All time High
-
ఆల్‌టైమ్ హై.. బంగారం కొత్త రేటు వింటే దడే!
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మరింత పెరిగాయి. కొన్ని రోజులుగా ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు నేడు (February 10) భారీగా ఎగిసి ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? రతన్ టాటా వీలునామాలో ఊహించని పేరు.. రూ.500 కోట్ల ఆస్తి ఆయనకే..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 79,800, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,060 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.350, రూ.390 చొప్పున పెరిగాయి.ఇతర ప్రాంతాల్లో.. చైన్నైలో 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,800 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,060 వద్ద కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.350, రూ.390 చొప్పున పెరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,210 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,950 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.390, రూ.350 చొప్పున పెరిగాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఆల్ టైమ్ హై!
హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ (real estate) ఆల్ టైం హై స్థాయికి చేరుకుంది. గతేడాది నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు, ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్ల పెంపు, హైడ్రా దూకుడు ఇవేవీ భాగ్యనగరంలో స్థిరాస్తి రంగాన్ని కదిలించలేకపోయాయి. కొత్త ప్రభుత్వ విధానాలతో కొద్ది కాలం అస్థిరత ఏర్పడినా.. మార్కెట్ తిరిగి శరవేగంగా పుంజుకుంది. దీంతో హైదరాబాద్ రియల్టీలో పూర్వ వైభవం సంతరించుకుంది. నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించగా.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఆర్థికవృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, కొనుగోలుదారుల అభిరుచిలో మార్పుల కారణంగా హైదరాబాద్‌లో గృహ విక్రయాలు పెరిగాయి. గతేడాది నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 36,974 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం సిటీలో అపార్ట్మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.5,974. ఏడాదిలో అపార్ట్మెంట్ల ధరలు 8 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయ్యింది. పశ్చిమ హైదరాబాదే.. హైటెక్ సిటీ, కోకాపేట, రాయదుర్గం, కూకట్పల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాదే కస్టమర్ల చాయిస్‌గా ఉంది. ఎల్బీనగర్, కొంపల్లి ప్రాంతాల్లో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో వరుసగా 11, 10 శాతం మేర రేట్లు పెరిగాయి. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో 8 శాతం, కోకాపేటలో 8 శాతం, మణికొండలో 6, నాచారం, సైనిక్‌పురిలో 5 శాతం మేర ధరలు పెరిగాయి. ప్రస్తుతం నగరంలో అత్యధికంగా చ.అ.ధరలు బంజారాహిల్స్‌లో రూ.14,400–16,020 మధ్య ఉండగా.. జూబ్లీహిల్స్‌లో 13,400–14,034, కోకాపేటలో 10,045–12,500, మణికొండలో రూ.8,500–9,220 మధ్య ధరలు ఉన్నాయి.ఆఫీస్ అ‘ధర’హో.. 2024లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. గతేడాది కొత్తగా 1.03 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ పూర్తి కాగా.. 1.56 కోట్ల చ.అ. స్పేస్ లావాదేవీలు జరిగాయి. కార్యాలయాల స్థలం లీజు, కొనుగోళ్లలో గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్(జీసీసీ) ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గతేడాది జరిగిన ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో జీసీసీ వాటా 49 శాతంగా ఉంది. 51 లక్షల చ.అ.ఆఫీస్ స్పేస్‌ను బహుళ జాతి కంపెనీలు జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. దేశీయ వ్యాపార సంస్థలు 24 లక్షల చ.అ.లు, ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ 18 లక్షల చ.అ.లు, 12 లక్షల చ.అడుగుల స్థలంలో థర్డ్ పార్టీ ఐటీ సంస్థల లావాదేవీలు ఉన్నాయి. నగరంలో ఆఫీస్ స్పేస్ ధర చ.అ.కు సగటున రూ.70గా ఉంది. ఏడాది కాలంలో ధరలు 7 శాతం మేర పెరిగాయి.దేశవ్యాప్తంగా ఇలా.. గతేడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 3,72,936 యూనిట్లు లాచింగ్ కాగా.. 3,50,612 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే లాంచింగ్స్‌లో 6 శాతం, విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇంకా 4,95,839 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 నెలల సమయం పడుతుంది. ఇక, గతేడాది 7.19 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. 5.03 కోట్ల చ.అ. స్థలం కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 8 నగరాల్లో మొత్తం 97.3 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది. -
పసిడికి పెరిగిన డిమాండ్
ముంబై: దిగుమతి సుంకం తగ్గింపుతో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 248.3 టన్నులుగా నమోదైంది. ముఖ్యంగా సుంకం తగ్గింపు ఆభరణాల కొనుగోళ్లను పెంచినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ‘2024 క్యూ3 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదిక తెలిపింది. ‘‘బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరడంతో.. ధరలు తగ్గే వరకు కొనుగోళ్ల కోసం ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించొచ్చు. దీంతో పూర్తి ఏడాదికి (2024) బంగారం డిమాండ్ 700–750 టన్నుల మేర ఉంటుంది. గతేడాదితో పోలి్చతే కొంత తక్కువ. 2024 చివరి త్రైమాసికంలో ధనత్రయోదశి, వివాహాల సీజన్ మొత్తం మీద బంగారం డిమాండ్‌కు ఊతంగా నిలుస్తాయి’’అని ఈ నివేదిక తెలిపింది. 2023లో బంగారం డిమాండ్ 761 టన్నులుగా ఉంది. ధనత్రయోదశి సందర్భంగా డిమాండ్ పెరగడంతో మంగళవారం ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.300 పెరిగి రూ.81,400కు చేరడం గమనార్హం. ఇక విలువ పరంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 53 శాతం పెరిగి రూ.1,65,380 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.1,07,700 కోట్లుగా ఉంది. బంగారం, వెండి దిగుమతులపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి బడ్జెట్లో తగ్గించడం తెలిసిందే. బంగారం దిగుమతులు 22% జంప్ పస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో 22 శాతం అధికంగా 27 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బంగారం దిగుమతులు 22 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత పండుగల సీజన్ దిగుమతులు పెరగడానికి కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అత్యధికంగా స్విట్జర్లాండ్ 40 శాతం మేర మన దేశానికి బంగారం ఎగుమతి చేయగా, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా ఆక్రమించాయి. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం దిగుమతుల వాటా 5 శాతంగా ఉంటుంది. బంగారం దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) మొదటి ఆరు నెలల్లో (సెప్టెంబర్ చివరికి) 137.44 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వాణిజ్య లోటు 119.24 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనించొచ్చు. బంగారానికి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద వినియోగదారుగా భారత్ ఉంటోంది. వెండి దిగుమతులు సైతం 376 శాతం పెరిగి 2.3 బిలియన్ డాలర్లుగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి నమోదయ్యాయి. కరెంటు ఖాతా లోటు ఒక శాతం ఎగసి 9.7 బిలియన్ డాలర్లకు చేరింది. -
రికార్డు స్థాయిలకు ఫారెక్స్
ముంబై: ఒక వారం విరామం తర్వాత భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు రికార్డు స్థాయిని చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం సెపె్టంబర్ 20వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చితే 2.838 బిలియన్ డాలర్లు పెరిగి 692.29 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫారెక్స్ నిల్వలు ఈ నెల 13వ తేదీతో ముగిసిన వారంలో కొంత వెనక్కుతగ్గినా, అంతక్రితం వరుసగా రెండు వారాలూ రికార్డు బాటన కొనసాగాయి. అన్ని విభాగాల్లోనూ పురోగతి.. » డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ సమీక్షా వారంలో 2.057 బిలియన్ డాలర్లు పెరిగి 605.686 బిలియన్ డాలర్లకు ఎగసింది. » పసిడి నిల్వలు 726 మిలియన్ డాలర్లు పెరిగి 63.613 బిలియన్ డాలర్లకు చేరాయి. » ఐఎంఎఫ్ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ 121 మిలియన్ డాలర్లు పెరిగి 18.54 బిలియన్ డాలర్లకు ఎగసింది. » అయితే ఐఎంఎఫ్ వద్ద నిల్వల పరిమాణం 66 మిలియన్ డాలర్లు తగ్గి 4.458 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. -
ఏపీలో ఆల్‌టైం హై విద్యుత్ వినియోగం!
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం ఆల్‌టైం హై రికార్డును తాకింది. ఎండల తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలోనే వినియోగం పెరిగిందని విద్యుత్ శాఖ అధికారులు అంచనాకి వచ్చారు. గడిచిన మూడు రోజుల్లో కరెంట్‌ను ప్రజలు విపరీతంగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో బుధవారం 253 మిలియన్ యూనిట్లు, గురువారం 259 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ రోజు రికార్డుస్ధాయిలో 260 మిలియన్ యానిట్ల దాటే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే గత ఏడాది ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ 219 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఇక గత ఎనిమిదేళ్లలో మే నెలలో రికార్డు స్ధాయి విద్యుత్ వినియోగం ఇదే కావడం మరో విశేషం. ఎన్నడూ లేని విధంగా 13231 మెగావాట్లకి పైగా విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది కంటే 26 శాతం అధికంగా విద్యుత్ డిమాండ్ నెలకొనడం ఇంకో విశేషం. ఏపీ సర్కార్ ముందు జాగ్రత్తగడిచిన మూడు రోజులుగా ఏపీలో కరెంట్ కాలుతోంది. మరో మూడు, నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. డిమాండ్ పీక్‌లో ఉన్న టైంలోనూ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగుతోందని అధికారులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక కారణంగా యూనిట్ విద్యుత్ రూ.7లకే కొనుగోలు చేస్తోంది. మొత్తం రూ.15 కోట్లతో 22 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తోంది ఏపీ విద్యుత్ శాఖ. -
సాక్షి మనీ మంత్రా: వారెవ్వా..నిఫ్టీ! ఆల్‌టైం రికార్డ్
Today StockMarket Nifty above 20k దేశీయస్టాక్‌మార్కెట్లు జోరుమీద ఉన్నాయి. కీలక సూచీలు రెండూ దలాల్‌స్ట్రీట్‌లో మెరుపులు మెరిపించాయి. ఆరంభంలో స్తబ్దుగా ఉన్నప్పటికీ ఆ తరువాత నుంచి పుంజు కున్నాయి. చివరికి సెన్సెక్స్ 246 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో 67,467 వద్ద ముగియగా, నిఫ్టీ 77 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 20,070 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ చరిత్రలో తొలిసిర 20వేలకు ఎగువన ముగియడం విశేషం. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు లాభపడ్డాయి.ముఖ్యంగా ఆగస్టులో దేశీయ CPI ద్రవ్యోల్బణం 6.83 శాతానికి చల్లబడడం, పారిశ్రామిక ఉత్పత్తి డేటా భారత ఆర్థికవ్యవస్థ పటిష్టతపై ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి. దాదాపు అన్ని రంగాల షేర్లులాభపడ్డాయి. ప్రధానంగా మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభాలు మార్కెట్లకు ఊత మిచ్చాయి. గ్రాసిం, కోల్ ఇండియా, టాటా కన్జ్యూమర్, ఎయిర్టెల్, టైటన్ టాప్ గెయినర్స్‌గానూ, జియో ఫైనాన్షియల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎం అండ్ఎం లార్సెన్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. రూపాయి: గత ముగింపు 82.92తో పోలిస్తే డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్ప నష్టంతో 82.98 వద్ద ముగిసింది. -
పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు
Petrol Diesel Prices దేశ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభం లోకి కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో అక్కడ ఇంధన ధరలు రూ. 300 మార్కును దాటాయి. దీంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశ ప్రజలు మరింత సంక్షోభంలోకి కూరుకు పోనున్నారని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంధన ధరలను పెంచేసింది. పెట్రోల్ ధరను 14.91, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరను 18.44 పెంచినట్లు గురువారం సాయంత్రం ప్రకటించింది. దీంతో అక్కడ ప్రస్తుతం పెట్రోల్ ధర305.36 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరుకుంది. ఇటీవలి ఆర్థిక సంస్కరణలతో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఆల్ టైం హైకి చేరింది. ఫలితంగా పాకిస్థానీ రూపాయి కూడా దిగ జారి పోతుండటంతో సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను కూడా భారీగా పెంచేసింది. డాలరు మారకంలో పాక్ కరెన్సీ 305.6 వద్దకు చేరింది. -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్‌లో కొనసాగుతున్న బుల్ జోరు
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభ లాభాలు మరింత ఎగిసిన సె న్సెక్స్, నిఫ్టీ మరో ఆల్ టైం రికార్డు స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగిసి 67,094 వద్ద, నిఫ్టీ పాయింట్లు ఎగిసి 19846 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ముగిసాయి. విదేశీ నిధుల ప్రవాహం, యూఎస్ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు ఆరంభంలోనే ఉత్సాహంగా ఉన్నాయి. అలాగే ఇండెక్స్ మేజర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో పాటు, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల కొనుగోళ్లు కూడా మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 67 వేలకు ఎగువన, నిఫ్టీ కూడా రికార్డ్ క్లోజింగ్‌ను నమోదు చేసింది. నిఫ్టీ 19,850 సమీపంలో ముగిసింది. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ , బజాజ్ ఫైనాన్స్, టాప్ ఇండెక్స్ గెయినర్లుగా . మరోవైపు హిందాల్కో, బజాజ్ఆటో, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, హీరో మోటో టాప్ లూజర్లుగా ఉన్నాయి. రూపాయి: గత ముగింపు 82.04తో పోలిస్తే బుధవారం డాలర్‌కు రూపాయి స్వల్పంగా తగ్గి 82.09 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి -
దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్, సరికొత్త రికార్డులు నమోదు
Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభంలోనే సరికత్త రికార్డుస్థాయిలను తాకాయి.వాల్ స్ట్రీట్ లాభాలతో భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డులను నమోదు చేసాయి. చరిత్రలో తొలిసారి 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 67వేల స్టాయిని తాకింది. నిఫ్టీ 19,800 స్థాయిని అధిగమించి సరికొత్త ఆల్-టైమ్ శిఖరాలకు చేరుకుంది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభపడగా, మెటల్ షేర్లు బాగా నష్టపోయాయి. రికార్డ్ స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 205 పాయింట్ల లాభంతో 66,795 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఫ్టాట్‌గా మారిన నిఫ్టీ చివర్లోపుంజుకుని 38 పాయింట్లు ఎగిసి 19,749 వద్ద ముగిసింది. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించింది. 2 బిలియన్ల డాలర్ల డీల్ కారణంగా ఇన్ఫోసిస్ షేరు టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆసియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, హీరో మోటోకార్ప్ ఎ క్కువగా లాభపడగా, ఫలితాల నేపథ్యంలో ఎల్టీఐ మైండ్ ట్రీ భారీగా నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి రూపాయి: మంగళవారం నాడు డాలర్‌తో రూపాయి 82.04 వద్ద స్థిరంగా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్‌టైమ్ రికార్డు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో యమునా నది మరింత ఉధృతరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం గురువారం ఉదయం నాటికి 208.46 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత యమునా నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీనిని ‘తీవ్ర పరిస్థితి’గా కేంద్ర జల సంఘం పేర్కొంది. ఇక నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం సూచించింది. బుధవారం నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 అమిత్ షాకు కేజ్రివాల్ లేఖ ఢిల్లీలో వరద ఉధృతి పెరుగుతోందని, యమునలో నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో భీకర వరదలు రావడం ప్రపంచానికి మంచి సందేశం కాదని చెప్పారు. జి–20 సదస్సుకు త్వరలో ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోంశామంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హరియాణాలోని హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఢిల్లీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసిందని తెలిపారు. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 హిమాచల్‌లో 88 మంది మృతి హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నంకల్లా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. మరో 16 మంది గల్లంతయ్యారు. 100 మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోయాయి. #WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr — ANI (@ANI) July 13, 2023 మరోవైపు పంజాబ్, హరియాణాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. హరియాణాలో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పంజాబ్‌లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హిమాచల్‌లోని మండీలో పూర్తిగా ధ్వంసమైన వంతెన -
బుల్ రన్: పెట్టుబడిదారులకు లాభాల పంట
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. గత రెండు సెషన్లుగా రికార్డుల మోత మోగిస్తున్న సూచీలు మంగళవారం కూడా అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. అంతేకాదు వరుసగా ఆరో సెషన్లో లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసిజి మెటల్ రంగ షేర్లు భారీ లాభాలనార్జించాయి. చివరికి నిఫ్టీ 55 పాయింట్లు ఎగిసి 18618 వద్ద, సెన్సెక్స్ 177 పాయింట్ల లాభంతో 62,681 వద్ద స్థిర పడ్డాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్ 62,887 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,678 వద్ద ఆల్ టైంని నమోదు చేశాయి. హోచ్‌యూఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరోమోటో,బ్రిటానియా, సిప్లా టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. ఇండస్ఇండ్, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, పవర్‌గగ్రిడ్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 81.72 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. సోమవరం 81.67 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
రికార్డుల జోరు: బుల్ రన్.. తగ్గేదేలే!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ సూచీలు సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో స్వల్పంగా నష్టపోయిన సూచీలు ఆ వెంటనే లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 350పాయింట్లు జంప్ చేయగా, నిఫ్టీ ఆల్ టైం హైని తాకింది. సెన్సెక్స్ 62,687 వద్ద నిఫ్టీ 18,611 వద్ద తాజా రికార్డును తాకింది. మెటల్ తప్ప దాదాపు అన్ని రంగాలు లాభాలనార్జించాయి. రిలయన్స్, ఏసియన్ పెయింట్స్ భారీగా లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 212 పాయింట్లు ఎగిసి 62,505 నిఫ్టీ 50 పాయింట్లు లాభంతో 18563 వద్ద ముగిసాయి. చైనాలో కరోనా మళ్లీ విస్తరించడం, లాక్డౌన్ ఆంక్షలు, జీరో-కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రదర్శనల ఫలితంగా గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి. దీనికి తోడు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు మార్కెటింగ్ కంపెనీల లాభాలతో సెన్సెక్స్ నిఫ్టీ కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. బ్యాంకు నిఫ్టీ కూడా 43వేల ఎగువకు చేరింది. బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటో, రిలయన్స్, టాటా మోటార్స్, టాటా కన్జ్యూమర్స్, నెస్లే టాప్ విన్నర్స్‌గా, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్,టాటాస్టీల్, గ్రాసిం టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాల్లో 81.64 వద్ద ఉంది. -
మస్క్ సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్?
న్యూఢిల్లీ:టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ టేకోవర్ తరవాత తమ యూజర్ల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగిందంటూ ప్రకటనదారులకు భరోసా ఇస్తోంది ట్విటర్. ఈ విషయాన్ని ప్రపంచ బిలియనీర్ ట్విటర్ బాస్ మస్క్ ట్విటర్లో షేర్ చేశారు. బ్లూటిక్ ఫీజు, భావ ప్రకటనా స్వేచ్ఛ, విద్వేషపూరిత కంటెంట్, ఇతర గందరగోళాల మధ్య యూజర్లు ప్రత్యర్థి ప్లాట్‌ఫారమ్‌లకు తరలిపోతున్నారన్న అంచనాల మధ్య ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. Twitter usage is at an all-time high lol — Elon Musk (@elonmusk) November 8, 2022 తమ రోజువారీ వినియోగదారుల వృద్ధి "ఆల్-టైమ్ హై"కి చేరుకుందని ట్విటర్ తన ప్రకటనదారులకు తెలిపింది. గత వారం ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత మానిటైజబుల్ డైలీ యూజర్ (mDAU) వృద్ధి 20 శాతానికి పైగా వేగం పుంజుకుందని,1.5 కోట్ల అదనపు యూజర్లు చేరారని ట్విటర్ పత్రాల ఆధారంగా ది వెర్జ్ నివేదించింది. ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్లో అమెరికాలో మరింత వేగంగా పెరుగుతోంది. ట్విటర్ తాజా 15 మిలియన్ల కంటే ఎక్కువ mDAUలను జోడించుకొని, క్వార్టర్ బిలియన్ మార్క్‌ను దాటింది. అంతకుముందు 16.6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. I just hope the servers don’t melt! — Elon Musk (@elonmusk) November 8, 2022 కాగా ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ ఆదాయం ఒక శాతం పడిపోయి 1.18 బిలియన్ డాలర్లకు, ఆ తరువాత క్వార్టర్లో 270 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇది ప్రకటనదారులను ప్రభావితం చేసింది. ఇక తాజా పరిణామల నేపథ్యంలో సమస్యాత్మక కంటెంట్‌తో పాటు తమ ప్రకటనలు కనిపించవచ్చనే ఆందోళనతో ఇప్పటికే వోక్స్వ్యాగన్ గ్రూప్ అనేక ఇతర కంపెనీలతో కలిసి ట్విటర్లో యాడ్స్‌ను నిలిపివేసింది. అలాగే డానిష్ బ్రూయింగ్ కంపెనీ కార్ల్స్‌బర్గ్ గ్రూప్ కూడా తన మార్కెటింగ్ బృందాలకు దాదాపు ఇలాంటి సలహానే ఇచ్చింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కూడా ప్రకటనలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
ఆపిల్ ఐఫోన్లు, మనోళ్లు తెగ కొనేశారట: రికార్డు ఆదాయం
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఇండియాలో ఐఫోన్ అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఐఫోన్ అమ్మకాలలో అత్యధిక ఆదాయాన్నినమోదు చేసింది. భారతదేశంలో బలమైన రెండంకెల వృద్ధితో ఆల్-టైమ్ రికార్డు ఆదాయ రికార్డును సాధించింది ఈ ఏడాది నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాల సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ వివరాలను వెల్లడించారు. ఒక్క సెప్టెంబర్ త్రైమాసికంలోనే ఐఫోన్ విక్రయాల్లో 10శాతం వృద్ధిని సాధించి 42.6 బిలియన్ల డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో ప్రపంచంలోని ప్రతి మార్కెట్లోనూ తమకు అద్భుతమైన ఆదాయం లభించిందని కుక్ తెలిపారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ, లాటిన్ అమెరికా దేశాల్లోనూ ఇదే తరహాలో వృద్ధి నమోదు చేశామన్నారు. ముఖ్యంగా థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మెక్సికో దేశాల్లో రెట్టింపు ఆదాయం సాధించామనీ, అలాగే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మరింత విజయవంతంగా అమ్మకాలు సాగిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్లో డీల్స్, ఆఫర్ల కారణంగా ఐఫోన్ అమ్మకాలు జోరందుకున్నాయన్నారు. -
రికార్డ్ స్థాయికి చమురు: పేలనున్న పెట్రో బాంబు?
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్- రష్యా యుద్ధం, రష్యాపై ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రికార్డు స్థాయికి చేరాయి. ముఖ్యంగా రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌ను మూడొంతుల మేర నియంత్రించడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు అంగీకారం తెలిపాయి. ఫలితంగా రష్యా ముడి చమురు దిగుమతి మరింత కఠినతరం కానుంది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే క్రూడాయిల్ బ్యారెల్ ధర 124 డాలర్లకు చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బ్యారెల్ రేటు పెరగడం ఇదే తొలిసారి. రష్యాపై ఆరో ప్యాకేజీ కింద ఆంక్షలు, నిషేధాజ్ఞలు తీవ్రం కావడంతో ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై పడింది. క్రూడాయిల్ ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 124 డాలర్లకు చేరడానికి దారి తీసిందీ పరిస్థితి. బ్రెంట్, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధరల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ఇక్కడ బ్యారెల్ ధర 60 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఈ ధరల ఒత్తిడి దేశీయ ధరలపై పడే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభం దేశీయ ఇంధన రంగం కూడా ప్రభావితం కానుంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో, దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులు, రిఫైనర్ల కార్యకలాపాల ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 30.5 శాతం, త్రైమాసికంలో 7.40 శాతం పెరిగాయి. అలాగే నిఫ్టీ 50లో 5 శాతానికి పైగా పతనంతో పోలిస్తే 2022లో బిఎస్ఇ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ 7.5 శాతం లాభపడింది. అలాగే ఇండియాలోని రెండు చమురు ఉత్పత్తిదారులు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాల మార్చి త్రైమాసికంలో నికర లాభం వరుసగా 21 శాతం, 207 శాతం జంప్ చేయడం విశేషం. ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైనపుడు ముడి చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్లకు అటూ ఇటూ కద లాడింది. మధ్యలో కాస్త శాంతించినప్పటికీ రష్యన్ చమురు ఎగుమతులపై యూరోపియన్ యూనియన్ తాజా ఆంక్షలతో మళ్లీ బ్యారెల్ 124 డాలర్ల మార్కుకు ఎగిసింది. దీంతో పెట్రోలు ధరలు మరింత పుంజుకోనున్నా యనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్రం పన్నులను తగ్గించిన్పటికీ అంతర్జాతీయ ప్రభావంతో దేశీయంగా మళ్లీ పెట్రో వాత తప్పదనే భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు చమురు ధరలు బ్యారెల్ 110 డాలర్లకు చేరడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం కంటే పెద్ద ముప్పే అంటూ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల దావోస్‌లో వ్యాఖ్యలును గుర్తు చేసుకుంటున్నారు. -
శ్రీలంక సంక్షోభం, భగ్గుమన్న పెట్రోలు, లీటరు రూ.420
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో మరోసారి ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మంగళవారం పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్ ధరను 38.4 శాతం పెంచుతూ అక్కడి సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆక్టేన్ 92 పెట్రోల్ ధర 420 రూపాయలు (1.17 డాలర్లు,) డీజిల్ రూ. 400 (1.11 డాలర్లు) కు చేరింది. ఏప్రిల్ 19 నుండి రెండోసారి ధరల పెంపుతో ఫ్యూయల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో విదేశీమారక నిల్వలు భారీగా క్షీణించాయి. దీంతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వరంగ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. శ్రీలంకలో చమురు నిల్వలు అడుగంటిపోవడంతో అక్కడి వినియోగదారుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. 1948లో స్వాతంత్య్రం పొందినప్పటి నుండి ఇంతటి సంక్షోభం ముందెన్నడూ లేదు. దాదాపు అన్ని నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. విదేశీ నిల్వల కొరత కారణంగా ఇంధనం, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాలకోసం జనుల క్యూలైన్లలో బారులు తీరుతున్న పరిస్థితి. అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం రేటు 40 శాతం దిశగా దూసుకుపోవడం, ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. శ్రీలంక తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, ఇంధనం అడుగంటిపోకుండా నిరోధించే చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఖర్చులను తగ్గించే చర్యగా, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, ఆయా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను నిర్దేశించింది. రవాణా, ఇతర సేవా ఛార్జీల సవరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందనీ ఈ ఫార్ములా ప్రతి పదిహేను రోజులకోసారి లేదా నెలకోసారి వర్తింపజేస్తామని విద్యుత్,ఇంధన శాఖ మంత్రి కాంచన విజే శేఖర ట్విటర్లో తెలిపారు. (1) Fuel Price will be revised from 3am today. Fuel pricing formula that was approved by the cabinet was applied to revise the prices. Price revision includes all costs incurred in importing, unloading, distribution to the stations and taxes. Profits not calculated and included. — Kanchana Wijesekera (@kanchana_wij) May 23, 2022 (3) Public sector workforce will be called to work on the direction of the head of the institute from today. Work from home will be encouraged to minimize the use of fuel and to manage the energy crisis. pic.twitter.com/JVKrmSYnoc — Kanchana Wijesekera (@kanchana_wij) May 23, 2022 -
సేవల రంగం.. సూపర్ స్పీడ్!
న్యూఢిల్లీ: భారత్ సేవలకు సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ గత పదిన్నర సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వేగాన్ని అక్టోబర్‌లో నమోదుచేసుకుంది. సెప్టెంబర్‌లో 55.2 వద్ద ఉన్న ఇండెక్స్ అక్టోబర్‌లో 58.4కు ఎగసింది. డిమాండ్, ఆర్థిక రికవరీకి ఇది సంకేతమని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా వ్యాపార విశ్వాసం తగ్గినప్పటికీ, కొత్త వ్యాపారాల్లో గుర్తించదగిన పురోగతి కనిపిస్తోందని, కొత్త ఉద్యోగ కల్పనకూ ఇది దారితీసిందని ఆమె విశ్లేషించారు. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపు క్షీణతగా పరిగణిస్తారు. సెకండ్‌వేవ్ ఆంక్షల తొలగింపు నేపథ్యంలో గత మూడు నెలలుగా సూచీ 50 పైన కొనసాగడం గమనార్హం. ముడి పదార్థాల ధరల భారం... ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడంతో, కంపెనీలు దాదాపు నాలుగున్నర సంవత్సరాలలో అత్యంత వేగంగా తమ ఫీజులను పెంచేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నట్లు పోలియానా డీ లిమా పేర్కొన్నారు. ఇంధనం, మెటీరియల్, రిటైల్, సిబ్బంది, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగినట్లు కంపెనీలు పేర్కొంటున్నాయని వెల్లడించారు. కాగా, నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు రాబోయే సంవత్సరంలో వృద్ధిని అడ్డుకోవచ్చని సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన చెందుతున్నారని, భవిష్యత్ వ్యాపార విశ్వాసంపై కొంత ప్రతికూల ధోరణి ఉందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో భారత్ సేవలకు అంతర్జాతీయ డిమాండ్ బలహీనంగా కొనసాగుతోందని ఆమె తెలిపారు. సేవలు–తయారీ కలిపినా దూకుడే... కాగా సేవలు–తయారీ రంగాలు కలిపిన కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సెప్టెంబర్‌లో 55.3 వద్ద ఉంటే, అక్టోబర్‌లో 58.7కు ఎగసింది. 2012 తర్వాత పటిష్ట నెలవారీ విస్తరణను ఇది సూచిస్తోందని ఎకనమిస్ట్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. వరుసగా రెండవనెలా ప్రైవేటు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల సృష్టి జరిగింది. ఒక్క తయారీ రంగాన్ని చూసినా మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఎకానమీ రికవరీ సంకేతాలను సూచిస్తూ అక్టోబర్ ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 55.9గా నమోదయ్యింది. ఇది సెప్టెంబర్‌లో 53.7 వద్ద ఉంది. ఫిబ్రవరి తర్వాత ఎకానమీ గణాంకాలు గణనీయంగా మెరుగుపడినట్లు తమ సర్వేద్వారా వెల్లడవుతున్నట్లు ఎకనమిస్ట్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు. -
ఇవి షేర్లా.. బుల్లెట్ రైళ్లా... లాభాలతో ఇన్వెస్టర్ల ఉక్కిరి బిక్కిరి
వియ్ డోంట్ బ్రేక్ రికార్డ్స్, వియ్ క్రియేట్ రికార్డ్స్ ఈ క్యాప్షన్ ఓ సినిమా ప్రచారానికి సంబంధించింది. ఇప్పుడు ఇదే క్యాప్షన్ ఐఆర్సీటీసీ షేర్లకు అన్వయించే పరిస్థితి స్టాక్ మార్కెట్లో నెలకొంది. పాత రికార్డుల సంగతి దేవుడెరుగు వారానికో కొత్త రికార్డు నమోదు చేస్తూ ముందుకు సాగుతోంది. గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఐఆర్సీటీసీ షేర్లు మరోసారి దుమ్ము రేపాయి. ఈ కంపెనీ షేర్లతో ఒక్కసారిగా వచ్చిపడుతున్న లాభాలతో ఇన్వెస్టర్లు ఉక్కిరి బిక్కిరి అవుతుండగా మరోవైపు ఈ దూకుడుకు కారణాలు వెతికే పనిలో మార్కెట్ విశ్లేషకులు ఉన్నారు. ఆల్‌టైం హై ఆన్లైన్లో రైలు టిక్కెట్స్ బుకింగ్ సర్వీసును అందించే ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పోరేషన్ లిమిటెడ్ సంస్థ షేర్లు బుల్లెట్ రైలును తలపిస్తున్నాయి. సరిగ్గా వారం రోజుల కిందట ఆల్‌టైం హై ధరగా ఒక్కో షేరు ధర రూ.4786లు పలికింది. దీంతో చాలా మంది విశ్లేషకులు ఇంత కంటే ధర పెరగడం కష్టమంటూ పేర్కొన్నారు. లాభాలు స్వీకరించాలనుకునే వారు ఇక్కడే షేర్లను అమ్మివేయడం బెటర్ అంటూ సూచించారు. కానీ వారి అందరి అంచనాలు వారం రోజుల వ్యవధిలో తలకిందులయ్యాయి. ఐదు వేలు అలవోకగా ఐఆర్సీటీసీ షేర్లకు 5000 దగ్గర రిసిస్టెన్స్ తప్పదని అంచనాలు నెలకొన్నాయి. ఐదు వేల మార్క్ చేరుకునేందుకు చాలా సమయం పడుతుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అదంతా తప్పని తేలియపోయింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఒక్కో షేరు రూ. 4786 నుంచి రూ. 5480కి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. గత వారం ఆల్‌టైం హై దగ్గర అనుమానంగా ఈ కంపెనీ షేర్లను కొన్నవారికి సైతం భారీ లాభాలను అందించింది ఐఆర్సీటీసీ. ఏడాది క్రితం సరిగ్గా ఏడాది కిందట అక్టోబరు 15న ఐఆర్సీటీసీ షేరు ధర రూ. 1329గా నమోదు అయ్యింది. అప్పటి నుంచి ప్యాసింజర్ రైలు తరహాలో నెమ్మదిగా షేరు ధర పెరుగుతూ వచ్చింది. 2021 జులై మొదటి వారంలో ఒక్కో షేరు ధర రూ. 2300లకు అటుఇటుగా నమోదు అయ్యింది. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ వేగం అందుకుని కేవలం రెండు నెలల వ్యవధిలో అంటే సెప్టెంబరు మొదటి వారం నాటికి ఒక్కో షేరు ధర రూ. 3300లను టచ్ చేసింది. ఆ తర్వాత సూపర్‌ఫాస్ట్ వేగంతో నాలుగు వేలు,. బుల్లెట్ రైలు వేగంతో ఐదువేలు క్రాస్ చేసి ఆల్‌టైం హై రూ. 5480ని టచ్ చేసింది. అందువల్లేనా కోవిడ్ అనంతరం రైలు ప్రయాణాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దేశం మొత్తం మీద ఆన్‌లైన్‌లై టిక్కెట్టు అందించే వ్యవస్థ ఐఆర్సీటీసీ ఒక్కటే ఉంది. కాబట్టి ఈ కంపెనీ పనితీరుకి ఢోకా లేదనే నమ్మకం ఇన్వెస్టర్లలో నెలకొందని జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ చైర్మన్ రవి సింఘాల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఒక్క రైలు టిక్కెట్స్ అమ్మకమే కాకుండా దాదాపుగా అన్ని నగరాల్లో ఆతిధ్య సేవలు అందివ్వడం పైనా ఐఆర్సీటీసీ దృష్టి పెట్టిందని, ఇప్పటికే హోటల్ చెయిన్స్‌తో ఒప్పందాలు కూడా ఖరారు అయ్యాయని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమిత్ బగాడియా అంటున్నారు. లాభాలు ఇలా సరిగ్గా ఏడాది కిందట ఐఆర్సీటీసీ షేరు ధర రూ. 1329గా నమోదు అయ్యింది. అప్పుడు రూ.1,32,900లను ఇన్వెస్ట్ చేసి వంద షేర్లు కొంటే ఇప్పుడు వాటి విలువ ఏకంగా రూ. 5,48,000 చేరుకుంది. అంటే ఏడాదిలో నికరంగా రూ. 4,16,900 లాభం అందింది. ఇక గత వారం రూ. 4,78,600 వెచ్చింది వంద షేర్లు కొన్న వారికి సైతం సుమారు రూ.70,000ల లాభం అందింది. స్టాక్మార్కెట్లో టాటా గ్రూపు జోరు మధ్య సైతం ఐఆర్సీటీసీ తన వేగాన్ని కొనసాగిస్తోంది. చదవండి: ఇదేం కెమిస్ట్రీ బాబు!... షేర్ల ధర అలా పెరిగింది.. కనక వర్షమే -
నిఫ్టీ రికార్డ్ !.. ఆల్‌టైం హై టచ్
ముంబై : స్టాక్ మార్కెట్లో మరో సంచలనం నమోదైంది. నేషనల్ స్టాక్ ఏక్సేంజీ సూచీ నిఫ్టీ ఆల్‌టైం హై పాయింట్లను తాకింది. మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతుండటంతో సోమవారం 18 వేల మార్క్‌ని టచ్ చేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈ రోజు ఉదయం 17,867 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ 17,839 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. కానీ ఆ వెంటనే కోలుకుంది. ఉదయం 9:30 గంటల నుంచి నిఫ్టీ సూచీ పాయింట్లు పెరుగుతూనే పోయింది. అలా మధ్యాహ్నం 12 గంటల సమయంలో 67 పాయింట్లు లాభపడి ఆల్‌టైం హైకి చేరుకుని 18,000 పాయింట్లను టచ్ చేసింది. ఐటీ షేర్ల అండతో నిఫ్టీ సునాయాసంగా 18వేల మార్క్‌ని అందుకుంది. ఈరోజు ఉదయం టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ షేర్లు ఆరంభంలో నష్టపోయాయి. కానీ ఇన్వెస్టర్లు ఈ కంపెనీల షేర్లపై నమ్మకం చూపించడంతో నష్టాల నుంచి కొలుకుని లాభాల బాట పట్టాయి. ఈ షేర్ల దన్నుతో నిఫ్టీ 18 వేల పాయింట్లను క్రాస్ చేసింది. మరోవైపు చైనా, జపాన్‌తో పాటు అమెరికాలో మార్కెట్లో సైతం మంచి ఫలితాలు రావడం నిఫ్టీకి కలిసొచ్చింది. -
సెన్సెక్స్ ఆల్‌టైం రికార్డు
ముంబై: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. దీంతో నిఫ్టీ సరికొత్త రికార్డులు నెలకొల్పిన మరుసటి రోజే సెన్సెక్స్ కూడా అదే పని చేసింది. 54,000 వేల పాయింట్లను బుధవారం అవలీలగా దాటేసింది. 54,000 క్రాస్ బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ సరికొత్త ఎత్తులకు చేరుకుంది. నెలన్నర రోజుల్లో తన ఖాతాలో మరో వెయ్యి పాయింట్లు జమ చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 50వేల మార్క్‌ని దాటిన సెన్సెక్స్ జూన్ 22న సెన్సెక్స్ పాత రికార్డులు బద్దలు కొడుతూ 53 వేల మార్క్‌ని క్రాస్ చేసింది. ఆ తర్వాత 54 వేలు చేరడానికి కేవలం 30 సెషన్లు మాత్రమే తీసుకుంది. బుధవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైంది మొదలు సెన్సెక్స్ సూచీ పైకి చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 546 పాయింట్లు లాభపడి 54,369 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఓ దశలో 54,465 గరిష్ట పాయింట్లకు చేరుకుంది. నిన్న పదహారు వేల మార్క్‌ని క్రాస్ చేసిన నిఫ్టీ ఈ రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగించింది. మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 122 పాయింట్లు లాభపడి 16,253 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. పాజిటివ్ ట్రెండ్ జూన్ నెలలో వివిధ కంపెనీలు ప్రకటించిన క్వార్టర్ ఫలితాలు ఆశజనకంగా ఉండటంతో మార్కెట్లో కొత్త ఉత్సాహం వచ్చింది. కోవిడ్ ఆంక్షలు తొలగించిన తర్వాత స్మాల్, మిడ్‌క్యాప్ కంపెనీలు వ్యాపారాలు పుంజుకున్నాయి. మరోవైపు కోవిడ్ వ్యాప్తి కంట్రోల్లోనే ఉండటంతో ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఆసక్తి చూపించారు. లాభపడ్డ షేర్లు హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకుల షేర్లు లాభాలు పొందగా టైటాన్, నెస్టల్ ఇండియా, ఆల్ట్రాటెక్ కంపెనీలు సెన్సెక్స్‌లో నష్టాలు పొందాయి. మరోవైపు మార్కెట్లో బులట్రెండ్ కొనసాగుతుండటంతో స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు లాభపడ్డాయి. -
Stock Market: లాభాల జోరు: సరికొత్త గరిష్టానికి నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో వరుసగా రెండో సెషన్లో లాభాల జోరును కంటిన్యూ చేస్తున్నాయి. దీంతో నిఫ్టీ 15600వద్ద రికార్డు స్థాయిని దాటేసింది. అటు సెన్సెక్స్ 52వేల ఎగువకు చేరగా, ప్రస్తుతం సెన్సెక్స్ 261 పాయింట్లు ఎగిసి 52198 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 15649 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మెటల్, ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లలోను కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. బజాజ్ ఆటో, ఓఎన్జిసి, హెచ్‌డిఎఫ్‌సి, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ లాభాలలో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడీస్, టీసీఎస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్,టాటా స్టీల్, జెఎస్డబ్ల్యు స్టీల్ , హిందాల్కో నష్టపోతున్నాయి. ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణికి తోడు, ప్రధానంగా జీడీపీ అంచనాలు ఊహించినదానికంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలంగా ఉంది. అయితే దేశ జీడీపీపై కరోనా ప్రభావం భారీగానే పడింది. నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి పతనమైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీడీపీ 2020-21లో 7.3 శాతం తగ్గింది. గత త్రైమాసికంలో (జనవరి-మార్చి 2021) ఇది 1.6 శాతం పెరిగింది. 2020-21 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 1.6 శాతం వృద్ధిని సాధించినట్లు ఎన్ఎస్ఓ వెల్లడించింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే 0.5 శాతం పెరుగుదల కనిపించిందని వెల్లడించింది. చదవండి: 40 ఏళ్ల కనిష్టానికి...జీడీపీ -
భారీ ఆఫర్: దూసుకుపోయిన ఇన్ఫోసిస్
సాక్షి, ముంబై: 1800 పాయింట్లుకు పైగా కుప్పకూలిన దలాల్ స్ట్రీట్‌లో ఈ సోమవారం బ్లాక్ మండేగా నిలిచింది. స్టాక్మార్కెట్లో 2021లో ఇదే అదిపెద్ద పతనం. అయితే దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం లాభాలతో మురిపించింది. తమ బోర్డు సమావేశంలో వాటాలను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తుందని ఆదివారం ఎక్స్ఛేంజీలకు సమాచారం కంపెనీ వెల్లడించడమే ఇందుకు కారణం. దీంతో ఇన్ఫోసిస్ షేరు ఏకంగా 2.72 శాతం ఎగిసి రూ.1480 తాకింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ బీఎస్ఇలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 6.12 లక్షల కోట్లను తాకింది. అనంతరం లాభాల స్వీకరణ కారణంగా స్వల్పంగా నష్టపోతోంది. (మార్కెట్ల క్రాష్: రూ. 7 లక్షల కోట్లు మటాష్) ఏప్రిల్ 14, 2021న బోర్డు సమావేశం ముగిసిన తరువాతఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్ ప్రకటించనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లవైపు మళ్లించాయి. ప్రధానంగా క్యూ4 ఫలితాలు, బోర్డ్ మీటింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకోనుందని అంచనా. దీనికితోడు ఫైనల్ డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించనుందని సీఎల్ఎస్ఏ అంచనాలు వెలువరించింది. దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నరశాతం ఈక్విటీకి సమానమైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి ఇన్ఫోసిస్ తిరిగి కొనుగోలు చేయనుందనితెలిపింది. ఈ బైబ్యాక్‌ను డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్లయితే,రెండేళ్ళలో ఇన్ఫోసిస్ రెండో బై బ్యాక్ ఆఫర్ అవుతుంది. మార్చి 2019న 747 ధర వద్ద 11.05 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లను 8,260 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (బంపర్ ఆఫర్ : ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీ తగ్గింపు) చదవండి : ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త! -
చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు.. పౌల్ట్రీ చరిత్రలో అత్యధికం
సాక్షి, అమరావతి: చికెన్ ధర సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో రూ.306కు చేరి ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఇంతటి ధర దేశంలోనే ఎప్పుడూ నమోదు కాలేదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, వడగాలులకు తోడు కోళ్ల కొరత వల్ల చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. గతేడాది కోవిడ్‌కు ముందు వరకు చికెన్ రేటు అధికంగానే (కిలో రూ.270 వరకు) ఉండేది. కోవిడ్ ఉధృత రూపం దాల్చిన తర్వాత వచ్చిన రూమర్స్‌తో నాలుగైదు నెలల పాటు చికెన్ ధర గణనీయంగా పడిపోయింది. ఒకానొక దశలో మూడు కిలోల చికెన్‌ను రూ.100కే విక్రయించారు. ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ నెమ్మదిగా బయటపడింది. క్రమేపీ చికెన్ ధర పెరగడం మొదలైంది. విజయవాడ జోన్లో గత డిసెంబర్ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుందన్న ప్రచారంతో చికెన్ రేటు మళ్లీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి దిగివచ్చింది. దాన్ని కూడా అధిగమించి.. చికెన్ ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 23న కిలో రూ.200 ఉన్న ధర.. మార్చి 31వ తేదీకి రూ.260కి చేరింది. ఏప్రిల్ 2న రూ.270, ఏప్రిల్ 3న రూ.296కు పెరిగింది. తాజాగా ఆదివారం రికార్డు స్థాయిలో కిలో రూ.306కి చేరింది. కోళ్ల కొరత వల్లే.. కొన్నాళ్ల నుంచి బ్రాయిలర్ కోళ్లకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఎండలు, వడగాలుల వల్ల కోళ్లు చనిపోతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా చికెన్ ధర పెరగడానికి ఇదే కారణం. ఈ స్థాయిలో ధర పెరగడం పౌల్ట్రీ చరిత్రలో ఇదే ప్రథమం. – కాజా వెంకటేశ్వరరావు (నాని), ప్రెసిడెంట్, అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఎండ దెబ్బ.. వేసవికాలంలో కోళ్ల ఎదుగుదల తగ్గుతుంది. మేత అధికంగా తింటే ఎండల ధాటికి తట్టుకోలేక చనిపోతాయని పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్లకు ఉదయం పూట మేత పెట్టరు. పైగా నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కోళ్లు సరిగ్గా తిండి కూడా తినలేవు. ఫలితంగా కోళ్లు ఎదుగుదల తగ్గి బరువు పెరగవు. అదే సమయంలో వడగాలులకు ఫారాల్లో పెరుగుతున్న కోళ్లు 10 నుంచి 15 శాతం వరకు మృత్యువాత పడుతుంటాయి. అలాగే ఏటా కోళ్ల విక్రయాల పెంపును దృష్టిలో ఉంచుకుని హ్యాచరీలు వారంపాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తాయి. ఆ సమయంలో పౌల్ట్రీలకు హ్యాచరీల వాళ్లు కోడి పిల్లలను విక్రయించరు. ఇలా నెల కిందట తెలుగు రాష్ట్రాల్లో క్రాప్ హాలిడే అమలు చేశారు. ఇవన్నీ వెరసి ఇప్పుడు డిమాండ్‌కు సరిపడినన్ని కోళ్లు లభ్యం కావడం లేదు. ఫలితంగా చికెన్ ధర గణనీయంగా పెరిగిపోయింది. మరో రెండు వారాలకు కోళ్ల లభ్యత పెరుగుతుందని, ఆ తర్వాత చికెన్ ధర దిగివస్తుందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. -
దూకుడు : కొత్త శిఖరాలకు మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త శిఖాలకు చేరాయి. గత వారం ఫ్లాట్‌గా ట్రేడ్ అయిన సూచీలు సోమవారం భారీగా ర్యాలీ అవుతున్నాయి. దీంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 52 వేల మార్కును అధిగమించి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 503 పాయింట్ల లాభంతో 52047వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 15290 వద్ద కొనసాగుతున్నాయి. అటు బ్యాంకింగ్ కౌంటర్ కూడా శుక్రవారం నాటి జోష్‌ను కొనసాగిస్తోంది. 641పాయింట్ల లాభంతో 36750 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల ధోరణి నెలకొంది. ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్ లాభంతో ఉన్నాయి.ఇండెక్స్ హెవీవెయిట్స్ ఇన్ఫోసిస్ రిలయన్స్ ఇండస్ట్రీస్,ఎస్బీఐ కూడా లాభపడుతున్నాయి. మరోవైపు ఓఎన్జీసీ. టెక్ మహీంద్రా.ఎస్బీఐ లైఫ్, హీరోమోటోకార్ప్ , కోల్ ఇండియా నష్టపోతున్నాయి. అటు చమురు ధరలు ఏడాది గరిష్టానికి చేరాయి. బ్రెంట్ ముడి 66 సెంట్లు లేదా 1.1 శాతం పెరిగి బ్యారెల్ 63.09 డాలర్లకు చేరుకుంది. ఇది జనవరి 22, 2020 నుండి అత్యధికం. -
200 లక్షల కోట్లను దాటేసిన ఇన్వెస్టర్ల సంపద
సాక్షి,ముంబై: బడ్జెట్ 2021 తరువాత దలాల్ స్ట్రీట్ సరికొత్త రికార్డులకు నెలవుగా మారింది. కీలక సూచీలు సరికొత్త జీవితాకాల గరిష్టాలను నమోదు చేసిన నేపథ్యంలో పెట్టుబడిదారుల సంపద కూడా రికార్డుస్థాయికి చేరింది. గురువారం ఆరంభంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ ప్రపంచ మార్కెట్ల సానుకూ సంకేతాలతో మిడ్ సెషన్ నుంచి లాభాల్లోకి మళ్లింది. దీంతో సెన్సెక్స్ 50,474 గరిష్ట స్థాయిని టచ్ చేసింది. అనంతరం సరికొత్త గరిష్టాల దిశగా సెన్సెక్స్ దూకుడును కొనసాగిస్తోంది. ఫలితంగా బిఎస్ఇ-లిస్టెడ్ సంస్థల ఆర్కెట్ క్యాప్ మొదటిసారి రూ .200 లక్షల కోట్లు దాటింది. అంతకుముందు రూ .198.3 లక్షల కోట్లతో పోలిస్తే పెట్టుబడిదారుల సంపద తాజాగా రూ .200.11 లక్షల కోట్లకు పెరిగింది. నేటి సెషన్లో 350 పాయింట్లకు పైగా జంప్ చేసిన సెన్సెక్స్, 50614 వద్ద, నిఫ్టీ 14,900 వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసాయి. ఐటిసి, ఎంఅండ్ ఎం, ఒఎన్‌జిసి, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టిపిసి టాప్ గెయినర్స్గాఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 256 పాయింట్లు ఎగిసి 50522 వద్ద, నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 14874 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కాగా బడ్జెట్ తర్వాత సెన్సెక్స్ గత నాలుగు సెషన్లలో 4,189 పాయింట్లు సాధించగా పెట్టుబడిదారుల సంపద రూ .13.99 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ 2014 నవంబర్ 28 న తొలిసారిగా రూ.100 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. తాజాగా ఇది రెట్టింపై 200 లక్షల కోట్లకు చేరింది. -
వ్యాక్సిన్ జోష్ : 50 వేల దిశగా సెన్సెక్స్ దౌడు
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్టు బుధవారం కూడా పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో కీలక సూచీలు రెండూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 256 పాయింట్లు ఎగిసి 48773 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు 14647 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 50 వేల వైపు పరుగులు పెడుతోంది. నిఫ్టీ 14600 ఎగువన స్థిరంగా కొనసాగుతుండగా, బ్యాంకు నిఫ్టీ సరికొత్త ఆల్ టైం హైని టచ్ చేసింది. ప్రధానంగా కరోనా అంతానికి దేశంలో రెండు వ్యాక్సిన్ల్లు అందుబాటులోకి రావడం, మరి రెండు రోజుల్లో వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ షురూ కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉంది. దీంతో ఆసియా అంతటా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ మన సూచీలు లాభాలతో కళకళలాడుతున్నాయి. వ్యాక్సిన్ డోస్‌లు పలు నగరాలకు చేరడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆశలు పుంజుకున్నాయి. (కోవీషీల్డ్ వ్యాక్సిన్ ధర : సీరం కీలక ప్రకటన) -
ఫండ్స్‌లో వరుసగా ఆరో నెలా అమ్మకాలే
న్యూఢిల్లీ: మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో వరుసగా ఆరో నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో (ఎంఎఫ్) అమ్మకాలు కొనసాగాయి. నవంబర్‌లో ఈక్విటీల నుంచి 30,760 కోట్ల పెట్టుబడులను ఫండ్స్ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. సెబీ గణాంకాల ప్రకారం జూన్ నుంచి ఇప్పటిదాకా రూ. 68,400 కోట్ల పెట్టుబడులు ఉపసంహరణ జరిగింది. అయితే, ఇతరత్రా వచ్చిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది తొలి 11 నెలల్లో (జనవరి–నవంబర్) నికరంగా రూ. 28,000 కోట్లు వెనక్కి తీసుకున్నట్లయింది. ఇదే వ్యవధిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ. 1.08 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఫలితంగా మ్యూచువల్ ఫండ్స్ విక్రయాలు ఎలా ఉన్నప్పటికీ ఎఫ్‌పీఐల ఊతంతో మార్కెట్లు గత కొద్ది నెలలుగా పెరుగుతూనే వచ్చాయి. ‘మార్కెట్లు కొత్త గరిష్టాలకు చేరడం, నిఫ్టీ వేల్యుయేషన్ 36 రెట్ల స్థాయికి చేరడం వంటి అంశాల కారణంగా లాభాల స్వీకరణ జరుగుతోంది. సెప్టెంబర్–అక్టోబర్‌తో పోలిస్తే పెట్టుబడుల ఉపసంహరణ మరింతగా పెరగడం ఇందుకు నిదర్శనం‘ అని ప్రైమ్‌ఇన్వెస్టర్‌డాట్‌ఇన్ సహ వ్యవస్థాపకురాలు విద్యా బాల తెలిపారు. ఈక్విటీ మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చే దాకా ఈ ధోరణి కొనసాగవచ్చని ఆమె పేర్కొన్నారు. మార్కెట్లు కరెక్షన్కు లోనైనా, దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్ధి పుంజుకుంటోందనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపించినా ఫండ్లు మళ్లీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టొచ్చని మార్నింగ్‌స్టార్ ఇండియా డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపూర్కర్ తెలిపారు. -
చివరి గంటలో అమ్మకాలు
ట్రేడింగ్ చివరి గంటలో బ్యాంక్, ఆర్థిక, వినియోగ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా శుక్రవారం స్టాక్‌మార్కెట్ నష్టపోయింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 21 పైసలు పుంజుకొని 73.45కు చేరినా, స్టాక్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 134 పాయింట్లు పతనమై 38,846 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు నష్టంతో 11,505 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు నష్టపోయాయి. ఫార్మా షేర్ల జోరు మాత్రం కొనసాగుతోంది. పలు ఫార్మా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 9 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 41 పాయింట్లు లాభపడింది. 564 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... ఆసియా మార్కెట్ల జోరుతో మన మార్కెట్ కూడా మంచి లాభాల్లోనే ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ ఈ లాభాలు కరిగిపోయాయి. చివరి గంటలో బ్యాంక్, ఆర్థిక రంగషేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 220 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్, మరో దశలో 344 పాయింట్ల మేర పతనమైంది. మొత్తం మీద రోజంతా 564 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఫార్మా షేర్లు పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.3 శాతం నష్టంతో రూ. 1,057 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 160కి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అలెంబిక్, అపోలో హాస్పిటల్స్, బయోకాన్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, లుపిన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► 285 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రామ్‌కో సిస్టమ్స్, విసా స్టీల్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఆల్‌టైమ్ హైకి డాక్టర్ రెడ్డీస్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేరు దుమ్ము రేపుతోంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రెవ్లిమిడ్ ఔషధానికి సంబంధించిన న్యాయ వివాదాన్ని పరిష్కరించుకున్నామని కంపెనీ వెల్లడించింది. దీంతో ఈ కంపెనీ షేరు ఇంట్రాడేలో 14 శాతం లాభంతో ఆల్‌టైమ్ హై, రూ.5,497ను తాకింది. చివరకు 10 శాతం లాభంతో రూ.5,327 వద్ద ముగిసింది. కరోనా వైరస్ వ్యాక్సిన్, స్పుత్నిక్–వి టీకాను భారత్‌లో పంపిణీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ షేర్ ఈ వారం జోరుగా పెరిగింది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 20 శాతానికి మించి లాభపడింది. -
పేటెంట్ వివాదానికి స్వస్తి : షేరు దూకుడు
సాక్షి,ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు కాలం కలిసి వస్తోంది. తాజా పరిణామాలతో శుక్రవారం నాటి మార్కట్లో హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ డా.రెడ్డీస్ షేరు దూసుకు పోతోంది. వరుసగా నాల్గోరోజూ కొనుగోళ్ళ మద్దతుతో 5 శాతానికి పైగా ఎగిసి రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఇటీవల నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ తయారీ ఒప్పందానికి తోడు, అమెరికాకు చెందిన సెల్జీన్తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధికారికంగా ప్రకటించింది. సెల్జీన్తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్ల ఆసక్తిభారీగా నెలకొంది. ('స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్) కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘రెవ్లీమిడ్’ ఔషధంపై యూఎస్ కంపెనీ ‘సెల్జీన్’ తో డాక్టర్ రెడ్డీస్‌కు పేటెంట్ వివాదాన్ని తాజాగా పరిష్కరించుకుంది. వ్యాజ్యం లోని అన్న అసాధారణమైన వివాదాల పరిష్కారం, రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి డీల్ కుదిరినట్టు తెలిపింది. దీంతో 2022 మార్చి తరువాత ప్రపంచంలోని ‘టాప్-10’ ఔషధాల్లో ఒకటైన ‘రెవ్లీమిడ్’ ఔషధంపై సెల్జీన్ యూఎస్ మార్కెట్లో విక్రయించే అంశంపై ఇరు కంపెనీలు ఒప్పందాన్ని ఆమోదించినట్టు తెలిపింది. తద్వారా 2022 మార్చి తర్వాత యూఎస్‌లో ‘రెవ్లీమిడ్’ జనరిక్ ఔషధం విక్రయాలకు డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి లభించింది. అలాగే 2026 జనవరి 31 వరకు కొంత పరిమితితోను. ఆ తర్వాత పరిమితి లేకుండా విక్రయం చేసుకోవచ్చని డాక్టర్ రెడ్డీస్ నార్త్ అమెరికా జెనెరిక్స్ సీఈఓ మార్క్ కికుచి చెప్పారు. మల్టిపుల్ మైలోమా, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్, మాంటిల్ సెల్ లింఫోమా, ఫోలిక్యులార్ లింఫోమా లాంటి కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. కాగా వరుస నష్టాలకు చెక్ చెప్పిన లాభాల మార్కెట్లో నిఫ్టీ ఫార్మా దాదాపు 4 శాతం ఎగిసింది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సిప్లా సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. -
టీసీఎస్ మరో ఘనత
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ పరంగా అతివిలువైన రెండవ కంపెనీగా నిలిచింది. సోమవారం టీసీఎస్ షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో 2 శాతానికి పైగా లాభంతో 2442 వద్ద టీసీఎస్ షేరు 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ను రూ .9 లక్షల కోట్లను అధిగమించింది. దీంతో ఆర్ఐఎల్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండవ సంస్థగా టీసీఎస్ రికార్డు సొంతం చేసుకుంది. (పెట్టుబడుల వెల్లువ : రిలయన్స్ జోరు) ఐటీ రంగంలో మెరుగైన షేర్లలో టీసీఎస్ స్టాక్ ఒకటని నిపుణులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బీఎసీపీ పారిబాస్ నివేదిక ప్రకారం కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల అద్దెలు, రవాణా లాంటి ఖర్చులను భారీగా తగ్గించుకుని పొదుపు బాటపట్టనుందని అని కాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి గౌరవ్ గార్గ్ అన్నారు. -
పెట్టుబడుల వెల్లువ : రిలయన్స్ జోరు
సాక్షి,ముంబై: ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజుకో కొత్త రికార్డుతో దూసుకుపోతోంది. టెలికాం విభాగం రిలయన్స్ జియోలో పెట్టుబడుల సునామీ అనంతరం తాజాగా రిలయన్స్ రిటైల్‌లో వరుస పెట్టుబడులను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ షేర్ సోమవారం దాదాపు 2 శాతం లాభపడి ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. తద్వారా 15 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ అధిగమించింది. దీంతో అత్యంత విలువైన తొలి భారతీయ కంపెనీగా అవతరించింది. రిలయన్స్ రిటైల్ లో అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లయిల్ 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశం ఉందన్న రిపోర్టుల మధ్య ఆర్ఐఎల్ షేరు 2360 రూపాయల వద్ద ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. దీంతో బీఎస్ఇలో సంస్థ మార్కెట్ క్యాప్ రూ.15.80 లక్షల కోట్లకు చేరింది. ఆర్ఐఎల్ షేరు గత ఆరు రోజులలో 12.21 శాతం పుంజుకోవడం విశేషం. రిలయన్స్ రీటైల్ విభాగంలో పెట్టుబడులువెల్లువ కొనసాగుతున్నసంగతి తెలిసిందే. తాజా కార్లయిల్ ఒప్పందం ఖరారైతే, ఒక భారతీయ కంపెనీలో ఇది అతిపెద్ద పెట్టుబడిగాను, దేశ రిటైల్ రంగంలో కంపెనీ మొదటి పెట్టుబడిగాను రికార్డు దక్కించుకోనుంది. ఇప్పటికే టెక్ ఇన్వెస్టర్ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ రూ.7500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్ ఏకంగా 20 బిలియన్ డాలర్లతో 40శాతం వాటా కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో పాటు త్వరలో కేకేఆర్, ముబదాలా, అబుదాబీలు కూడా ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. -
భగ్గుమన్న బంగారం : రూ . 57,008కి ఎగిసిన పసిడి
సాక్షి, న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందని స్ధాయిలో దూసుకుపోతున్నాయి. రెండు వారాలుగా పైపైకి ఎగబాకిన పసిడి దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఆల్‌టైం హైకి చేరాయి. పదిగ్రాముల పసిడి ఏకంగా 57,008 రూపాయలకు పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు 576 రూపాయలు భారమై 77,840 రూపాయలు పలికింది. పసిడి ధరలు స్వల్పంగా పెరిగినా గత 16 సెషన్స్‌లో వరుసగా పెరగడంతో తాజాగా సరికొత్త శిఖరాలకు ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం త్వరలోనే రికార్డుస్ధాయిలో 2080 డాలర్ల వరకూ పెరుగుతుందని నేషనల్ ఆస్ర్టేలియా బ్యాంక్ ఆర్థిక వేత్త జాన్ శర్మ అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరగడం, ఆర్థిక అనిశ్చితితో మదుపుదారులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో బులియన్ మార్కెట్లో ఈవారం బంగారం పదేళ్ల గరిష్టస్ధాయిలో భారీగా లాభపడిందని రాయ్‌టర్స్ పేర్కొంది. కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో బంగారంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారని, రాబోయే రోజుల్లోనే బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి : పసిడి.. వెండి- ఆకాశమే హద్దు -
ఆల్‌టైం హై : రూ . 55,800 దాటిన బంగారం
ముంబై : బంగారం, వెండి ధరలు గురువారం ఆల్ టైం హైకి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ యల్లోమెటల్ ధర ఎగిసింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి 765 రూపాయలు భారమై తొలిసారిగా 55,863 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి ఏకంగా 4074 రూపాయలు పెరిగి 75,967 రూపాయలకు ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరగడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై పెనుప్రభావం చూపుతుందనే అంచనాలతో మదుపుదారులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఏకంగా 2055 డాలర్ల ఆల్‌టైం హైకి చేరింది. అమెరికన్ డాలర్ బలహీనపడటం, మదుపుదారుల పెట్టుబడులు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని కొటక్ సెక్యూరిటీస్ కమాడిటీ రీసెర్చ్ హెడ్ రవీంద్ర రావు అంచనా వేశారు. అమెరికన్ డాలర్ పుంజుకుంటే బంగారం ధరల్లో కొంత తగ్గుదల నమోదవుతుందని ఆయన పేర్కొన్నారు. చదవండి : పసిడి ఎఫెక్ట్ : 1500 కోట్ల ఆదాయం -
ఇప్పట్లో పసిడి పరుగుకు బ్రేక్ లేనట్టే!
ముంబై : బంగారం, వెండి ధరలు రికార్డు స్ధాయిలో పరుగులు పెడుతున్నాయి. సామాన్యుడికి స్వర్ణం అందనంత దూరానికి చేరువవుతోంది. పెళ్లిళ్లకూ, శుభకార్యాలకూ కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. అమెరికా-చైనా ఉద్రిక్తత, కరోనా వైరస్ కల్లోలం, అనిశ్చత రాజకీయ పరిస్థితులు రాబోయే రోజుల్లోనూ బంగారానికి భారీ డిమాండ్‌ను పెంచుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా బంగారం ధరలు ఏకంగా 1500 రూపాయలకు పెరగడం ఆల్‌టైం హైలను నమోదు చేస్తుండటంతో పసిడి పరుగుకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదని చెబుతున్నారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితుల నేపథ్యంలో ధరల్లో ఒడిదుడుకులు నెలకొన్నా బంగారం ధరలు నిలకడగా పెరుగుతాయని పృథ్వీ ఫిన్‌మార్ట్ హెడ్ మనోజ్ జైన్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులను దీర్ఘకాలం కొనసాగించాలని, సత్వర అమ్మకాలు దూరంగా ఉండాలని సూచించారు. చదవండి : క్యా'రేట్' మోసం ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2,000 డాలర్లకు చేరువవడంతో దేశీ మార్కెట్లోనూ యల్లోమెటల్ భారమైంది. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 150 రూపాయలు పెరిగి 52,250 రూపాయలకు ఎగబాకింది. ఇక కిలోవెండి 977 రూపాయలు పెరిగి 66,505 రూపాయలు పలికింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, ఆర్థిక వృద్ధి మందగమనంతో పాటు అమెరికా డాలర్ బలహీనపడటంతో పెట్టుబడి సాధనంగా బంగారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితుల నేపథ్యంలో ధరల్లో ఒడిదుడుకులు నెలకొన్నా బంగారం ధరలు నిలకడగా పెరుగుతాయని పేర్కొన్నారు. -
రిలయన్స్ @ రూ.2000
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బుధవారం రూ.2000లు అందుకుంది. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.1980 వద్ద మొదలైంది. మార్కెట్ ప్రారంభం నుంచి సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నప్పటికీ.., రిలయన్స్ షేరు స్థిరమైన ర్యాలీ చేసింది. ఫలితంగా ఒక దశలో 1.50శాతం లాభపడి రూ.2000 మార్కును అందుకుంది. ఈ ధర షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12.6లక్షల కోట్లను అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.1971.85)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.1992 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాది (2020)లో రియలన్స్ షేరు 32శాతం ర్యాలీ చేసింది. ఇటీవల మార్చి కనిష్ట స్థాయి(రూ.867.82) నుంచి ఏకంగా 130 శాతం లాభపడటం విశేషం. బోర్డు సమావేశం జూలై 31కు వాయిదా: రియలన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ల సమావేశాన్ని జూలై 24నుంచి జూలై 30కు వాయిదా వేస్తున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీంతో రియలన్స్ క్యూ1 గణాంకాలు జూలై 30వ తేదిన వెల్లడి కానున్నాయి. -
రికార్డుల మోత మోగిస్తున్న రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సోమవారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. తన అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం ఇందుకు కారణమైంది. క్వాల్కామ్ వెంచర్స్ సంస్థ జియోలో 0.15శాతం వాటాను రూ.730 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఆదివారం రిలయన్స్ ప్రకటించింది. ఫలితంగా నేడు బీఎస్ఈ రియలన్స్ షేరు రూ.1908.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో షేరు 3.64శాతం పెరిగి రూ.1947 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయ గం.11:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.1878.50)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.1935 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ మార్చి మార్కెట్ పతనం నుంచి రిలయన్స్ షేరు ఏకంగా 120శాతం ర్యాలీ చేసింది. ఈ వారంలో బుధవారం (ఈ నెల 15న) జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎమ్(వార్షిక సాధారణ సమావేశం) కోసం ఇన్వెస్టర్లు ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు. రూ.12లక్షల కోట్లకు చేరిన మార్కెట్క్యాప్: రిలయన్స్ షేరు కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోవడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా రిలయన్స్ రికార్డుకెక్కింది. షేరు టార్గెట్ ధరను పెంచిన బ్రోకరేజ్‌లు: ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ షేరు టార్గెట్ ధరను పెంచింది. గతంలో బ్రోకరేజ్ సంస్థ కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను రూ.1950 నుంచి రూ.2000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. డిజిటల్ వ్యాపారంలో కంపెనీ వ్యూహాత్మక అడుగులు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, క్వాల్కామ్లతో ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్లు జియోలో వాటాను కొనుగోలు చేయడం షేరు ర్యాలీకి మరింత ఉత్సాహానిస్తున్నాయి. -
రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త రికార్డు
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సోమవారం కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. తన డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ జియోలోకి వరుసగా పెట్టుబడులు వెల్లువెత్తడంతో రిలయన్స్ షేరుకు డిమాండ్ పెరిగింది. నేటి ఉదయం బీఎస్ఈలో రూ.1801 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఈ షేరకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఒక దశలో 2.55శాతం పెరిగి రూ.1833.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర(రూ.1833.10) షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.11.5లక్షల కోట్ల మార్కును దాటింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ రికార్డుకెక్కింది. ఉదయం 11గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.1787.50)తో పోలిస్తే రూ.1828.25 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది షేరు కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1833.10లు, రూ.1833.10గా నమోదయ్యాయి. జియోలోకి 12వ పెట్టుబడి: రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుంది. గ్లోబల్ సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ కార్ప్ 0.39శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 1895 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో డిజిటల్, టెలికం విభాగమైన రిలయన్స్ జియోలో 25.1 శాతం వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1.17 లక్షల కోట్లను సమీకరించినట్లయిందని విశ్లేషకులు తెలియజేశారు. -
ఆల్‌టైం హైకి ఎయిర్టెల్ షేరు
నాలుగో త్రైమాసికంలో నష్టాలను ప్రకటించినప్పటికీ.., టెలికాం రంగ దిగ్గజం ఎయిర్ టెల్ కంపెనీ షేరు మంగళవారం ఉదయం ట్రేడింగ్ సెషన్లో 10శాతం లాభపడింది. తద్వారా షేరు తన జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ నిన్న మార్కెట్ ముగింపు అనంతరం 2019-20 ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన క్వార్టర్లో రూ.5,237 కోట్ల నికర నష్టాలు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఐనప్పటికీ పలు బ్రోకరేజ్ సంస్థలు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. ఫలితంగా ఎయిర్టెల్ షేరు సోమవారం ముగింపు(రూ.538.15)తో పోలిస్తే దాదాపు 4శాతం లాభంతో రూ.559.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 10శాతం లాభపడి రూ.591.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 11గంటలకు షేరు మునుపటి ముగింపుతో పోలిస్తే 9శాతం లాభంతో రూ.585.15 వద్ద ట్రేడ్ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.314.05, రూ.591.95 ఉన్నాయి. ఎయిర్‌టెల్‌కు 5,237 కోట్ల నష్టాలు ఎయిర్టెల్ షేరుపై బ్రోకరేజ్‌ల వ్యూ:- మోర్గాన్ స్టాన్లీ: ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్పీయూ) రూ.123 నుంచి రూ.154కు పెరిగింది. ఓవరాల్ సబ్స్క్రైబర్లు పెరిగారు. డాటా వినియోగం నుంచి వచ్చే ఆదాయం అంచనాలకు మించి పెరిగింది. అయితే వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీలకు కేటాయింపులు మాత్రం ప్రతికూలంగా ఉన్నాయి. షేరుకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను రూ.575గా పెంచుతున్నాము. సీఎల్ఎస్ఏ: భారత్‌లో ఆదాయం అంచనాలకు మించి నమోదైంది. ఆఫ్రికాలోనూ ఆశించిన స్థాయిలో గణాంకాలు నమోదు కావడం ఆశ్చర్యపరిచింది. గతంలో షేరుకు కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నాము. షేరు కొనుగోలు టార్గెట్ ధరను రూ.670లకు పెంచుతున్నాము. క్రిడెట్ స్వీస్: క్వార్టర్ టు క్వార్టర్ ఏఆర్పీయూ 14శాతం వృద్ధిని సాధించింది. అధిక టారీఫ్ విధింపు కంపెనీపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేకపోయింది. డాటా వినియోగంతో అదనపు సబ్స్క్రైబర్లు పెరుగుదల అంశాలను పరిశీలిస్తే ఈ అంశం స్పష్టమవుతోంది. షేరు కొనుగోలు టార్గెట్ ధరను రూ.600గా నిర్ణయించాం. -
భారీ పెట్టుబడులు, రైట్స్ ఇష్యూ : రిలయన్స్ దూకుడు
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూకు తేదీ ప్రకటన, సంస్థకు పెట్టుబడుల వెల్లువ వార్తలతో ఇన్వెస్టర్ల ఆసక్తి భారీగా నెలకొంది. దీంతో సోమవారం నాటి మార్కెట్లో ఆర్ఐఎల్ షేర్లు రికార్డు స్థాయివైపు దూసుకుపోతోంది. ముఖ్యంగా రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు చర్చలు నేపథ్యంలో రిలయన్స్ రెండున్నర శాతం పైగా లాభంతో కొనసాగుతోంది. 2021 మార్చి నాటికి రిలయన్స్ సంస్థను రుణ రహిత సంస్థగా రూపొందించే ప్రణాళికలో ఉన్నట్టు ప్రకటించిన అధినేత ముకేశ్ అంబానీ ఆ దిశలో శరవేగంగా ముందుకు పోతుండటం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. (మరో మెగా డీల్‌కు సిద్ధమవుతున్న అంబానీ) వరుస మెగా డీల్స్ ప్రకటిస్తున్న రిలయన్స్ లో ట్రేడర్లు కొనుగోళ్లతో వరుసగా ఐదో రోజూ షేరు లాభాల్లో ఉంది. గత 3 నెలల్లో రిలయన్స్ వరుసగా ఐదు సెషన్ల పాటు లాభాల్లో కొనసాగడం ఇదే తొలిసారి. ఇంట్రాడేలో 3శాతం పైగా లాభపడిన షేర్ 52 వారాల గరిష్ట స్థాయి(రూ.1617.80)కి సమీపానికి వచ్చింది. ఇంట్రాడే గరిష్టం రూ.1615. మార్కెట్ క్యాప్ రూ.10 లక్షలకోట్ల ఎగువన స్థిరంగా వుంది. కాగా సౌదీ అరేబియాకు చెందిన వెల్త్ ఫండ్, జనరల్ అట్లాంటిక్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకుఆసక్తి కనబరుస్తోందన్న వార్తలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి. మరో 2-3 రోజుల్లో ఈ డీల్‌కు అనుమతి లభించే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్‌తో పాటు, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పాట్నర్స్లు జియోలో మైనార్టీ వాటాను కొనుగోలు చేశాయి.సౌదీ డీల్ కూడా పూర్తియితే ఒక నెలరోజుల వ్యవధిలోనే రిలయన్స్ నాలుగు మెగా డీల్‌ను పూర్తి చేసినట్టు అవుతుంది. మరోవైపు దాదాపు 30 ఏళ్లలో తొలిసారిగా రూ.53,125 కోట్ల నిధుల్ని సమీకరించే ఉద్దేశంతో 1:15 నిష్పత్తిలో రైట్స్ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న ఇది ప్రారంభం కానుంది. -
తొలి సంతకం : కొత్త తీరాలకు మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త గరిష్టాల పరుగు కొనసాగుతోంది. గురువారం దలాల్ స్ట్రీల్ కొత్త జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ 42వేల కీలకమైన గరిష్టస్తాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 12, 383 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందాలపై తొలి సంతకం చేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా, ముఖ్యంగా ఏషియన్ మార్కెట్లు సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే లాభాలనార్జించిన సూచీలు, ఆ తరువాతం వేగం పుంజుకున్నాయి. కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ 155 పాయింట్లు ఎగిసి 42028 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 12380 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాలతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మ షేర్లు మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి. మరోవైపు మెటల్ షేర్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీలాంటి, రిలయన్స్, కొటక్బ్యాంకు లాంటి దిగ్గజాలతో పాటు యస్‌బ్యాంకు, సన్‌ఫార్మ, నెస్లే, హచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్ భారీగా లాభపడుతున్నాయి. మరోవైపు వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరోమోటో నష్టపోతున్నాయి. -
సెన్సెక్స్ మరో రికార్డు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి కోలుకుని కొత్త గరిష్టాలను తాకాయి. అటు ఆర్థికమందగమనం, ఇటు ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగినప్పటికీ సెన్సెక్స్ మంగళవారం 41,903.36 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అయితే లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 11పాయింట్లు క్షీణించి 41847 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి12 333 వద్ద కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, టీసీఎస్ హీరో మోటోకార్ప్, హెచ్‌సిఎల్ టెక్, ఐటీసీ, ఎంఅండ్ఎం లాభపడుతుండగా, యస్ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా నష్టపోతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబరులో ఐదున్నర సంవత్సరాల గరిష్ట స్థాయి 7.35 శాతానికి చేరుకున్న సంగతి తెలిసిందే. -
లాభాల జోరు : సూచీలు రికార్డు
సాక్షి, ముంబై : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు చల్లబడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. ఈనేపథ్యంలో దేశీయంగా స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ 257 పాయింట్లు ఎగిసి 41857 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు లాభంతో 12330 వద్ద కొత్త కొనసాగుతుతోంది. తద్వారా కీలకసూచీ సెన్సెక్స్ 41880 వద్ద ఆల్ టైం హైని టచ్ చేసింది. అలాగే నిఫ్టీ 12330కి ఎగువన స్థిరంగా ఉంది. దాదాపు అన్ని సెక్టార్లు కొనుగోళ్లతో కళ కళ లాడుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ల లాభాలు మార్కెట్కుమద్దతునిస్తున్నాయి. ముఖ్యంగా ఆశాజనక ఫలితాలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టాప్ విన్నర్‌గా కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, సన్ ఫార్మ, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, టాటా స్టీల్, కోటక మహీంద్ర, ఐసీఐసీ, ఐటీ భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు యస్‌బ్యాంకు, టాటా మోటార్స్, భారతి ఇన్ఫ్రాటెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐషర్‌మోటార్స్, టీసీఎస్ నష్టపోతున్నాయి. -
మూడో రోజూ రికార్డ్ లాభాలు
దలాల్ స్ట్రీట్ ఆల్‌టైమ్ హై రికార్డ్‌లతో దద్దరిల్లుతోంది. ఇంధన, ఐటీ, వాహన షేర్ల జోరుతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం సానుకూల ప్రభావం చూపించింది. వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను సృష్టించాయి. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 41,719 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరకు 115 పాయింట్ల లాభంతో 41,674 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 12,268 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 38 పాయింట్ల లాభంతో 12,260 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడినా, ఎన్ఎస్ఈ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కారణంగా ఒడిదుడుకులు చోటు చేసుకున్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. త్వరలో యూటీఐ ఏఎమ్‌సీ ఐపీఓ ప్రముఖ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, యూటీఐ ఏఎమ్‌సీ త్వరలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. ఈ ఐపీఓ సైజు రూ.3,000 కోట్లుగా ఉండగలదని అంచనా. సెన్సెక్స్ @ 45,500 వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 45,500 పాయింట్లకు, నిఫ్టీ 13,400 పాయింట్లకు చేరతాయని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. ఫార్మా, ఆగ్రో కెమికల్స్, ఆయిల్, గ్యాస్, కార్పొరేట్ బ్యాంక్‌లు, పెద్ద ఎన్బీఎఫ్సీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మిడ్‌క్యాప్ సిమెంట్ కంపెనీలు, నిర్మాణ రంగ షేర్లు లాభపడతాయని పేర్కొంది. -
కొనసాగిన రికార్డ్ లాభాలు
స్టాక్ మార్కెట్లో రికార్డ్ లాభాలు బుధవారం కూడా కొనసాగాయి. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్ల జోరుకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. ఈ రెండు సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ వరుసగా రెండో రోజూ కొత్త రికార్డ్లను నెలకొల్పాయి. తొలిసారిగా సెన్సెక్స్ 41,500 పాయింట్లు, నిఫ్టీ 12,200 పాయింట్ల ఎగువన ముగిశాయి. ఇంట్రాడేలో 41,615 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 206 పాయింట్ల లాభంతో 41,559 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 12,238 పాయింట్ల ఆల్‌టైమ్ హైను తాకి చివరకు 57 పాయింట్ల లాభంతో 12,222 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమైనా, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీల లాభాలకు కళ్లెం పడింది. లోహ, ఐటీ, ఫార్మా, రియల్టీ, కన్సూమర్ రంగ షేర్లు లాభపడగా, ప్రభుత్వ రంగ, టెలికం, ఆయిల్, గ్యాస్ షేర్లు నష్టపోయాయి. జోరుగా కొనుగోళ్లు.... ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన చర్యలను తీసుకుంటుందన్న అంచనాలు, ఆశలతో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయని నిపుణులంటున్నారు. బుధవారం జీఎస్టీ మండలి సమావేశం జరగ్గా... మార్కెట్ ముగిసే సమయానికి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కానీ శ్లాబ్‌లను మార్చే అవకాశాలు లేవన్న వార్తలతో మార్కెట్లు సానుకూలంగా కదిలాయి. అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఆర్డర్లు పెరుగుతాయనే అంచనాలతో లోహ, ఐటీ షేర్లు పెరిగాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. త్వరలో రొసారి బయోటెక్ ఐపీఓ! ప్రత్యేక రసాయనాలు తయారు చేసే రొసారి బయోటెక్ కంపెనీ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానున్నది. ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకి సమర్పించింది. రూ.150 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ సైజు రూ.700 కోట్లు మేర ఉంటుందని అంచనా. -
దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మెరుపులు
సాక్షి,ముంబై: దలాల్ స్ట్రీట్‌లో నేడు(మంగళవారం) రికార్డుల హోరెత్తింది.అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఆరంభం లాభాలనుంచి మరింత ఎగిసిన కీలక సూచీలు రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ వరుస రికార్డులను నమోదు చేయడంతోపాటు హై స్థాయిల వద్ద రికార్డు క్లోజింగ్వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు కొనుగోళ్ల కళ కళల్లాడాయి. సెన్సెక్స్ 413 పాయింట్లు ఎగిసి 41,352 వద్ద, నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 12165 వద్ద ముగిసాయి. బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో నిఫ్టీ బ్యాంకు రికార్డు స్థాయిలను సాధించింది. టాటా స్టీల్, భారతి ఎయిర్ టెల్, వేదాంతా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ టీసీఎస్, ఐటీసీ యస్ బ్యాంకు టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. మరోవైపు గెయిల్, సన్‌ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, నష్టపోయాయి. -
ఖతార్ ఫండ్‌కు అదానీ ఎలక్ట్రిసిటీలో వాటా
న్యూఢిల్లీ: అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌లో 25.1 శాతం వాటాను ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) కొనుగోలు చేయనున్నది. ఈ డీల్ విలువ రూ.3,200 కోట్లు. ఈ మేరకు ఖతార్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతో నిశ్చయాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ ట్రాన్సిమిషన్ తెలిపింది. అదానీ ట్రాన్సిమిషన్ కంపెనీకి చెందిన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై సంస్థ(ఏఈఎమ్ఎల్), ముంబైలో 400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 30 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్తును పంపిణి చేస్తోంది. ఈ డీల్ నేపథ్యంలో అదానీ ట్రాన్సిమిషన్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.350ను తాకింది. చివరకు 1.7 శాతం లాభంతో రూ.342 వద్ద ముగిసింది. -
గ్లోబల్ జోష్‌తో నిఫ్టీ ఆల్‌టైం హై..
