Bank Nifty
-
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
-
‘చెల్లం సార్ ఎక్కడున్నారు? ఇక్కడ ఘోరం జరిగిపోతోంది’ !?
ఒమిక్రాన్ భయాలు షేర్ మార్కెట్‌ని చుట్టు ముట్టాయి. స్టాక్ మార్కెట్లో కరెక్షన్ కొనసాగుతోంది. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైంది మొదలు మధ్యాహ్నం వరకు బేర్ పట్టు వీడటం లేదు. దేశీ సూచీలు నేల చూపులు చేస్తూనే ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ సర్రున కిందకి జారుతున్నాయి. మార్కెట్ ప్రారంభమైన అరగంట సమయంలోనే రూ.5.02 లక్షల మేరకు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మార్కెట్ క్రాష్ అవుతుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్ సందండి మొదలైంది. ముఖ్యంగా ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో పాపులరైన చెల్లం సార్ క్యారెక్టర్స్‌తో మీమ్స్ వస్తున్నాయి. చెల్లం సార్ మీరెక్కడున్నారు. స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతుంది. ఎక్కడి వరకు ఈ డౌన్ ఫాల్ కొనసాగుతుంది అంటూ మీమ్స్ సృష్టిస్తున్నారు. Me searching for Chellam Sir to know why stock market is down😜😂#StockMarket #nifty50 #Sensex pic.twitter.com/8WPOx4BuTT — Rama Shankar (@rockrama35) December 20, 2021 నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీలు బాగా నష్టపోతుండటంతో నిఫ్టీని టార్గెట్ చేసుకుని నవ్వులు పూయించే మీమ్స్ వచ్చాయి. Nifty from 18,600 to 16,500 .#nifty50 #sensex #StockMarket pic.twitter.com/7xphgNDzQ9 — JustTweetBro💙 (@Rahul_says96) December 20, 2021 మార్కెట్ క్రాష్‌కి ఒమిక్రాన్ భయాలే కారణమంటూ విశ్లేషకులు చెబుతుండటంతో ఒమిక్రాన్‌పై కూడా మీమ్స్ వచ్చాయి #StockMarket crash #nifty50 pic.twitter.com/w8nXkmBIU0 — P R O F E S S O R (@Kalpaish_) December 20, 2021 స్టాక్ మార్కెట్‌పై వచ్చిన పలు మీమ్స్ #Powergrid Investor's Today.!#StockMarket pic.twitter.com/BgGAQOziou — #𝐁𝐡𝐚𝐫𝐚𝐭𝐉𝐚𝐢𝐢𝐧 🇮🇳 भारत जैन (@BharatJaiin) December 20, 2021 The fall#StockMarket pic.twitter.com/8yM2CUGtDy — DA DEVIL'S ADVOCATE 🇮🇳 (@_JOGI1212) December 20, 2021 Why does this always happen? 😥#Markets #StockMarket #banknifty #INTRADAY #investors pic.twitter.com/vzthW4lOEh — Mohit Munjal (@mohit_munjal) December 16, 2021 -
లాభాలతో మొదలైన మార్కెట్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. మార్కెట్‌పై ఇన్వెస్టర్లు నమ్మకం ఉంచడంతో మార్కెట్ పాజిటివ్ ట్రెండ్‌లో మొదలైంది. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 54,385 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్ల మద్దతు లభించడంతో వరుసగా పాయింట్లు పొందుతూ పైపైకి చేరుకుంది. ఉదయం 9:50 గంటల సమయంలో 253 పాయింట్లు లాభపడి 54,531 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ సైతం 64 పాయింట్లు లాభపడి 16,302 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఎంఅండ్ఎం, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్ షేర్లు లాభాలు పొందగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల పాలయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఆఫ్ పర్సెంట్ లాభం పొందగా ఆటో నిఫ్టీ ఆఫ్ పర్సెంట్ నష్టపోయింది. గత వారం ఐపీవోకి వచ్చిన రోలేక్స్ రింగ్స్ షేర్లు 130 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ సాధించాయి. ఈవారం నిర్మా గ్రూపు నుంచి నువోవో విస్టా, కార్ ట్రేడ్లు ఐపీవోకి వస్తున్నాయి. -
రికార్డ్ స్థాయి నుంచి కుప్పకూలిన మార్కెట్లు
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో దూకుడు చూపుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి బోర్లా పడ్డాయి. అయితే తొలుత యథావిధిగా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నప్పటికీ తదుపరి అమ్మకాలు పెరగడంతో వెనకడుగు వేశాయి. మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఉధృతంకావడంతో చివరికి పతనంతో నిలిచాయి. సెన్సెక్స్ 695 పాయింట్లు కోల్పోయి 43,828 వద్ద ముగిసింది. నిఫ్టీ 197 పాయింట్లు వొదులుకుని 12,858 వద్ద స్థిరపడింది. తొలుత సెన్సెక్స్ 44,825 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. తదుపరి 43,758 వరకూ జారింది. వెరసి ఇంట్రాడే గరిష్టం నుంచి 1,050 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ సైతం 13,146 వద్ద గరిష్టాన్ని తాకగా.. 12,834 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. గురువారం(26న) నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం దెబ్బతీసినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. తొలుత ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 30,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. 30,198కు చేరి రికార్డ్ నెలకొల్పింది. పీఎస్‌యూ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో ప్రధాన రంగాలన్నీ2.5-1 శాతం మధ్య క్షీణించగా.. ప్రభుత్వ రంగ బ్యాంక్స్ 1.7 శాతం ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ 6 శాతం జంప్‌చేయగా.. గెయిల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా మాత్రమే అదికూడా 1.7-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఐషర్, యాక్సిస్, కొటక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, శ్రీ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటో, యూపీఎల్, సిప్లా, ఎయిర్టెల్ 4-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. చిన్న షేర్లు వీక్ డెరివేటివ్ కౌంటర్లలో బీవోబీ, శ్రీరామ్ ట్రాన్స్, కెనరా బ్యాంక్, పీఎన్బీ, మణప్పురం, టాటా పవర్, బంధన్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, పీవీఆర్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 4.5-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, జూబిలెంట్ ఫుడ్, ఎస్ఆర్ఎఫ్, డీఎల్ఎఫ్, ఇండిగో, జిందాల్ స్టీల్, ఎంఆర్ఎఫ్, కాల్గేట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.4-3.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.7-1 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,126 లాభపడగా.. 1,660 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్ల ‘హై’జంప్- 30,000కు బ్యాంక్ నిఫ్టీ
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు రానున్న వార్తలతో ఇటీవల దూకుడు చూపుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి కొత్త రికార్డులకు తెరతీశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 260 పాయింట్లు ఎగసి 44,783కు చేరింది. నిఫ్టీ సైతం 78 పాయింట్లు పెరిగి 13,133 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 30,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. 309 పాయింట్లు ఎగసి 30,045కు చేరింది. వెరసి మార్కెట్లు వరుసగా మూడో రోజు చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు సెంటిమెంటుకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. పీఎస్‌యూ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో ఐటీ(0.35 శాతం) మాత్రమే బలహీనపడగా.. మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్ 2.6 శాతం పుంజుకోగా.. ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ సైతం 1.2-0.6 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్, గ్రాసిమ్, టాటా స్టీ్ల్, హిందాల్కో, శ్రీసిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, నెస్లే, హీరో మోటో 1.2-0.3 శాతం మధ్య నీరసించాయి. ఐబీ హౌసింగ్ అప్ డెరివేటివ్ కౌంటర్లలో ఐబీ హౌసింగ్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, ఆర్బీఎల్ బ్యాంక్, జిందాల్ స్టీల్, బాష్ 5.5-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క జూబిలెంట్ ఫుడ్, ఐడియా, బెర్జర్ పెయింట్స్, పేజ్, బీఈఎల్, ఎస్ఆర్ఎఫ్, అమరరాజా 1-0.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ 0.5 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,240 లాభపడగా.. 558 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నేడు సానుకూల ఓపెనింగ్ చాన్స్?!
దేశీ స్టాక్ మార్కెట్లు నేడు(14న) సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 11,492 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,467 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్నాలజీ షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో శుక్రవారం యూఎస్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 0.5 శాతం పుంజుకోగా.. నాస్డాక్ 0.6 శాతం నీరసించింది. ప్రస్తుతం ఆసియాలో సింగపూర్ మినహా మిగిలిన మార్కెట్లు 2-0.5 శాతం మధ్య లాభపడి కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు నేడు తిరిగి ఒడిదొడుకుల మధ్య ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడక్కడే వారాంతాన ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 14 పాయింట్లు బలపడి 38,854 వద్ద నిలవగా.. నిఫ్టీ 15 పాయింట్లు పుంజుకుని 11,464 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,978-38,712 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 11,493-11,420 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,425 పాయింట్ల వద్ద, తదుపరి 11,386 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,499 పాయింట్ల వద్ద, ఆపై 11,533 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,234 పాయింట్ల వద్ద, తదుపరి 21,989 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,697 పాయింట్ల వద్ద, తదుపరి 22,914 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,176 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 724 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 838 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 317 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
ఆటుపోట్ల మధ్య నష్టాలతో- చిన్న షేర్లు డీలా
ప్రతికూల విదేశీ సంకేతాలతో నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 152 పాయింట్లు క్షీణించి 38,205కు చేరగా.. నిఫ్టీ 31 పాయింట్లు నీరసించి 11,303 వద్ద ట్రేడవుతోంది. 38,285 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 38,454 ఎగువన గరిష్టాన్నీ, 38,196 వద్ద కనిష్టాన్నీ చేరింది. టెక్ దిగ్గజాలలో అమ్మకాలతో వరుసగా రెండు రోజు శుక్రవారం యూఎస్ మార్కెట్లు పతనంకావడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు చైనాతో సరిహద్దు వద్ద సైనిక వివాదాల కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రయివేట్ బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రయివేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ 0.4 శాతం చొప్పున క్షీణించగా.. మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ప్రాటెల్, టాటా మోటార్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఐషర్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఐవోసీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఎస్బీఐ, కోల్ ఇండియా, మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్, ఓఎన్జీసీ 3-0.5 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎంఅండ్ఎం, కొటక్ బ్యాంక్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జీ 1-0.5 శాతం మధ్య నీరసించాయి. ఐడియా జోరు డెరివేటివ్స్‌లో ఐడియా 5 శాతం జంప్‌చేయగా.. ఎన్ఎండీసీ, ఎస్కార్ట్స్, వేదాంతా, హెచ్‌పీసీఎల్, పెట్రోనెట్, అశోక్ లేలాండ్, సెయిల్, అదానీ ఎంటర్, బాష్, మదర్సన్, అపోలో టైర్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, టాటా కన్జూమర్, పీవీఆర్, బీవోబీ, టాటా పవర్, కాల్గేట్ 3-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 965 నష్టపోగా.. 862 లాభాలతో కదులుతున్నాయి. -
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ సోమవారం ఉదయం సెషన్లో 2.50శాతం లాభపడింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇందుకు కారణమైంది. మార్కెట్ లాభాల ప్రారంభంలో భాగంగా నేడు ఈ ఇండెక్స్ 22వేల పైన 22,307.30 వద్ద వద్ద ప్రారంభమైంది. ఈ ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీ బ్యాంక్ షేర్ల ర్యాలీతో ఒక దశలో 2.50శాతం లాభపడి(553 పాయింట్లు) 22,520 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్ మునుపటి ముగింపు(21,966.80)తో పోలిస్తే 22,330 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3శాతం లాభపడింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 3శాతం పెరిగాయి. ఆర్బీఎల్ బ్యాంక్ 2.50శాతం, ఫెడరల్ బ్యాంక్ 2శాతం, ఎస్బీఐ బ్యాంక్ 1.50శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 1.50శాతం ర్యాలీ చేశాయి. అలాగే పీఎన్బీ బ్యాంక్ 1శాతం లాభపడగా, బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు అరశాతం పెరిగింది. మరోవైపు బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు అరశాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ అప్‌సైడ్‌లో 22,600 స్థాయి వద్ద కీలక నిరోధ స్థాయిని, డౌన్‌సైడ్‌లో 22,050 వద్ద కీలక మద్దతు స్థాయిని కలిగి ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయానికి సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడి 37246 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 10971 వద్ద ట్రేడ్ అవుతోంది. -
బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో విక్రయాలు
మార్కెట్ ప్రారంభం నుంచి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ రంగాలకు చెందిన హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఫిన్ సర్వీసెస్ రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు కొనసాగుతున్నాయి. వాహన ఫైనాన్స్ విభాగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరుసగా రెండోరోజూ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. లాభాల స్వీకరణ కారణంగా ఆర్బీఎల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు 3శాతం నుంచి 5శాతం నష్టాన్ని చవిచూశాయి. 4శాతం నష్టపోయిన ఎన్బీఎఫ్సీ స్టాక్‌లు: ఎన్బీఎఫ్సీ స్టాక్‌లు బజాజ్ ఫైనాన్షియల్ హోల్డింగ్, బజాజ్ ఫిన్‌సర్వీసెస్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్అండ్ఫైనాన్స్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 4శాతం నష్టాన్ని చవిచూశాయి. కరోనా ఎఫెక్ట్‌తో స్వల్పకాలంలో నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ ఇప్పట్లో రికవరీ అయ్యే అవకాశం లేదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ మిడ్సమయానికి కల్లా 2.5శాతాన్ని నష్టాన్ని చవిచూసి 21,578 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 2.50శాతం పతనాన్ని చవిచూశాయి. -
నిఫ్టీకి తదుపరి నిరోధం 10750
మార్కెట్ ర్యాలీ కొనసాగితే నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో 10750 స్థాయిని అందుకొనే అవకాశం ఉందని ఆనంద్ రాఠి టెక్నికల్ విశ్లేషకుడు నీలేశ్ రమేశ్ జైన్ అభిప్రాయపడ్డారు. అలాగే ఇదే స్థాయి నిఫ్టీకి తదుపరి నిరోధ స్థాయి కావచ్చని, ఈ స్థాయి నిఫ్టీ 100రోజుల ఎక్స్‌పోన్షియల్ మూవింగ్ యావరేజ్ స్థాయిగా ఉందని నీలేశ్ తెలిపారు. వీక్లీ ఛార్ట్‌లో నిఫ్టీ పెద్ద బుల్లిష్ క్యాండిల్‌ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. నిఫ్టీకి కీలకమైన 61.8శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి 10,550పై ఈ వారాన్ని ముగించిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వీక్లీ ఛార్ట్‌లో మూమెంటం ఇండికేటర్లు, ఓసిలేటర్లు బయింగ్ మోడ్‌లో ఉన్నాయని, ఇది మార్కెట్‌పై బుల్స్ పట్టు సాధించడాన్ని సూచిస్తుందని నీలేశ్ తెలిపారు. ప్రస్తుత పుల్‌బ్యాక్ ర్యాలీ మరింత విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. ఒలటాలిటీ ఇండెక్స్ ఇండియా వీఐఎక్స్ 10శాతం నష్టపోయి 3నెలల కనిష్టస్థాయి 25.7 స్థాయి వద్ద ముగిసింది. వీఐఎక్స్ పతనం మార్కెట్లో స్వల్పకాలంలో పాటు ఎలాంటి ఒడిదుడుకులు ఉండకపోవచ్చని సూచిస్తుంది. ఇది బుల్స్‌కు మరింత ఉత్సాహానిచ్చే అంశంగా ఉందని నీలేశ్ పేర్కోన్నారు. నిఫ్టీ ఇండెక్స్‌తో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చాలా తక్కువగా ర్యాలీ చేసింది. ఈ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వీక్లీ స్కేల్లో చిన్న బుల్లిష్ క్యాండిల్ నమోదైంది. అప్‌సైడ్‌లో 22,400 స్థాయి కీలక నిరోధంగా మారునుంది. ఈ స్థాయిని అధిగమించగలిగితే నిఫ్టీ తక్షణ నిరోధం 23,500 స్థాయి వద్ద ఉందని నీలేశ్ తెలిపారు. -
బ్యాంక్ షేర్ల భారీ పతనం
మార్కెట్ క్షీణతలో భాగంగా సోమవారం ఉదయం సెషన్లో బ్యాంకింగ్ రంగ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2.50శాతానికి పైగా నష్టపోయింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఒక సమవేశంలో మాట్లాడుతూ ‘‘బ్యాంకుల రుణాల వన్‌టైమ్ రీకన్‌స్ట్రక్చన్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాము.’’ అని వ్యాఖ్యానించారు. కార్పోరేట్ రుణాలు మెండిబకాయిలు(ఎన్పీఏ)గా మారేందుకు ప్రస్తుతం ఉన్న గడువును 90రోజుల నుంచి 120రోజులు లేదా 150రోజులకు పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు శుక్రవారం జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత్ దాస్ బోర్డు సభ్యులకు తెలిపినట్లు సమాచారం. రుణాల పునర్వ్యవస్థీకరణ, ఎన్‌పీఎల గడువు పెంపు వంటి అంశాలు అమల్లోకి వస్తే బ్యాంకు రుణాల చెల్లింపులు ఆలస్యం కావడంతో పాటు మొండిబకాయిలు మరింత పెరగవచ్చనే అందోళనలు ఇన్వెస్టర్లలో మొదలయ్యాయి. ఫలితంగా నేడు ప్రైవేట్ బ్యాంక్‌లతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఉదయం గం.11:15ని.లకు ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2.33శాతం నష్టపోయి 21,088 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇదే ఇండెక్స్‌లో అత్యధికంగా ఆర్బీఎల్ బ్యాంక్ 6శాతం నష్టపోయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 5.50శాతం, యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ షేర్లు 4శాతం నష్టపోయాయి. పీఎన్బీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ షేర్లు 3శాతం క్షీణించాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల 2శాతం నుంచి 1శాతం పతనమయ్యాయి. -
100 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ప్రారంభం
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ గురువారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 334 పాయింట్లు నష్టపోయి 34534వద్ద, నిప్టీ 102 పాయింట్లను కోల్పోయి 10202 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో నెలకొన్న విక్రయాలతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2శాతం నష్టపోయి 21వేల దిగువున 20996 వద్ద ప్రారంభమైంది. కోవిడ్-19 రెండో దశ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు పెరిగాయి. కరోనా వ్యాధి ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది దాదాపు 5 శాతం క్షీణించనున్నట్లు ఐఎంఎఫ్ అంచనావేసింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ 4.5శాతం కుచించుకుపోతుందని తెలిపింది. నేడు జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడం కూడా సూచీల నష్టాల ప్రారంభానికి కారణమైంది. ఐఓసీ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, ఇన్ఫ్రాటెల్ షేర్లు 2.50శాతం నుంచి 4శాతం నష్టపోయింది. హిందూస్థాన్ యూనిలివర్, ఐటీసీ, బీపీసీఎల్, బజాజ్-అటో, గెయిల్ షేర్లు అరశాతం 2.50శాతం లాభపడ్డాయి. -
జోరుగా బ్యాంకింగ్ రంగ షేర్ల ర్యాలీ..!
బ్యాంకింగ్ రంగ షేర్లు శుక్రవారం మిడ్‌సెషన్ సమయానికి జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఏజీఆర్ బకాయిల చెల్లింపులు విషయమై టెలికాం కంపెనీల ప్రతిపాదనలు పరిశీలించడానికి కొంత సమయం కావాలని డాట్ కోరడంతో బ్యాంకింగ్ రంగ షేర్లలో రిలీఫ్ ర్యాలీ కొనసాగుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2శాతానికి (445 పాయింట్లు)పైగా లాభపడి 21వేల పైకి చేరుకుంది. ఇండెక్స్ మధ్యాహ్నం 12:30ని.లకు నిన్నటి ముగింపు(20,956.30)తో పోలిస్తే 2శాతం లాభంతో 21,383.70 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 5శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. ఫెడరల్ బ్యాంక్, బంధన్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, ఆర్బీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2శాతం పెరిగాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, పీఎన్బీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు 1శాతం నుంచి అరశాతం ర్యాలీ చేశాయి. 10200 పైకి నిఫ్టీ ఇండెక్స్ సెంచరీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్ మిడ్‌సెషన్ కల్లా 300 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 10200 స్థాయిపై ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్, ఆర్థిక, అటో, ఫార్మా రంగ షేర్ల ర్యాలీ సూచీల లాభాలకు కారణయ్యాయి. మధ్యాహ్నం గం.12:45ని.లకు సెన్సెక్స్ 371 పాయింట్లు పెరిగి 34,579 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 10,202 వద్ద ట్రేడ్ అవుతోంది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. డాలర్ మారకంలో రూపాయి బలపడటంతో ఒక్క ఐటీ రంగ షేర్లు మాత్రం నష్టాలను చవిచూస్తున్నాయి. -
బ్యాంకింగ్ రంగ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు
బ్యాంకింగ్ రంగ షేర్లకు సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో భారీగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 4 శాతానికి(819 పాయింట్లు) పైగా లాభపడింది. మార్కెట్ భారీ లాభాల ప్రారంభంలో భాగంగా నేడు ఈ ఇండెక్స్ మునుపటి ముగింపు(19297.25)తో పోలిస్తే 2శాతానికి పైగా లాభంతో 19297 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. లాక్‌డౌన్‌ను విడతల వారీగా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రకటనతో ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం అవుతుందనే సానుకూల అంచనాలు బ్యాంకింగ్ రంగ షేర్లకు డిమాండ్‌ను పెంచాయి. ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దీంతో ఒక దశలో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 4.24శాతం 819 పాయింట్లు 20,117 లాభపడి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు 4శాతం లాభంతో 20,078 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6శాతం లాభపడింది. యాక్సిస్ బ్యాంక్, ఆర్బీఎల్ షేరు 5.50శాతం లాభపడింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 5శాతం పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 4శాతం ర్యాలీ చేశాయి. కోటక్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ షేర్లు 3శాతం లాభపడ్డాయి. -
బ్యాంక్ నిఫ్టీ 2శాతం క్రాష్
గత రెండు ట్రేడింగ్ సెషన్లో 10శాతం ర్యాలీ చేసిన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 2శాతానికి పైగా నష్టపోయింది. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ నేడు 18,962.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఎఫ్అండ్ఓ ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో గత రెండు రోజులుగా భారీ లాభాలను ఆర్జించిన బ్యాంకింగ్ రంగ షేర్లు నేడు మార్కెట్ ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో ఇండెక్స్ 439 పాయింట్లను కోల్పోయి 18,729.90 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు ఇండెక్స్ మునుపటి ముగింపు(19,169.80)తో పోలిస్తే 1.85శాతం(355 పాయింట్లు) 18,819.65 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా 4శాతం నష్టపోయింది. యాక్సిస్ బ్యాంక్ 3శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు 2శాతం క్షీణించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్బీఎల్ షేరు 1.50శాతం క్షీణించాయి. ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు 1శాతం పతనమగా, పంజాజ్ నేషనల్ బ్యాంక్ షేరు 0.10శాతం నష్టపోయింది. అయితే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు మాత్రం 9.88శాతం లాభంతో రూ.22.25 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. -
లాక్డౌన్ టైంలోనే బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయ్..!
లాక్డౌన్ కాలంలో నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇండెక్స్‌లు నష్టాలను చవిచూడలేదని ఏస్‌ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి. విచిత్రంగా ఈ సమయంలోనే ఈ ఇండెక్స్‌లు చెప్పుకొదగిన ర్యాలీని చేశాయి. కేంద్రం మార్చి 24న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. నాటి నుంచి నిన్నటి(మే 27) వరకు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 9శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ 19శాతం పెరిగింది. ఐసీసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎడెల్వీజ్ ఫైనాన్స్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాంటి ఫైనాన్స్ స్టాక్ లాక్డౌన్ సమయంలో రాణించిన షేర్లలో ఉన్నాయి. ఇక నష్టపోయిన షేర్లను పరిశీలిస్తే... బజాజ్ ఫైనాన్స్ అత్యధిక నష్టాన్ని చవిచూసింది. వాటితో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ సర్వీసెస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్ కంపెనీ షేర్లున్నాయి. మున్ముందు మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది: ఉమేష్ మెహతా ఫైనాన్షియల్ స్టాక్స్ ర్యాలీ మున్ముందు మరింత సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా అభిప్రాయపడ్డారు. సుధీర్ఘ లాక్డౌన్, మారిటోరియటం పొడగింపు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల ఉనికి ప్రశ్నార్థకం చేస్తుందని ఆయనన్నారు. మారిటోరియం పొడిగింపు ఎన్పీఏ సైకిల్‌ను మరింత ఇబ్బంది పెట్టే అంశం. దాని ప్రభావం ఈ త్రైమాసికంలో కాకపోయినా వచ్చే క్వార్టర్ నుంచైనా స్పష్టంగా చూడవచ్చు. పొడగింపు అంశం బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను ప్రభావితం చేయడమే కాకుండా వాటి లాభదాయకతను దెబ్బతీస్తుంది. ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ప్రతికూల ప్రభావానికి దారితీసింది. ఇది బ్యాంకులకు అనుకూలంగా లేదు. ఇప్పుడిప్పుడే ప్రతికూల వృద్ధి రేటు ప్రభావాన్ని చవిచూస్తున్నాం. అని ఉమేష్ మెహతా తెలిపారు. -
రెండోరోజూ రాణిస్తున్న బ్యాంక్ నిప్టీ
బ్యాంకింగ్ రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో వరుసగా రెండోరోజూ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ జోరును కనబరుస్తోంది. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్ గురువారం ఉదయం ట్రేడింగ్‌లోనే 3శాతానికి పైగా లాభపడింది. నేడు డెరివేటివ్ కాంట్రాక్టులు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు బ్యాంకింగ్ రంగ షేర్లలో ఎక్కువగా షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ కూడా బ్యాంకింగ్ రంగ షేర్లు రాణిస్తుండటం కూడా ఇన్వెస్టర్లకు ఈ షేర్ల కొనుగోళ్లపై ఆస్తకి చూపుతున్నారు. నిన్నటి ట్రేడింగ్‌లో ఇదే ఇండెక్స్ 6శాతం లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే. క్రితం రోజు భారీ లాభాల ముగింపు(18,710.55) కొనసాగింపుగా నేడు ఈ ఇండెక్స్ 1శాతం లాభంతో 18,924.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి బ్యాంకింగ్ రంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా ప్రైవేట్ రంగ షేర్లు లాభపడ్డాయి. ఫలితంగా ఇండెక్స్ ఒక దశలో 3.17శాతం (593 పాయింట్లు) పెరిగి 19304.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:30నిల.కు ఇండెక్స్ 2.71శాతం లాభంతో 19,218.10 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండస్ బ్యాంక్ 6శాతం పెరిగింది. బంధన్బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ఆర్బీఎల్, కోటక్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 3శాతం నుంచి 2శాతం ర్యాలీ చేశాయి. ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 1శాతం వరకు పెరిగాయి. ఒక్క పీఎన్బీ షేరు ఎలాంటి లాభనష్టాలను చవిచూడకుండా స్థిరంగా ట్రేడ్ అవుతోంది. -
9500 దాటితే 10వేలకు నిఫ్టీ!
అంతర్జాతీయ మార్కెట్ల అండతో దేశీయ మార్కెట్లు తిరిగి అప్‌మూవ్ బాట పట్టాయి. బుధవారం 9300 పాయింట్లను తాకిన నిఫ్టీ గురువారం 9400 పాయింట్ల పైన ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి కీలక నిరోధం 9500-9600 పాయింట్ల వద్ద ఉందని, దీన్ని విజయవంతంగా దాటితేనే 9900-10000 పాయింట్లకు చేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు నిప్టీ త్వరలో 20వేల పాయింట్లను దాటవచ్చని అంచనా వేస్తున్నారు. నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీపై ప్రముఖ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి... ఐసీఐసీఐ సెక్యూరిటీస్: నిఫ్టీకి 8800 పాయింట్ల వద్ద హైబాటమ్ ఏర్పడినట్లుంది. క్రమంగా నిఫ్టీ ఏప్రిల్ గరిష్ఠం 9900 పాయింట్లను మరోమారు పరీక్షించవచ్చు. తక్షణ మద్దతు 9050 పాయింట్ల వద్ద ఉంది. ఫార్మా, ఐటీ స్టాకులపై బుల్లిష్. ఏంజల్ బ్రోకింగ్: నిఫ్టీ ముందుగా 9450-9550 పాయింట్లను చేరవచ్చు. బ్యాంకు నిఫ్టీ 20వేల పాయింట్లను తాకవచ్చు. ఈ సమయంలో షార్ట్స్ మంచివి కాదు. నిఫ్టీకి 9000- 9250 పాయింట్ల వద్ద మద్దతుంది. ఇక్కడకు వచ్చినప్పుడల్లా కొనుగోళ్లకు అవకాశంగా చూడాలి. మోతీలాల్‌ఓస్వాల్: నిఫ్టీ కీలక నిరోధం 9150-9180 పాయింట్లను విజయవంతంగా దాటింది. ఇదే ఊపులో 9500- 9600 పాయింట్ల వరకు వెళ్లవచ్చు. బ్యాంకునిఫ్టీకి మద్దతు 18000 పాయింట్ల వద్ద ఉంది. ఆర్ఐఎల్, టాటాకెమికల్స్, బ్రిటానియా, హిండాల్కో, ఐషర్పై బుల్లిష్. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్: వీక్లీ చార్టుల్లో హామర్ ప్యాట్రన్ ఏర్పడడం మరింత అప్‌మూవ్‌కు సంకేతం. ఈ జోరుతో వారం రోజుల్లో నిఫ్టీ 9600 పాయింట్ల వరకు పరుగు తీయవచ్చు. బ్యాంకు నిఫ్టీ 19500-20000 పాయింట్లను తాకవచ్చు. నిఫ్టీ లాంగ్స్‌కు 9100 పాయింట్లు స్టాప్‌లాస్. -
బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1200 పాయింట్ల జంప్ ..!
ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ బుధవారం మిడ్‌సెషన్ సమయానికి 1200 పాయింట్లు లాభపడింది. ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లకు భారీగా లభించిన కొనుగోళ్ల మద్దతు ఇండెక్స్ ర్యాలీకి కారణమైంది. ఈ ఇండెక్స్ నిన్నటి ముగింపు(17,440.35)తో పోలిస్తే దాదాపు 1శాతం లాభంతో 17603.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రేపు (గురువారం) మే డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో టేడర్లు బ్యాంకింగ్ రంగ షేర్లలో షార్ట్ కవరింగ్‌కు పాల్పడ్డారు. ఫలితంగా మార్కెట్ ప్రారంభం నుంచి ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ షేర్లకు గణనీయమైన కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో ఇండెక్స్ 1200 పాయింట్లు(5.55 శాతం) లాభపడి 18640.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 2గంటలకు ఇండెక్స్ మునుపటి ముగింపుతో పోలిస్తే 5.5శాతం లాభంతో 18,407.80 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఈ ఇండెక్స్‌లో అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్ 10శాతం పెరిగి ఫ్రిజ్ అయ్యింది. ఐసీఐసీఐ బ్యాంక్ 8శాతం లాభపడింది. బంధన్ బ్యాంక్,, కోటక్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు 5శాతం ర్యాలీ చేశాయి. ఫెడరల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ షేర్లు 4శాతం లాభపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్ షేర్లు 2శాతం నుంచి 3శాతం ర్యాలీ చేశాయి. -
బ్యాంకు నిఫ్టీ గట్టెక్కేనా?!
కోవిడ్19 దెబ్బకు ప్రపంచ మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్లు కూడా అల్లకల్లోలమవుతున్నాయి. ఈ వరుసలో మార్చినెల్లో మార్కెట్లు మహా పతనం చూశాయి. అయితే అనంతరం ఏప్రిల్‌లో ప్రధాన సూచీలు కొంతమేర కోలుకున్నాయి. కానీ బ్యాంకు నిఫ్టీ మాత్రం ఆ స్థాయిలో రికవరీ చూపలేదు. దీంతో బ్యాంకుషేర్లపై నెగిటివ్ ధృక్పధం పెరిగింది. తాజాగా టర్మ్లోన్స్పై ఆర్బీఐ మారిటోరియం విధించడంతో బ్యాంకింగ్ రంగంలో మరిన్ని డిఫాల్టులు పెరగవచ్చని బ్రోకరేజ్‌లు హెచ్చరిస్తున్నాయి. దీంతో కొంచెంకొంచెంగా కోలుకుంటున్న బ్యాంకు నిఫ్టీ తిరిగి నేల చూపులు ఆరంభించింది. గతవారాంతానికి నష్టాల్లో ముగిసి దాదాపు మార్చినెల కనిష్ఠాల వద్దకు చేరింది. మంగళవారం ఆరంభట్రేడింగ్లో మాత్రం కొంత మేర నిలదొక్కుకొని 17500 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. బ్యాంకు నిఫ్టీ మార్చినెల్లో 16,131 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. తిరిగి తాజా బలహీనతతో మరోమారు ఈ కనిష్ఠాన్ని చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాస్త అప్‌మూవ్ కనిపించినా షార్ట్ చేయడానికి ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ బ్యాంకు నిఫ్టీ అప్‌మూవ్ చూపితే ముందు 18200 పాయింట్ల వద్ద బలమైన నిరోధం ఎదురుకానుంది. ఆపైన 20000 పాయింట్లు నిరోధంగా నిలుస్తుంది. దిగువన 17000 పాయింట్ల వద్ద మద్దతు కనిపిస్తోంది. అంతకు దిగువన మార్చి కనిష్ఠం 16000- 16200 పాయింట్ల వద్ద బలమైన మద్దతు దొరకవచ్చు. ఏప్రిల్ అప్‌మూవ్ అనంతరం బ్యాంకునిఫ్టీ మరలా వెనుదిరిగి 78 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయిలకు చేరింది. దీన్ని బట్టి ప్రధాన సూచీల కన్నా బ్యాంకింగ్ రంగంలో షార్ట్స్ బాగా పెరిగాయని, అందువల్ల మరింత పతనం ముందుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ బ్యాంకు నిఫ్టీ మార్చి కనిష్ఠస్థాయి వద్ద కూడా మద్దతు పొందకుంటే మరో 10- 15 శాతం మేర పతనం చెందే ఛాన్సులున్నాయంటున్నారు. ఇదే జరిగితే నిఫ్టీలో సైతం కరెక్షన్కు ఛాన్సులుంటాయని చెబుతున్నారు. -
9,200 దాటితేనే- పెట్టుబడికి 3 స్టాక్స్!
గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్పకాలిక చలన సగటులు 20 డీఎంఏ, 50 డీఎంఏ ప్రకారం బుల్లిష్ వేవ్‌ను సూచించినట్లు నార్నోలియా ఫైనాన్షియల్ టెక్నికల్, డెరివేటివ్ రీసెర్చ్ హెడ్ షబ్బీర్ కయూమీ పేర్కొన్నారు. అయితే నిఫ్టీ 9,200 పాయింట్ల ఎగువకు చేరాక.. ఆ స్థాయిలో నిలదొక్కుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. ఫలితంగా నిఫ్టీ స్వల్పకాలంలో 9,550కు చేరే వీలున్నట్లు అంచనా వేశారు. ఈ సందర్భంగా స్వల్ప కాలానికి మూడు స్టాక్స్‌ను పెట్టుబడికి అనువైనవిగా సూచిస్తున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. నీరసిస్తే గత వారం నిఫ్టీ 9200-8800 శ్రేణిలో కన్సాలిడేట్ అయ్యింది. దీంతో 50 డీఎంఏ ఎగువన నిలదొక్కుకోలేకపోయింది. గరిష్ట స్థాయిలవద్ద అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు బేరిష్ క్యాండిల్ స్టిక్ సూచిస్తోంది. దీంతో ఇకపై నిఫ్టీ ఒకవేళ బలహీనపడితే.. తొలుత 8750 పాయింట్ల వద్ద, తదుపరి 8650 స్థాయిలోనూ సపోర్ట్ లభించే వీలుంది. ఈ స్థాయి దిగువకు చేరితే అమ్మకాలు ఊపందుకోవచ్చు. ఫలితంగా 8,300 పాయింట్ల వరకూ క్షీణించే అవకాశముంది. అయితే గత వారం 20 డీఎంఏ, 50 డీఎంఏను అధిగమించడంతో కొంతమేర సానుకూల ధోరణితో సైడ్‌వేస్ కదలికలకు ఆస్కారం ఉంది. తద్వారా 9,200 పాయింట్లను అధిగమించి నిఫ్టీ నిలదొక్కుకుంటే మరింత బలపడేందుకు చాన్స్ ఉంటుంది. రానున్న కాలంలో నిఫ్టీ గరిష్టంగా 9,550ను తాకవచ్చని భావిస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ.. గత వారమంతా బలహీనంగానే ట్రేడయ్యింది. కీలక మద్దతు స్థాయిల దిగువన ముగిసింది. చార్టుల ప్రకారం నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ప్రతికూలంగా కనిపిస్తోంది. అయితే 18,000 ఎగువకు చేరితే బ్యాంక్ నిఫ్టీ పుంజుకునే వీలుంది. సాంకేతికంగా బ్యాంక్ స్టాక్స్‌లో కొన్ని కౌంటర్లు రివర్సల్‌ను సూచిస్తున్నాయి. ఇది బ్యాంక్ నిఫ్టీకి కొంతమేర మద్దతు పలికే అవకాశముంది. కాగా.. స్వల్ప కాలానికి మూడు కౌంటర్లు కొనుగోలుకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ షేరుని రూ. 340 టార్గెట్‌తో రూ. 280 ప్రాంతంలో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ. 240 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవలసి ఉంటుంది. రోజువారీ చార్టుల ప్రకారం ఈ కౌంటర్లో డబుల్ బాటమ్ ప్రైస్ ప్యాటర్న్ ఏర్పడింది. ప్రధాన మద్దతు స్థాయిని నిలుపుకుంటే స్వల్ప కన్సాలిడేషన్ తదుపరి బలపడే వీలుంది. ఆర్ఎస్ఐ సానుకూల సంకేతాలు ఇస్తోంది. ఎంఏసీడీ సైతం ఈ కౌంటర్ పుంజుకోవచ్చని సూచిస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఆటో రంగ దేశీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ షేరుని రూ. 350 టార్గెట్‌తో రూ. 305 సమీపంలో కొనుగోలు చేయవచ్చు. రూ. 280 వద్ద స్టాప్‌లాస్ అమలు చేయవలసి ఉంటుంది. రోజువారీ చార్టుల ప్రకారం ఈ కౌంటర్లో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగినట్లు తోస్తోంది. కనిష్ట స్థాయిల నుంచి రీబౌండ్ అవుతోంది. ఇకపై మరింత పుంజుకునే అవకాశముంది. ఈ కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరుగుతోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ గత కొద్ది రోజులుగా ఈ కౌంటర్లో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. అయితే రూ. 1115-1125 వద్ద డిమాండ్ కనిపించడంతో ఈ స్థాయిలలో మద్దతు లభిస్తోంది. ఈ స్థాయిలో పటిష్ట బేస్ ఏర్పడినట్లు వారపు చార్టులు సూచిస్తున్నాయి. రోజువారీ చార్టుల ప్రకారం చూస్తే డబుల్ బేస్ ఏర్పడింది. వెరసి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇకపై ఈ కౌంటర్ మరింత జోరందుకోవచ్చని భావిస్తున్నాం. -
ఎన్పీఏ భయాలతో బ్యాంక్ నిఫ్టీలో భారీ షార్ట్స్..!
ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వచ్చేవారంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఆప్షన్ ముగింపు తేది గురువారం మే 28న) ఉండటంతో హెవీ కాల్ సెల్లింగ్ ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద వచ్చేవారంలో ఇండెక్స్ 8శాతం పరిధి డౌన్‌సైడ్ ట్రెండ్‌లో ట్రేడ్ అవ్వొచ్చని మార్కెట్ విశ్లేషకుడు రామ్ సహల్ అంటున్నారు. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వచ్చే వారంలో 16580-18020 రేంజ్లో కదలాడే అవకాశం ఉంది. లాక్ డౌన్ కొనసాగింపు దృష్ట్యా ఆర్బీఐ ఈఎంఐలపై మరో 3నెలల పాటు తాత్కలిక నిషేధాన్ని పొడిగించింది. దీంతో భవిష్యత్తులో బ్యాంకుల ఎన్పీఏలు మరింత పెరగవచ్చనే అంచనాలతో ఫైనాన్షియల్ రంగంలో బలహీనత నెలకొని ఉంది. ఇండెక్స్ అంతర్లీన వాల్యూ శుక్రవారం 2.6శాతం పడిపోయి 17279 చేరుకోవడంతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎఫ్అండ్ఓ కాంట్రాక్టు 65శాతం పెరిగి 649113 చేరుకుంది. ఇండెక్స్ ధర 17286 పడిపోవడంతో వచ్చే నెల కాంటాక్టు 33శాతం పెరిగింది. ఇది ప్రతికూలతకు సంకేతమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండెక్స్ 18500 కీలక స్థాయిని బ్రేక్ చేసినప్పటి నుంచి భారీ పతనాలను చవిచూస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ హెచ్ అమిత్ గుప్తా తెలిపారు. -
ఫైనాన్స్ షేర్ల క్షీణత మార్కెట్‌ను మరింత ముంచింది..!
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్ని టర్మ్ లోన్ చెల్లింపులపై మారిటోరియాన్ని ఆగస్ట్ 31వరకు పొడిగించడంతో శుక్రవారం బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెన షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. రుణగ్రహీతల నుండి రుణాల తిరిగి పొందడానికి ఎక్కువ కాలం వేచి ఉండటంతో బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీస్తుందని విశ్లేషకులు తెలిపారు. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2.6శాతం నష్టంతో 17,279 వద్ద, నిప్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3శాతం నష్టంతో 9,421 ముగిశాయి. అయితే ఎన్ఎస్ఈ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.10శాతం స్వల్ప నష్టంతో 1090 పాయింట్లు వద్ద స్థిరపడింది. ఇప్పటికే కోవిద్ లాక్‌డౌన్‌తో ఇప్పటికే బ్యాంకులు ఒత్తిడిలో ఉన్నాయి. అలాగే ఆస్తుల నాణ్యత విషయంలో చాలా సమస్యలను ఎదుర్కోంటున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ మారిటోరియం పొడగింపు ప్రతికూలంగా మారనుంది. అయితే, రెపోరేటు తగ్గింపు క్రెడిట్ వృద్ధికి సానుకూలంగా ఉంటుంది. ఈ తాత్కాలిక నిషేధం ప్రతికూలంగా ఉంటుంది. ఎన్బీఎఫ్సీలు, బ్యాంకుల ఖర్చులను తగ్గిస్తుంది. అని షేర్‌ఖాన్ వైస్ ప్రెసిడెంట్ లలితాబ్ శ్రీవాస్తవ తెలిపారు. శుక్రవారం మార్కెట్ ముగింపు సరికే యాక్సిస్ బ్యాంక్ 5.50శాతం, ఫెడరల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 2శాతం నుంచి 4శాతం నష్టంతో ముగిశాయి. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ షేర్లు అరశాతం నష్టంతో రూ.151 వద్ద ముగిసింది. -
ఆల్ టైం గరిష్టానికి బ్యాంక్ నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలను దాటేసింది. సూచీలన్నీ సంక్రాంతి సంబరాలతో ఆల్ టైం గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో దాదాపు అన్ని సెక్టార్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం 274 పాయింట్లు ఎగిసి 34,866వద్ద, నిఫ్టీ75 పాయింట్లు పుంజుకుని 10,756 వద్ద మరో చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి.ఇదే బాటలో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. తొలిసారి26వేల స్థాయిని తాకింది. దాదాపు అన్ని బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతోపాటు మెటల్, రియల్టీ లాభపడుతున్నాయి. ముఖ్యంగా జేపీ మోర్గాన్ షేర్ అప్డేట్తో ఐసీఐసీఐ వరుసగా రెండవ సెషన్లో కూడా లాభపడుతూ టాప్ విన్నర్‌గా ఉంది. భారీ లాభాలతో మూడేళ్ల గరిష్టాన్ని తాకింది. అలాగే ఐడీఎఫ్సీ విలీనంతో క్యాపిటల్ ఫస్ట్ భారీగా లాడపడుతోంది. ఎనిమిది నెలల గరిష్టం వద్ద కొనసాగుతోంది. హెచ్‌డీఐఎల్, ఐఎఫ్సీఐ, మణప్పురం, జీ, పీసీ జ్యువెలర్స్, జీఎంఆర్, టాటా స్టీల్, చెన్నై పెట్రో లాభపడుతుండగా, ఐషర్, అశోక్ లేలాండ్, ఇండస్ఇండ్ స్వల్పంగా నష్టపోతున్నాయి. -
బ్యాంక్ నిఫ్టీ...ఫ్యూచర్స్ సిగ్నల్స్
ప్రపంచ ట్రెండ్ ప్రభావంతో మంగళవారం కూడా కొనసాగిన మన మార్కెట్ ర్యాలీలో ప్రధాన సూచీ నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ తక్కువ పెరిగింది. నిఫ్టీ 0.80 శాతం పెరగ్గా, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 0.42 శాతం పెరుగుదలతో సరిపెట్టుకుని 24,785 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 1.72 లక్షల షేర్లు (7.33 శాతం) యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 25.16 లక్షల షేర్లకు పెరిగింది. క్రితం రోజు స్పాట్ బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ 13 పాయింట్ల డిస్కౌంట్‌తో ముగియగా, ఆ డిస్కౌంట్ మంగళవారం 2 పాయింట్లకు తగ్గింది. తాజా లాంగ్ బిల్డప్‌ను ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. ఈ గురువారం ముగిసే వీక్లీ ఆప్షన్స్ విభాగంలో 25,000 స్ట్రయిక్ వద్ద తాజా కాల్‌రైటింగ్ ఫలితంగా 2.43 లక్షల షేర్లు యాడ్‌కాగా, 11.08 లక్షల షేర్లతో భారీ కాల్ బిల్డప్ ఇక్కడ వుంది. 24,500, 24,600, 24,700 స్ట్రయిక్స్ వద్ద పుట్ రైటింగ్ జరగ్గా, అన్నింటికంటే ఎక్కువగా 24,700 స్ట్రయిక్ పుట్ ఆప్షన్లో 3.28 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 4.63 లక్షల షేర్ల బిల్డప్ వుంది. మిగతా రెండు స్ట్రయిక్స్ వద్ద 2.50 లక్షల చొప్పున షేర్లు యాడ్ అయ్యాయి. 24,600 స్ట్రయిక్ వద్ద 5.47 లక్షలు, 24,500 స్ట్రయిక్ వద్ద 7.53 లక్షల షేర్ల చొప్పున బిల్డప్ వుంది. వచ్చే రెండు రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ 24,700పైన స్థిరపడితే 25,000 స్థాయిని తాకే అవకాశం వుంటుందని, 25,140 పాయింట్ల రికార్డుస్థాయిని చేరాలంటే 25,000 పాయింట్లస్థాయిని బలంగా దాటాల్సివుంటుందని కాల్ ఆప్షన్ డేటా సూచిస్తున్నది. క్షీణత సంభవిస్తే 24,500–24,700 పాయింట్ల శ్రేణి మధ్య మద్దతు పొందవచ్చని పుట్ ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది.