న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. రాజీనామాపై తాను నిర్ణయం తీసుకునే ముందు ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవాల్సిందని, అలా చేయకుండా తప్పు చేశానన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ప్రత్యర్థిగా వారణాసి నుంచి బరిలోకి దిగిన కేజ్రీవాల్ అక్కడ ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ టీవీ చానల్‌తో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకొని తప్పుచేశాననిపిస్తోంది. కానీ పార్టీ విధివిధానాల పరంగా మేము తీసుకున్న నిర్ణయం సరైందే. అయితే ఈ నిర్ణయం తీసుకునేముందు ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాల్సింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరిన మేము రాజీనామా విషయంలో మాత్రం వారి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా తప్పుచేశాం. సమాచార లోపం వల్ల ఈ పనిని చేయలేకపోయామ’న్నారు. నగర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, అవినీతిని అంతమొందించి, వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడడమే పార్టీ విధానంగా ఢిల్లీ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయా లు నమోదు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలా? వద్దా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా? అనే విషయంలో ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకే సిద్ధమై, 49 రోజులపాటు పాలించింది. పాలనలోనూ కొత్త ఒరవడిని సృష్టించి నగరవాసుల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. అయితే ఎన్నికల ముందు ఢిల్లీ జన్‌లోక్‌పాల్‌ను అమలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో విఫలమైనందుకుగాను తాను ముఖ్యమంత్రి పదవి నుంచి, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆయా మంత్రి పదవుల నుంచి వైదొలగుతున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేయకుండానే కేజ్రీవాల్ సర్కార్ ఔట్ అయ్యింది.
దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లోనే కేజ్రీవాల్ తప్పుకున్నారని, యుద్ధం నుంచి పార్టీపోయిన సైనికుడం టూ ప్రతిపక్షాలు విమర్శించాయి. నగరంలో కేజ్రీవాల్ ఇటీవల చేసిన ఎన్నికల ప్రచారంలో కూడా ఓ ఆటోడ్రైవర్ కేజ్రీవాల్‌కు చెంపదెబ్బ కొట్టాడు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినందుకే తనకు కోపం వచ్చిందని, అందుకే ఆ పని చేశానం టూ ఆటో డ్రైవర్ స్వయంగా కేజ్రీవాల్‌తోనే చెప్పుకున్నాడు. అప్పటిదాకా రాజీనామాపై తాను సరైన నిర్ణయమే తీసుకున్నానంటూ చెప్పుకొచ్చిన కేజ్రీవాల్ ఈ ఘటనల తర్వాత తన వైఖరిని మార్చుకున్నారు. ఢిల్లీలో ప్రచారం చేసిన ప్పుడు ప్రజల మనసులో ఉన్న అభిప్రాయం అర్థమైందని, తప్పు చేశాననిపించిందన్నారు. ‘సీఎం కుర్చీకి అతుక్కుపోవాల్సింది. అయితే అందుకు నా అంతరాత్మ అంగీకరించలేదు. రాజీనామా చేసి మేం పెద్ద త్యాగం చే శామనే భ్రమలో ఇన్నాళ్లూ ఉన్నాం. ప్రజలు మమ్మ ల్ని ప్రశంసిస్తారనుకున్నాం. అయితే ప్రజలు మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయార’న్నారు.
ప్రజాభిప్రాయాన్నితెలుకోవాల్సింది..తప్పుచేశాం..!
Published Wed, Apr 16 2014 11:30 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement