
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ఐటీ, పవర్, హెల్త్ కేర్, మెటల్ స్టాక్స్ మద్దతుతో వరుసగా రెండవ రోజు రికార్డు స్థాయికి పెరిగాయి. చివరకు, సెన్సెక్స్ 662.63 పాయింట్లు(1.16%) పెరిగి 57,552.39 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 201.20 పాయింట్లు (1.19%) లాభపడి 17,132.20 వద్ద ముగిసింది. సుమారు 1434 షేర్లు అడ్వాన్స్ అయితే, 1537 షేర్లు క్షీణించాయి, 105 షేర్లు మారలేదు. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.99 వద్ద నిలిచింది.
భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్ మరియు శ్రీ సిమెంట్స్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, నెస్లే, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఐటీ, పవర్, హెల్త్ కేర్, మెటల్, ఆయిల్ & గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి.(చదవండి: ఇదేం టెక్నాలజీ! మన తారలకు చెప్పుకోలేని తలనొప్పి)
Comments
Please login to add a commentAdd a comment