Government of Delhi
-
విపక్షాల లొల్లి నడుమే... ‘ఢిల్లీ’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’పై గురువారం లోక్‌సభలో ఆమోద ముద్రపడింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ఈ బిల్లుపై లోక్‌సభలో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు?: కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బిల్లును ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ప్రభుత్వ పాలనా సరీ్వసులపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు ఉన్నాయంటూ న్యాయస్థానం చెప్పిందని గుర్తుచేశారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే, రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన శాసనసభలపై కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అధికారులే నడిపిస్తే ఇక ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఎందుకని నిలదీశారు. ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ వ్యవస్థను విచి్ఛన్నం చేయొద్దని కోరారు. డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ మాట్లాడుతూ.. ‘ఇండియా’ కూటమి బలంగా ఉందని, మీ గురించి ఆలోచించుకోండి అని బీజేపీకి హితవు పలికారు. 2024లో తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజలను బానిసలుగా మారుస్తారా?: కేజ్రివాల్ ఢిల్లీ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ గురువారం ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలను బానిసలుగా మార్చడానికే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆక్షేపించారు. ప్రజల హక్కులను లాక్కొనే బిల్లు ఎందుకని నిలదీశారు. బిల్లుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన వాదన ఒక్కటి కూడా లేదన్నారు. బిల్లు విషయంలో తప్పు చేస్తున్నట్లు కేంద్రానికి కూడా తెలుసని పేర్కొన్నాను. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే..: అమిత్ షా ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 239ఏఏ కింద పార్లమెంట్‌కు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఢిల్లీ బిల్లుపై లోక్‌సభలో తొలుత ఆయన చర్చను ప్రారంభించారు. కేవలం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఢిల్లీలోని అధికార ఆప్ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. ఢ్రిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కలి్పంచాలన్న సూచనను జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌బాయి పటేల్, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఢిల్లీ బిల్లు విషయంలో అసలు సమస్య అధికారుల బదిలీలు, పోస్టింగులపై నియంత్రణ గురించి కాదని, ఇప్పటిదాకా జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బిల్లును వ్యతిరేకిస్తున్నారని కేజ్రివాల్ పారీ్టపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బిల్లులు, చట్టాలు కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని తేలి్చచెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అందుకే మీరు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారని కాంగ్రెస్ సహా ఇతర పారీ్టలను ఉద్దేశించి అన్నారు. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాక ‘ఇండియా’ కూటమిలో ‘ఆప్’ భాగస్వామిగా ఉండబోదన్నారు. -
ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్‌టైమ్ రికార్డు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో యమునా నది మరింత ఉధృతరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం గురువారం ఉదయం నాటికి 208.46 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత యమునా నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీనిని ‘తీవ్ర పరిస్థితి’గా కేంద్ర జల సంఘం పేర్కొంది. ఇక నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం సూచించింది. బుధవారం నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 అమిత్ షాకు కేజ్రివాల్ లేఖ ఢిల్లీలో వరద ఉధృతి పెరుగుతోందని, యమునలో నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో భీకర వరదలు రావడం ప్రపంచానికి మంచి సందేశం కాదని చెప్పారు. జి–20 సదస్సుకు త్వరలో ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోంశామంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హరియాణాలోని హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఢిల్లీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసిందని తెలిపారు. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 హిమాచల్‌లో 88 మంది మృతి హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నంకల్లా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. మరో 16 మంది గల్లంతయ్యారు. 100 మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోయాయి. #WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr — ANI (@ANI) July 13, 2023 మరోవైపు పంజాబ్, హరియాణాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. హరియాణాలో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పంజాబ్‌లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హిమాచల్‌లోని మండీలో పూర్తిగా ధ్వంసమైన వంతెన -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఆర్డినెన్స్
‘ఢిల్లీ ఆర్డినెన్స్’ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ (సవరణ) చట్టం, 2023, ఢిల్లీలో పరిపాలనా రూపాన్ని మారుస్తుంది. ఈ ఆర్డినెన్స్, స్పష్టమైన కారణం లేకుండా, ‘సేవలకు’ సంబంధించి అధికారాలను వినియోగించుకునే వీలును ఢిల్లీ ప్రభుత్వానికి లేకుండా చేస్తోంది. దీనికి బదులుగా, ఇది భారత ప్రభుత్వానికి అపరిమిత అధికారాన్ని ఇచ్చింది. పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిని, మంత్రులను రబ్బర్ స్టాంప్ కంటే తక్కువ స్థాయికి కుదించింది. దీంతో ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం చుక్కాని లేనిదిగా మిగిలిపోయింది. పైగా, ప్రజల అభీష్టం అనేది ఏ మాత్రం విలువ లేనిదిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ పాలన ఎలా ఉంటుందనేది ఆశ్చర్యంగానే ఉంది. అంబేడ్కర్, సుప్రీంకోర్టు అభిప్రాయాలను కలిపి చదివినట్లయితే, దురదృష్టవశాత్తు ఆర్డినెన్స్ రాజ్యాంగ నైతికతను విస్మరించిందని స్పష్టమవుతోంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ 1948 నవంబర్ 4న రాజ్యాంగ సభలో రాజ్యాంగ నైతికత గురించి ప్రసంగించారు. ఆయన ఇలా అన్నారు: ‘‘ప్రజాస్వామ్య రాజ్యాంగం శాంతియుతంగా పనిచేయడానికి రాజ్యాంగ నైతికత వ్యాప్తి ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించినప్పటికీ, దానితో పరస్పరం అనుసంధానితమైన రెండు అంశాలను దురదృష్టవశాత్తు సాధారణంగా గుర్తించలేదు. ఒకటి, పరిపాలనా రూపానికి రాజ్యాంగ రూపంతో దగ్గరి సంబంధం ఉంది. రెండోది, దాని రూపాన్ని మార్చకుండా కేవలం పరిపాలనా రూపాన్ని మార్చడం ద్వారా రాజ్యాంగాన్ని వక్రీకరించగలగడం. ఇలా చేయడం ద్వారా రాజ్యాంగాన్ని అస్థిరపర్చి, రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకించడం కచ్చితంగా సాధ్యమవుతుంది.’’ ఇంత తొందరేల? జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ (సవరణ) చట్టం, 2023, ఢిల్లీలో పరిపాలనా రూపాన్ని మారుస్తుంది. అలాగే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదు. ఆర్డినెన్స్ రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్ట్ నిర్ణయిస్తుంది. పైగా దాని ప్రస్తుత రూపాన్ని సవాలు చేసినప్పుడు, 1991లో జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి కనీసం ఢిల్లీలో అమలులో ఉన్న పరిపాలనా రూపాన్ని అది అధిగమిస్తుందనడంలో సందేహం లేదు. ఒక మార్పు తీసుకురావడంలో ఇంత తొందరపాటు అవస రమా? రాజ్యాంగం ఇచ్చిన అసాధారణ అధికారాన్ని వినియోగించు కోవాల్సిన తక్షణ అవసరం ఉందా? ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అధికారుల నియామకం, నియంత్రణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వా నికీ, భారత ప్రభుత్వానికీ మధ్య ఉన్న వివాదాన్ని, ఆర్డినెన్స్ ప్రకటించడానికి కేవలం ఒక వారం ముందు సుప్రీంకోర్టు పరిష్కరించింది. రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతకుముందు, రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన వివాదంలో, సుప్రీంకోర్టు (2018) రాజ్యాంగ నైతికతను ఈ పదాలలో ప్రస్తావించింది. ‘‘రాజ్యాంగ నైతికత అనేది ఉన్నత స్థాయి సిబ్బందిపై, పౌరు లపై ఒక ముఖ్యమైన తనిఖీ వ్యవస్థగా పనిచేస్తుంది. అపరిమితమైన శక్తిని కలిగివుండి, ఎటువంటి తనిఖీలు, నియంత్రణలు లేకపోతే ప్రజాస్వామ్య ఆలోచనకు విరుద్ధమైన నిరంకుశ పరిస్థితి ఏర్పడుతుంది. అదే మొత్తం ప్రజాస్వామ్య భావనకే విరుద్ధమైనది.’’ కాలు చేతులు లేకుండా... ఈ ఆర్డినెన్స్, స్పష్టమైన కారణం లేకుండా, ‘సేవలకు’ సంబంధించి అధికారాలను వినియోగించుకునే వీలును ఢిల్లీ ప్రభుత్వానికి లేకుండా చేస్తోంది. దీనికి బదులుగా, ఇది భారత ప్రభుత్వానికి అపరి మిత అధికారాన్ని ఇచ్చింది. పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిని, మంత్రులను రబ్బర్ స్టాంప్ కంటే తక్కువ స్థాయికి కుదించింది. అంబేడ్కర్, సుప్రీంకోర్టు అభిప్రాయాలను కలిపి చదివినట్ల యితే, దురదృష్టవశాత్తు ఆర్డినెన్స్ రాజ్యాంగ నైతికతను విస్మరించిందని స్పష్టమవుతుంది. ఇతర నిబంధనలను చూస్తే, ఆర్డినెన్స్ ఢిల్లీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక అథారిటీని ఏర్పాటు చేసే వీలు కల్పిస్తుంది. దీనిని నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అని పిలుస్తారు. ఈ అథారిటీకి పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్, అంటే భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లోని జాబితా పరిధిలోకి వచ్చే ఎంట్రీలు కాకుండా, ఢిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో పనిచేస్తున్న గ్రూప్–ఏ అధికారులకు సంబంధించి హాస్యాస్పదమైన సిఫార్సులు చేసే అధికా రాలు మాత్రమే ఉన్నాయి. అథారిటీకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించినప్పటికీ, సీనియర్ బ్యూరోక్రాట్లుగా ఉన్న మరో ఇద్దరు అధికార సభ్యులు ముఖ్యమంత్రిని తోసిరాజనవచ్చు. అందువల్ల, ముఖ్యమంత్రి పేరుకు నామమాత్రపు అధిపతి. పైగా ఆయన ఢిల్లీ ప్రజల ఎన్నికైన ప్రతినిధి అయినప్పటికీ, ఆయన కేవలం సున్నాకు తగ్గించబడ్డారు. అంతే కాకుండా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుకి అథారిటీ సిఫార్సును ఆమోదించాల్సిన అవసరం లేదు. ప్రజాభీష్టం మాటేమిటి? మరొక క్రూరమైన కోత ఏమిటంటే, సాక్షాత్తూ మంత్రుల మండలి అభిప్రాయాలను ఒక కార్యదర్శి నిరోధించగలగడం. అప్ప టికి అమలులో ఉన్న చట్టానికి అనుగుణంగా మంత్రుల మండలి అభిప్రాయం లేకపోతే గనక, తానుగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోగలిగే అధికారం ఈయనకు దఖలు పడింది. పైగా ఆ అభిప్రాయాన్ని ఆయన తప్పనిసరిగా లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తెచ్చి, దానిమీద ఆయన నిర్ణయాన్ని తీసుకునే వీలు కల్పిస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల చట్టబద్ధతను పరీక్షించే ఇన్విజిలేటర్ లేదా ఎగ్జామినర్ పాత్రను కార్యదర్శి స్వీకరిస్తాడు. కాబట్టి ముఖ్యమంత్రి పాత్ర శూన్యంగా మారిపోవడమే కాకుండా, మంత్రి మండలి కూడా ఆ స్థాయికి దిగజారిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ పాలన ఎలా ఉంటుందనేది ఆశ్చర్యంగానే ఉంది. ఆర్డినెన్స్ ద్వారా న్యాయం ప్రభావితం అవుతుందా? అవును, ఆర్డినెన్స్‌లోని సెక్షన్ 45 డి ప్రకారం, ఏదైనా కమిషన్, చట్టబద్ధమైన అధికార వ్యవస్థ, బోర్డు, కార్పొరేషన్ లో ఎవరైనా ఛైర్పర్సన్, సభ్యుడు లేదా ఆఫీస్ బేరర్‌ను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అంటే తద్వారా భారత ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటుంది. పర్యవసానంగా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ఢిల్లీ మహిళా కమి షన్, ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మొదలైన వాటితో సహా పాక్షిక–న్యాయ అధికారాలను అమలు చేసే చట్టబద్ధమైన సంస్థల నియామకాన్ని భారత ప్రభుత్వమే చేపడుతుంది. ఇది బాలల హక్కులు, స్త్రీల హక్కులు, రవాణా, నీరు, విద్యుత్ మొదలైన రంగాలకు విస్తరించింది. ప్రభావ వంతంగా, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం చుక్కానిలేనిదిగా మిగిలి పోయింది. పైగా, ప్రజల అభీష్టం అనేది ఏమాత్రం విలువ లేనిదిగా మారిపోయింది. ఆర్డినెన్స్ ఆమోదం పొందిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన ఏకగ్రీవ తీర్పును రద్దు చేయడమే ఆర్డినెన్స్ ఉద్దేశ్యం, లక్ష్యం అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలపై, దాని ఎన్నికైన ప్రజాప్రతినిధులపై, రాజ్యాంగంపై కూడా రాజ్యాంగ వంచన రూపంలో వచ్చింది. ఈ మొత్తం కసరత్తు బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడం, ‘‘ప్రజాస్వామ్య రాజ్యాంగం శాంతి యుతంగా పనిచేయడానికి రాజ్యాంగ నైతికత విస్తరణ ఆవశ్యకతను’’ అంగీకరించడంలో పొరబడ్డారా అనే ఆశ్చర్యానికి దారి తీస్తుంది. జస్టిస్ మదన్ బి లోకూర్ వ్యాసకర్త సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి -
పద్మ అవార్డులకు వైద్యుల పేర్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ముగ్గురు వైద్యుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం వెల్లడించారు. డాక్టర్లు ఎస్కే సరిన్, సురేశ్ కుమార్, సందీప్ బుధిరాజలు ఇందులో ఉన్నారని చెప్పారు. కోవిడ్ 19 పోరాటంలో భాగంగా వీరు చేసిన సేవలను గుర్తుంచుకొని పేర్లను సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కేవలం వైద్యుల పేర్లను మాత్రమే పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మొత్తం 9,427 మంది ప్రజలు కలసి 740 మంది పేర్లను సూచించారన్నారు. ఇందులో డాక్టర్లు, పారమెడిక్స్, ఇతర ఆరోగ్య రంగ నిపుణులు ఉన్నారన్నారు. ఇందులో ముగ్గురి పేర్లను డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నేతృత్వంలోని కమిటీ ఖరారు చేసిందన్నారు. వారిలో ఐఎల్‌బీఎస్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్.కె సరిన్, ఎల్ఎన్జేపీ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్, గ్రూప్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మ్యాక్స్ హెల్త్ కేర్ గ్రూప్ డాక్టర్ సందీప్ బుధిరాజలు ఉన్నారని తెలిపారు. -
వెయ్యి బస్సుల కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి బస్సుల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపణలపై సీబీఐతో ప్రాథమికంగా దర్యాప్తు చేయించాలని హోం శాఖ సిఫారసు చేసింది. ఢిల్లీ రవాణా శాఖ బస్సుల కొనుగోలు, వార్షిక నిర్వహణ కాంటాక్టు (ఏఎంసీ)ల్లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష బీజేపీ ఆరోపించగా, దీనిపై విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజాల్ ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఏఎంసీలో విధానపరమైన లోపాలున్నాయని, దానిని రద్దు చేయాలంటూ ఆ కమిటీ సిఫారసు చేసింది. దాంతో దీనిపై సీబీఐతో విచారణకు హోంశాఖ ఆదేశించింది. -
ఢిల్లీలో ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే!
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని తేల్చిచెప్పే బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్సీటీడీ)ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వం ఎవరనే అంశానికి సంబంధించి కొన్ని విషయాల్లో గందరగోళం నెలకొందని, దీన్ని తొలగించేందుకే ఈ బిల్లును తెచ్చామని చెప్పారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని లోక్‌సభలో ఆప్, కాంగ్రెస్ వ్యతిరేకించాయి. బిల్లు ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే ఎల్జీ అని ఖరారుకానుంది, అంతేకాక ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్ చర్యకైనా ఎల్జీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి కానుంది. ఇది రాజకీయ బిల్లు కాదని, కేవలం కొన్ని అంశాలపై స్పష్టత కోసం తెచ్చిన బిల్లని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈబిల్లు వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. నిజానికి ఈ బిల్లు 1991లో కాంగ్రెస్ తెచ్చిందని గుర్తు చేశారు. ఎల్జీ కార్యనిర్వహణాధికారి కనుక రోజూవారీ కార్యకలాపాలు తెలుసుకునే హక్కు ఆయనకుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి అధికారాలు లాక్కొని ఎల్జీకి కట్టబెట్టలేదని వివరించారు. తమ తప్పుంటే విని దిద్దుకుంటామని, కానీ ఎలాంటి తప్పు లేనప్పుడు విమర్శలను సహించమని, ఈ బిల్లు మరింత పారదర్శకత కోసమే తెచ్చామని చెప్పారు. 2015 నుంచి ఢిల్లీ హైకోర్టులో కొన్ని అంశాలపై వేసిన కేసులు, వాటిపై కోర్టు ఇచ్చిన రూలింగ్స్‌తో కొంత గందరగోళం నెలకొందన్నారు. ఎల్జీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపని చెప్పి చేయాలని కోర్టు తీర్పులిచ్చిందన్నారు. రాజ్యాంగ వ్యతిరేకం రాష్ట్ర ప్రభుత్వ హక్కులను లాక్కునే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి విమర్శించారు. ఇది గతంలో అప్పటి హోంమంత్రి అద్వానీ ఇచ్చిన హామీలకు వ్యతిరేకమన్నారు. అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం అమలు చేయకుండా అపేందుకే ఈ బిల్లు తెచ్చారన్నారు. ఢిల్లీ ప్రభుత్వంపై గందరగోళానికి కాంగ్రెస్, ఆప్ కారణమని బీజేపీ ఎంపీ మీనాక్షి లేకి దుయ్యబట్టారు. కావాలనుకుంటే కాంగ్రెస్ అప్పట్లోనే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందన్నారు. 2013లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఒక వ్యక్తి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ బ్రిజేందర్ సింగ్ పరోక్షంగా అరవింద్ క్రేజీవాల్‌ను విమర్శించారు. అరవింద్ హయాంలో ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చిఉంటే ఈ పాటికి సివిల్‌వార్ వచ్చేదన్నారు. రాష్ట్రాల హక్కుల హరణలో కేంద్రం స్పెషలిస్టని, ఢిల్లీని పాలించాలని భావిస్తోందని ఆప్ ఎంపీ భగవంత్‌మన్ విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లా అసెంబ్లీ ఉన్న యూటీలాగా ఢిల్లీని మార్చాలని కేంద్రం భావిస్తోందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏ నిర్ణయాధికారం లేకుంటే, అసెంబ్లీకి ఎన్నికలెందుకన్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. -
ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా సోకి, తగ్గిపోయినట్లు సెరోలాజికల్ సర్వేలో తేలింది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ఒక నివేదిక సమర్పించింది. ఢిల్లీలో నాలుగో దశ సెరోలాజికల్ సర్వేలో భాగంగా తాజాగా 15,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ప్రతి నలుగురిలో ఒకరి శరీరంలో యాంటీ బాడీలు(ప్రతి రక్షకాలు) ఉన్నట్లు తేలింది. అంటే వీరంతా కరోనాకు గురై కోలుకున్నవారే. సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించిన పరీక్షల్లో 25.1 మందిలో, అక్టోబర్ మూడో వారంలో నిర్వహించిన పరీక్షల్లో 25.5 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఢిల్లీ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఇప్పటికే కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 80% బెడ్లు కోవిడ్ బాధితులకే! ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండడం పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజారోగ్యంపై బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి, కరోనా వ్యాప్తిని నియంత్రించాలని ధర్మాసనం సూచించింది. 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80 శాతం ఐసీయూ పడకలను కోవిడ్–19 రోగులకు కేటాయించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80 శాతం ఐసీయూ పడకలను కరోనా బాధితులకు రిజర్వ్ చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 8,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 85 మంది కోవిడ్ కారణంగా మృతిచెందారు. -
అమెరికాలో పీహెచ్డీ.. ఆశ్రమంలో బందీ!
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో పీహెచ్డీ పూర్తిచేసి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేసే తన కూతురు ఢిల్లీలోని ఓ ఆధ్యాత్మిక ఆశ్రమంలో బందీగా మారిందని, ఆమెను విడిపించి రక్షించాలంటూ ఓ యువతి తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ కేసు విచారించిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం.. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీచేసింది. అనంతరం కేసు విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. హైదరాబాద్‌కు చెందిన దుంపల రాంరెడ్డి, మీనావతి కూతురు సంతోష్ రూప జేఎన్టీయూ అనంతపురంలో బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని లూయిస్విల్లే వర్సిటీలో 2005 నుంచి 2012 వరకు ఎంఎస్, పీహెచ్డీ పూర్తిచేసింది. అనంతరం అక్కడే ఐఓడబ్ల్యూఏ వర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ కోర్సులో చేరింది. పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అసోసియేట్‌గా కూడా 2015 వరకు పనిచేసింది. 2015 జూలైలో అకస్మాత్తుగా వర్సిటీ విడిచిపెట్టింది. అయితే ఎక్కడికి వెళ్లిందన్న విషయంలో తల్లిదండ్రులకు, ప్రొఫెసర్లకు ఎలాంటి సమాచారం లేదు. అయితే కొంతకాలానికి రూప.. ఢిల్లీ రోహిణీ ప్రాంతంలోని విజయ్‌విహార్‌లో వీరేంద్ర దీక్షిత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వర్సిటీ పేరుతో నడుపుతున్న ఆశ్రమంలో ఉన్నట్లు తల్లిదండ్రులకు తెలిసింది. బ్యాంకు ఖాతాలో రూ.కోటి కాగా, రూప ఆశ్రమంలో చేరేనాటికి ఆమె బ్యాంకు ఖాతాలో దాదాపు కోటి రూపాయలు ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. తమ కూతురు కోసం సంప్రదించిన ప్రతిసారి ఆశ్రమ నిర్వాహకులు సంతోష్ రూప ఇష్టానికి భిన్నంగా తాము ఒత్తిడి తెస్తున్నామని, తమ నుంచే రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసేవారని తెలిపారు. కాగా, ఈ ఆశ్రమంలో అనేక మంది బాలికలు, మహిళలు బందీలుగా ఉన్నారని, వారిని కాపాడాలని 2017లో ఢిల్లీ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఓ కమిటీ వేసింది. వందలాది మంది బాలికలు, మహిళలను అక్కడ పశువుల కొట్టాన్ని తలపించేలా ఉంచారని, అక్కడ ఎలాంటి వసతుల్లేవని, వైద్యం కూడా అందట్లేదని, ఇరుకైన సందులు ఉన్నాయని కమిటీలో ఉన్న న్యాయవాది నందితారావు నివేదికలో పేర్కొన్నారు. చాలా మంది డ్రగ్స్ అలవాటు పడ్డట్లు కనిపించారని వివరించారు. వారిని చీకటి గదుల్లో ఉంచారని, వారు పడుకునే ప్రాంతంలో కూడా పర్యవేక్షణ ఉండదని, వారికి ఎలాంటి గోప్యత లేదని తెలిపారు. ఆ తర్వాత హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే వీరేంద్ర దీక్షిత్ అదృశ్యమయ్యాడని 2018లో హైకోర్టుకు సీబీఐ తెలిపింది. తాము వృద్ధాప్యంలో ఉన్నామని, రూ.2 వేల పెన్షన్ డబ్బులతో బతుకుతున్నామని, కూతురిని తీసుకెళ్లేందుకు ఇక్కడే ఢిల్లీలో ఒక గది అద్దెకు తీసుకుని బతుకుతున్నామని తల్లిదండ్రులు పిటిషన్లో పేర్కొన్నారు. తమ కూతురు జైలులాంటి వాతావరణంలో ఉండటాన్ని చూసి మానసిక క్షోభతో తమ ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని తెలిపారు. తమ బాగోగులు చూసుకునేందుకైనా తమ కూతురును పంపించాలని కోరారు. తమ కూతురు డ్రగ్స్‌కు బానిసై ఉంటుందని, ఆమె ఆరోగ్యంగా లేదని వివరించారు. ఆశ్రమంలో ఆత్మహత్య జరిగినందున తమ కూతురు క్షేమంపై బెంగగా ఉందని వివరించారు. -
ఢిల్లీలో మహిళల భద్రతకు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మహిళల భద్రత పెంపొందించే దిశగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. బస్సుల్లో మహిళల భద్రత కోసం మార్షల్స్ సంఖ్యను దాదాపు 10వేలు పెంచుతున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో ప్రభుత్వ వాహనాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పథకంలో భాగంగా కేజ్రీవాల్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘ఈరోజు నేను మీకు ప్రభుత్వ వాహనాల్లో మహిళల భద్రత బాధ్యతను అప్పగిస్తున్నాను. దీని వల్ల వారు బస్సుల్లో తమ ఇంటిలో ఉన్నట్లు భావించి ప్రయాణం చేస్తారు’అని సోమవారం త్యాగరాజ స్టేడియంలో నూతనంగా నియామకమైన మార్షల్స్నుద్దేశించి మాట్లాడారు. మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే సహించకూడదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో 3,400 మంది మార్షల్స్ ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
షరతులు వర్తిస్తాయ్: షీలా దీక్షిత్
ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయమై కాంగ్రెస్ మాటమార్చింది. బేషరతుగా మద్దతు ఇస్తామని తాము ఎన్నడూ అనలేదని, బయటి నుంచి మాత్రమే ఇస్తామని అంటోంది. ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీకరించడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆప్ ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరారు. ఆప్‌కు బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మంచి విషయమేనని ఆయన చెప్పారు. తాము మద్దతు ఇచ్చేది ఆప్ మేనిఫెస్టోకే గానీ ఆప్‌కు కాదని ఆయన చెప్పారు. మేనిఫెస్టోను అమలుచేసి ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను ఆప్ నెరవేర్చాలని ఆయన కోరారు.