
సమైక్యం అంటే సంకెళ్లా!
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గురువారం శాసనసభలో సస్పెండ్ చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గురువారం శాసనసభలో సస్పెండ్ చేశారు. దీనిని నిరసిస్తూ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ ఎదుట రోడ్డుపై వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఆందోళన చేస్తున్న విజయమ్మ, శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే పీఆర్‌కే తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.