కోవిడ్19 దెబ్బకు ప్రపంచ మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్లు కూడా అల్లకల్లోలమవుతున్నాయి. ఈ వరుసలో మార్చినెల్లో మార్కెట్లు మహా పతనం చూశాయి. అయితే అనంతరం ఏప్రిల్‌లో ప్రధాన సూచీలు కొంతమేర కోలుకున్నాయి. కానీ బ్యాంకు నిఫ్టీ మాత్రం ఆ స్థాయిలో రికవరీ చూపలేదు. దీంతో బ్యాంకుషేర్లపై నెగిటివ్ ధృక్పధం పెరిగింది. తాజాగా టర్మ్‌లోన్స్‌పై ఆర్‌బీఐ మారిటోరియం విధించడంతో బ్యాంకింగ్ రంగంలో మరిన్ని డిఫాల్టులు పెరగవచ్చని బ్రోకరేజ్‌లు హెచ్చరిస్తున్నాయి. దీంతో కొంచెంకొంచెంగా కోలుకుంటున్న బ్యాంకు నిఫ్టీ తిరిగి నేల చూపులు ఆరంభించింది. గతవారాంతానికి నష్టాల్లో ముగిసి దాదాపు మార్చినెల కనిష్ఠాల వద్దకు చేరింది. మంగళవారం ఆరంభట్రేడింగ్‌లో మాత్రం కొంత మేర నిలదొక్కుకొని 17500 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. బ్యాంకు నిఫ్టీ మార్చినెల్లో 16,131 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. తిరిగి తాజా బలహీనతతో మరోమారు ఈ కనిష్ఠాన్ని చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాస్త అప్‌మూవ్ కనిపించినా షార్ట్ చేయడానికి ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
ఒకవేళ బ్యాంకు నిఫ్టీ అప్‌మూవ్ చూపితే ముందు 18200 పాయింట్ల వద్ద బలమైన నిరోధం ఎదురుకానుంది. ఆపైన 20000 పాయింట్లు నిరోధంగా నిలుస్తుంది. దిగువన 17000 పాయింట్ల వద్ద మద్దతు కనిపిస్తోంది. అంతకు దిగువన మార్చి కనిష్ఠం 16000- 16200 పాయింట్ల వద్ద బలమైన మద్దతు దొరకవచ్చు. ఏప్రిల్ అప్‌మూవ్ అనంతరం బ్యాంకునిఫ్టీ మరలా వెనుదిరిగి 78 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయిలకు చేరింది. దీన్ని బట్టి ప్రధాన సూచీల కన్నా బ్యాంకింగ్ రంగంలో షార్ట్స్ బాగా పెరిగాయని, అందువల్ల మరింత పతనం ముందుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ బ్యాంకు నిఫ్టీ మార్చి కనిష్ఠస్థాయి వద్ద కూడా మద్దతు పొందకుంటే మరో 10- 15 శాతం మేర పతనం చెందే ఛాన్సులున్నాయంటున్నారు. ఇదే జరిగితే నిఫ్టీలో సైతం కరెక‌్షన్‌కు ఛాన్సులుంటాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment