
అసెంబ్లీలో ప్రసంగిస్తున్న వైఎస్ విజయమ్మ
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వాకౌట్ చేసింది. అంతకుముందు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అసెంబ్లీలో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన బిల్లులోని అన్ని అంశాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సభలో ఏకాభిప్రాయం లేనప్పుడు రాష్ట్రాన్ని ఏలా విభజిస్తారని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని, ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరుగుతుందని ఆరోపించారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరగాలని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్-3 వినియోగంలో అన్యాయం చేస్తున్నారని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అందుకు నిరసనగా తమ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్ విజయమ్మ సభలో ప్రకటించారు.