వారణాసిలో పోటెత్తిన ఓటర్డు, రికార్డు స్థాయి పోలింగ్!
వారణాసి: వారణాసి ఓటర్లు తీవ్ర స్థాయిలో ఉన్న ఎండ వేడి పక్కన పెట్టి భారీ సంఖ్యలో ఓటేశారు. వారణాసిలో సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా రికార్టు స్థాయిలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు.
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్ ల మధ్య పోటీ దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది.
సోమవారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకు 56 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైందని, పెద్ద సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఓటింగ్ బార్లు తీరి ఉండటం స్పష్టంగా కనిపించింది.
భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఈసీ అధికారుల తెలిపారు. 2009 ఎన్నికల్లో వారణాసిలో పోలింగ్ శాతం 43 శాతం మాత్రమేనని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ధరించి కాంగ్రెస్ అభ్యర్ధి ఆజయ్ రాయ్ పోలింగ్ బూత్ లోకి వెళ్లడం వివాదంగా మారింది.