![Delhi Govt to Deploy 13,000 Marshals in Buses - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/29/Untitled-9.jpg.webp?itok=2IGoqsjZ)
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మహిళల భద్రత పెంపొందించే దిశగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. బస్సుల్లో మహిళల భద్రత కోసం మార్షల్స్ సంఖ్యను దాదాపు 10వేలు పెంచుతున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో ప్రభుత్వ వాహనాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పథకంలో భాగంగా కేజ్రీవాల్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘ఈరోజు నేను మీకు ప్రభుత్వ వాహనాల్లో మహిళల భద్రత బాధ్యతను అప్పగిస్తున్నాను. దీని వల్ల వారు బస్సుల్లో తమ ఇంటిలో ఉన్నట్లు భావించి ప్రయాణం చేస్తారు’అని సోమవారం త్యాగరాజ స్టేడియంలో నూతనంగా నియామకమైన మార్షల్స్‌నుద్దేశించి మాట్లాడారు. మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే సహించకూడదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో 3,400 మంది మార్షల్స్ ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment