ఫకీరేం కాదు కోటీశ్వరుడే | Arvind Kejriwal – A 'fakir' who has assets worth crores | Sakshi
Sakshi News home page

ఫకీరేం కాదు కోటీశ్వరుడే

Published Thu, Apr 24 2014 2:57 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

ఫకీరేం కాదు కోటీశ్వరుడే - Sakshi

ఫకీరేం కాదు కోటీశ్వరుడే

తాను ఫకీర్నని... తన జేబులో రూ. 500 మాత్రమే ఉంటాయని చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోటీశ్వరుడని ఆయనే పరోక్షంగా ఒప్పుకున్నారు. తన పేరిట ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలో రూ.4 లక్షల నగదు, భార్య సునీత వద్ద రూ. 17 లక్షలకుపైగ చరాస్తి కలిగి ఉన్నట్లు ఆప్ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే రూ.90 లక్షలు విలువైన స్థిరాస్తి తన పేరిట ఉండగా, సునీత పేరిట ఉన్న స్థిరాస్తి విలువ రూ.కోటికి పైగా ఉంటుందని చెప్పారు. ఇదంతా ఆయన ఎక్కడ నోటి ద్వారా ప్రకటించలేదు.

వారణాసి నుంచి ఆప్ పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల బరిలో దూకిన కేజ్రీవాల్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో తన నామినేషన్ పత్రాలతోపాటు తనకు, తన కుటుంబసభ్యులకు ఉన్న ఆస్తుల వివరాలను ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వారణాసి నుంచి బీజేపీ లోక్సభ ఎన్నికల బరిలో దిగిన మోడీ లాగా హెలికాప్టర్లో తాను తిరగలేనని.... నామినేషన్ వేసేందుకు డొక్కు జీపులో వెళ్లానని బుధవారం వారణాసిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement