Today StockMarket Nifty above 20k దేశీయస్టాక్‌మార్కెట్లు జోరుమీద ఉన్నాయి. కీలక సూచీలు రెండూ దలాల్‌స్ట్రీట్‌లో మెరుపులు మెరిపించాయి. ఆరంభంలో స్తబ్దుగా ఉన్నప్పటికీ ఆ తరువాత నుంచి పుంజు కున్నాయి. చివరికి సెన్సెక్స్ 246 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో 67,467 వద్ద ముగియగా, నిఫ్టీ 77 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 20,070 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ చరిత్రలో తొలిసిర 20వేలకు ఎగువన ముగియడం విశేషం.
బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు లాభపడ్డాయి.ముఖ్యంగా ఆగస్టులో దేశీయ CPI ద్రవ్యోల్బణం 6.83 శాతానికి చల్లబడడం, పారిశ్రామిక ఉత్పత్తి డేటా భారత ఆర్థికవ్యవస్థ పటిష్టతపై ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి.
దాదాపు అన్ని రంగాల షేర్లులాభపడ్డాయి. ప్రధానంగా మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభాలు మార్కెట్లకు ఊత మిచ్చాయి. గ్రాసిం, కోల్ ఇండియా, టాటా కన్జ్యూమర్, ఎయిర్టెల్, టైటన్ టాప్ గెయినర్స్‌గానూ, జియో ఫైనాన్షియల్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎం అండ్‌ఎం లార్సెన్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
రూపాయి: గత ముగింపు 82.92తో పోలిస్తే డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్ప నష్టంతో 82.98 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment