Varanasi Lok Sabha
-
అట్టహాసంగా మోడీ నామినేషన్
-
వారణాసిలో పోటెత్తిన ఓటర్డు, రికార్డు స్థాయి పోలింగ్!
వారణాసి: వారణాసి ఓటర్లు తీవ్ర స్థాయిలో ఉన్న ఎండ వేడి పక్కన పెట్టి భారీ సంఖ్యలో ఓటేశారు. వారణాసిలో సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా రికార్టు స్థాయిలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్ ల మధ్య పోటీ దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకు 56 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైందని, పెద్ద సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఓటింగ్ బార్లు తీరి ఉండటం స్పష్టంగా కనిపించింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఈసీ అధికారుల తెలిపారు. 2009 ఎన్నికల్లో వారణాసిలో పోలింగ్ శాతం 43 శాతం మాత్రమేనని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ధరించి కాంగ్రెస్ అభ్యర్ధి ఆజయ్ రాయ్ పోలింగ్ బూత్ లోకి వెళ్లడం వివాదంగా మారింది. -
ఫకీరేం కాదు కోటీశ్వరుడే
తాను ఫకీర్నని... తన జేబులో రూ. 500 మాత్రమే ఉంటాయని చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోటీశ్వరుడని ఆయనే పరోక్షంగా ఒప్పుకున్నారు. తన పేరిట ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలో రూ.4 లక్షల నగదు, భార్య సునీత వద్ద రూ. 17 లక్షలకుపైగ చరాస్తి కలిగి ఉన్నట్లు ఆప్ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే రూ.90 లక్షలు విలువైన స్థిరాస్తి తన పేరిట ఉండగా, సునీత పేరిట ఉన్న స్థిరాస్తి విలువ రూ.కోటికి పైగా ఉంటుందని చెప్పారు. ఇదంతా ఆయన ఎక్కడ నోటి ద్వారా ప్రకటించలేదు. వారణాసి నుంచి ఆప్ పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల బరిలో దూకిన కేజ్రీవాల్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో తన నామినేషన్ పత్రాలతోపాటు తనకు, తన కుటుంబసభ్యులకు ఉన్న ఆస్తుల వివరాలను ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వారణాసి నుంచి బీజేపీ లోక్సభ ఎన్నికల బరిలో దిగిన మోడీ లాగా హెలికాప్టర్లో తాను తిరగలేనని.... నామినేషన్ వేసేందుకు డొక్కు జీపులో వెళ్లానని బుధవారం వారణాసిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.