సాక్షి, ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలను దాటేసింది. సూచీలన్నీ సంక్రాంతి సంబరాలతో ఆల్ టైం గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో దాదాపు అన్ని సెక్టార్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం 274 పాయింట్లు ఎగిసి 34,866వద్ద, నిఫ్టీ75 పాయింట్లు పుంజుకుని 10,756 వద్ద మరో చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి.ఇదే బాటలో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. తొలిసారి26వేల స్థాయిని తాకింది. దాదాపు అన్ని బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతోపాటు మెటల్, రియల్టీ లాభపడుతున్నాయి.
ముఖ్యంగా జేపీ మోర్గాన్ షేర్ అప్‌డేట్‌తో ఐసీఐసీఐ వరుసగా రెండవ సెషన్‌లో కూడా లాభపడుతూ టాప్ విన్నర్‌గా ఉంది. భారీ లాభాలతో మూడేళ్ల గరిష్టాన్ని తాకింది. అలాగే ఐడీఎఫ్‌సీ విలీనంతో క్యాపిటల్ ఫస్ట్ భారీగా లాడపడుతోంది. ఎనిమిది నెలల గరిష్టం వద్ద కొనసాగుతోంది. హెచ్‌డీఐఎల్, ఐఎఫ్‌సీఐ, మణప్పురం, జీ, పీసీ జ్యువెలర్స్, జీఎంఆర్, టాటా స్టీల్, చెన్నై పెట్రో లాభపడుతుండగా, ఐషర్, అశోక్ లేలాండ్, ఇండస్‌ఇండ్ స్వల్పంగా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment