
వరుడు అంకిత్‌రెడ్డిని దీవిస్తున్న వైఎస్ విజయమ్మ
సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు చవ్వా రాజశేఖరరెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం హాజరయ్యారు. ఈసందర్భంగా కలశ పూజలో పాల్గొని వరుడు అంకిత్‌రెడ్డిని దీవించారు. అనంతరం పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేసి ఆమె వెనుదిరిగారు.
అంతకముందు అనంతకు చేరుకున్న వైఎస్ విజయమ్మకు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్వీవీయూ పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి నయనతారెడ్డి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ చైర్‌పర్సన్ రాగే హరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ ఎల్‌ఎం ఉమ, వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి, గౌస్‌బేగ్, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి, విద్యాసాగర్‌రెడ్డి, అనిల్‌కుమార్ గౌడ్, కొర్రపాడు హుస్సేన్‌పీరా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment