ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వచ్చేవారంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ఆప్షన్ ముగింపు తేది గురువారం మే 28న) ఉండటంతో హెవీ కాల్ సెల్లింగ్ ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద వచ్చేవారంలో ఇండెక్స్ 8శాతం పరిధి డౌన్‌సైడ్ ట్రెండ్‌లో ట్రేడ్ అవ్వొచ్చని మార్కెట్ విశ్లేషకుడు రామ్ సహల్ అంటున్నారు.
బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వచ్చే వారంలో 16580-18020 రేంజ్‌లో కదలాడే అవకాశం ఉంది. లాక్ డౌన్ కొనసాగింపు దృష్ట్యా ఆర్‌బీఐ ఈఎంఐలపై మరో 3నెలల పాటు తాత్కలిక నిషేధాన్ని పొడిగించింది. దీంతో భవిష్యత్తులో బ్యాంకుల ఎన్‌పీఏలు మరింత పెరగవచ్చనే అంచనాలతో ఫైనాన్షియల్ రంగంలో బలహీనత నెలకొని ఉంది.
ఇండెక్స్ అంతర్లీన వాల్యూ శుక్రవారం 2.6శాతం పడిపోయి 17279 చేరుకోవడంతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టు 65శాతం పెరిగి 649113 చేరుకుంది. ఇండెక్స్ ధర 17286 పడిపోవడంతో వచ్చే నెల కాంటాక్టు 33శాతం పెరిగింది. ఇది ప్రతికూలతకు సంకేతమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండెక్స్ 18500 కీలక స్థాయిని బ్రేక్ చేసినప్పటి నుంచి భారీ పతనాలను చవిచూస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ హెచ్ అమిత్ గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment