షరతులు వర్తిస్తాయ్: షీలా దీక్షిత్
Published Tue, Dec 24 2013 1:12 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయమై కాంగ్రెస్ మాటమార్చింది. బేషరతుగా మద్దతు ఇస్తామని తాము ఎన్నడూ అనలేదని, బయటి నుంచి మాత్రమే ఇస్తామని అంటోంది. ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీకరించడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆప్ ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరారు. ఆప్‌కు బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మంచి విషయమేనని ఆయన చెప్పారు. తాము మద్దతు ఇచ్చేది ఆప్ మేనిఫెస్టోకే గానీ ఆప్‌కు కాదని ఆయన చెప్పారు. మేనిఫెస్టోను అమలుచేసి ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను ఆప్ నెరవేర్చాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement