న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్‌మెంట్) బిల్లు–2023’పై గురువారం లోక్‌సభలో ఆమోద ముద్రపడింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ఈ బిల్లుపై లోక్‌సభలో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు?: కాంగ్రెస్
సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బిల్లును ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ప్రభుత్వ పాలనా సరీ్వసులపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు ఉన్నాయంటూ న్యాయస్థానం చెప్పిందని గుర్తుచేశారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే, రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన శాసనసభలపై కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అధికారులే నడిపిస్తే ఇక ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఎందుకని నిలదీశారు. ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ వ్యవస్థను విచి్ఛన్నం చేయొద్దని కోరారు. డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ మాట్లాడుతూ.. ‘ఇండియా’ కూటమి బలంగా ఉందని, మీ గురించి ఆలోచించుకోండి అని బీజేపీకి హితవు పలికారు. 2024లో తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.
ప్రజలను బానిసలుగా మారుస్తారా?: కేజ్రివాల్
ఢిల్లీ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ గురువారం ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలను బానిసలుగా మార్చడానికే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆక్షేపించారు. ప్రజల హక్కులను లాక్కొనే బిల్లు ఎందుకని నిలదీశారు. బిల్లుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన వాదన ఒక్కటి కూడా లేదన్నారు. బిల్లు విషయంలో తప్పు చేస్తున్నట్లు కేంద్రానికి కూడా తెలుసని పేర్కొన్నాను.
అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే..: అమిత్ షా
ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 239ఏఏ కింద పార్లమెంట్‌కు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఢిల్లీ బిల్లుపై లోక్‌సభలో తొలుత ఆయన చర్చను ప్రారంభించారు. కేవలం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఢిల్లీలోని అధికార ఆప్ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. ఢ్రిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కలి్పంచాలన్న సూచనను జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌బాయి పటేల్, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు.
ఢిల్లీ బిల్లు విషయంలో అసలు సమస్య అధికారుల బదిలీలు, పోస్టింగులపై నియంత్రణ గురించి కాదని, ఇప్పటిదాకా జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బిల్లును వ్యతిరేకిస్తున్నారని కేజ్రివాల్ పారీ్టపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బిల్లులు, చట్టాలు కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని తేలి్చచెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అందుకే మీరు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారని కాంగ్రెస్ సహా ఇతర పారీ్టలను ఉద్దేశించి అన్నారు. బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందాక ‘ఇండియా’ కూటమిలో ‘ఆప్’ భాగస్వామిగా ఉండబోదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment