Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభంలోనే సరికత్త రికార్డుస్థాయిలను తాకాయి.వాల్ స్ట్రీట్ లాభాలతో భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డులను నమోదు చేసాయి. చరిత్రలో తొలిసారి 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 67వేల స్టాయిని తాకింది. నిఫ్టీ 19,800 స్థాయిని అధిగమించి సరికొత్త ఆల్-టైమ్ శిఖరాలకు చేరుకుంది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభపడగా, మెటల్ షేర్లు బాగా నష్టపోయాయి.
రికార్డ్ స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 205 పాయింట్ల లాభంతో 66,795 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఫ్టాట్‌గా మారిన నిఫ్టీ చివర్లోపుంజుకుని 38 పాయింట్లు ఎగిసి 19,749 వద్ద ముగిసింది.
బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించింది. 2 బిలియన్ల డాలర్ల డీల్ కారణంగా ఇన్ఫోసిస్ షేరు టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆసియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, హీరో మోటోకార్ప్ ఎ క్కువగా లాభపడగా, ఫలితాల నేపథ్యంలో ఎల్‌టీఐ మైండ్ ట్రీ భారీగా నష్టపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బ్రిటానియా, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి
రూపాయి: మంగళవారం నాడు డాలర్‌తో రూపాయి 82.04 వద్ద స్థిరంగా ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment