఆప్ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. ఢ్రిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కలి్పంచాలన్న సూచనను జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌బాయి పటేల్, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఢిల్లీ బిల్లు విషయంలో అసలు సమస్య అధికారుల బదిలీలు, పోస్టింగులపై నియంత్రణ గురించి కాదని, ఇప్పటిదాకా జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బిల్లును వ్యతిరేకిస్తున్నారని కేజ్రివాల్ పారీ్టపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బిల్లులు, చట్టాలు కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని తేలి్చచెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అందుకే మీరు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారని కాంగ్రెస్ సహా ఇతర పారీ్టలను ఉద్దేశించి అన్నారు. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాక ‘ఇండియా’ కూటమిలో ‘ఆప్’ భాగస్వామిగా ఉండబోదన్నారు. -
Parliament sessions 2023: పార్లమెంట్లో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో తక్షణమే చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. సోమవారం ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు ఆమోదం లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తర్వాత స్పీకర్ బిర్లా మాట్లాడారు. వెంటనే విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. విద్యా, ఆర్థిక శాఖలకు చెందిన ప్రశ్నలపై చర్చ మొదలైంది. ‘మీ స్థానాల్లోకి తిరిగి వెళ్లండి, సభకు సహకరించండి’ అని స్పీకర్ పదేపదే కోరినా విపక్ష సభ్యులు లెక్కచేయలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. లోక్‌సభ పునఃప్రారంభమైన తర్వాత సినిమాటోగ్రఫీ (సవరణ) బల్లు–2023ను ఆమోదించారు. ఈ బిల్లు రాజ్యసభలో గతంలోనే ఆమోదం పొందింది. పైరసీని అరికట్టడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, నినాదాలు కొనసాగుతుండడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో వాయిదాల పర్వం మణిపూర్ అంశంపై ‘267 నిబంధన’ కింద వెంటనే చర్చ చేపట్టాలని ఎగువసభలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జోషి చెప్పారు. విపక్ష ఎంపీలు ప్రధాని సమాధానం చెప్పాలని పునరుద్ఘాటించారు. దీంతో సభను చైర్మన్ ధన్‌ఖడ్ పలుమార్లు వాయిదా వేశారు. తొలుత ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం 2 గంటల దాకా, తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల దాకా, అనంతరం 3.30 గంటల వరకూ వాయిదా వేశారు. విపక్షాలు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ: పీయూష్ గోయల్ కేంద్రానికి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉందని, ఈ విషయం అందరికీ తెలుసని కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ చెప్పారు. సంఖ్యలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్నారు. మెజార్టీని నిరూపించుకున్న తర్వాతే బిల్లులను ఆమోదించాలన్న నిబంధన ఏదీ లేదని పేర్కొన్నారు. అవిశ్వాసం తీర్మానంపై ఎప్పుడు చర్చ చేపట్టాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని వివరించారు. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తేలి్చచెప్పారు. అలాగే మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగే యూపీఏ ప్రభుత్వ హయాంనాటి నిర్వాకాలు బయటపడతాయన్న భయంతో కాంగ్రెస్ పార్టీ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని పీయూష్ గోయల్ మండిపడ్డారు. -
Manipur violence: హింస నివారణలో ప్రభుత్వం విఫలం
ఇంఫాల్: మణిపూర్‌లో జాతి వైషమ్యాలను అదుపుచేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఆరోపించింది. మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో ప్రధాని మోదీ తీవ్ర ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారని పేర్కొంది. సత్వరమే పరిష్కరించకుంటే దేశ భద్రతకు సైతం సమస్యగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు ఈ మేరకు ఆదివారం రాష్ట్ర మహిళా గవర్నర్ అనసూయ ఉయికేకు ఇచి్చన వినతి పత్రంలో పేర్కొన్నారు. వారు శని,ఆదివారాల్లో మణిపూర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. బాధిత ప్రజలకు తక్షణమే పునరావాసం కలి్పంచాలని, రాష్ట్రంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా కాల్పులు, గృహ దహన ఘటనలు కొనసాగుతుండటాన్ని బట్టి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుండటంతో వదంతులు వ్యాప్తి చెంది జాతుల మధ్య విభేదాలు మరింతగా పెరిగాయన్నారు. జాతుల మధ్య పెరిగిన వైషమ్యాలను తక్షణమే చల్లార్చాల్సిన అవసరముందన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో తక్షణమే సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని గవర్నర్‌కు విపక్ష ఎంపీలు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో బయోమెట్రిక్ సర్వే 2021 సంవత్సరంలో మయన్మార్ దేశంలో సైనిక జుంటా అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లోకి పెరిగిన వలసలపై కేంద్రం అప్రమత్తమైంది. అక్రమంగా ప్రవేశించిన మయన్మార్ దేశస్తులను గుర్తించేందుకు బయోమెట్రిక్ సర్వే చేపట్టాలంటూ కేంద్రప్రభుత్వం ఇటీవల మణిపూర్, మిజోరం రాష్ట్రాలను ఆదేశించింది. మిజోరంలోని మొత్తం 11 జిల్లాల్లో కలిపి 30 వేల మందికిపైగా మయన్మార్ దేశస్తులున్నట్లు అంచనా. కేంద్రం నుంచి అందిన ఆదేశాల మేరకు ప్రస్తుతం సహాయక శిబిరాల్లో సర్వే చేపట్టినట్లు మిజోరం ముఖ్యమంత్రి లాల్ థంగ్లియానా ఆదివారం చెప్పారు. సెపె్టంబర్ 30వ తేదీలోగా మయన్మార్ దేశస్తుల నమోదు పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ కోరిందన్నారు. తమ వర్గానికి చెందిన వారే అయినందున తిరిగి మయన్మార్ పంపించలేక వారికి మానవతాదృక్పథంలో ఆశ్రయం కలి్పస్తున్నట్లు తెలిపారు. కొందరు బంధువుల వద్ద, అద్దె ఇళ్లలో ఉంటుండగా ఎక్కువ మంది సహాయ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారని చెప్పారు. -
మణిపూర్‌లో ఇండియా
ఇంఫాల్: కొంతకాలంగా హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో విపక్ష ‘ఇండియా’ కూటమి రెండు రోజుల పర్యటన శనివారం మొదలైంది. ఇందుకోసం కాంగ్రెస్‌తో పాటు పలు పారీ్టలకు చెందిన 21 మంది ఎంపీల బృందం శనివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరింది. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరితో పాటు కనిమొళి (డీఎంకే), సుష్మితా దేవ్ (తృణమూల్ కాంగ్రెస్), ఆర్జేడీ, ఆరెల్డీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, ఆరెస్పీ తదితర పారీ్టల ఎంపీలు వీరిలో ఉన్నారు. రాజకీయాలు చేసేందుకు రాలేదని అధీర్ స్పష్టం చేశారు. ‘‘కేవలం బాధితులను కలిసి వారి సమస్యలను అర్థం చేసుకోవడమే మా ఉద్దేశం. సమస్యకు పరిష్కారానికి అన్ని పారీ్టలూ చిత్తశుద్ధితో కృషి చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. మణిపూర్ కల్లోలం దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోందన్నారు. శనివారం తొలి రోజు ఇంఫాల్‌తో పాటు మొయ్రంగ్, విష్ణుపూర్ జిల్లాలతో పాటు తాజాగా హింసాకాండ చెలరేగిన చౌరాచంద్‌పూర్‌లో కూడా ఎంపీల బృందం పర్యటించింది. కుకీ తెగకు చెందిన బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించింది. వారికి ధైర్యం చెబుతూ గడిపింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించేలా ఒత్తిడి తేవాలని బాధితులు వారిని కోరారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హింసాకాండ బీజేపీ ఉద్దేశపూర్వకంగా అమలు చేస్తున్న కుట్ర ఫలితమేనని ఆరోపించారు. మణిపూర్ అంశంపై ప్రధాని, కేంద్ర మంత్రులు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అ«దీర్ దుయ్యబట్టారు. ‘‘మమ్నల్ని పార్లమెంటులో నోరెత్తనివ్వడం లేదు. అందుకే నేరుగా ప్రభావిత ప్రాంతాలకే వచ్చి, బాధితులతో మమేకమవుతున్నాం. వారు అనుభవించిన చిత్రహింసలకు సంబంధించిన దారుణ గాథలను వారి నోటే విని చలించిపోయాం’’ అని చెప్పారు. భద్రతా కారణాల రీత్యా ఇంఫాల్ నుంచి హెలికాప్టర్లో బృందం పర్యటన సాగింది. ఆదివారం వారు గవర్నర్ అనసూయా ఉయికెను కలిసి సమస్యపై చర్చిస్తారని సమాచారం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు గవర్నర్ తెలిపారు. ఇరు తెగత వారితోనూ చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. శనివారం చౌరాచంద్‌పూర్‌లో పునరావాస శిబిరాన్ని ఆమె సందర్శించారు. భారీ ర్యాలీ విపక్ష ఎంపీలు మణిపూర్‌లో అడుగు పెట్టిన రోజే రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన వేలాది మంది కుకీ తెగ ప్రజలు ఇంపాల్‌లో భారీ ర్యాలీ జరిపారు. తమ ప్రాబల్యమున్న ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన కావాలంటూ నినదించారు. మణిపూర్ సమగ్ర సమన్వయ కమిటీ సారథ్యంలో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది. భర్త, కొడుకుల మృతదేహాలు చూపించండి తన కుమారుడు, భర్త మృతదేహాలనైనా చూపించండంటూ అత్యాచార బాధితురాలు విపక్ష ఎంపీలను కోరారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ప్రత్యర్థి తెగకు చెందినవారు నగ్నంగా ఊరేగించడం తెలిసిందే. వారిలో ఒక మహిళను ఎంపీలు కనిమొళి (డీఎంకే), సుషి్మతాదేవ్ (టీఎంసీ) కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ Mýఆమె భర్తను, కొడుకును చంపడంతో పాటు ఆమె కూతురిపై కూడా అత్యాచారనికి ఒడిగట్టారన్నారు. ఈ కేసు విచారణను శనివారం సీబీఐ చేపట్టింది. మణిపూర్ హింసపై ఆరు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ గొంతులు అప్పుడేమైనట్టు: బీజేపీ మణిపూర్‌లో విపక్ష ఎంపీల పర్యటన ఫక్తు రాజకీయ నాటకమని బీజేపీ దుయ్యబట్టింది. గత ప్రభుత్వాల హయాంలో మణిపూర్ భగ్గున మండి నెలల తరబడి స్తంభించినప్పుడు వీరంతా పార్లమెంటులో కనీసం నోరైనా ఎత్తలేదెందుకని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. బీజేపీ విమర్శలను ఇండియా బృందం తిప్పికొట్టింది. ‘‘ప్రధాని సారథ్యంలో అఖిలపక్ష బృందం మణిపూర్‌లో పర్యటిస్తే అందులో ఆనందంగా భాగస్వాములం అయ్యేవాళ్లం. కానీ అందరికంటే ముందుగా, ఎక్కువగా స్పందించాల్సిన ఆయన అసలు సోదిలో కూడా లేకుండాపోయారు’అంటూ దుయ్యబట్టింది. -
పట్టువీడని విపక్షాలు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే పార్లమెంట్లో సమాధానం చెప్పాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్‌లో అమాయకులు బలైపోతున్నా ప్రధానమంత్రి ఎందుకు నోరువిప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపక్ష ఎంపీలు శుక్రవారం సైతం పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనకు దిగారు. అలాగే మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో తక్షణమే చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉభయసభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. కార్యకలాపాలేవీ జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో 3 బిల్లులకు ఆమోదం లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. 1978 మే 10న కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ జరిగిందని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి గుర్తుచేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందిస్తూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందని, అవిశ్వాస తీర్మానంపై 10 రోజుల్లోగా చర్చ చేపట్టవచ్చని తేలి్చచెప్పారు. సంఖ్యా బలం ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గందరగోళం మధ్యే పలు బిల్లులను సభ ఆమోదించింది. ఇదేమన్నా స్టేజీయా: చైర్మన్ ఆగ్రహం మణిపూర్ తదితర అంశాలపై చర్చకు రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. 47 మంది ఎంపీలు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నోత్తరాల ప్రాధాన్యతను వివరిస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ జోక్యం చేసుకున్నారు. అది తమకు తెలుసని, మణిపూర్ హింసపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాంతో, ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఇది నాటక రంగం కాదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఓబ్రెయిన్ బల్లపై చేతితో గట్టిగా కొడుతూ అరిచారు. ఆయన తీరును తప్పుబడుతూ సభను చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు. -
రాజ్యసభ నుంచి 19మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్
-
రాజ్యసభలో 19 విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చ జరపాలని రాజ్యసభ పోడియం ముందు విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నందున 19 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సభా కార్యకలాపాలను అడ్డుకొని, నిబంధనలను ఉల్లంఘించినందుకు వారం రోజులపాటు సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో ఏడుగురు టీఎంసీ ఎంపీలు, తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలు, అయిదుగురు డీఎంకే ఎంపీలు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. తెలంగాణ నుంచి బడుగు లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దామోదర రావు సస్పెండ్ అయ్యారు. కాగా సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ఉభయ సభల్లో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా ప్రధానమంత్రి డెవలప్మెంట్ ప్యాకేజీ కింద 5,000 మంది కాశ్మీరీ వలసదారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించినట్లు కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ‘ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద, 5,502 కాశ్మీరీ వలసదారులు ప్రభుత్వ ఉద్యోగాలను అందించాం. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ద్వారా లోయలో వివిధ విభాగాల్లో నిమగ్నమై ఉన్న కాశ్మీరీ వలస ఉద్యోగుల కోసం 6000 ట్రాన్సిట్ అకామిడేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది’ అని లోక్‌సభలో నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా తెలిపారు. చదవండి: ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
పార్లమెంట్లో పోటాపోటీ నిరసనలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎంపీల నడుమ శుక్రవారం కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రాజ్యసభ నుంచి సస్పెండైన 12 మంది ఎంపీలతోపాటు పలువురు విపక్ష సభ్యులు ఐదు రోజులుగా గాంధీజీ విగ్రహం వద్ద బైఠాయించి, నిరసన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బీజేపీ ఎంపీలు కూడా పోటీగా ప్లకార్డులు చేతబూని అక్కడికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎంపీలు కొద్దిసేపటి తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉన్న అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీగా వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. గాంధీజీ విగ్రహం వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. బీజేపీ సభ్యుల తీరుపై విపక్ష ఎంపీలు సభాపతులకు ఫిర్యాదు చేశారు. 12 మంది ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతంలోకి అధికార పార్టీ ఎంపీలు అనుమతి లేకుండా చొరబడ్డారని రాజ్యసభలో ఆర్జేడీ సభ్యుడు మనోజ్‌ఝా ఆరోపించారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి ఇదే అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ స్పందిస్తూ.. గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలిపే హక్కు బీజేపీ సభ్యులకు కూడా ఉందన్నారు. పార్లమెంట్‌లోని సెక్యూరిటీ సిబ్బందిపై ప్రతిపక్షాల దాడిపై బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారన్నారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్ పదవీ కాలం గరిష్టంగా ఐదేళ్లు! కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ల పదవీ కాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల దాకా పొడిగించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను కేంద్రం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్(సవరణ) బిల్లును కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సభలో ప్రవేశపెట్టారు. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో ఈ బిల్లులను తీసుకొచ్చారు. వీటిని కాంగ్రెస్ సభ్యులు శశి థరూర్, కె.సురేష్, అధిర్ రంజన్ చౌదరి, ఆర్ఎస్పీ సభ్యుడు ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతరాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. పదవీ కాలం పొడిగింపు అనేది సీబీఐ, ఈడీ డైరెక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి మరింత విధేయులుగా మారడానికి దోహదపడుతుంది తప్ప ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న చట్టాలు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలంపై ఎలాంటి పరిమితి విధించలేదని జితేంద్ర గుర్తుచేశారు. తాము ఐదేళ్ల పరిమితిని విధిస్తూ చట్టం తీసుకొస్తున్నామని వివరించారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు రెండేళ్ల పదవీ కాలాన్ని ఖరారు చేస్తూ వినీత్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. -
పార్లమెంటులో హింసాత్మక ధోరణి.. 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, 2021 చివరి రోజున రాజ్యసభలో హింసకు పాల్పడిన 12 మంది విపక్ష ఎంపీలపై తాజాగా సస్పెన్షన్ వేటు విధించారు. వీరంతా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సభకు హాజరుకాకుడదని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగా అసాధారణ దుష్ప్రవర్తన, ధిక్కార, హింసాత్మక, వికృత ప్రవర్తన కారణంగా వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. సస్పెండ్ చేసిన వారిలో ఆరుగురు కాంగ్రెస్ నేతలతో పాటు శివసేన నేత ప్రియాంక చతుర్వేది, అనిత్ దేశాయ్, టీఎంసీ డోలా సేన్, శాంతా ఛెత్రి, సీపీఎం నేత ఎలమరం కరీం, మరో సీపీఐ నేత ఉన్నారు. ఈ ఏడాది వర్షాకాల పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఆగస్టు 11న లోక్‌సభలో పెగాసస్ స్పైవేర్‌పై చర్చించాల్సిందిగా అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో విపక్ష నేతలు మహిళా సిబ్బందిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు వెలుగు చూశాయి. (చదవండి: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం..!) జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి సూచించాలని డిమాండ్ చేసినప్పటికీ దాన్ని ఆమోదించడంతో సభ దద్దరిల్లింది. ఇక సీసీటీవీ ఫుటేజీలో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో భద్రతా సిబ్బంది మీదకు దూసుకెళ్లడం కనిపించింది. నల్లజెండాలు చేతపట్టుకున్న ఎంపీలు టేబుల్స్ పైకిఎక్కి ఫైళ్లు, పత్రాలు చెల్లాచెదురు చేయడం సీసీటీవీలో రికార్డయ్యింది. (చదవండి: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. ‘ఇదేం బుద్ధి’ అంటూ శశి థరూర్‌పై విమర్శలు) మహిళా మార్షల్స్‌పై విపక్షాలు అసభ్యంగా ప్రవర్తించాయని ప్రభుత్వం ఆరోపించగా, ప్రతిపక్షం ఒక ఉమ్మడి ప్రకటనలో "మహిళా ఎంపీలతో సహా ప్రతిపక్ష నాయకులు, సభ్యులపై చేయి చేసుకోవడానికిగాను ప్రభుత్వం బయటి వ్యక్తులను తీసుకువచ్చింది" అని ఆరోపించింది. ఈ క్రమంలో నాటి హింసాత్మక ఘటనకు సంబంధించి 12 మంది ఎంపీలపై తాజాగా సస్పెన్షన్ వేటు వేశారు. చదవండి: శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్ -
రాజ్యసభ రగడ: విపక్ష ఎంపీలపై కేంద్రం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆందోళన వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. రాజ్యసభలో గందరగోళానికి కారణమైన విపక్ష ఎంపీలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష సభ్యలు అనుచిత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై బీజేపీ చీఫ్ శివ ప్రతాప్ శుక్లా నేతృత్వంలోని రాజ్యసభ ఎథిక్స్ కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. ఈ సమాశేంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు బుధవారం కొంతమంది ప్రతిపక్ష సభ్యులు మార్షల్స్‌పై దాడి చేయడంతోపాటు, హౌస్ ఆస్తులను ధ్వంసం చేశారన్న ప్రభుత్వం ఫిర్యాదుపై చర్చించనుంది. మరోవైపు సభలో ప్రతిపక్షాలు, ట్రెజరీ ఆస్తులు రెండూ సమానమేనని, రెండూరెండు కళ్లలాంటివని రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు శుక్రవారం ప్రకటించడం గమనార్హం. కాగా పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వ తీరుపై మండిపడిన విపక్షాలు కేంద్రం విమర్శలు గుప్పించాయి. బయటి వ్యక్తులకు మార్షల్స్ డ్రస్‌లు వేసి బుధవారం పార్లమెంట్‌లోకి తీసుకొచ్చి మహిళా ఎంపీలపై దాడి చేయించారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలే క్రమశిక్షణ ఉల్లంఘించి దురుసుగా ప్రవర్తించారని కేంద్రం కౌంటర్ ఎటాక్ చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను రిలీజ్ చేసింది. కాగా సభలో జరిగిన పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. Rajya Sabha Chairman M Venkaiah Naidu today asserted that the Opposition and Treasury benches in the House are like his two eyes and are equal for him. (File pic) pic.twitter.com/FKSwt7Ik4J — ANI (@ANI) August 13, 2021 -
జస్టిస్ లోయా మృతిపై సిట్ విచారణ జరపండి
న్యూఢిల్లీ: సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మృతిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ బృందంతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష ఎంపీలు రాష్ట్రపతి∙కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ నేతృత్వంలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల బృందం రాష్ట్రపతిని కలసి వినతిపత్రం అందచేసింది. ‘ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాం. సీబీఐ, ఎన్ఐఏలపై మాకు విశ్వాసం లేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎంపిక చేసిన స్వతంత్ర అధికారుల బృందంతో దర్యాప్తు చేయించాలని మేం కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలకు చెందిన 114 మంది ఎంపీలు వినతిపత్రంపై సంతకాలు చేశారు.