Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభ లాభాలు మరింత ఎగిసిన సె న్సెక్స్, నిఫ్టీ మరో ఆల్ టైం రికార్డు స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగిసి 67,094 వద్ద, నిఫ్టీ పాయింట్లు ఎగిసి 19846 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ముగిసాయి.
విదేశీ నిధుల ప్రవాహం, యూఎస్ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు ఆరంభంలోనే ఉత్సాహంగా ఉన్నాయి. అలాగే ఇండెక్స్ మేజర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో పాటు, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల కొనుగోళ్లు కూడా మార్కెట్లకు జోష్‌నిచ్చాయి.
ఫలితంగా సెన్సెక్స్ 67 వేలకు ఎగువన, నిఫ్టీ కూడా రికార్డ్ క్లోజింగ్‌ను నమోదు చేసింది. నిఫ్టీ 19,850 సమీపంలో ముగిసింది. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ , బజాజ్ ఫైనాన్స్, టాప్ ఇండెక్స్ గెయినర్లుగా . మరోవైపు హిందాల్కో, బజాజ్‌ఆటో, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, హీరో మోటో టాప్ లూజర్‌లుగా ఉన్నాయి.
రూపాయి: గత ముగింపు 82.04తో పోలిస్తే బుధవారం డాలర్‌కు రూపాయి స్వల్పంగా తగ్గి 82.09 వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి
Comments
Please login to add a commentAdd a comment