walk out
-
అసెంబ్లీలో మంత్రి అనిత అనుచిత వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్‌రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. -
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గరంగరం.. మంత్రి వైఖరికి నిరసనగా వాకౌట్ చేసిన వైఎస్సార్సీపీ సభ్యులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రాజ్యసభలో వినేశ్ ఫొగట్ అంశం .. విపక్షాలపై ధన్‌ఖడ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజ్యసభ్య నుంచి ఇండియా కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడంపై చర్చకు అనుమతించకపోవడంతో ఇండియా కూటమి సభ్యులు రాజ్యసభ్య నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖాయమైన తర్వాత బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో తలపడాల్సిన మన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. పోరుకు కొన్ని గంటల ముందు నిర్వహించే వెయింగ్‌లో ఆమె బరువు 50 కేజీల 100 గ్రాములుగా వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువుంది. దాంతో నిబంధనల ప్రకారం ఆమెను డిస్క్వాలిఫై చేస్తు న్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో గురువారం రాజ్యసభలో వినేశ్ ఫొగాట్ డిస్క్వాలిఫై అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఒక్కరికే (ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ) హృదయం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. దేశం మొత్తం ఆమె పరిస్థితి చూసి బాధపడుతోంది. మీరిలా ప్రతీ (ఒలింపిక్స్‌లో డిస్క్వాలిఫై) అంశాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానించినట్లు కాదా అని వ్యాఖ్యానించారు. ప్రతి స్పందనగా విపక్షనేతలు నినాదాలు చేయడంతో.. ఆగ్రహించిన ధన్కర్ కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఇండియా కూటమి నేతలు ప్రకటించారు. #WATCH | Congress MP Deepender Hooda says, "Vinesh has not lost but she has won the hearts of crores of people. The sports system has lost. The government should give her all the facilities that are given to a gold medallist... Today a Rajya Sabha seat is vacant (in Haryana), we… pic.twitter.com/456mQEYea5— ANI (@ANI) August 8, 2024వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ అనర్హతకు సంబంధించిన అంశంపై చర్చించాలని మేము కోరాం. కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు అని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో డిస్క్వాలిఫై కావడంతో వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె రిటైర్మెంట్పై స్పందించిన తివారీ.. ఆశ కోల్పోవద్దని, దేశం మొత్తం ఆమెకు అండగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. -
విపక్షాల లొల్లి నడుమే... ‘ఢిల్లీ’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’పై గురువారం లోక్‌సభలో ఆమోద ముద్రపడింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ఈ బిల్లుపై లోక్‌సభలో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు?: కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బిల్లును ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ప్రభుత్వ పాలనా సరీ్వసులపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు ఉన్నాయంటూ న్యాయస్థానం చెప్పిందని గుర్తుచేశారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే, రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన శాసనసభలపై కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అధికారులే నడిపిస్తే ఇక ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఎందుకని నిలదీశారు. ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ వ్యవస్థను విచి్ఛన్నం చేయొద్దని కోరారు. డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ మాట్లాడుతూ.. ‘ఇండియా’ కూటమి బలంగా ఉందని, మీ గురించి ఆలోచించుకోండి అని బీజేపీకి హితవు పలికారు. 2024లో తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజలను బానిసలుగా మారుస్తారా?: కేజ్రివాల్ ఢిల్లీ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ గురువారం ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలను బానిసలుగా మార్చడానికే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆక్షేపించారు. ప్రజల హక్కులను లాక్కొనే బిల్లు ఎందుకని నిలదీశారు. బిల్లుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన వాదన ఒక్కటి కూడా లేదన్నారు. బిల్లు విషయంలో తప్పు చేస్తున్నట్లు కేంద్రానికి కూడా తెలుసని పేర్కొన్నాను. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే..: అమిత్ షా ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 239ఏఏ కింద పార్లమెంట్‌కు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఢిల్లీ బిల్లుపై లోక్‌సభలో తొలుత ఆయన చర్చను ప్రారంభించారు. కేవలం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఢిల్లీలోని అధికార ఆప్ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. ఢ్రిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కలి్పంచాలన్న సూచనను జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌బాయి పటేల్, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఢిల్లీ బిల్లు విషయంలో అసలు సమస్య అధికారుల బదిలీలు, పోస్టింగులపై నియంత్రణ గురించి కాదని, ఇప్పటిదాకా జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బిల్లును వ్యతిరేకిస్తున్నారని కేజ్రివాల్ పారీ్టపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బిల్లులు, చట్టాలు కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని తేలి్చచెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అందుకే మీరు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారని కాంగ్రెస్ సహా ఇతర పారీ్టలను ఉద్దేశించి అన్నారు. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాక ‘ఇండియా’ కూటమిలో ‘ఆప్’ భాగస్వామిగా ఉండబోదన్నారు. -
‘గెట్‌అవుట్‌రవి’.. వాకౌట్ చేసిన గవర్నర్‌పై తమిళుల నిరసన గళం
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలిరోజున సభ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగం పాఠాన్ని పలు చోట్ల విస్మరించడంతో వివాదం రాజేసింది. ద్రవిడ దిగ్గజాల పేర్లను ఆయన ప్రస్తావించకపోవడం, తమిళనాడు పేరు మార్చాలని వ్యాఖ్యనించటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవికి వ్యతిరేకంగా చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ‘గెట్‌అవుట్‌రవి’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో గవర్నర్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్లో పోస్టులు వెళ్లువెత్తుతున్నాయి. దీంతో గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. చెన్నైలో ట్విట్టర్ నంబర్ 1 ట్రెండింగ్ గెట్‌అవుట్‌రవి అనే పోస్టర్లు వెలిచాయి. పోస్టర్‌పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, యువజన సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా డీఎంకే పార్టీ నేతల ఫోటోలతో పోస్టర్లు ఉన్నాయి. గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చిన వారికి డీఎంకే నేతలు కృతజ్ఞతలు తెలిపారు. This one is ultimate #GetOutRavi pic.twitter.com/Q1B080wW0N — Vignesh Anand (@VigneshAnand_Vm) January 9, 2023 ఇదీ చదవండి: తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ‘వాకౌట్’ -
తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ‘వాకౌట్’
సాక్షి, చెన్నై: తమిళనాట గవర్నర్‌కు, డీఎంకే సర్కారుకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో కనీవినీ ఎరగని సంఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం సమావేశాల తొలి రోజు సభనుద్దేశించి గవర్నర్ ఆర్.ఎన్.రవి చేసిన ప్రసంగంలో ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠాన్ని పలుచోట్ల విస్మరించడం వివాదం రాజేసింది. అందులో పేర్కొన్న పేర్లలో వివేకానందున్ని మాత్రం ప్రస్తావించి పెరియార్, అన్నాదురై వంటి ద్రవిడ దిగ్గజాలను ఆయన పక్కన పెట్టారు. ద్రవిడ మోడల్ ఆదర్శంగా పలు అభివృద్ధి పథకాలను చేపట్టాం వంటి పాయింట్లనూ ప్రస్తావించలేదు. పైగా పలు అంశాలపై తన అభిప్రాయాలను కూడా జోడిస్తూ ప్రసంగించారు. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్లు ప్రసంగ పాఠానికి కట్టుబడటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో రవి తీరుపై అధికార డీఎంకే సభ్యులు భగ్గుమన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అనంతరం ఏకంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు సీఎం ఎంకే స్టాలిన్ సిద్ధమయ్యారు! ‘‘గవర్నర్ ప్రసంగంలోని అసంబద్ధ అంశాలను తిరస్కరించాలి. సభకు సమర్పించిన లిఖిత ప్రసంగ పాఠం మాత్రమే చెల్లుబాటవుతుందని ప్రకటించాలి’ అని అందులో కోరారు. కానీ స్టాలిన్ మాట్లాడుతుండగానే రవి హఠాత్తుగా లేచి సభ నుంచి నిష్క్రమించారు! అనంతరం తీర్మానాన్ని సభ ఆమోదించింది! రవి తీరు విచారకరమని, ద్రవిడ దిగ్గజాలతో పాటు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరునూ ప్రస్తావించకపోవడం శోచనీయమని స్పీకర్ అప్పవు అన్నారు. సభా సంప్రదాయాలను రవి తుంగలో తొక్కారంటూ మంత్రులు మీడియాతో మండిపడ్డారు. ‘‘జాతీయ గీతాలాపన జరగకుండానే సభను వీడారు. జాతీయ గీతాన్ని కూడా అవమానించారు’’ అని విమర్శించారు. డీఎంకే మద్దతుదారులు ట్విట్టర్లో ‘గెటౌట్రవి’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆయన బర్తరఫ్కు, రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ తీరును ఖండిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు డీఎంకే మిత్రపక్షాలు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, మనిదనేయ మక్కల్ కట్చి, తమిళర్ వాల్వురిమై కట్చి ప్రకటించాయి. బీజేపీ మాత్రం గవర్నర్‌కు మద్దతుగా నిలిచింది. గవర్నర్ సభలో ఉండగానే ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం పెడతారా అంటూ స్టాలిన్, స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించింది. డీఎంకే, దాని మిత్రపక్షాలు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దుయ్యబట్టారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా సీఎం తీర్మానం ప్రవేశపెట్టడాన్ని విపక్ష అన్నాడీఎంకే తప్పుబట్టింది. దీన్ని రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించింది. గవర్నర్, డీఎంకే సర్కారు మధ్య ఎంతోకాలంగా నిప్పూ ఉప్పు వంటి పరిస్థితి నెలకొని ఉంది. (చదవండి: యూత్ ఐకాన్‌గా రాహుల్ గాంధీ.. ఆ సత్తా ఉంది: శత్రుఘ్న సిన్హా) -
ఆ వైద్యుడు ప్రసంగం ప్రారంభంకాగానే... లేచి వెళ్లిపోయిన విద్యార్థులు.. ఎందుకంటే...
అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయం మెడికల్ స్కూల్లో వైట్‌కోట్ వేడుక జరుగుతోంది. ఈ సందర్భంగా వేదికపై డాక్టర్ క్రిస్టిన్ కొలియర్ అనే ప్రముఖ వైద్యుడు ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగం ఇలా ప్రారంభం కాగానే ఒక్కసారిగా విద్యార్థులంతా లేచి బయటకు వచ్చేశారు. దీంతో ఆ వేడుకకు వచ్చిన ప్రముఖులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి వైట్ కోట్ అనేది అధికారిక కార్యక్రమం. ఇది విద్యార్థులంతా వైద్య రంగంలోకి ప్రవేశించినందుకు గుర్తుగా వారందరికీ వైట్‌కోట్‌లు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ వైద్యుడిని ప్రధాన అతిధిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ...దాదాపు 340 మంది విద్యార్థులు యూనివర్సిటీ డీన్‌కి ఒక పిటిషన్ అందజేశారు కూడా. వాస్తవానికి వైద్యుడు కొలియర్ సోషల్ మీడియాలోనూ, పలు ఇంటర్వ్యూల్లోనూ అబార్షన్‌కి వ్యతిరేకంగా పలు ఉపన్యాసాలు ఇవ్వడంతో విద్యార్థుల్లో ఆయన పట్ల వ్యతిరేక భావం ఏర్పడింది. దీంతో కొత్తగా వైద్యారంగంలోకి వచ్చిన విద్యార్థులు, పూర్వపు విద్యార్థులతో సహా సుమారు 72 మంది కమ్యూనిటీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్ పై సంతకాలు చేశారు. అంతేగాదు అబార్షన్‌కి వ్యతిరేకంగా ప్రసంగిస్తూ ....విశ్వవిద్యాలయాల స్థితిని దిగజార్చారు, పైగా వైద్య విధానంలో ఒక వ్యక్తి ప్రాణ రక్షణ నిమిత్తం అబార్షన్ చేయడం లేదా చేయించుకోవడం అనేది ఒక భాగం అంటూ.... ఆయన ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పిటిషన్లో విద్యార్థులు పేర్కొన్నారు. Incoming medical students walk out at University of Michigan’s white coat ceremony as the keynote speaker is openly anti-abortion pic.twitter.com/Is7KmVV811 — Scorpiio (@PEScorpiio) July 24, 2022 (చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం... ఇద్దరు మృతి) -
లోక్‌సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నాల్గవరోజూ కూడా నిరసనల గళమే వినిపిస్తోంది. గురువారం ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలు ప్రారంభమై.. కాసేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం 11.30 గంకు లోక్‌సభ, మధ్యాహ్నాం 12 గం. రాజ్యసభ వాయిదా పడ్డాయి. అనంతరం ఉభయ సభలు మొదలుకాగా.. విపక్షాల నిరసనల నడుమే సభా కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో లోక్‌సభలో జీఎస్టీ పన్ను భారంపై చర్చకు టీఆర్ఎస్ఎంపీల పట్టుబట్టారు. స్పీకర్ చర్చకు నిరాకరించడంతో.. ఎంపీలు వాకౌట్ చేశారు. టీఆర్ఎస్ తో పాటు డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ వాకౌట్ చేశారు. -
జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ బయటకు?
తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్న కామెడీ షో జబర్దస్త్ . ఈ షో తరువాత వేరే చానళ్లలో పలు కామెడీ ప్రోగ్రామ్‌లు వచ్చినప్పటికీ దీనిని బీట్ చేయలేకపోయాయి. ఇందులోని కమెడియన్స్‌కు కూడా షో మంచి పేరును తీసుకొచ్చింది. వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో(జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్) నుంచి లక్షలు సంపాదిస్తున్న నటులూ ఉన్నారు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ ముందు వరుసలో ఉంటాడు. కేవలం సుధీర్ స్కిట్స్ కోసమే ఎక్స్ట్రా జబర్ధస్త్ చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చదవండి: అనారోగ్యంతో బిగ్‌బాస్‌కు జెస్సీ గుడ్‌బై జబర్దస్త్ కామెడీ షోకి ఎంతో మంది వచ్చారు వెళ్లిపోయారు. కానీ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌లోనే కొనసాగుతున్నాడు. సుధీర్‌తోపాటు తన టీం సభ్యులైన ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కూడా అతని వెంటే ఉన్నారు. ఇటు షోలు చేస్తూనే సమయం కుదిరినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తున్నాడు. వేరే కామెడీ షోలలో ఆఫర్లు వచ్చినా వాటిని రిజక్ట్ చేసేవాడే కానీ జబర్దస్త్‌ను మాత్రం వదల్లేదు. అయితే ప్రస్తుతం సుధీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. చదవండి: సుడిగాలి సుధీర్ పెళ్లి.. యువతి ఎవరంటే..! త్వరలోనే సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకి వచ్చేస్తాడని ప్రచారం గట్టిగానే జరుతుంది. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అతి త్వరలోనే సుధీర్ జబర్దస్త్ జర్నీకి శుభం కార్డ్ పడనుందని టాక్ వినిపిస్తోంది. అయితే సడెన్‌గా సుధీర్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో సరిగా తెలియదు కానీ ఇకపై షోలో తను కొనసాగేందుకు అతను ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం హీరోగా సుధీర్ మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటితోపాటు కమెడియన్‌గా కూడా చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇటు షో అటు సినిమా.. రెండు బ్యాలెన్స్ చేయడం కుదరకపోవడంతో తన అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. చదవండి: షూటింగ్ గ్యాప్‌లో ఇలా రచ్చ చేసిన విజయ్, పూరీ అయితే సుధీర్ బయటకు వస్తే అతను లేని జబర్దస్త్ ఊహించడం చాలా కష్టం. ఇప్పుడు అతను వెళ్లిపోతే కచ్చితంగా అతనితో పాటు గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం పూర్తిగా మాయమవుతుంది. లేదా సుధీర్ వెళ్లిపోతే.. శ్రీను, రాంప్రసాద్‌లో ఒకరు టీం లీడర్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా సుధీర్ వెళ్లిపోతే మాత్రం కచ్చితంగా షో టీఆర్పీ రేటింగ్స్‌పై మరింత ప్రభావం చూపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై సుధీర్ ఇప్పటి వరకు స్పందించలేదు. అతని నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
లోక్‌సభలో ‘ఉన్నావ్’ రభస
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని సజీవంగా తగలపెట్టేందుకు ప్రయత్నించిన ఘటనపై శుక్రవారం లోక్‌సభ అట్టుడికింది. చర్చ సందర్భంగా పలువురు సభ్యులు హైదరాబాద్‌లో దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను కూడా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు.. ఆమెను బెదిరిస్తున్న తీరులో వ్యవహరించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. జీరో అవర్‌లో ఉన్నావ్ ఘటనను లేవనెత్తిన కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి చేసిన ఒక వ్యాఖ్య బీజేపీ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది. ‘ఒకవైపు రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు సీతమ్మలను తగలబెడ్తున్నారు’ అని చౌధురి వ్యాఖ్యానించారు. ఉత్తర పదేశ్ చట్టాలు అమలుకాని అధర్మ ప్రదేశ్‌గా మారిందన్నారు. దీనిపై హోం మంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, ఉన్నావ్ ఘటనలను పోలుస్తూ.. ‘నిందితులను హైదరాబాద్ పోలీసులు కాల్చిపారేశారు.. ఉత్తరప్రదేశ్ పోలీసులు వదిలేశారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ ఉన్నావ్ ఘటనకు మతం రంగు పులముతున్నారని, రాజకీయం చేస్తున్నారని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. చదవండి: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి కాంగ్రెస్ సభ్యుల అనుచిత ప్రవర్తన ఇరానీ ఆవేశంగా మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు టీఎన్ ప్రతాపన్, దీన్ కురియకొసె గట్టిగా అరుస్తూ, ఆగ్రహంగా ఇరానీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రతీపన్ బెదిరింపు ధోరణిలో షర్ట్ చేతులను పైకి లాక్కోవడం కనిపించింది. దీనిపై ఇరానీ, బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లంచ్ బ్రేక్ తరువాత ఆ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభలోకి రాలేదు. వెంటిలేటర్‌పై ఉన్నావ్ బాధితురాలు మృతి ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ గతరాత్రి మృతి చెందింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. -
ఎస్పీజీ బిల్లుకు పార్లమెంటు ఓకే
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖులకు రక్షణ కల్పించే ఎస్పీజీ చట్టానికి చేసిన సవరణకు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజకీయ కక్షతోనే చట్ట సవరణ చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణలను హోం మంత్రి తిరస్కరించగా, ఇదే అంశంపై తమ నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చకు హోం మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వం దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రతపై ఆలోచన చేసిందని, ఒక్క గాంధీ కుటుంబం గురించి మాత్రం కాదని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయమూ తీసుకోదని, గతంలో కాంగ్రెస్ పార్టీ నే అలాంటి నిర్ణయాలు అనేకం తీసుకుందని విమర్శించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, దేవెగౌడ, మన్మోహన్ సింగ్‌ల ఎస్పీజీ భద్రతపై సమీక్షలు జరిపినప్పుడు ఎలాంటి చర్చ జరగలేదని, ఆయన అన్నారు. అయితే హోం మంత్రి సమాధానంపై సంతృప్తి చెందడం లేదంటూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ప్రధాని, కుటుంబ సభ్యులకు మాత్రమే.. ‘ప్రధానికి కేటాయించిన అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు ఎస్పీజీ రక్షణ కల్పిస్తాం. అధికారం కోల్పోయిన రోజు నుంచి ఈ సేవలు నిలిపివేస్తారు’ అని అమిత్ షా వివరించారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఆగంతకుల చొరబాటును ప్రస్తావిస్తూ.. నల్లటి టాటా సఫారీ వాహనంలో రాహుల్ వస్తారని ప్రియాంకకు సమాచారం ఉందని, కానీ మీరట్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు అదే వాహనంలో రావడంతో సిబ్బంది లోనికి అనుమతించారన్నారు. ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. -
సభకు కర్ణాటక సెగ
న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల సూచనల మేరకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందంటూ పార్లమెంటులో ఈ అంశంపై మంగళవారం కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. ఆ పార్టీ సభ్యులు ఆందోళనను విరమించకపోవడం, వివిధ ఇతర అంశాలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ, సీపీఎం సభ్యులు కూడా ఆందోళన చేపట్టడంతో రాజ్యసభ మంగళవారం పూర్తిగా వాయిదా పడింది. ఉదయం రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నేతృత్వంలో సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనలు, నినాదాలు చేశారు. దీంతో సభను వెంకయ్య వాయిదా వేసి, మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ కార్యకలాపాలను చేపట్టారు. ఆ సమయాన్ని ప్రశ్నోత్తరాలకు కేటాయించినప్పటికీ, సభ్యులు సభ మొదలవగానే వెల్‌లోకి వచ్చి నిరసనలకు దిగారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు హరివంశ్ ప్రకటించారు. 2 గంటలకు సమావేశమైనప్పుడు పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు. కాగా, మంగళవారం ఉదయం సభా కార్యకలాపాలను ప్రారంభించిన అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ముందే నిర్ణయించిన, సభలో ప్రస్తుతం చర్చించాల్సిన విషయాలను పక్కనబెట్టి కర్ణాటక అంశంపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్ నుంచి తనకు నోటీసు అందిందనీ, కానీ దీనికి ఒప్పుకోవడం లేదని తెలిపారు. లోక్‌సభలో నినాదాలు చేసిన రాహుల్ కర్ణాటక అంశంపై లోక్‌సభలోనూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలను ‘వేటాడే’ చర్యలను బీజేపీ ఆపివేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ నుంచి ఆ పార్టీ ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు సభలో కాంగ్రెస్‌పక్ష నాయకుడు అధిర్ రంజన్ మాట్లాడుతూ కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కూల్చడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలోనూ వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. చౌధరి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ సభలోకి వచ్చారు. ‘నియంతృత్వం నశించాలి. వేటాడే రాజకీయాలను ఆపేయాలి’ అని నినాదాలు చేశారు. ఈడీ, సీబీఐల చేత కేసులు పెట్టిస్తామని బెదిరిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత బీజేపీయే రాజీనామాలు చేయిస్తోందని బీకే హరివంశ్ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిర పరచడంలో తమ పాత్ర లేదని బీజేపీ చెప్పడం పెద్ద అబద్ధమన్నారు. -
గూగుల్‌కు ఉద్యోగుల షాక్
సింగపూర్/న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో పనిచేసే ఉద్యోగులు గురువారం ఆ సంస్థకు షాక్ ఇచ్చారు. మహిళా ఉద్యోగులపై లైంగికవేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల విషయంలో సంస్థ పక్షపాతంతో వ్యవహరించడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులు వాకౌట్ నిర్వహించారు. తొలుత జపాన్ రాజధాని టోక్యోలో ఉదయం 11.10 గంటలకు గూగుల ఉద్యోగులు అందరూ కంపెనీ నుంచి బయటకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం అమెరికా, భారత్, స్విట్జర్లాండ్, సింగపూర్, బ్రిటన్ సహా పలుదేశాల్లోని వేలాది మంది గూగుల్ ఉద్యోగులు ఉదయం 11.10కు(స్థానిక కాలమానం ప్రకారం) కార్యాలయాల నుంచి వాకౌట్ చేశారు. ఆండ్రాయిడ్ ఓఎస్ సృష్టికర్త ఆండీ రూబిన్, డైరెక్టర్ రిచర్డ్ డీవౌల్ సహా కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై గూగుల్ దశాబ్దకాలం పాటు మౌనం పాటించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల సంచలన కథనాన్ని ప్రచురించింది. కాగా, వేధింపులపై కోర్టును ఆశ్రయించేలా నిబంధనల్లో సవరణ, స్త్రీ–పురుషులకు సమాన వేతనం, కంపెనీ బోర్డులో తగిన ప్రాధాన్యం కల్పించడం వంటి సంస్కరణలు చేపట్టాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. -
కర్ణాటకం ముగిసింది!
బెంగళూరు: కర్ణాటకలో దాదాపు పది రోజులుగా సాగిన రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య సీఎం పీఠం అధిరోహించిన సీఎం కుమారస్వామి అసెంబ్లీ బలపరీక్షలో సునాయాసంగా విజయం సాధించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి సాగుతున్న ఉత్కంఠకు ముగింపు పలుకుతూ శుక్రవారం ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ సర్కారు మూజువాణి ఓటుతో నెగ్గింది. బీజేపీ ఎమ్మెల్యేలు ముందే వాకౌట్ చేయడంతో అవాంతరాలు లేకుండా బలపరీక్ష ఘట్టం ముగిసింది. కాంగ్రెస్‌కు చెందిన 78, జేడీఎస్‌కు చెందిన 37, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కలసి మొత్తం 117 మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో కుమారస్వామి ప్రభుత్వం గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ కుమార్ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చివరి నిమిషంలో తమ స్పీకర్ అభ్యర్థిని బీజేపీ ఉపసంహరించుకోవడంతో పోటీ లేకుండానే ఎన్నిక పూర్తయింది. పార్లమెంటరీ సంప్రదాయాల్ని అనుసరించి తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించినట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు తన పట్ల నమ్మకం చూపనందుకు బాధగా ఉన్నా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని కుమారస్వామి అన్నారు. బలపరీక్షలో కుమారస్వామిని ఓడించాలంటే 104 మంది సభ్యులున్న బీజేపీకి మరో 7గురు ఎమ్మెల్యేలు అవసరం. అయితే ఆ పార్టీ ముందే వాకౌట్ చేయడంతో అసెంబ్లీలో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోలేదు. వారం రోజుల వ్యవధిలో కర్ణాటక అసెంబ్లీలో ఇది రెండో బలపరీక్ష. మే 17న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో 19న రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్– జేడీఎస్ కూటమి తరఫున కుమారస్వామి మే 23న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నమ్మకం చూపనందుకు బాధగా ఉంది అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా నా పట్ల ప్రజలు నమ్మకం ఉంచనందుకు బాధగా ఉంది. ఐదేళ్లు సుస్థిర పాలనను అందిస్తాం. మా సొంత ప్రయోజనాలను తీర్చుకునేందుకు అధికారంలోకి రాలేదు’ అని చెప్పారు. తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడూ అధికారం కోసం అర్రులు చాచలేదని, ఎక్కువ సమయం ప్రతిపక్షంలోనే ఉన్నామని పేర్కొన్నారు. ‘2006లో బీజేపీతో నేను సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడపై అపనింద పడింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో లౌకిక ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దానిని తొలగించాను’ అని చెప్పారు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లుగానే రైతు రుణాలు మాఫీ చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్లను దుర్వినియోగం చేస్తోందని కుమారస్వామి ఆరోపించారు. మంత్రిత్వ శాఖల పంపకంపై చర్చలు బలపరీక్ష పూర్తవ్వడంతో మంత్రిత్వ శాఖల పంపకంపై జేడీఎస్–కాంగ్రెస్‌లు దృష్టిపెట్టాయి. శాఖల పంపిణీపై చర్చించేందుకు బలపరీక్ష పూర్తయిన కొద్దిసేపటికే ఇరు పార్టీల నేతలూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎల్పీ నేత సిద్దరామయ్య నివాసంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, జేడీఎస్ నేత హెచ్డీ రేవణ్న తదితరులు హాజరయ్యారు. మంత్రి పదవులపై అధిష్టానంతో చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. రైతురుణాల్ని మాఫీ చేయాలి సభ నుంచి వాకౌట్కు ముందు ప్రతిపక్ష నేత యడ్యూరప్ప సీఎం కుమారస్వామిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్‌కు సీఎం పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు. తన పోరాటం కాంగ్రెస్‌పై కాదని, కుమారస్వామిపైనే అన్నారు. కుమారస్వామి నమ్మక ద్రోహం గురించి అందరికీ తెలుసని, కుమారస్వామి, దేవెగౌడలు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తారని ఆ పార్టీ సభ్యుల్ని హెచ్చరించారు. కుమార స్వామి సీఎంగా ఉండడం నచ్చకనే సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ. 53 వేల కోట్ల రుణాల్ని మాఫీ చేస్తానని కుమారస్వామి ప్రకటించారని, ప్రస్తుత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోనే దానిపై ప్రకటన చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
లోక్ సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. హామీల అమలులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రధానమంత్రి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. ‘రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధానమంత్రి ధన్యవాద ప్రసంగానికి ముందే రాష్ట్ర విభజన గోడు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరాం. మా విన్నపాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. వాకౌట్ చేసి బయటకు వచ్చాం.’ అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రెండోరోజు కూడా సభలో తమ ఆందోళన కొనసాగించారు. సభ ప్రారంభం కాగానే వెల్‌లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. -
సభలో నేను ఉండకూడదని బాబు కుట్ర
-
'సభలో నేను ఉండకూడదని చంద్రబాబు కుట్ర'
హైదరాబాద్: ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాకౌట్ చేశారు. విచారణ జరగకుండానే తాను తప్పు చేసినట్లు ఎలా చెబుతారంటూ అంతకు ముందు ఆయన ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో వాదించారు. కమిటీ సభ్యులు రామకృష్ణ, శ్రవణ్‌ను చెవిరెడ్డి నిలదీశారు. వీడియో క్లిప్పుంగుల్లో తాను తప్పు చేసినట్లు ఎక్కడా లేదని ఆయన ఈ సందర్భంగా వారితో అన్నారు. సభ నుంచి తనను సస్పెండ్ చేయాలని ముందే నిర్ణయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రివిలేజ్ కమిటీనే కావాలని సభ్యుల హక్కులను కాలరాస్తోంది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తాను ఉండనే కూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని చెవిరెడ్డి చెప్పారు. -
'ఇంత దారుణమా.. సభకు సెలవు'
హైదరాబాద్: ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. ఓపక్క కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై చర్చ చేపట్టేందుకు అంగీకరించకపోవడం, మరోవైపు ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసే ప్రసక్తి లేదని ప్రభుత్వం చెప్పడంతో ఇక చేసేది లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా సభనుంచి బాయ్ కాట్ చేశారు. నేటి సమావేశంలో ఏం జరిగిందంటే.. సోమవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభంకాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా పలువురు మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సెక్స్ రాకెట్ పై చర్చ, దాని అనంతరం పరిణామాలను గత మూడు రోజులుగా ప్రజలు చూస్తున్నారని అన్నారు. కాల్ మనీపై చర్చ చేపట్టాలని, అలాగే రోజాపై సస్పెన్షన్ పునఃమీక్షించకుంటే తామంతా మూకుమ్మడిగా సభను బాయ్ కాట్ చేస్తామని తెలిపారు. రోజా సస్పెన్షన్‌పై అవసరం అయితే, కోర్టుకు కూడా వెళతామని అన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశం తీవ్రతను తగ్గించేలా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్నారంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అనంతరం విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ బీజేపీ ఒక జాతీయ పార్టీ అని తెలుసుకుంటే మంచిదని, తమ పార్టీ టీడీపీకి మిత్రపక్షం మాత్రమేనని అన్నారు. ప్రతిసారి కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటూ అదేదో పెద్ద రాకెట్ గా చెప్పే ప్రయత్నం చేయడం సరికాదని, అది పేపర్ కటింగ్స్ లో తప్ప అంత తీవ్రతతో ఉన్నది కాదన్నట్లుగా మాట్లాడారు. అనంతరం ప్రభుత్వం తరుపున మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసేది లేదని స్పష్టం చేశారు. సెక్స్ రాకెట్ పై చర్చ ఇప్పటికే పూర్తయిందని కూడా అన్నారు. ఆ వెంటనే స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్నే తిరిగి మరోసారి ప్రస్తావిస్తూ రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసేది లేదని, ఇప్పుడు మీ నిర్ణయమేమిటో చెప్పాలని ప్రశ్నించగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేచి మాట్లాడారు. తాము ఇంతగా విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తూ అధికారం ఉందికదా అని ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే తాము అంగీకరించేది లేదన్నారు. బీఏసీ లో జరిగిన వ్యవహారాలు చెప్పాలని తమ ఎమ్మెల్యే ప్రయత్నించినా వినకపోవడం, కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చకు అంగీకరించకపోవడం, రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయనని చెప్పడం చాలా దారుణం అని, ఇంతకంటే బాధపెట్టే విషయం మరొకటి లేదని, ఇక మీకు సెలవు అంటూ తమ పార్టీ నేతలతో మూకుమ్మడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. -
'హడావుడి' బిల్లులపై విపక్షం వాకౌట్
సాక్షి, హైదరాబాద్: నిర్మాణాత్మక చర్చ చేపట్టడానికి అవకాశం లేకుండా అసెంబ్లీలో హడావుడిగా బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందడాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ఇప్పటికిప్పుడే ప్రవేశపెట్టి, ఇప్పుడే చర్చించడం ఎలా సాధ్యమని విపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రశ్నిం చారు. బిల్లులు పెడుతున్న విధానాన్ని నిశితంగా విమర్శించారు. గురువారం సభలో ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనుమతించినప్పుడు.. విపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడారు. కనీసం 7రోజుల సమయం ఇవ్వాలని సూచిస్తున్న రూల్-90లోని నాలుగో పేరాని విపక్ష నేత సభలో చదివి వినిపించారు. అందుకే తాను 15రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసినా, 5రోజులకే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌కు ఉన్న విశేషాధికారాన్ని ఉపయోగించుకొని బిల్లులు ప్రవేశపెట్టిన వెంటనే చర్చ, ఆమోదం అనడం సభాసంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు. గురువారం ప్రవేశపెడుతున్న బిల్లులో వివాదాస్పదమైనవీ ఉన్నాయని, కేసులను వేగవంతం చేసి ఆస్తులను ఆటాచ్ చేసే బిల్లును ప్రత్యర్థులను వేధించడానికి ప్రభుత్వం వాడుకుంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయన్నారు. బిల్లులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చర్చించడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. విపక్ష నేత జగన్ సూచనకు స్పీకర్ కోడెల సానుకూలంగా స్పందించలేదు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చానని సమాధానం ఇచ్చారు. 'ప్రతిపక్షం అడిగినా ఇలా తోసిపుచ్చుతామంటే(బుల్డోజ్ చేస్తామంటే)...' అని జగన్ మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్‌చేసి ఆర్థిక మంత్రి యనమలకు ఇచ్చారు. ఎవరినీ బుల్డోజ్ చేసే ఉద్దేశం లేదని, సమయం లేకపోవడం, అత్యవసరం దృష్ట్యా ఇలా చేయాల్సి వచ్చిందని యనమల వివరణ ఇచ్చారు. జగన్ మళ్లీ గట్టిగా ప్రశ్నించారు. 'ఆయన(మంత్రి) 'మూవ్' అంటారు.. మీరు(స్పీకర్) ఐస్ హ్యావ్ ఇట్ అంటారు.. అయిపోతుంది. ఇదేనా బిల్లులకు ఆమోదం తెలిపే పద్ధతి?' అని మండిపడ్డారు. ‘ఇదే మాదిరి బుల్డోజ్ చేస్తామంటే సభలో ప్రతిపక్షం ఉండటం ఎందుకు? ఈ వైఖరికి నిరసనగా మేం వెళతాం. తర్వాతే పిలవండి' అని చెబుతూ సభ నుంచి వాకౌట్ చేశారు. -
అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్
-
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సిపి వాకౌట్
హైదరాబాద్: బడ్జెట్‌పై చర్చించడానికి శాసనసభలో తగిన సమయం ఇవ్వనందుకు నిరసన తెలుపుతూ వైఎస్ఆర్ సిపి వాకౌట్ చేసింది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మళ్లీ సభలో గొడవ జరిగింది. ప్రతిపక్షానికి గంటన్నర సమయం మాత్రమే ఇచ్చారు. ఈ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి మాట్లాడుతూ గత శాసనసభ సమావేశాలలో ప్రతిపక్ష నేతకు ఎంత సమయం ఇచ్చారో చూసి, ఆ మేరకు తమకు కూడా సమయం ఇవ్వమని కోరారు. సభలో ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షమని ఆయన గుర్తు చేశారు. తమకు సమయం ఇవ్వకపోతే నిరసనగా వాకౌట్ చేయడం తప్ప తమకు మరో మార్గంలేదని చెప్పారు. అయినా సమయం ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్ సిపి సభ్యులు వాకౌట్ చేశారు. -
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
-
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వాకౌట్ చేసింది. అంతకుముందు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అసెంబ్లీలో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన బిల్లులోని అన్ని అంశాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సభలో ఏకాభిప్రాయం లేనప్పుడు రాష్ట్రాన్ని ఏలా విభజిస్తారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని, ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరుగుతుందని ఆరోపించారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరగాలని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్-3 వినియోగంలో అన్యాయం చేస్తున్నారని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అందుకు నిరసనగా తమ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్ విజయమ్మ సభలో ప్రకటించారు. -
సమైక్యం అంటే సంకెళ్లా!
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గురువారం శాసనసభలో సస్పెండ్ చేశారు. దీనిని నిరసిస్తూ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ ఎదుట రోడ్డుపై వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఆందోళన చేస్తున్న విజయమ్మ, శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే పీఆర్కే తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. -
ఎన్ఐసీ సమావేశం నుంచి చంద్రబాబు వాకౌట్
జాతీయ సమైక్యత మండలి (ఎన్ఐసీ) సమావేశం నుంచి టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు వాకౌట్ చేశారు. సోమవారం ఢిల్లీలో ఆరంభమైన ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబు ఆంద్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజన గురించి ప్రస్తావించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ వెంటనే జోక్యం చేసుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్య గురించి చర్చించేందుకు ఎన్ఐసీ వేదిక కాదని చెప్పారు. కేంద్ర మంత్రులు పి.చిదంబరం, సుశీల్ కుమార్ కూడా చంద్రబాబు తెలంగాణ సమస్యను ప్రస్తావించడాన్నివ్యతిరేకించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, మత ఘర్షణల గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు తెలంగాణ సమస్య ప్రస్తావించడంతో వారు అభ్యంతరం తెలిపారు. ఐతే తెలంగాణ గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే సమావేశంలో ఉండనని చెప్పిన చంద్రబాబు వాకౌట్ చేశారు.