న్యూఢిల్లీ: రాజ్యసభ్య నుంచి ఇండియా కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడంపై చర్చకు అనుమతించకపోవడంతో ఇండియా కూటమి సభ్యులు రాజ్యసభ్య నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖాయమైన తర్వాత బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో తలపడాల్సిన మన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. పోరుకు కొన్ని గంటల ముందు నిర్వహించే వెయింగ్‌లో ఆమె బరువు 50 కేజీల 100 గ్రాములుగా వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువుంది. దాంతో నిబంధనల ప్రకారం ఆమెను డిస్‌క్వాలిఫై చేస్తు న్నట్లు ప్రకటించారు.
ఈ తరుణంలో గురువారం రాజ్యసభలో వినేశ్ ఫొగాట్ డిస్‌క్వాలిఫై అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఒక్కరికే (ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ) హృదయం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. దేశం మొత్తం ఆమె పరిస్థితి చూసి బాధపడుతోంది. మీరిలా ప్రతీ (ఒలింపిక్స్‌లో డిస్‌క్వాలిఫై) అంశాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానించినట్లు కాదా అని వ్యాఖ్యానించారు. ప్రతి స్పందనగా విపక్షనేతలు నినాదాలు చేయడంతో.. ఆగ్రహించిన ధన్‌కర్ కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఇండియా కూటమి నేతలు ప్రకటించారు.
#WATCH | Congress MP Deepender Hooda says, "Vinesh has not lost but she has won the hearts of crores of people. The sports system has lost. The government should give her all the facilities that are given to a gold medallist... Today a Rajya Sabha seat is vacant (in Haryana), we… pic.twitter.com/456mQEYea5
— ANI (@ANI) August 8, 2024
వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ అనర్హతకు సంబంధించిన అంశంపై చర్చించాలని మేము కోరాం. కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు అని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో డిస్‌క్వాలిఫై కావడంతో వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె రిటైర్మెంట్‌పై స్పందించిన తివారీ.. ఆశ కోల్పోవద్దని, దేశం మొత్తం ఆమెకు అండగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment