న్యూఢిల్లీ: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో యమునా నది మరింత ఉధృతరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం గురువారం ఉదయం నాటికి 208.46 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత యమునా నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీనిని ‘తీవ్ర పరిస్థితి’గా కేంద్ర జల సంఘం పేర్కొంది.
ఇక నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం సూచించింది. బుధవారం నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది.
#WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c
— ANI (@ANI) July 13, 2023
అమిత్ షాకు కేజ్రివాల్ లేఖ
ఢిల్లీలో వరద ఉధృతి పెరుగుతోందని, యమునలో నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో భీకర వరదలు రావడం ప్రపంచానికి మంచి సందేశం కాదని చెప్పారు. జి–20 సదస్సుకు త్వరలో ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోంశామంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
హరియాణాలోని హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఢిల్లీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసిందని తెలిపారు. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు.
#WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c
— ANI (@ANI) July 13, 2023
హిమాచల్‌లో 88 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నంకల్లా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. మరో 16 మంది గల్లంతయ్యారు. 100 మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోయాయి.
#WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr
— ANI (@ANI) July 13, 2023
మరోవైపు పంజాబ్, హరియాణాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. హరియాణాలో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పంజాబ్‌లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
హిమాచల్‌లోని మండీలో పూర్తిగా ధ్వంసమైన వంతెన
Comments
Please login to add a commentAdd a comment