అంతర్జాతీయ మార్కెట్ల అండతో దేశీయ మార్కెట్లు తిరిగి అప్‌మూవ్ బాట పట్టాయి. బుధవారం 9300 పాయింట్లను తాకిన నిఫ్టీ గురువారం 9400 పాయింట్ల పైన ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి కీలక నిరోధం 9500-9600 పాయింట్ల వద్ద ఉందని, దీన్ని విజయవంతంగా దాటితేనే 9900-10000 పాయింట్లకు చేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు నిప్టీ త్వరలో 20వేల పాయింట్లను దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీపై ప్రముఖ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి...
ఐసీఐసీఐ సెక్యూరిటీస్: నిఫ్టీకి 8800 పాయింట్ల వద్ద హైబాటమ్ ఏర్పడినట్లుంది. క్రమంగా నిఫ్టీ ఏప్రిల్ గరిష్ఠం 9900 పాయింట్లను మరోమారు పరీక్షించవచ్చు. తక్షణ మద్దతు 9050 పాయింట్ల వద్ద ఉంది. ఫార్మా, ఐటీ స్టాకులపై బుల్లిష్.
ఏంజల్ బ్రోకింగ్: నిఫ్టీ ముందుగా 9450-9550 పాయింట్లను చేరవచ్చు. బ్యాంకు నిఫ్టీ 20వేల పాయింట్లను తాకవచ్చు. ఈ సమయంలో షార్ట్స్ మంచివి కాదు. నిఫ్టీకి 9000- 9250 పాయింట్ల వద్ద మద్దతుంది. ఇక్కడకు వచ్చినప్పుడల్లా కొనుగోళ్లకు అవకాశంగా చూడాలి.
మోతీలాల్‌ఓస్వాల్: నిఫ్టీ కీలక నిరోధం 9150-9180 పాయింట్లను విజయవంతంగా దాటింది. ఇదే ఊపులో 9500- 9600 పాయింట్ల వరకు వెళ్లవచ్చు. బ్యాంకునిఫ్టీకి మద్దతు 18000 పాయింట్ల వద్ద ఉంది. ఆర్‌ఐఎల్, టాటాకెమికల్స్, బ్రిటానియా, హిండాల్కో, ఐషర్‌పై బుల్లిష్.
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్: వీక్లీ చార్టుల్లో హామర్ ప్యాట్రన్ ఏర్పడడం మరింత అప్‌మూవ్‌కు సంకేతం. ఈ జోరుతో వారం రోజుల్లో నిఫ్టీ 9600 పాయింట్ల వరకు పరుగు తీయవచ్చు. బ్యాంకు నిఫ్టీ 19500-20000 పాయింట్లను తాకవచ్చు. నిఫ్టీ లాంగ్స్‌కు 9100 పాయింట్లు స్టాప్‌లాస్.
9500 దాటితే 10వేలకు నిఫ్టీ!
Published Thu, May 28 2020 10:17 AM | Last Updated on Thu, May 28 2020 10:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment