Sudigali Sudheer: Walk Out From Jabardasth Show Rumors Are Viral - Sakshi
Sakshi News home page

Sudigali Sudheer: జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్‌ అవుట్‌..

Published Sat, Nov 13 2021 8:52 PM | Last Updated on Sun, Nov 14 2021 10:34 AM

Rumors Are Viral About Sudigali Sudheer Walk Out From Jabardasth - Sakshi

తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్న కామెడీ షో జబర్దస్త్ . ఈ షో తరువాత వేరే చానళ్లలో పలు కామెడీ ప్రోగ్రామ్‌లు వచ్చినప్పటికీ దీనిని బీట్‌ చేయలేకపోయాయి. ఇందులోని కమెడియన్స్‌కు కూడా షో మంచి పేరును తీసుకొచ్చింది. వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో(జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌) నుంచి లక్షలు సంపాదిస్తున్న నటులూ ఉన్నారు. జబర్దస్త్ ద్వారా ఫేమస్‌ అయిన వారిలో సుడిగాలి సుధీర్‌ ముందు వరుసలో ఉంటాడు. కేవలం సుధీర్ స్కిట్స్ కోసమే ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌ చూసే వాళ్లు  ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 
చదవండి: అనారోగ్యంతో బిగ్‌బాస్‌కు జెస్సీ గుడ్‌బై

జబర్దస్త్ కామెడీ షోకి ఎంతో మంది వచ్చారు వెళ్లిపోయారు. కానీ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్‌లోనే కొనసాగుతున్నాడు. సుధీర్‌తోపాటు తన టీం సభ్యులైన ఆటో రాంప్రసాద్‌, గెటప్‌ శ్రీను కూడా అతని వెంటే ఉన్నారు. ఇటు షోలు చేస్తూనే సమయం కుదిరినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తున్నాడు. వేరే కామెడీ షోలలో ఆఫర్లు వచ్చినా వాటిని రిజక్ట్‌ చేసేవాడే కానీ జబర్దస్త్‌ను మాత్రం వదల్లేదు. అయితే ప్రస్తుతం సుధీర్‌కు సంబంధించిన ఓ  ఆసక్తికరమైన విషయం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.
చదవండి: సుడిగాలి సుధీర్ పెళ్లి.. యువతి ఎవరంటే..!

త్వరలోనే సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకి వచ్చేస్తాడని ప్రచారం గట్టిగానే జరుతుంది. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అతి త్వరలోనే సుధీర్ జబర్దస్త్ జర్నీకి శుభం కార్డ్ పడనుందని టాక్‌ వినిపిస్తోంది. అయితే సడెన్‌గా సుధీర్‌ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో సరిగా తెలియదు కానీ ఇకపై షోలో తను కొనసాగేందుకు అతను ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం హీరోగా సుధీర్‌ మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటితోపాటు కమెడియన్‌గా కూడా చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇటు షో అటు సినిమా.. రెండు బ్యాలెన్స్ చేయడం కుదరకపోవడంతో తన అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.
చదవండి: షూటింగ్‌ గ్యాప్‌లో ఇలా రచ్చ చేసిన విజయ్‌, పూరీ

అయితే సుధీర్‌ బయటకు వస్తే అతను లేని జబర్దస్త్ ఊహించడం చాలా కష్టం. ఇప్పుడు అతను వెళ్లిపోతే కచ్చితంగా అతనితో పాటు గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ కూడా బయటికి వచ్చే ఛాన్స్‌ ఉంది. అదే జరిగితే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం పూర్తిగా మాయమవుతుంది. లేదా సుధీర్‌ వెళ్లిపోతే.. శ్రీను, రాంప్రసాద్‌లో ఒకరు టీం లీడర్‌ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా సుధీర్‌ వెళ్లిపోతే మాత్రం కచ్చితంగా షో టీఆర్పీ రేటింగ్స్‌పై మరింత ప్రభావం చూపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై సుధీర్‌ ఇప్పటి వరకు స్పందించలేదు. అతని నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement