ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. మార్కెట్‌పై ఇన్వెస్టర్లు నమ్మకం ఉంచడంతో మార్కెట్ పాజిటివ్ ట్రెండ్‌లో మొదలైంది. ఈరోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 54,385 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్ల మద్దతు లభించడంతో వరుసగా పాయింట్లు పొందుతూ పైపైకి చేరుకుంది. ఉదయం 9:50 గంటల సమయంలో 253 పాయింట్లు లాభపడి 54,531 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ సైతం 64 పాయింట్లు లాభపడి 16,302 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఎంఅండ్‌ఎం, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్ షేర్లు లాభాలు పొందగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల పాలయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ ఆఫ్ పర్సెంట్ లాభం పొందగా ఆటో నిఫ్టీ ఆఫ్ పర్సెంట్ నష్టపోయింది. గత వారం ఐపీవోకి వచ్చిన రోలేక్స్ రింగ్స్ షేర్లు 130 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్ సాధించాయి. ఈవారం నిర్మా గ్రూపు నుంచి నువోవో విస్టా, కార్ ట్రేడ్‌లు ఐపీవోకి వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment