ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆధిక బరువు కారణంగా అనర్హత వేటు పడి పతకాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే ఆమె తన రెజ్లింగ్ కెరీర్‌కు విడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది.
అయితే ఇప్పుడు వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎక్స్‌లో ఉద్వేగభరిత పోస్టు షేర్ చేసిన ఆమె.. అందులో పలు విషయాలను ప్రస్తావించింది. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేను కానీ, రెజ్లింగ్ కొనసాగించే సత్తా మాత్రం తనకు ఉందని ఫోగట్ తెలిపింది.
"నా బృందానికి, నా తోటి భారతీయులకు, నా ఫ్యామిలీకి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మా లక్ష్యాన్ని మేము ఇంకా చేరుకోలేదు. ఏదో మిస్ అయినట్లు అన్పిస్తోంది. అయితే పరిస్థితులు ఇకపై మునపటిలా ఉండకపోవచ్చు.
నేను 2032 వరకు రెజ్లింగ్ వృత్తిని కొనసాగించాలని భావిస్తున్నాను. కానీ భవిష్యత్ నా కేరీర్ ను ఎలా నిర్ణయిస్తుందో తెలియదు. కానీ నేను నమ్మిన దాని కోసం నా పోరాటం ఆపనని వినేష్ పేర్కొంది.
అదే విధంగా ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ టీమ్‌పై ఫోగట్ ప్రశంసల వర్షం కురిపించింది. వీరేన్ రస్కిన్హా, యతిన్ భట్కర్‌లతో పాటు చాలా మంది ఇతర అథ్లెట్లు నాకు మద్దతుగా నిలిచారు. వారి సపోర్ట్‌తోనే నేను ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించగలిగాను. నాకు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు అంటూ ఫోగట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment