ముంబై : స్టాక్ మార్కెట్ ఈ రోజు లాభాలతో ముగిసింది. దేశీ సూచీలు సరికొత్త ఎత్తులు తాకాయి. ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 58,482 పాయింట్లతో మొదలైంది.ఆ తర్వాత కొద్ది మొత్తంలో పాయింట్లు కోల్పోయినా నష్టాల్లోకి జారుకోలేదు. సాయంత్రం నాలుగు గంటలకు మార్కెట్ ముగిసే సమయానికి 69 పాయింట్ల లాభంతో 58,247 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,420 పాయింట్లతో మొదలైంది. ఓ దశలో 17,438 పాయింట్లను అత్యధిక స్థాయి టచ్ చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి 17,382 దగ్గర క్లోజయ్యింది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నాలుగు శాతం లాభాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రాలు ఉన్నాయి. నెస్టల్ ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి.
చదవండి : ద్రవ్యలోటు కట్టడికి చర్యలు అవశ్యం
Comments
Please login to add a commentAdd a comment