ముంబై : గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్‌తో స్టాక్ మార్కెట్లు సత్తా చాటాయి. పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల ఎగువన సరికొత్త శిఖరాలకు చేరింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సి, ఇన్ఫోసిస్, యస్ బ్యాంక్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో షేర్లు లాభపడుతుండగా..జీ ఎంటర్టైన్మెంట్, భారతి ఇన్ఫ్రాటెల్, భారతి ఎయిర్‌టెల్‌లు నష్టపోతున్నాయి. ఇక 176 పాయింట్ల లాభంతో బీఎస్ఈ సెన్సెక్స్ 41,066 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 38 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 12,111 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.మరోవైపు జీడీపీ వృద్ధిపై మంగళవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక గణాంకాలు మార్కెట్ తదుపరి గమనాన్ని నిర్ధేశిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
కొత్త గరిష్టాల వద్ద స్టాక్‌మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు జోరుగా కొనసాగుతున్నాయి. యుఎస్-చైనా వాణిజ్య పరిణామాలపై అనుకూల అంచనాలతో ప్రపంచ మార్కెట్ల సానుకూల ధోరణి నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసి కొత్త గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 471 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్ 40827 వద్ద, నిఫ్టీ 141 పాయింట్లు ఎగిసి 12055 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేయడగా నిఫ్టీ దీనికి మరో 50 పాయింటలు దూరంగా ఉంది. దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి. భారతి ఎయిర్టెల్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్, వేదాంతా, హెచ్డీఎఫ్ఎసీ, సన్‌ఫార్మా, హీరో మోటో, యాక్సిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడుతున్నాయి. మరోవైపు జీ ఎంటర్టైన్మెంట్, యస్‌బ్యాంకు, ఎన్జీసీ, ఐటీసీ, విప్రో, పవర్ గ్రిడ్, గెయిల్, ఐసీఐసీఐ బ్యాకునష్టపోతున్నాయి. -
ఆల్ టైం గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ అదే జోరు
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్‌లో లాభాల జోరు కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల బలమైన సెంటిమెంటుతో సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్ చేసి 40, 816 వద్ద ఆల్ టైం గరిష్టానికి చేరింది. అటు నిఫ్టీ కూడా 12000 ఎగువన హుషారుగా కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగిసి 40770 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు ఎగిసి 12025 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా హెవీ వెయిట్ రిలయన్స్‌తో పాటు బ్యాంకింగ్ రంగ షేర్ల లాభాలు మార్కెట్లను సరి కొత్త గరిష్టాల దిశగా తీసుకెళ్తున్నాయి. దీనికి టెలికం కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మరింత ఊతమిస్తున్నాయి. రిలయన్స్ టాప్ విన్నర్‌గా కొనసాగుతుండగా, వొడాఫోన్ ఐడియా ఈ రోజు మరో 22 శాతం ఎగిసింది. భారతి ఎయిర్టెల్ కూడా 2 శాతం ఎగిసింది. జీ,ఇండస్ ఇండ్ బ్యాంకు, సన్‌ఫార్మ, కోల్ ఇండియా. యస్ బ్యాంకు, టాటా స్టీల్, మారుతి సుజుకి లాభపడుతుండగా, భారతి ఇన్ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, కోటక్ మహీంద్ర, ఎస్బీఐ, ఐవోసీ, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో నష్టపోతున్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ ఆరంభంలో డాలరు మారకంలో బలహీనంగా ఉన్నా, అనంతరం పుంజుకుంది. 9 పైసలు నష్టపోయినా ప్రస్తుతం స్వల్ప లాభంతో 71.69 వద్ద వుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ ఫ్యూచర్స్ 0.31 శాతం క్షీణించి బ్యారెల్ 60.72 డాలర్లకు చేరుకుంది. -
శ్రావణమాసంలో షాక్ : పరుగాపని పుత్తడి
సాక్షి, ముంబై : అమెరికా, చైనా మధ్య తాజా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పుంజుకుంది. ఇటీవల మెరుపులు మెరిపిస్తూ, శ్రావణమాసంలో కస్టమర్లను భయపెడుతున్న పసిడి ధరలు బుధవారం మరోసారి ఆల్ టైం గరిష్టానికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగా డిమాండ్ ఊపందుకోవడంతో బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ. 1,113 పెరిగి రూ. 38వేల మార్క్‌కు చేరువైంది. 10 గ్రాముల పుత్తడి ధర రూ. 37,920 వద్ద ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతో వెండి ధర కూడా పెరిగింది. రూ. 650 పెరిగిన కిలో వెండి ధర 43,670 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ .1,113 పెరిగి రూ .37,920 కు చేరుకోగా, 99.5 శాతం స్వచ్ఛత గల పుత్తడి ధర రూ. 1,115 పెరిగి రూ .37,750 కు చేరుకుంది. సావరిన్ బంగారం కూడా ఎనిమిది గ్రాములకు రూ .200 పెరిగి 27,800 రూపాయలకు చేరుకుంది. స్థానిక డిమాండ్‌తోపాటు, బలమైన ప్రపంచ ధోరణి ప్రధానంగా బంగారం ధరల పెరుగుదలకు దారితీసిందని విశ్లేషకులు తెలిపారు. అమెరికా-చైనా ట్రేడ్‌వార్, ఫెడ్ రేట్ కట్, దేశీయ మార్కెట్లలో అమ్మకాలు బంగారం ధరకు ఊతమిస్తున్నాయన్నారు. 10 గ్రాములకి 37,920 రూపాయల బంగారం ధర ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో ఇదే తొలిసారని ఆల్ ఇండియా సారాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర జైన్ అన్నారు. అంతర్జాతీయ స్పాట్ బంగారం ధరలు బుధవారం 1,490 డాలర్లకు చేరుకున్నాయి. ఔన్సు వెండి 16.81 డాలర్లు పలికింది. ట్రేడ్‌వార్ భయాలు, ఫెడ్ రేట్ కట్, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారంలో కొనుగోళ్లు పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పారు. మరోవైపు దేశీయ కరెన్సీ వరుసగా అయిదువ రోజు కూడా నష్టాల్లోనే ముగిసింది. ఆర్బీఐ అనూహ్యంగా రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ముఖ్యంగా బ్యాంక్ సెక్టార్ బాగా నష్టపోయింది. -
స్టాక్‌మార్కెట్ల జోరు : రికార్డుల హోరు
సాక్షి,ముంబై: ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడుమీద ఉన్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో మార్కెట్లు మరోసారి రికార్డుల మైలురాళ్లను చేరుకున్నాయి. సెన్సెక్స్ 40,000, నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌లను సులభంగా అధిగమించి స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ అరంభ లాభాల నుంచి మరింత ఎగిసి 422పాయింట్లు జంప్‌చేసి 40,136 వద్ద నిఫ్టీ సైతం 125 పాయింట్లు ఎగసి 12,048 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనల కారణంగా యూరప్, అమెరికా, ఆసియా మార్కెట్లు నీరసించినప్పటికీ దేశీయంగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక్క మీడియా మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్, ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్స్ లాభాలు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, ఐవోసీ, టాటా స్టీల్, ఐబీ హౌసింగ్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, యస్ బ్యాంక్ టాప్ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. ఓఎన్జీసీ, ఐటీసీ, ఐషర్, టెక్ మహీంద్రా, గెయిల్, ఎల్అండ్టీ స్వల్పంగా నష్టపోతున్నాయి. -
కొనసాగుతున్న ర్యాలీ 2.0
నరేంద్ర మోదీ ఘన విజయ సంబరాలు స్టాక్మార్కెట్లో శుక్రవారం కూడా కొనసాగాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రావడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,800 పాయింట్లపైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్లకు చేరిన నేపథ్యంలో లాభాల స్వీకరణ కారణంగా గురువారం నష్టపోయిన స్టాక్ మార్కెట్ శుక్రవారం కొనుగోళ్లతో కళకళలాడింది. బ్యాంకింగ్, ఆర్థిక, వాహన రంగ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, స్టాక్ సూచీలు ముందుకే దూసుకుపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం, గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా పతనం కావడం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 623 పాయింట్లు లాభపడి 39,435 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి 11,844 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో ఈ నెల 20న నెలకొల్పిన క్లోజింగ్ రికార్డ్లను సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం బ్రేక్ చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. సెంటిమెంట్‌కు జోష్... ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఘన విజయం దక్కిన కారణంగా కేంద్ర ప్రభుత్వం నిశ్చయాత్మక నిర్ణయాలు తీసుకోగలదనే అంచనాలు పెరిగాయని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ జయంత్ మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. ఇది బిజినెస్ సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని పేర్కొన్నారు. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనిశ్చితితో పెట్టుబడులకు దూరంగా ఉన్న ఇన్వెస్టర్లు.. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రావడంతో జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని నిపుణులంటున్నారు. అంతకంతకూ పెరిగిన లాభాలు... ఆసియా మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నా, సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఉదయం పదిగంటల సమయంలో లాభాలు తగ్గాయి. ఆ తర్వాత అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పుంజుకున్నాయి. అంతకంతకూ లాభాలు పెరుగుతూనే పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 666 పాయింట్లు, నిఫ్టీ 202 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ షేర్ల జోరు... ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. వచ్చే నెల మొదటి వారంలో జరిగే మోనేటరీ పాలసీలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించనున్నదని, కొత్త ప్రభుత్వం మరిన్ని మూలధన నిధులను అందించనున్నదని, బలహీన బ్యాంక్‌లను బలమైన బ్యాంక్‌ల్లో విలీనం చేసే ప్రక్రియ మరింత వేగవంతం కాగలదన్న అంచనాలు బ్యాంక్ షేర్లను లాభాల బాట నడిపిస్తున్నాయి. మరిన్ని విశేషాలు.... ► 31 సెన్సెక్స్ షేర్లలో 27 షేర్లు లాభపడగా, 4 షేర్లు–ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, హిందుస్తాన్ యూనిలివర్ నష్టపోయాయి. నిఫ్టీ 50లో 44 షేర్లు లాభాల్లో, 6 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► ఐసీఐసీఐ బ్యాంక్ 5 శాతం లాభంతో రూ.432 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఇంట్రాడేలో ఈ షేర్ ఆల్ టైమ్ హై, రూ.434ను తాకింది. ఈ షేర్‌తో పాలు 20కు పైగా షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఆర్తి ఇండస్ట్రీస్, సిటీ యూనియన్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఐనాక్స్ లీజర్, కల్పతరు పవర్, మణప్పురం ఫైనాన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► వాటా కొనుగోళ్ల విషయమై హిందుజా గ్రూప్, ఇతిహాద్ ఎయిర్‌వేస్‌ల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో జెట్ ఎయిర్వేస్ షేర్ 5 శాతం నష్టంతో రూ.148 వద్ద ముగిసింది. ► రూ.616 కోట్ల ఆర్డర్లు రావడంతో జేఎమ్‌సీ ప్రాజెక్ట్స్ షేర్ 14 శాతం లాభంతో రూ.135 వద్దకు చేరింది. ► గతంలోలాగానే ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక రంగంపై మరిన్ని నిధులు ఖర్చు చేయగలదనే అంచనాలతో సిమెంట్ షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఇంట్రాడేలో హెడెల్‌బర్గ్ సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్, జేకే సిమెంట్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఇండియా సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 3–11 శాతం రేంజ్లో ఎగిశాయి. ► 170కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. దిలిప్ బిల్డ్‌కాన్, అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ, అమృతాంజన్ హెల్త్‌కేర్, మగధ్ షుగర్ అండ్ ఎనర్జీ, జేఎమ్‌టీ ఆటో షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 5 రోజుల్లో.. రూ. 6 లక్షల కోట్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క శుక్రవారం రోజే రూ.2.54 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,53,830 కోట్లు పెరిగి రూ.1,52,71,407 కోట్లకు చేరింది. ఇక ఈ వారం 5 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ. 6 లక్షల కోట్ల మేర పెరిగింది. చరిత్రాత్మక వారం... వారంపరంగా చూస్తే, సెన్సెక్స్ 1,503 పాయిం ట్లు, నిఫ్టీ 437 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఇరు సూచీలు దాదాపు 4% ఎగిశాయి. ఈ ఏడాది ఈ సూచీలు అత్యధికంగా లాభపడింది ఈ వారమే. ఈ వారంలోనే సెన్సెక్స్ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్లపైకి ఎగబాకాయి. గురువారం ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హైలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం ఆల్‌టైమ్ హై వద్ద ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా జీవిత కాల గరిష్టానికి ఎగసింది. బ్యాంక్ నిఫ్టీ ఈ వారంలో 6% లాభపడింది. మరోవైపు ఇన్వెస్టర్ల భయా న్ని ప్రతిబింబించే ఇండియా ఓలటాలిటీ ఇం డెక్స్ ఈ వారంలో 41 శాతం క్షీణించింది. ఈ వారంలో ఈ సూచీ 44 నెలల గరిష్ట స్థాయి, 30.18కు ఎగసినా, ఎన్నికల ఫలితాల కారణంగా 16.54 స్థాయికి దిగివచ్చింది. -
దూసుకుపోతున్న స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో రేసు గుర్రాల్లా దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది వర్షపాతం 96శాతం సాధారణ సగటును అందుకోవచ్చన్న వాతావరణ శాఖ వేసిన అంచనాలు కీలక సూచీలకు బూస్ట్ ఇస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో అటు నిఫ్టీ, ఇటు సెన్సెక్స్ సరికొత్త రికార్డులను అధిగమించి ఉత్సాహంగా ట్రేడ్ అవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే నిఫ్టీ గత గరిష్ట రికార్డ్ 11,761ను అధిగమించి 11800 స్థాయిని తాకింది. అటు సెన్సెక్స్ సైతం 450 పాయింట్లు జంప్ చేసింది. ప్రస్తుతం 39,325వద్ద కొనసాగుతోంది. అటు బ్యాంకింగ్ సెక్టార్లో కొనుగోళ్లతో బ్యాంక్ నిఫ్టీ కూడా రికార్డు స్థాయిల్లో కొనసాగుతోంది. రియల్టీ మినహా అన్ని రంగాలూ లాభాల్లోనే కొనసాగుతున్నాయి ఐసీఐసీఐ, టైటన్, ఇండస్ఇండ్, ఏషియన్ పెయింట్స్, ఐబీ హౌసింగ్, హిందాల్కో, ఇన్ఫ్రాటెల్, ఎల్అండ్టీ, టీసీఎస్, మారుతీ 3-1.5 శాతం మధ్య ఎగశాయి. ఆరంభంలో నష్టపోయిన టాటా మోటార్స్ కూడా మిడ్ సెషన్ తరువాత లాభాల్లోకి మళ్లింది. సిప్లా, ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, బీపీసీఎల్ నష్టపోతున్నాయి. రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్, సన్‌టెక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండియాబుల్స్, బ్రిగేడ్ 3-0.5 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు మూత పడనుందన్న వార్తలతో జెట్ ఎయిర్వేస్ షేరు 18శాతం పతనమైంది. అటు ఇండిగో 54 వారాల గరిష్టం వద్ద ఉంది. స్సైస్ జెట్ కూడా భారీ లాభాలతో కొనసాగుతోంది. కాగా రేపు బుధవారం మార్కెట్లకు సెలవు. -
భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు : రికార్డ్ హైకి నిఫ్టీ
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సాధారణ వర్షపాత అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉంది. ఆరంభ లాభాల జోరును దూకుడు గా కొనసాగిస్తోంది. త్రిబుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్లు లాభంతో 39212 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు ఎగిసి 11772 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో నిఫ్టీ మరో సరికొత్త హైని టచ్ చేసింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ బాగా లాభపడుతోంది. 30300 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. మారుతి, హీరో మోటో, ఐసీఐసీఐ, వేదాంతా, భారతి ఇన్ఫ్రాటెల్, జీ, ఇండస్ ఇండ్, విప్రో లాభపడుతున్నాయి. మరోవైపు యిర్‌టెల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, అదానీ, జెట్ ఎయిర్ వేస్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ప్రారంభమైంది. 69.49 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. -
రికార్డ్ స్థాయిల నుంచి పతనం
ఇంట్రాడేలో సూచీలు ఆల్‌టైమ్ హైలను తాకినట్లుగానే పలు షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఏషియన్ పెయింట్స్, అతుల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, గోద్రేజ్ ప్రోపర్టీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండియన్ హోటల్స్, ముత్తూట్ ఫైనాన్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. నాలుగు రోజుల స్టాక్‌మార్కెట్ లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు కురవవచ్చనే అంచనాలు, ముడి చమురు ధరలు భగ్గుమనడం...ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయి. దీంతో ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు పెరిగినప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. రోజంతా 443 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 180 పాయింట్లు పతనమై 38,877 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 11,644 పాయింట్ల వద్దకు చేరింది. ఎల్‌నినోతో ‘తక్కువ’ వర్షాలు.... పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో వృద్ది చెందుతోందని, ఫలితంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగానే వర్షాలు పడొచ్చనే అంచనాలను ప్రైవేట్ వాతావరణ సంస్థ, స్కైమెట్ వెలువరించింది. దీంతో వృద్ధి మందగించివచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముడి చమురు ధరలు భగ్గుమనడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్యారెల్ బ్రెంట్ చమురు ఐదు నెలల గరిష్ట స్థాయి, 70 డాలర్లకు చేరువ కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పాలసీని ఆర్బీఐ నేడు(గురువారం) వెలువరించనున్నది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఈ పావు శాతం రేట్ల కోతను మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుందని విశ్లేషకులంటున్నారు. 443 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల జోష్‌తో మధ్యాహ్నం దాకా లాభాల్లోనే ట్రేడయ్యాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ ఒక దశలో 213 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 230 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 443 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 48 పాయింట్లు లాభపడగా, మరో దశలో 84 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, సెన్సెక్స్ 393 పాయింట్లు, నిఫ్టీ 117 పాయింట్ల మేర నష్టపోయినట్లయింది. -
ప్రాఫిట్ బుకింగ్ : అయినా లాభాల్లోనే
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. కానీ ఆరంభ లాభాలను కుదించుకోవడంతో ఆల్ టైం హైల నుంచి వెనక్కి తగ్గాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో రికార్డుల బోణి కొట్టిన కీలక సూచీలు రెండూ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. ఆరంభంనుంచి దాదాపు చివరి వరకూ ట్రిపుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోయిన మార్కెట్లు ఒక దశలో 400 పాయింట్ల లాభాలను సాధించాయి. అయితే చివరి అర్థగంటలో అమ్మకాలతో సెన్సెక్స్ 199 పాయింట్ల లాభాలకు పరిమితమై 38871 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు ఎగిసి 11669 వద్ద ముగిశాయి. ఇవాల్టి మార్కెట్లో సెన్సెక్స్ 39వేల మైలురాయిని దాటగా, నిప్టీ 11700 స్థాయికి ఎగువన ట్రేడ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా రికార్డ్ స్థాయిలో కొనసాగడం విశేషం. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా లాభపడ్డాయి. మెటల్, ఐటీ, ఆటో రంగాలు లాభాల్లో ముగిశాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ నష్టపోయాయి. ఆంధ్రాబ్యాంక్, లక్ష్మీ విలాస్, టాటా స్టీల్, పీఎన్బీ హౌసింగ్, వెల్ కార్ప్ టాప్విన్నర్స్గా ఉండగా, జేఅండ్‌కే, సిండికేట్, పీఎన్బీ, బీవోబీ, యూనియన్, బీవోఐ, కెనరా, అలహాబాద్, సెంట్రల్, ఇండియన్ బ్యాంక్, టాటా మోటార్స్, హిందాల్కో, వేదాంతా, గెయిల్, టాటా స్టీల్, విప్రో, మారుతీ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ లాభపడిన వాటిల్లో ఉన్నాయి. అయితే ఐవోసీ, యూపీఎల్, ఇండస్ఇండ్, జీ, ఐబీ హౌసింగ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఐషర్, టైటన్, కోల్ ఇండియా టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. కాగా ఆర్బీఐ రేట్ కట్ అంచనాలు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో బీజేపీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనుందనే అంచనాలు ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు దారి తీసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు. -
స్టాక్‌మార్కెట్ దూకుడు : 39వేల ఎగువకు సెన్సెక్స్
దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త రికార్డుల మోత మోగించాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 39వేలపాయింట్ల వద్ద సరికొత్త ఆల్ టైం హైని తాకగా, నిఫ్టీ 11700 స్థాయికి పైన ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అటు బ్యాంక్ నిఫ్టీ కూడా 30,646 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరుకోగా.. సరికొత్త రికార్డుకు నిఫ్టీ 60 పాయింట్ల దూరంలో నిలిచింది. ఆరంభంలోనే ట్రిపుల్ సెంచరీ లాభాలను సాధించిన సెన్సెక్స్ తన జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం 384 పాయింట్లు ఎగిసి 39057 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు లాబంతో 11724 వద్ద కొనసాగుతోంది. ఆర్బీఐ వడ్డీరేటు కోత అంచనాలకు తోడు, ఇది ఎన్నికల ముందు మార్కెట్లలో భారీ ర్యాలీగా నిపుణులు పేర్కొంటున్నారు. అన్ని రంగాలూ లాభపడుతుండగా, పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ 2.75 శాతం చొప్పున ఎగశాయి. అలాగే ఐటీ, ఆటో 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. ప్రభుత్వ బ్యాంక్స్‌లో జేఅండ్‌కే, సిండికేట్, పీఎన్బీ, బీవోబీ, యూనియన్, బీవోఐ, కెనరా, అలహాబాద్, సెంట్రల్, ఇండియన్ బ్యాంక్ టాప్విన్నర్స్గా ఉన్నాయి. మరోవైపు టాటా మోటార్స్, హిందాల్కో, వేదాంతా, గెయిల్, టాటా స్టీల్, విప్రో, మారుతీ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ 6-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐవోసీ, యూపీఎల్, ఇండస్ఇండ్, జీ, ఐబీ హౌసింగ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఐషర్, టైటన్, కోల్ ఇండియా నష్టపోతున్నాయి. -
2030 నాటికి లక్ష మార్క్‌కు సెన్సెక్స్
వరుసగా ఆరో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఆ తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సెన్సెక్స ఒక దశలో 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయింది. అటు నిఫ్టీ కూడా 11500 దిగువకు చేరింది. అనంతరం సెన్సెక్స్ 18పాయింట్ల నష్టంతో 38006 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు లాభంతో 11430 వద్దకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 45 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నా ఊగిసలాట ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ట్రిపుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోయింది. రియల్టీ అత్యధికంగా 2.7 శాతం పుంజుకోగా, ప్రయివేట్ బ్యాంక్స్ 0.5 శాతం బలపడ్డాయి. మరోవైపు ఆటో 1.2 శాతం, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. రియల్టీ షేర్లలో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 16 శాతంపైగా దూసుకెళ్లగా.. బ్రిగేడ్, ఇండియాబుల్స్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, శోభా, సన్‌టెక్, మహీంద్రా లైఫ్ 6-1 శాతం మధ్య ఎగశాయి. వీటితోపాటు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్, యాక్సిస్, టాటా స్టీల్, ఆర్ఐఎల్, కొటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ లాభపడుతుండగా, మారుతీ, హీరో మోటో, గ్రాసిమ్, ఐషర్, వేదాంతా, ఎంఅండ్ఎం, ఓఎన్జీసీ, ఎల్అండ్టీ, హెచ్‌సీఎల్ టెక్, విప్రో నష్టపోతున్నాయి. మరోవైపు ఎన్నికలు ముగిసేనాటికి సెన్సెక్స్ 40వేల స్థాయిని తాకుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 2019 లో 40వేలను టచ్ చేస్తుదని బీఎన్పీ పరిబాస్ చెప్తుండగా, డిసెంబరు 2019 నాటికి 42 వేల టార్గెట్‌ను మోర్గాన్ స్టాన్లీ నిర్ణయించింది. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ ఉన్నప్పటికీ, సాంకేతిక మద్దతుస్థాయిల వద్ద స్థిరంగా ఉంటున్న సెన్సెక్స్ 2019లో ఆల్‌టైం గరిష్టాన్ని టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 2030 నాటికి 50వేలను దాటొవచ్చని చెప్పారు. అంతేకాదు లక్ష స్థాయిని కూడా తాకే అవకాశం ఉందని ఎలిక్సిర్ ఈక్విటీ డైరెక్టర్ దిపన్ మెహతా వ్యాఖ్యానించారు. అలాగే రానున్న మూడేళ్లలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు 15శాతం లాభాలొస్తాయని పేర్కొన్నారు. -
పెట్రో ధరలకు మళ్లీ రెక్కలు
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్రం రూ.2.5 మేర తగ్గించిందని సంతోషించేలోపే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు మళ్లీ షాకిచ్చాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 14 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెంచు తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.87.29కి చేరుకోగా, డీజిల్ రూ.77.06కు పెరిగింది. దీంతో పెట్రోల్ ధరలు మళ్లీ మూడువారాల గరిష్టానికి చేరుకున్నట్లయింది. పెట్రోలియం ఉత్పత్తులపై రూ.2.5ను తగ్గిస్తూ అక్టోబర్ 4న కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం లీటర్ పెట్రోల్‌పై 18 పైసలు, డీజిల్‌పై 29 పైసలను పెంచా యి. తాజా నిర్ణయంతో 2014 నుంచి ఇప్పటివ రకూ పెట్రోల్‌పై రూ.11.77, డీజిల్‌పై రూ.13.47ను ప్రభుత్వం పెంచినట్లయింది. కాగా, రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రం రూ.2.5 మేర ధరల్ని తగ్గించిందని కాంగ్రెస్ ఆరోపించింది. -
పెట్రో షాక్ : ఆల్ టైం హైకి చేరిన ఇంధన ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం పెట్రోల్ ధర ఆల్‌టైం హై స్ధాయిలో లీటర్‌కు రూ 89.69కు చేరగా, డీజిల్ ధర లీటర్ రూ 78.42కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ 82.32కు చేరగా, డీజిల్ ధర లీటర్‌కు రూ 73.87కు ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో ఇంధన ధరలు భారమై పెట్రోల్ లీటర్‌కు రూ 87.30కి చేరాయి. పెట్రో ధరలు లీటర్‌కు రూ వందకు చేరువగా పరుగులు తీస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రో భారాలతో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. పెట్రో భారాల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం తన వంతుగా కొద్దినెలల కిందటే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని గుర్తుచేశారు. -
చారిత్రక కనిష్టం వద్ద రూపాయి ముగింపు
సాక్షి, ముంబై: డాలరు మారకంలో రూపాయి అత్యంత కనిష్టాన్ని నమోదు చేసింది. రూపాయి క్షీణతను అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినప్పటికీ రుపీ పతనం ఆగలేదు. మంగళవారం డాలరు మారకంలో రూ.72.97 స్థాయిని తాకింది. ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి 46 పైసలు క్షీణించి మరో చారిత్రాత్మక కనిష్టం 73 స్థాయికి చేరువలో ముగిసింది. పెరుగుతున్న చమురు ధరలకు తోడు వాణిజ్యలోటు వర్తక లోటు, అంతర్జాతీయ అంశాలు రూపాయి విలువను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు మసాలా బాండ్లపై ఉపసంహరణ పన్ను తొలగింపు, ఎఫ్‌పీఐల సడలింపు, దిగుమతి సుంకం పెంపు, క్యాడ్ నియంత్రణ లాంటి చర్యల్ని చేపట్టిన సంగతి తెలిసిందే. -
పెట్రో షాక్ : ఆల్ టైం హైలో ఇంధన ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, ముడిచమురు ధరల భారంతో గురవారం పెట్రో ధరలు ఆల్ టైం హైకి చేరాయి. దేశ వాణిజ్యరాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రికార్డు స్ధాయిలో రూ. 86.91కు ఎగబాకింది. డీజిల్ లీటర్‌కు రూ. 75.96కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 21 పైసలు పెరిగి రూ. 84.30కు చేరింది. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ. 79.51, రూ. 71.55కు పెరిగాయి. అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ అత్యంత కనిష్టస్ధాయిలో రూ. 71కు పడిపోయిన ఆగస్ట్ 16 నుంచి ఇంధన ధరలు భారమవుతున్నాయి. మరోవైపు రూపాయి పతనంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి నిలకడగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రూపాయిని స్ధిరీకరించేందుకు ఆర్బీఐ జోక్యంపై జైట్లీ మాట్లాడుతూ రూపాయి బలోపేతానికి ఆర్బీఐ అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పుకొచ్చారు. -
షాకింగ్ : ఆల్ టైం హైలో పెట్రోల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం వరుసగా 15వ రోజు కూడా భగ్గుమన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ 84.09కు చేరగా, ముంబైలో అత్యధికంగా పెట్రోల్ లీటర్‌కు రూ 86.72 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌కు రూ 79.31కు చేరింది. ఇక డీజిల్ ధరలూ రికార్డు స్ధాయికి చేరాయి. దేశ ఆర్థిక, వాణిజ్య రాజధాని ముంబైలో డీజిల్ లీటర్‌కు రూ 75.74కు పెరిగింది. అమెరికన్ డాలర్‌తో రూపాయి అత్యంత కనిష్టస్ధాయికి పడిపోయిన క్రమంలో ఆగస్ట్ 16 నుంచి ఇంధన ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు ముడిచమురు ధరలు భారమవడం, రూపాయి బలహీనం వంటి అంతర్జాతీయ అంశాలే కారణమని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. ముడిచమురు ఉత్పాదన పడిపోవడం కూడా ధరల పెంపునకు కారణమని చెప్పుకొచ్చారు. పెట్రో ధరల పెంపు తాత్కాలికమేనని త్వరలోనే పరిస్థితి కుదుటపడుతుందని మంత్రి పేర్కొన్నారు. -
దలాల్ స్ట్రీట్‌లో బుల్ దూకుడు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి ఆల్‌టైం గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దలాల్ స్ట్రీట్‌లో బుల్ దూకుడు కొనసాగుతోంది. దీంతో కీలక సూచీలు సెన్సెక్స్ , నిఫ్టీ సరికొత్త గరిష్టాలను టచ్ చేశాయి. నిఫ్టీ 35 పాయింట్లు ఎగిసి 11,600స్థాయిని అధిగమించింది. సెన్సెక్స్, 132 పాయింట్లు పుంజుకుంది. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే. అయితే బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనిపిస్తోంది. సన్ ఫార్మా, డాబర్, టెక్‌మహీంద్ర, తదితర షేర్లు లాభపడుతుండగా ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, జెట్ ఎయిర్వేస్ నష్టపోతోంది. -
మరోసారి రికార్డ్ గరిష్టాలకు స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలో కొంత వెనుకంజ వేసినా తర్వాత పుంజుకున్న కీలక సూచీలు మరోసారి రికార్డు స్థాయిల వద్ద ఉత్సాహంగా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 222 పాయింట్లు ఎగిసి 37,887 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి11,450వద్ద ముగిసాయి. మీడియా, బ్యాంక్ నిఫ్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాల లాభాలు మార్కెట్లకు ఊత మిచ్చాయి. మరోవైపు ఐటీ, ఫార్మా రంగాలు స్వల్పంగా నష్టపోయాయి. టాటామోటార్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఆర్ఐఎల్, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్, ఐబీ హౌసింగ్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఇండస్ఇండ్ లాభాలతో మురిపించగా, హెచ్‌పీసీఎల్, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, ఐవోసీ నష్టాల్లో ముగిసాయి. -
షేర్ల జోరు : బఫెట్‌ను దాటేసిన జుకర్‌బర్గ్
శాన్ఫ్రాన్సిస్కో : ఓ వైపు కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాండల్, మరోవైపు యూజర్ల ప్రైవసీపై ఆందోళనలు ఫేస్‌బుక్‌ను తీవ్ర ఇరకాటంలో పడేసినప్పటికీ, ఆ కంపెనీ మాత్రం ఏ మాత్రం జంగకుండా శరవేగంగా దూసుకుపోయింది. శుక్రవారం ఫేస్బుక్ స్టాక్స్ ఆల్-టైమ్ రికార్డు గరిష్టంలో 203.23 డాలర్ల వద్ద ముగిశాయి. అతిపెద్ద స్పోర్ట్స్ స్ట్రీమింగ్ డీల్‌ను ఫేస్బుక్ దక్కించుకుంది అని తెలియగానే కంపెనీ స్టాక్స్ కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఉరకలు పెట్టారు. ఈ వార్త ఇన్వెస్టర్లకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. ఆసియాలోని థాయ్‌ల్యాండ్, వియత్నాం, కాంబోడియా, లావోస్‌లో 2019 నుంచి 2022 వరకు జరిగే 380 లైవ్ మ్యాచ్‌ల ఎక్స్‌క్లూజివ్ రైట్స్‌ను ఫేస్బుక్ దక్కించుకుందని టైమ్స్ రిపోర్టు చేసింది. ఈ డీల్ విలువ 264 మిలియన్ డాలర్లుగా పేర్కొంది. ఫేస్బుక్ స్టాక్స్ ఆల్‌టైమ్ గరిష్టంలో ర్యాలీ జరుపడంతో, కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద కూడా అదేమాదిరి దూసుకుపోయింది. వారెన్ బఫెట్‌ను దాటేసి, ప్రపంచంలో మూడో అత్యంత ధనికుడిగా నిలిచారు. దీంతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తర్వాత మూడో స్థానంలో జుకర్‌బర్గ్ ఉన్నారు. ప్రస్తుతం జుకవర్‌బర్గ్ సంపద 81.6 బిలియన్ డాలర్లుగా ఉంది. డేటా షేరింగ్ స్కాండల్‌తో మార్చి నెలలో ఫేస్బుక్ షేర్లు ఎనిమిది నెలల కనిష్టంలో 152.22 డాలర్ల వద్ద నమోదైన సంగతి తెలిసింది. శుక్రవారం రోజు ఈ స్టాక్ 203.23 డాలర్ల వద్ద ముగిసింది. -
గరిష్టస్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు
-
రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు ధరలను సవరించడంతో ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ 80.76 దాటడం గమనార్హం. డీజిల్ లీటర్‌కు రూ 73.45కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ రూ 76.24కు చేరగా, డీజిల్ ధర రూ 67.57కు ఎగబాకింది. జూన్ 2017లో పెట్రో ధరల రోజువారీ సవరణ అమలులోకి వచ్చిన అనంతరం దేశ రాజధానిలో తొలిసారిగా పెట్రోల్ లీటర్‌కు అత్యధికంగా 33 పైసలు పెరగ్గా, డీజిల్ 26 పైసల మేర పెరగినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. పెట్రో ధరలు స్థానిక పన్నులకు అనుగుణంగా ఉండే క్రమంలో పలు మెట్రో నగరాలు, రాష్ట్ర రాజధానులతో పోలిస్తే ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రో ధరలను యథాతథంగా ఉంచిన ఆయిల్ కంపెనీలు మే 14 నుంచి తిరిగి ధరల సవరణను చేపట్టినప్పటి నుంచి పెట్రో ధరలు వరుసగా ఏడవ రోజూ పెరిగాయి. గత వారం రోజులుగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ 1.61, డీజిల్ ధర లీటర్‌కు రూ 1.64 మేర పెరిగాయి. -
ఇది ఆరంభం మాత్రమే..బిగ్ రన్ ముందుంది
సాక్షి, ముంబై: అంచనాలకనుగుణంగానే దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిపోయింది. మెరుగైన ఫలితాలు, బోనస్కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడి సోమవారం టీసీఎస్ స్టాక్ మరింత పుంజుకుంది. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లో టాటా గ్రూప్ ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ మరో సరికొత్త రికార్డును సాధించింది. 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించి టాప్‌లో నిలిచింది. టీసీఎస్ షేరు 4శాతం ఎగిసి 6.75 లక్షల కోట్లను అధిగమించింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్ విలువలో దేశీయంగా ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. గ్లోబల్‌గా 64వ కంపెనీగా అవతరించింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో 100 కోట్ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించిన టీసీఎస్ షేరు ధర 3500 వద్ద ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది.దీనిపై స్పందించిన టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ 100 బిలియన్ డాలర్ల కంపెనీల్లో టాటా గ్రూపు కంపెనీ(టీసీఎస్) చేరడం చాలా సంతోషించదగ్గ విషయమంటూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు టీసీఎస్ బిగ్ రన్‌కు ఇది ఆరంభం మాత్రమేనని వ్యాఖ్యానించారు. కాగా క్యూ4(జనవరి-మార్చి) ఫలితాల్లో త్రైమాసిక ప్రాతిపదికన టీసీఎస్ నికర లాభం 5.7 శాతం పెరిగి 6904 కోట్ల రూపాయలను సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం ఆదాయం సైతం రూ. 32,075 కోట్లకు చేరింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించింది. దీంతోపాటు వాటాదారులకు షేరుకి రూ. 29 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. -
పెట్రోల్,డీజిల్ భారీ ధరలు; తగ్గాలంటే దారిదే!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం, యావత్ దక్షిణాసియాలోనే పెట్రో ఉత్పత్తులపై అధిక పన్నులు వసూలు చేస్తోన్న దేశంగా భారత్ వెలిగిపోతుండటం తెలిసిందే. దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.73 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.64.58. అదే మన తెలుగురాష్ట్రాల్లోనైతే ఈ వసూళ్లు తారాస్థాయిలో జరుగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 78 పైమాటే, ఇక విశాఖపట్నంలోనైతే రూ. 79 దాటింది. నెల్లూరు, చిత్తూరు లాంటి జిల్లాల్లోనైతే ఏకంగా లీటర్ పెట్రోలును రూ.80కి అమ్ముతున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోన్న ధరలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ స్పందించారు. ఒక్కటే దారి: సోమవారం పార్లమెంట్ వాయిదా అనంతరం మంత్రి ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ ధరల తగ్గుదలకు ఓ సూచన చేశారు. ‘‘ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్‌ను పలుమార్లు అభ్యర్థించాను.. పెట్రో ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తే, అవి వినియోగదారుడికి అందుబాటు దరల్లో లభించడం ఖాయం’’ అని స్పష్టం చేశారు. ఇంకా.. ‘‘పెట్రోలియం ఉత్పత్తులనేవి అంతర్జాతీయ వస్తువులన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా చోటుచేసుకునే ఒడిదుడుకులు దేశీయంగా ప్రభావం చూపుతున్నాయి. వినియోగదారుల పరంగా భారత్ సున్నితమైన దేశం. ధరల తగ్గింపునకు మా వంతు ప్రయత్నాలను చేస్తున్నాం..’’ అని మంత్రి అన్నారు. దేశంలో అన్నిరకాల ఉత్పత్తులకు భిన్నంగా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం రాజకీయంగా విమర్శలకు దారితీసిన విషయం విదితమే. ఏదైనా ఉత్పత్తిపై జీఎస్టీ విధింపునకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షుడిగా, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండే జీఎస్టీ కౌన్సిల్‌దే తుది నిర్ణయమన్న సంగతి తెలిసిందే. గతంలో కేంద్ర ప్రభుత్వం చేతులో ఉన్న ధరల నియంత్రణ అధికారాన్ని ఆయిల్ కంపెనీలకు కట్టబెట్టిన తర్వాత.. ఆ సంస్థలు 15 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించేవి. గతేడాది జూన్ నుంచి రోజువారీగా ధరలను సమీక్షించడం ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకింత చొప్పున పెరుగూ తాజాగా నాలుగేళ్ల గరిష్టస్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు చేరాయి. -
కొనసాగుతున్న పెట్రో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరోరోజూ భారమయ్యాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడం, అధిక డిమాండ్ కారణంగా పెట్రో ధరలు మండుతున్నాయి. మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ సగటున రూ 80కి చేరువవుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు డీజిల్ ధరలు సైతం రూ 67కు ఎగబాకాయి. ఈ ఏడాది జనవరి 24న పెట్రోల్ ధరలు మూడేళ్ల గరిష్టస్ధాయిని తాకినప్పటి నుంచీ ధరల షాక్ కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, ఒపెక్ దేశాల్లో చమురు ఉత్పత్తులపై నియంత్రణలతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఇక రూపాయి మారకం, పెట్రో ఉత్పత్తులపై సుంకాలతో దేశీయ వినియోగదారులు పెట్రో ధరలపై ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. పెట్రో ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించాలని కేంద్రాన్ని కోరుతుంటే రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్, ఇతర పన్నులను తగ్గించాలని కేంద్రం కోరుతోంది. -
ఆల్ టైం గరిష్టానికి బ్యాంక్ నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలను దాటేసింది. సూచీలన్నీ సంక్రాంతి సంబరాలతో ఆల్ టైం గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో దాదాపు అన్ని సెక్టార్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం 274 పాయింట్లు ఎగిసి 34,866వద్ద, నిఫ్టీ75 పాయింట్లు పుంజుకుని 10,756 వద్ద మరో చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి.ఇదే బాటలో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. తొలిసారి26వేల స్థాయిని తాకింది. దాదాపు అన్ని బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతోపాటు మెటల్, రియల్టీ లాభపడుతున్నాయి. ముఖ్యంగా జేపీ మోర్గాన్ షేర్ అప్డేట్తో ఐసీఐసీఐ వరుసగా రెండవ సెషన్లో కూడా లాభపడుతూ టాప్ విన్నర్‌గా ఉంది. భారీ లాభాలతో మూడేళ్ల గరిష్టాన్ని తాకింది. అలాగే ఐడీఎఫ్సీ విలీనంతో క్యాపిటల్ ఫస్ట్ భారీగా లాడపడుతోంది. ఎనిమిది నెలల గరిష్టం వద్ద కొనసాగుతోంది. హెచ్‌డీఐఎల్, ఐఎఫ్సీఐ, మణప్పురం, జీ, పీసీ జ్యువెలర్స్, జీఎంఆర్, టాటా స్టీల్, చెన్నై పెట్రో లాభపడుతుండగా, ఐషర్, అశోక్ లేలాండ్, ఇండస్ఇండ్ స్వల్పంగా నష్టపోతున్నాయి. -
మార్కెట్లో మరోసారి రికార్డుల మోత
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోముగిసాయి. అంతర్జాతీయ పరిణామాల ఊరట, దేశీయ ఐఐపీ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండడం.. మన మార్కెట్లో నిష్టీ మరోసారి రికార్డుల మోత మోగించింది. ముఖ్యంగా కీలక సూచీ నిఫ్టీ మరోసారి సరికొత్త గరిష్టం వద్ద ముగిసింది. దీంతో పాటు స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ కూడా కొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 151పాయింట్లు ఎగిసి 32, 423 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 10,153 వద్ద క్లోజ్ అయింది. ఇంట్రాడేలో ఆల్ టైం గరిష్ట స్థాయిని.. క్లోజింగ్‌లో ఆల్‌టైం గరిష్ట స్థాయిని నిఫ్టీ నమోదు చేసింది. 10,172 నిఫ్టీ టచ్ చేసిన నిఫ్టీ ఆల్‌టైం హై వద్ద ముగియడం విశేషం. దీనికి ఫార్మ, ఆటో లాభాలు మద్దతునిచ్చాయి. ఎంఅండ్ఎం, బజాజ్ఆటో, హీరో మోటోకార్ప్ , భారతి ఇన్ఫ్రాటెల్, ఇండియా బుల్స్ బాగా లాభపడ్డాయి. వీటితోపాటు ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లాభాల్లో ముగిసాయి. ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఐటీసీ, అంబుజా సిమెంట్స్, టాటా పవర్ స్టాక్స్ నిఫ్టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. -
ప్రపంచ రుణ భారంపై జాగ్రత్త
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆందోళన వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రుణ భారం పట్ల జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. ఈ రుణ భారం ఆల్-టైమ్ హైకి చేరినట్లు పేర్కొంది. గడచిన ఏడాదికి ఫైనాన్షియల్ సెక్టార్‌ను మినహాయించి చూస్తే... ప్రభుత్వ, ప్రైవేటు రుణ భారాలు 152 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక తెలిపింది. ఇందులో 65 శాతానికిపైగా ప్రైవేటు రంగానిదని వివరించింది. ఇదే తీరు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధి మళ్లీ వెనక్కు తిరుగుతుందని ఐఎంఎఫ్ వివరించింది. ఈజీ మనీ విధానం సమస్యకు మూలం ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల ‘ఈజీ మనీ’ విధానమే అసలు సమస్యని కూడా పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం మొదలుకొని వృద్ధికి మద్దతుగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. చైనాలో పెరుగుతున్న ప్రైవేటు రంగం రుణ భారం, కొన్ని దిగువ ఆదాయ దేశాల్లో ప్రభుత్వ రుణాల భారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి విఘాతం కలిగిస్తాయని విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థల మందగమనం వల్ల రుణ భారాలు తగ్గించుకోవడం అటు కంపెనీలకు ఇటు దేశాలకు కూడా కష్టమైన పనని పేర్కొంది. రుణ భారం తగ్గించుకునే ప్రక్రియలో తీసుకునే నిర్ణయాలు వ్యయాలకు, పెట్టుబడులకు విఘాతంగా మారి చివరికి అది ప్రపంచ వృద్ధి గతిపై ప్రభావం చూపుతుందనీ విశ్లేషించింది. ఇదే పరిస్థితి కొనసాగితే, తాజా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయని, ఇది తీవ్ర ఆర్థిక మాంద్యం పరిస్థితికి దారితీసే వీలుందని ఐఎంఎఫ్ ద్రవ్య నిర్వహణా విభాగ నివేదిక హెచ్చరించింది. పరిస్థితి మెరుగుపడాలంటే... ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు తొలగిపోయే పరిస్థితులను కూడా నివేదిక వివరించింది. ఇందులో ఒకటి బలమైన వృద్ధి తీరు ఒకటికాగా, ఇందుకు ప్రధానంగా సాధారణ స్థాయి ద్రవ్యోల్బణ పరిస్థితులని పేర్కొంది. ఉత్పాదకతను, ఉపాధిని సృష్టించే పెట్టుబడులు, ద్రవ్య, వాణిజ్య పరమైన పెట్టుబడులు, కంపెనీలు క్రమంగా తమ రుణ భారాలను తగ్గించుకోవడం వంటివి ఇందులో కీలకమని వివరించింది. -
సెన్సెక్స్ సరికొత్త రికార్డు
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ సరికొత్త గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది. గురువారం నాటి మార్కెట్ లో 36 పాయింట్ల వృద్ధితో 21373 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 274 పాయింట్లు లాభపడింది. అయితే డిసెంబర్ 9 తేదిన నమోదు చేసిన ఇంట్రాడే హై 21483 పాయింట్లను అధిగమించలేదు. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 6345 వద్ద ముగిసింది. లార్సన్, యాక్సీస్ బ్యాంక్, గెయిల్, జిందాల్ స్టీల్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, హెచ్ సీఎల్ టెక్, ఓఎన్ జీసీ, పీఎన్ బీ, ఎన్ టీపీసీ నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.