'సభలో నేను ఉండకూడదని చంద్రబాబు కుట్ర' | ysrcp mla chevireddy bhaskar reddy takes on Privilege Committee | Sakshi
Sakshi News home page

'సభలో నేను ఉండకూడదని చంద్రబాబు కుట్ర'

Published Thu, Dec 22 2016 2:08 PM | Last Updated on Tue, May 29 2018 3:48 PM

'సభలో నేను ఉండకూడదని చంద్రబాబు కుట్ర' - Sakshi

'సభలో నేను ఉండకూడదని చంద్రబాబు కుట్ర'

హైదరాబాద్‌: ఏపీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం నుంచి వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వాకౌట్‌ చేశారు. విచారణ జరగకుండానే తాను తప్పు చేసినట్లు ఎలా చెబుతారంటూ అంతకు ముందు ఆయన ప్రివిలేజ్‌ కమిటీ సమావేశంలో వాదించారు. కమిటీ సభ్యులు రామకృష్ణ, శ్రవణ్‌ను చెవిరెడ్డి నిలదీశారు.

వీడియో క్లిప్పుంగుల్లో తాను తప్పు చేసినట్లు ఎక్కడా లేదని ఆయన ఈ సందర్భంగా వారితో అన్నారు. సభ నుంచి తనను సస్పెండ్ చేయాలని ముందే నిర్ణయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రివిలేజ్‌ కమిటీనే కావాలని సభ్యుల హక్కులను కాలరాస్తోంది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తాను ఉండనే కూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని చెవిరెడ్డి చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement