బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ సోమవారం ఉదయం సెషన్‌లో 2.50శాతం లాభపడింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇందుకు కారణమైంది. మార్కెట్ లాభాల ప్రారంభంలో భాగంగా నేడు ఈ ఇండెక్స్ 22వేల పైన 22,307.30 వద్ద వద్ద ప్రారంభమైంది. ఈ ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీ బ్యాంక్ షేర్ల ర్యాలీతో ఒక దశలో 2.50శాతం లాభపడి(553 పాయింట్లు) 22,520 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్ మునుపటి ముగింపు(21,966.80)తో పోలిస్తే 22,330 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3శాతం లాభపడింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 3శాతం పెరిగాయి. ఆర్‌బీఎల్ బ్యాంక్ 2.50శాతం, ఫెడరల్ బ్యాంక్ 2శాతం, ఎస్‌బీఐ బ్యాంక్ 1.50శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 1.50శాతం ర్యాలీ చేశాయి. అలాగే పీఎన్‌బీ బ్యాంక్ 1శాతం లాభపడగా, బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు అరశాతం పెరిగింది. మరోవైపు బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు అరశాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ అప్‌సైడ్‌లో 22,600 స్థాయి వద్ద కీలక నిరోధ స్థాయిని, డౌన్‌సైడ్‌లో 22,050 వద్ద కీలక మద్దతు స్థాయిని కలిగి ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదే సమయానికి సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడి 37246 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 10971 వద్ద ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment