విదేశీ బ్యాంకుల్లోని నల్లధనం వెనక్కి తెస్తాం: కేజ్రివాల్
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. లోకసభ ఎన్నికల మెనిఫెస్టోని ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం విడుదల చేసిన తర్వాత అరవింద్ కేజ్రివాల్ మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం తెచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నాం అని అన్నారు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన విరాళాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
తాము చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ బీఐ)కు వ్యతిరేకం కాదని.. కొన్ని రంగాల్లో అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. విద్యుత్ రంగంలో ఎఫ్ డీఐలను నిషేధించినందుకే ఆప్ ప్రభుత్వాన్ని 49 రోజుల్లో కూలదోశారని ఆయన అన్నారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించే విధంగానే ఆప్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మెనిఫెస్టోలో రూపొందించిన అంశాలను కేజ్రివాల్ తెలిపారు.